కోతకు వచ్చిన వరి పంట ప్రమాదవశాత్తు కాలిపోయింది. ఈ ఘటన నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం కాజీరామారం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బట్టుపల్లి మణెమ్మకు చెందిన రెండెకరాల వరి పంట కోతకు వచ్చింది. గురువారం ఉదయం కోత మిషన్‌తో కోయాల్సింది ఉంది.
అయితే, బుధవారం మధ్యాహ్నం పొలంపైగా వెళ్తున్న 11కేవీ విద్యుత్ తీగలు రాపిడితో మంటలు రేగి పైరుపై పడ్డాయి. ఎండ తీవ్రత కారణంగా మంటలు వెంటనే అంటుకుని పొలంమంతా వ్యాపించాయి. ఫైరింజన్ వచ్చేలోగానే నష్టం జరిగిపోయింది. తన పొలంలో కొత్తరకం వరి వంగడం సాగు చేశానని, క్వింటా రూ.1600 చొప్పున ఇప్పటికే రైతులు విత్తనాల కోసం అడిగారని బాధితురాలు తెలిపింది. సుమారు రూ.80 వేల మేర నష్టం వాటిల్లినట్లు ఆమె అంటోంది.