
శ్రీకాకుళం ,పాతపట్నం : పొలంకు ఎరువు వేసేందుకు వెళ్లిన ఓ రైతును మృతువు విద్యుత్ తీగ రూపంలో బలితీసుకుంది. భార్యతో కలిసి పొలంకు వెళ్లిన అతడు కొంతసమయానికే విగతజీవిగా మారాడు. తెగిన విద్యుత్ తీగ పొలంలో పడివుండడాన్ని గమనించని ఆయన దానిని తాకి ప్రాణాలు కోలోయాడు. పాతపట్నం మండలం కాగువాడ గ్రామంలో ఈ హృదయవి« దారకర సంఘటన చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలావున్నాయి. కా గువాడ గ్రామంలో గాజులవీధికి చెందిన కౌలు రైతు గణపతి తవుడు(70) విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మహేంద్రతనయా నది అవతల ఉన్న వరి పంటపొలంకు ఎరువు వేసేందుకు సోమవారం ఉదయం 8 గంటల సమయంలో భార్య చిన్నమ్మితో కలిసి తవుడు ఇంటివద్ద బయల్దేరాడు. ఎరువు పట్టుకొని నదిలో పడవపై అవతలివైపు వున్న పొలం వద్దకు వెళ్లాడు.
అయితే అప్పటికే విద్యుత్ వైరు తెగి పొలంలో పడి వుంది. దీనిని గమనించని తవుడు ఎరువుతో పొలంలోకి దిగాడు. వైరును తాకడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. కళ్లముందే భర్త చనిపోవడంతో భార్య కన్నీరుమున్నీరై విలపించింది. వెంటనే గ్రామానికి వెళ్లి గ్రామస్తులకు తెలియజేసింది. గ్రా మస్తులు విద్యుత్‌ను నిలిపివేసి పొలం వద్దకు వెళ్లారు. విషయాన్ని విద్యుత్ శాఖ అధికారులకు తెలియజేశారు. వెంటనే విద్యుత్ శాఖ ఏడీ ఎన్. మోహనరావు, ఏఈ డి.వి.ఎల్.కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేసుకున్నారు. ఉన్నతాధికారులకు విషయం తెలియజేస్తామని ఏడీ తెలిపారు. స్థానిక పోలీసులు పాతపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించారు. మంగళవారం ఉదయం పోస్టుమార్టం చేస్తామని మృతుడు బంధువులకు తెలిపారు. తవుడుకు రెండు ఎకరాల పొలంతో పాటు ఇతరులకు చెంది న రెండు ఎకరాల పొలం కౌలుకు చేస్తున్నాడు. మృతుడికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.