విద్యుత్ సేవలో డ్రోన్స్
Published Mon, Nov 28 2016 2:24 AM | Last Updated on Wed, Sep 5 2018 3:38 PM
సాక్షి, చెన్నై: విద్యుత్ శాఖ సేవకు డ్రోన్‌స (మానవ రహిత విమానాలు) రంగంలోకి దిగనున్నాయి. తొలి విడతగా చెన్నైలో మూడు లేదా నాలుగు విమానాల కొనుగోలుకు కసరత్తులు సాగుతున్నాయి. రాష్ట్రంలో రోజుకు పదమూడు వేల మెగావాట్ల మేరకు విద్యుత్ వినియోగం సాగుతున్న విషయం తెలిసిందే. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి, కేంద్ర గ్రిడ్‌ల నుంచి వచ్చే విద్యుత్ సబ్‌స్టేషన్ల ద్వారా రాష్ట్రంలో సరఫరా అవుతున్నది. ఇందుకుగాను భారీ విద్యుత్ లైన్లు ఆయా సబ్ స్టేషన్లను అనుసంధానించే విధంగా ఏర్పాట్లు చేశారు. అరుుతే, తరచూ ఈ భారీ విద్యుల్ లైన్లలో ఏర్పడే సమస్యలతో , మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరాకు తీవ్ర ఆటంకాలు తప్పడం లేదు. ఇలాంటి ప్రభావాలతో శుక్రవారం ఎనిమిది జిల్లాలు అంధకారంలో మునగాల్సిన పరిస్థితి.
అంతకు ముందు దక్షిణ చెన్నైలో ఇలాంటి సమస్యను ప్రజలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ విద్యుత్ లైన్లలో ఎక్కడ సమస్య బయలు దేరిందో గుర్తించేందుకు తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితి. ఈ కారణంగా సమయం వృథా, పని భారం ఎక్కువే. దీనిని పరిగణలోకి తీసుకున్న విద్యుత్ బోర్డు వర్గాలు ఎక్కడెక్కడ అయితే, సమస్యలు బయలు దేరుతాయో , తక్కువ సమయంలో వాటిని పరిశీలించి, ఆ ఫొటోలను కంట్రోల్ రూంకు చేరే వేసే విధంగా, సిబ్బంది సకాలంలో అక్కడికి చేరుకుని మరమ్మతులు చేపట్టేందుకు తగ్గ కార్యాచరణతో ముందుకు సాగేందుకు నిర్ణయించారు. ఇందు కోసం ప్రత్యేకంగా మానవ రహిత విమానాలను కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకున్నారు.
విద్యుత్ సేవలో డ్రోన్‌స: తొలి విడతగా చెన్నైలో మానవ రహిత విమానాలను రంగంలోకి దించేందుకు తగ్గ ప్రయత్నాలు వేగవంతం చేశారు. శ్రీ పెరంబదూరు నుంచి తరమణి, మనలి నుంచి మైలాపూర్ , ఉత్తర చెన్నై నుంచి మరలి, మైలాపుర్ నుంచి బేషిన్ బ్రిడ్జి వైపుగా సాగే భారీ విద్యుత్ లైన్లను పరిశీలించేందుకు, పర్యవేక్షించేందుకు ఈ మానవ రహిత విమానాలు రంగంలోకి దించనున్నారు. ముందుగా ఆ లైన్ల వెంబడి మానవ రహిత విమానాల్లోని కెమెరాల ఆధారంగా వీడియో చిత్రీకరణ సాగుతుంది. ఆ లైన్లలో ఎక్కడైనా సాంకేతిక పరంగా, హై ఓల్టేజీ కారణంగా, ఇతర కారణాలతో ఏదేని మరమ్మతులు చోటు చేసుకున్నా, సమస్య బయలు దేరినా తక్షణం ఆ ప్రదేశాన్ని గుర్తించేందుకు వీలుగా మానవ రహిత విమానాలను పంపిస్తారు.
ఆవిమానాలు ఆ ప్రదేశాన్ని గుర్తించి కంట్రోల్ రూంకు ఫొటోలను పంపుతుంది. దీంతో సిబ్బంది అక్కడికి చేరుకుని సకాలంలో సమస్యను అధిగమించేందుకు వీలు ఉండడం వల్లే, ఈ మానవ రహిత విమానాల మీద దృష్టి పెట్టినట్టు విద్యుత్ బోర్డు అధికారి ఒకరు పేర్కొన్నారు. తొలివిడతగా చెన్నైలో మూడు లేదా, నాలుగు విమానాలను కొనుగోలు చేయనున్నామని ప్రకటించారు. టెండర్ల ద్వారా మానవ రహిత విమానాల కొనుగోలు ఉంటుందని, ఈ ప్రయత్నం సత్ఫలితాల్ని ఇచ్చిన పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ప్రధాన నగరాల్లో మానవ రహిత విమానాల సేవల్ని విస్తరింప చేస్తామన్నారు.
Advertisement
Advertisement