పల్లెల్లో విద్యుత్ చౌర్యానికి సంబంధించి ఆ శాఖకు చెందిన 56 మంది అధికారులు 28 బృందాలుగా ఏర్పడి మంగళవారం 16 గ్రామాల్లో దాడులు నిర్వహించారు.
విద్యుత్ అధికారుల మెరుపు దాడులు
Jul 11 2017 11:23 PM | Updated on Sep 5 2018 3:37 PM
- 16 గ్రామాల్లో తనిఖీలు
- 161 చౌర్యం కేసులు గుర్తింపు
- రూ. 2.42 లక్షల జరిమానా
అవుకు: పల్లెల్లో విద్యుత్ చౌర్యానికి సంబంధించి ఆ శాఖకు చెందిన 56 మంది అధికారులు 28 బృందాలుగా ఏర్పడి మంగళవారం 16 గ్రామాల్లో దాడులు నిర్వహించారు. ఇందుకు సంబంధించి విద్యుత్ శాఖ ఏఈ భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ ఆయా గ్రామాల్లో 1788 సర్వీసులను తనిఖీ చేయగా 161 సర్వీసుల్లో చౌర్యం జరుగుతున్నట్లు గుర్తించామన్నారు. అక్రమంగా విద్యుత్ వాడుతున్న వారిపై కేసులు నమోదుచేయడంతోపాటు రూ.2.42 లక్షల జరిమానా విధించినట్లు చెప్పారు. దాడుల్లో ఆపరేషన్ డీఈ ఓబుళకొండారెడ్డి, ఏడీఈలు శివరాం, నాగరాజు, సుబ్రహ్మణ్యం 23 మంది ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement
Advertisement