విద్యుత్ ఉచ్చులో చుక్కల జింక మృతి
గ్రామ శివారు రక్షిత అటవీప్రాంతంలో స్థానిక రైతు ఎర్రమ్మ జీడిమామిడితోటలో వేటగాళ్లు పన్నిన విద్యుత్ ఉచ్చులో పడి ఆడ చుక్కల జింక (వయస్సు సుమారు 3 సంవత్సరాలు) మరణించింది. సమాచారం తెలిసి ఆ ప్రాంతంలో కాపు కాసిన అటవీఅధికారులకు శుక్రవారం రాత్రి మానేపల్లి వీరభద్రరావు, మిరియాల రాంబాబు, మిరియాల దుర్గాప్రసాద్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.
రాజవొమ్మంగి :
గ్రామ శివారు రక్షిత అటవీప్రాంతంలో స్థానిక రైతు ఎర్రమ్మ జీడిమామిడితోటలో వేటగాళ్లు పన్నిన విద్యుత్ ఉచ్చులో పడి ఆడ చుక్కల జింక (వయస్సు సుమారు 3 సంవత్సరాలు) మరణించింది. సమాచారం తెలిసి ఆ ప్రాంతంలో కాపు కాసిన అటవీఅధికారులకు శుక్రవారం రాత్రి మానేపల్లి వీరభద్రరావు, మిరియాల రాంబాబు, మిరియాల దుర్గాప్రసాద్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. వారు హైటెన్షన్ విద్యుత్‌లైన్ నుంచి విద్యుత్‌కంచెను తొలగిస్తుండగా తమ సిబ్బంది పట్టుకున్నారని స్థానిక రేంజ్ అధికారి మానాప్రగడ శివకుమార్ శనివారం విలేకరులకు తెలిపారు. ఆ ముగ్గుర్ని అదుపులోకి తీసుకొని వన్యప్రాణి సంరక్షణ చట్టం పరిధిలో కేసు నమోదు చేశామన్నారు. వీరిని సోమవారం కోర్టుకు తరలిస్తామన్నారు. మరణించిన జింకను ఐస్‌బాక్స్‌లో భద్రపరచామని, కోర్టు ఎదుట పెడతామని వివరించారు. నిందితుల నుంచి కత్తి, మాంసం తయారు చేసేందుకు అవసరమైన సరంజామా, విద్యుత్‌కంచెకు ఉపయోగించిన వైర్లు స్వాధీనపరచుకున్నామన్నారు.
-
అటవీ అధికారుల అదుపులో ముగ్గురు