కనెక్షన్..కలెక్షన్..! | Connection .. .. Collection! | Sakshi
Sakshi News home page

కనెక్షన్..కలెక్షన్..!

Published Fri, Feb 19 2016 12:49 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM

కనెక్షన్..కలెక్షన్..! - Sakshi

కనెక్షన్..కలెక్షన్..!

డిస్కంలో అవినీతి చేపలు..
కాసుల వర్షం కురిపిస్తున్న కొత్త విద్యుత్ విద్యుత్ కనెక్షన్లు
రూ.13 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ లైన్ ఇన్స్‌పెక్టర్
ఏడాదిలో 13 మంది పట్టుబడ్డ వైనం

 
 సిటీబ్యూరో: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్‌ఎస్‌పీడీసీఎల్) అవినీతికి కేరాఫ్‌గా మారుతోంది. సంస్థలో పని చేస్తున్న ఉద్యోగుల అక్రమాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్(సీఎండీ)సహా జేఎండీ విజిలెన్స్‌కు ఫిర్యాదులు అందుతున్నాయి. విద్యుత్ సిబ్బందిపై గత ఐదేళ్లలో 1200పైగా ఫిర్యాదులు అందడం సిబ్బంది అక్రమాలకు అద్దం పడుతోంది. అయినా నామమాత్రపు విచారణలు తప్ప..శిక్షపడిన దాఖలాలు లేక పోవడం గమనార్హం. అక్రమ ఆస్తులు కూడ బెట్టడం ఏసీబీకి పట్టుపడటం..ఏడాది కాలం తిరగకుండానే మళ్లీ అంత కన్నా పెద్ద పోస్టులో కూర్చోవడం సంస్థలో పరిపాటిగా మారింది. 2015-2016లో గ్రేటర్ పరిధిలోనే 13 మంది ఇంజనీర్లు ఏసీబీకి పట్టుబడటం విశేషం. ఏసీబీ కేసులు ఎదుర్కొంటున్న వారు సైతం ఆపరేషన్ విభాగంలో కీలకమైన ఫోకల్ పోస్టుల్లో ఏఈ, ఏడీఈ, డీఈ, ఎస్‌ఈ పోస్టుల్లో కొనసాగుతుండటం గమనార్హం. పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నట్లు ఉన్నతాధికారులు పేర్కొంటున్నా..అక్రమార్కుల సంఖ్య నానాటికి పెరుగుతోండటం విచారించదగ్గ విశయం.

ప్రతి పనికీ ఓ రేటు..
అపార్టుమెంట్‌కు కొత్త ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు, విద్యుత్ లైను ఏర్పాటు, ప్యానల్ బోర్డు మంజూరు, చివరకు కాలిపోయిన మీటర్ మార్చాలన్నా...లైన్‌మెన్ దగ్గరి నుంచి డీఈ వరకు అందరికీ ఎంతో కొంత ఇచ్చుకోవాల్సిందే. వినియోగదారులకు పారదర్శకంగా సేవలు అందించాల్సిన ఉద్యోగులు అక్రమ సంపాదనే లక్ష్యంగా పని చే స్తున్నారు. ఉద్యోగుల కేడర్‌ను బట్టి చేసే పనులు, పుచ్చుకునే కమిషన్లు విభజిస్తున్నారు. కొత్త లైన్లు, పాతలైన్ల మార్పిడి, ట్రాన్స్ ఫార్మర్ల రిపేర్లు, సబ్‌స్టేషన్ల నిర్మాణం, వాటి కాంట్రాక్ట్, ఆపరేటర్ల నియామకం, భూగర్భ కేబుల్ పనులు ఇలా ప్రతి పనికి ఓ ధర నిర్ణయించారు. కొత్త కనెక్షన్‌కు రూ. 3 నుంచి రూ. 5 వేలు వసూలు చేస్తుంటేడగా, వాణిజ్య సముదాయానికి ట్రాన్స్‌ఫార్మర్ మంజూరురు రూ.లక్ష వసూలు చేస్తున్నారు. ప్యానల్ బోర్డుకు రూ.15వేలు, లైన్‌షిఫ్టింగ్‌కు రూ.10-20వేలు డిమాండ్ చేస్తున్నారు. ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలకు కొత్త సబ్‌స్టేషన్లు కేటాయించాలంటే రూ.1.50 లక్షలు, భూగర్భకేబుల్ వర్క్స్, కొత్త సబ్‌స్టేషన్ల నిర్మాణానికి కేటాయించిన  బ డ్జెట్‌లో 10 శాతం చెల్లించుకోవాల్సిందే.
 
ఏసీబీ వలలో పెద్ద అంబర్ పేట్ లైన్ ఇన్‌స్పెక్టర్
మీటర్ ఏర్పాటుకు లంచం తీసుకుంటుండగా పట్టివేత

 ఎల్‌బీనగర్‌కు చెందిన అనంతుల రవీందర్ కుంట్లూర్‌లోని తన వ్యవసాయ భూమిలో బోరు వేసి కనెక్షన్ తీసుకున్నాడు. దీనికి సమీపంలో మరో రెండు ఇళ్లు నిర్మించి మీటర్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఇందుకు రూ.15 వేలు ఇవ్వాల్సిందిగా లైన్ ఇన్స్‌పెక్టర్ ప్రభులాల్ డిమాండ్ చేయగా, రూ.13 వేలు ఇచ్చేందుకు అంగీకరించి, దీనిపై ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. గురువారం మధ్యాహ్నం పెద ్దఅంబర్‌పేట్ బస్టాఫ్ సమీపంలో రవీందర్ నుంచి లైన్ ఇన్స్‌పెక్టర్ ప్రభులాల్ రూ.13 వేలు లంచం తీసుకుంటుండగా అక్కడ మాటువేసిన ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లైన్ ఇన్స్‌పెక్టర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement