యూనైటెడ్ ఎలక్టిస్రిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు దుగ్గిరాల సూరిబాబు మాట్లాడుతూ షిప్ట్ ఆపరేటర్లకు 4 నెలల నుంచి, మీటరు రీడర్లకు 7 నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదన్నారు. జీతాలు లేకుండా కార్మికులు నెలలు, నెలలు ఎలా పని చేస్తారని ప్రశ్నించారు. అతి తక్కువ వేతనాలతో ప్రాణాలు ఫణంగా పెట్టి విద్యుత్ సంస్థ అభివృద్ధికి కాంట్రాక్ట్ కార్మికులు కృషి చేస్తున్నాప్పటికీ అధికారులు చిన్నచూపు చూడటం దారుణమన్నారు. కార్మికులకు కాంట్రాక్టర్లు జీతాలు ఇవ్వకపోతే అధికారులు ఏమి చేస్తున్నారని నిలదీశారు. జీతాలు అమలు చేయలేని సీఎండీ ఉత్తర్వులు దేనికని ఎద్దేవా చేశారు.
సంఘం జిల్లా కార్యదర్శి జాకీర్ హుస్సేన్ మాట్లాడుతూ పర్మినెంట్ ఉద్యోగుల కన్వర్షన్లు ఇవ్వడంలోనూ జాప్యం జరుగుతుందన్నారు. ఎన్నిసార్లు వినతులు ఇచ్చినా స్పందన లేదన్నారు. యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సుధాకర్‌రావు, ఎస్‌పీడీసీఎల్ కమిటీ అధ్యక్షుడు ఖాజావలి, జిల్లా నాయకులు నాగయ్య, పెంచలప్రసాద్, జీఎస్ బాబు, రామయ్య, పి.కృష్ణ, హజరత్ వలి, నాని, బాలకృష్ణ పాల్గొన్నారు.