వాషింగ్టన్ : ఇప్పుడున్నవిమానాలకు వినూత్నంగా, ఎక్కువ సామర్థ్యంతో, పర్యావరణ అనుకూల ఎయిర్ క్రాప్ట్ ను తయారుచేసేందుకు అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా సిద్ధమైంది. మొదటి ఎలక్ట్రిక్ పవర్డ్ ఎయిర్ ప్లేన్ ఎక్స్-57 ను తయారుచేసే ప్రణాళికను విడుదల చేసింది. వాషింగ్టన్ లోని అమెరికన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటిక్స్ అండ్ ఆస్ట్రోనాట్స్ కాన్ఫరెన్స్ లో నాసా అడ్మినిస్ట్రేటర్ చార్లెస్ ఎఫ్ బోల్టెన్ ఎక్స్-57 మ్యాక్స్ వెల్ ప్లాన్ గురించి వివరించారు. ఏవియేషన్ లో నూతన యుగ ఆరంభానికి ఎక్స్-57 శ్రీకారం చుట్టుతుందని బోల్టెన్ పేర్కొన్నారు. వెంటనే ఈ టెక్నాలజీతో అమెరికన్ జెట్ లైనర్స్ రాకపోయినా... కొన్నేళ్ల తర్వాత మాత్రం చిన్న, సాధారణ ఏవియేన్లకు, ప్రయాణికుల విమానాలకు ఈ టెక్నాలజీ వాడతారని విశ్వసిస్తున్నట్టు పేర్కొన్నారు. ఒక్క గంటకు 175 మైల్స్ వేగంతో ఈ విమానం ప్రయాణించగదని చెప్పారు.
మొత్తం 14 ఎలక్ట్రిక్ మోటార్స్ లను దీనిలో పొందుపరిచారు. ప్రస్తుతమున్న రెక్కలకంటే భిన్నంగా, చాలా స్కిన్నియర్ గా, ప్రత్యేకంగా ఈ కొత్త విమాన రెక్కలు ఉండబోతున్నాయి. ఎలక్ట్రిక్ టెక్నాలజీతో రూపొందించే ఎక్స్-57 ఎయిర్ క్ట్రాప్ట్ శబ్దాన్నిగణనీయంగా తగ్గిస్తుంది. ప్రజలను శబ్ద అవాంతరాల నుంచి బయటపడేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ ఎయిర్ క్రాప్ట్ ల రూపకల్పనతో గ్యాస్అలైన్ మోటార్స్ లన్నింటినీ , నాసా ఎలక్ట్రిక్ లోకి మార్చనుంది. నాసా తీసుకొచ్చే ఈ విమానంతో నిర్వహణ ఖర్చులు 40 శాతం తగ్గిపోవడంతో పాటు ప్రయాణికులు తక్కువ సమయంలోనే గమ్యస్థానాలకు చేరిపోవచ్చు. ఇంధన వాడకం కూడా ఐదు రెట్లు తగ్గిపోనుంది.
ఈ కొత్త విమానానికి "మ్యాక్స్ వెల్" గా నాసా నామకరణం చేసింది. 19శతాబ్దంలో క్లాసికల్ సిద్ధాంతంలో ఎలక్ట్రోమ్యాగ్నటిజమ్ రేడియేషన్స్ ను తీసుకొచ్చిన స్కాటిస్ శాస్త్రవేత్త పేరు జేమ్స్ క్లార్క్ మ్యాక్స్ వెల్. అతనే పేరునే ఈ విమానానికి పెట్టింది.1947లో మొదట ఎక్స్ ఎయిర్ ప్లేన్లను నాసా ప్రపంచానికి పరిచయం చేసింది. ఇప్పటివరకూ వచ్చిన ఎక్స్ ప్లేన్స్ అన్నీ ప్రపంచ ఏవియేషన్, స్నేష్ టెక్నాలజీలో ఇవి ప్రముఖ స్థానాన్ని సంపాదించుకున్నాయి. చివరి ఎయిర్ క్రాప్ట్ ఎక్స్-43ఏ ను నాసా దశాబ్దం కిందట తయారుచేసింది.
మొదటి ఎలక్ట్రిక్ విమానానికి నాసా శ్రీకారం
Published Sat, Jun 18 2016 1:05 PM | Last Updated on Wed, Sep 5 2018 3:37 PM
Advertisement