manemma
-
అనారోగ్యంతో బాధపడుతున్న మణెమ్మను స్వదేశానికి పంపిన దుబాయ్ సీజేఐ!
దుబాయ్‌లో పనిచేసేందుకు వెళ్లింది ఆంధ్రప్రదేశ్‌కి చెందిన మణెమ్మ. అనుకోకుండా ప్రాణాంతక వ్యాధి బారినపడింది. దీంతో తన సొంతూరుకి ఎలా పయనమవ్వాలో తెలియని దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. అయితే దుబాయ్ కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా(సీజీఐ) ఏపిఎన్ఆర్టీఎస్ సాయంతో మణెమ్మను సురక్షితంగా స్వదేశంలోని హెల్త్కేర్సెంటర్కి పంపింది. వివారాల్లోకెళ్తే..ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లాకు చెందిన ఎమ్ మణెమ్మ సెప్టెంబర్ 2022లో దుబాయ్‌లో ఓ ఇంట్లో పనిచేయడానికి వెళ్లింది. కానీ దురదృష్ణవశాత్తు డిసెంబర్ 22న ఆమెకు ప్రాణాంతక వ్యాధి టీబీ ఉందని వైద్య పరీక్షల్లో తేలింది. అప్పటి నుంచి మణెమ్మకు దుబాయ్‌లోనే ట్రీట్మెంట్ జరుగుతుంది. ఐతే ఇప్పుడు ఆమె పూర్తి స్థాయిలో కోలుకుంది. భారతదేశం ప్రయాణించడానికి ఎలాంటి సమస్య లేదని వీల్‌చైర్ ద్వారా నర్సు సాయంతో పంపిచొచ్చని వైద్యులు సూచించారు. దీంతో దుబాయ్ సీజేఐ మణెమ్మను తన వివరాలను చెప్పల్సిందిగా కోరింది. అయితే తనకు కుటుంబసభ్యులు, స్నేహితులు ఎవ్వరూ లేరని చెప్పడంతో ఆమె సొంతూరుకు దగ్గరలో ఉన్న హెల్త్‌కేర్ సెంటర్లు గురించి తెలియజేయమంటూ ఏపిఎన్ఆర్టీఎస్ ప్రెసిడెంట్ వెంకట్ మేడపాటికి ఈ మెయిల్ పంపింది దుబాయ్ సీజేఐ. దీంతో ఏపీఎన్ఆర్టీఎస్ ఈ విషయాన్ని ఏలూరు కలెక్టర్ కార్యాలయానికి తెలియజేసింది. కలెక్టర్ కార్యాలయం వారు సెయింట్ ఆన్స్ లయోలా ప్రేమ్ నివాస్ రిహాబిలేషన్ సెంటర్లో ఉండటానికి అనుమతివ్వడంతో ఏపీఎన్ఆర్టీఎస్ ఆ విషయాన్ని దుబాయ్ సీజేఐకి తెలిపింది. దుబాయ సీజే మణెమ్మకు నర్సుని తోడుగా ఇచ్చి హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి పంపగా, అక్కడ నుంచి ఏపీఎన్ఆర్టీసి అంబులెన్స్ సాయంతో లయోలా ప్రేమ్ నివాస్ రిహాబిలిటేషన్ సెంటర్‌కు మణెమ్మను సురక్షితంగా చేర్చారు. ఈ విషయంలో తమకు సహకరించినందుకు గానూ దుబాయ సీజేఏ ఏపీఎన్ఆర్టీఎస్ వారికి కృతజ్ఞతలు తెలిపింది. అలాగే ఏపీఎన్ఆర్టీఎస్ కూడా మణెమ్మను సురక్షితంగా తరలించడంలో సాయం చేసిన ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఐఏఎస్ గారికి, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి విజయ లక్ష్మి, డిఆర్ఓ మూర్తి, జిల్లా పరిపాలన శాఖ అధికారులకు, దుబాయ్ సీజేఐకి ధన్యవాదాలు తెలిపింది. (చదవండి: యూరప్‌లో వైభవంగా మలయప్ప స్వామి కల్యాణం) -
జస్ట్ మిస్!
సికింద్రాబాద్ :సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అభ్యర్థులు ఎవరూవరుసగా మూడుసార్లు గెలవలేదు. ఇక్కడి నుంచి వరుసగా రెండుసార్లు గెలిచినపలువురు నేతలకు మూడోసారిఆశాభంగం తప్పలేదు. ఈ నియోజకవర్గం 1956లో ఆవిర్భవించగా, ఇప్పటి వరకు 17సార్లు (ఉప ఎన్నికతో 1987–89)ఎన్నికలు జరిగాయి. ఇక్కడి నుంచి పోటీ చేసిన వారిలో ఐదుగురురెండుసార్లు వరుసవిజయాలు సాధించారు. మూడోసారి పోటీ చేసేఅవకాశం లభించక కొందరు, పోటీ చేసి పరాజయం పాలవడంతో మరికొందరు హ్యాట్రిక్ చేజార్చుకున్నారు. ఒకరు మూడుసార్లు, మరొకరు నాలుగు సార్లు ఎంపీగా గెలిచినప్పటికీ హ్యాట్రిక్ మాత్రం దక్కలేదు. ♦ సికింద్రాబాద్ స్థానం నుంచి పోటీ చేసిన నరాల సాయికిరణ్ యాదవ్ 1957, 62 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు.ఆ తర్వాత ఎన్నికలకు పోటీకి దూరమైన ఆయన తిరిగి 1971లో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. ♦ కాంగ్రెస్ నేత పి.శివశంకర్ 1979, 1980 ఎన్నికల్లో గెలుపొందారు. ఆ తర్వాత ఎన్నికల్లో ఆయనకు పోటీ చేసే అవకాశం రాలేదు. ♦ 1987, 89 ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి టి.అంజయ్యమరణానంతరం ఆయన సతీమణి మణెమ్మ రెండుసార్లుఎంపీగా గెలుపొందారు. ♦ 1991 ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ.. ఆ తర్వాతి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి, పీవీ తనయుడు రాజేశ్వరావు చేతిలో పరాజయం పాలయ్యారు. ♦ తిరిగి 1998, 99 ఎన్నికల్లో రెండుసార్లు వరుస విజయాలు సాధించిన దత్తాత్రేయ... 2004లో ఓటమిపాలై హ్యాట్రిక్ చేజార్చుకున్నారు. 2014లో నాలుగోసారి ఎంపీగా గెలిచారు. ♦ 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున అంజన్‌కుమార్‌యాదవ్ తొలి విజయం సాధించారు. 2009లోనూ రెండోసారి గెలుపొందారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయి హ్యాట్రిక్ మిస్ అయ్యారు. -
అంజయ్య సతీమణి మణెమ్మ కన్నుమూత
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య సతీమణి, మాజీ పార్లమెంట్ సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే టి.మణెమ్మ (75) ఆది వారం కన్నుమూశారు. ఆమెకు నలుగురు కుమార్తె లు, ఒక కుమారుడు ఉన్నారు. రక్తహీనత, జ్వరంతోపాటు మరికొన్ని అనారోగ్య సమస్యలతో ఆమె గత నెల 27న జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చేరారు. వైద్యులు ఇంటెన్సివ్ కేర్‌లో ఉంచి చికిత్స నిర్వహిస్తున్నారు. ఆమె ఆరోగ్యం క్షీణించి ఆదివారం మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. గత మూడేళ్లుగా వయోభారం, అనారోగ్యంతో మణెమ్మ ఇంటికే పరి మితమయ్యారు. ఆమె అంత్యక్రియలు సోమవారం మధ్యాహ్నం మహాప్రస్థానంలో అధికారిక లాంఛనాలతో జరుగుతాయని బంధువులు తెలిపారు. రాజకీయ ప్రస్థానం.. 1986లో సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న భర్త టి.అంజయ్య మృతి చెందడంతో ఆ పార్లమెంట్‌కు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మణెమ్మ విజయం సాధించారు.1989లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రెండవ సారి ఎంపీగా తెలంగాణలోనే అత్యధిక మెజార్టీతో విజయం సాధించారు. 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖరరెడ్డి ముషీరాబాద్ అసెంబ్లీకి జరిగిన ఉపఎన్నికల్లో మణెమ్మను నిలబెట్టి గెలిపించారు. అనంతరం 2009లో మళ్లీ ముషీరాబాద్ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. సీఎం కేసీఆర్ సంతాపం.. మణెమ్మ మృతి పట్ల ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ని ప్రార్థించారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అధికార లాంఛనాలతో మణెమ్మ అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషిని కేసీఆర్ ఆదేశించారు. కాంగ్రెస్‌కు తీరని లోటు: ఉత్తమ్ మణెమ్మ అకాల మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మణెమ్మ మృతి పట్ల సంతా పం ప్రకటించారు. మణెమ్మ మృతి పట్ల టీపీసీసీ కిసాన్‌సెల్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి కూడా సంతాపం ప్రకటించారు. హోంమంత్రి నాయిని, కెవీపీ రాంచందర్‌రావు, జానారెడ్డి, పొన్నాల, పి.శంకర్ రావు, మాజీ ఎంపీ కెఎస్.రావు, ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి దంపతులు మణెమ్మ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌లు ఫోన్లో కుటుంబసభ్యులను పరామర్శించారు. వైఎస్ జగన్ సంతాపం.. సాక్షి, అమరావతి: మణెమ్మ మృతిపట్ల ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నట్లు వైఎస్ జగన్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. -
ఇల్లు కూలి వృద్ధురాలి మృతి
మోత్కూరు మండలం బొద్దుగూడెం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సప్పిడి మనెమ్మ(75) అనే వృద్ధురాలు ఇల్లు కూలి అక్కడికక్కడే మృతిచెందింది. గురువారం కురిసిన భారీ వర్షానికి ఇల్లు బాగా నానిపోవడం వల్లే కూలిందని స్థానికులు తెలిపారు. -
మరణంలోనూ వీడని బంధం
కడదాకా ఒకరికొకరు తోడుంటామని.. ఆదర్శ జీవనయానం సాగించిన ఆ దంపతులు ఒకరి తరువాత మరొకరు తనువు చాలించారు. అనారోగ్యానికి గురైన భార్య మరణించడంతో ఆ దుఃఖాన్ని తట్టుకోలేక గుండెపగిలి భర్త కనుమూశాడు. ఈ విషాదకర సంఘటన బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా ధన్వాడ మండలం మరికల్ గ్రామంలో చోటుచేసుకుంది. మరికల్‌కు చెందిన బండర్‌పల్లి మణెమ్మ(70), నాగప్ప(75) దంపతులు అన్యోన్యంగా దాంపత్య జీవితం గడిపారు. వీరికి కూతురు, కొడుకు సంతానం కాగా, కొడుకు ఏడేళ్ల క్రితమే అనారోగ్యంతో మృతిచెందాడు. కొడుకు లేడనే వేదనతో మణెమ్మ గత ఆరేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతోంది. నాగప్ప రెక్కలకష్టం మీదే ఆ కుటుంబం బతుకీడుస్తోంది. మంచంపట్టిన భార్యకు నాగన్నే అన్ని సపర్యలూ చేసేవాడు. చేతగాని వయస్సులోనూ ఆమె బాగోగులు చూసుకుంటున్నాడు. అయితే తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మణెమ్మ మంగళవారం రాత్రి కనుమూసింది. అంత్యక్రియలు ముగిసిన వెంటనే.. మణెమ్మ చనిపోయిన విషయాన్ని బంధువులకు చెప్పగా, వారు రావడానికి కొంత ఆలస్యమైంది. బుధవారం మధ్యాహ్నం ఆమె అంత్యక్రియలు నిర్వహించిన అనంతరం ఇళ్లకు చేరుకున్నారు. ఎవరి దుఃఖంలో వారున్నారు. తోడునీడ లేదని.. పుట్టెడు శోకంతో ఉన్న నాగన్న సాయంత్రం 4:30 గంటలకు కుమిలి కుమిలి ఇంట్లోనే కన్నుమూశాడు. భార్యాభర్తలు ఒకేరోజు.. కొన్ని గంటల వ్యవధిలో చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
రెండెకరాల్లో చేతికి వచ్చిన వరి పంట దగ్ధం
కోతకు వచ్చిన వరి పంట ప్రమాదవశాత్తు కాలిపోయింది. ఈ ఘటన నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం కాజీరామారం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బట్టుపల్లి మణెమ్మకు చెందిన రెండెకరాల వరి పంట కోతకు వచ్చింది. గురువారం ఉదయం కోత మిషన్‌తో కోయాల్సింది ఉంది. అయితే, బుధవారం మధ్యాహ్నం పొలంపైగా వెళ్తున్న 11కేవీ విద్యుత్ తీగలు రాపిడితో మంటలు రేగి పైరుపై పడ్డాయి. ఎండ తీవ్రత కారణంగా మంటలు వెంటనే అంటుకుని పొలంమంతా వ్యాపించాయి. ఫైరింజన్ వచ్చేలోగానే నష్టం జరిగిపోయింది. తన పొలంలో కొత్తరకం వరి వంగడం సాగు చేశానని, క్వింటా రూ.1600 చొప్పున ఇప్పటికే రైతులు విత్తనాల కోసం అడిగారని బాధితురాలు తెలిపింది. సుమారు రూ.80 వేల మేర నష్టం వాటిల్లినట్లు ఆమె అంటోంది. -
కన్నేశాడు.. కాటేశాడు..
కుత్బుల్లాపూర్: అప్పటికే పెళ్లైంది.. భార్య ఉంది.. ఇద్దరు పిల్లలు ఉన్నారు.. మరో మహిళతో సహజీవనం చేస్తూ ఓ మైనర్ బాలికపై కన్నేశాడో ప్రబుద్ధుడు. పథకం ప్రకారం ఇంట్లోకి పిలిపించి బీరు తాగించి మరీ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మెదక్ జిల్లా కు చెందిన ఓ బాలిక (14) బతుకుదెరువు కోసం కుత్బుల్లాపూర్ ప్రాంతంలో ఓ ఇంట్లో పని చేస్తూ తల్లితో కలిసి ఉంటుంది. మెదక్‌జిల్లా చేగుంట మండలం రాంపూర్‌కు చెందిన ఎల్లం (45 ) కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మేస్త్రీ పని చేసే ఎల్లంకు ఒంటరిగా ఉంటున్న మణెమ్మతో వివాహేతర సంబంధం ఉంది. ఈ నేపధ్యంలో మెదక్ జిల్లాకు చెందిన బాలిక ఎల్లం ఉంటున్న కాలనీలోనే ఓ ఇంట్లో పని చేస్తున్న విషయాన్ని గుర్తించాడు. ఆ బాలికపై కన్నేసిన ఎల్లం ఎట్టకేలకు లొంగ దీసుకోవాలని పథకం పన్నాడు. ఈ నెల 13వ తేది మంగళవారం మధ్యాహ్నం సమయంలో కొత్త బట్టలు తీసుకున్నా చూద్దువురా అంటూ బాలికకు మాయమాటలు చెప్పి మణెమ్మ ఇంటికి తీసుకు వచ్చింది. అప్పటికే ఇంట్లో ఉన్న ఎల్లం ప్రధాన ద్వారానికి గొళ్లెం పెట్టి బాలికకు బలవంతంగా బీరు తాగించి మణెమ్మ సమక్షంలోనే లైంగిక దాడికి దిగాడు. నాటి నుంచి బాలిక పరిస్థితి విషమంగా మారింది. జరిగిన విషయాన్ని ఎవరికి చెప్పుకోలేకపోయింది. రెండు రోజుల నుంచి తీవ్ర జ్వరం రావడంతో ఇంటి యజమానిరాలుతో పాటు బాలిక తల్లి గట్టిగా అడగడంతో బోరున విలపిస్తూ జరిగిన విషయం చెప్పింది. దీంతో సోమవారం పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి బాధితులు సీఐ డి.వి.రంగారెడ్డికి ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు నిర్భయ చట్టంతో పాటు బాలిక ను హింసించడంపై కేసులు నమోదు చేశారు. -
కూలీ డబ్బులతో చదివించా..
జార్ఖండ్ రాష్ట్ర ఐఏఎస్ అధికారి డి.ఆంజనేయులు తల్లి మణెమ్మకు మాతృవందనం విశిష్ట పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూలీ పనులు చేస్తూ తన కుమారుడిని ఐఏఎస్ చదివించానని తెలిపారు. తన కొడుకు కూడా పట్టుదలతో చదివి అనుకున్న లక్ష్యాన్ని సాధించాడని మురిసిపోయారు. -
ఈ అమ్మ మణిపూస
మే 11మాతృదినోత్సవంసందర్భంగా... మారుమూల గ్రామంలో ఎస్సి కాలనీ పిల్లాడు ఎస్ఎస్సి పాసైతేనే గొప్ప... అలాంటిది ఐఎఎస్ అవ్వడం అంటే మాటలు కాదు కదా! దళితుల జీవితాలను వెలుగులోకి తెచ్చేది విద్య ఒక్కటేనని నమ్మిన ఓ తల్లి బిడ్డనెలాగైనా కలెక్టర్‌ని చేయాలనుకుంది. ఆమె ఆశయం నెరవేరడం వెనక... కన్న ప్రేమొక్కటే కాదు... కాయకష్టం కూడా ఉంది. మడమ తిప్పిన బిడ్డలో మళ్లీ స్ఫూర్తి నింపి, లక్ష్యంవైపు ముందుకు పంపిన ఆ తల్లి పేరు-మణెమ్మ. అమ్మ కలను నిజం చేసిన కొడుకు - ఆంజనేయులు. ‘బువ్వ పెట్టంగనే బాధ్యత తీరిపోదు కదా! అట్లని ఇచ్చేటందుకు... నా దగ్గర ఆస్తులేమీ లేవు. కలెక్టర్ కావాలని చిన్నగున్నప్పుడు వాడు చెప్పిన మాటలు నిజం చేయాలన్న పట్టుదల మాత్రం నాకు చానా ఉండేది. అదే వాడ్ని కలెక్టర్‌ని చేసింది’ అంటూ మణెమ్మ చెప్పిన మాటలు అందరి అమ్మల మనసుల్నీ తాకుతాయి. రెండుసార్లు సివిల్స్ పరీక్ష రాసిన ఆంజనేయులు ఫలితం లేకపోవడంతో తల్లి పడుతున్న తిప్పలు చూసి సొంతూరికి తిరిగొచ్చేశాడు. ‘ఏదో ఒక ఉద్యోగం చేసి నీకు సాయపడతానమ్మా... ఇంకా ఎన్నాళ్లు ఈ తిప్పలు పడతావు’ అన్న కొడుకు మాటలకు మణెమ్మ చెప్పిన సమాధానం ఆంజనేయులు ఎప్పటికీ మరిచిపోలేడు. ‘‘నేనున్నగదా బిడ్డా... చదవలేనంటే చెప్పు... నేను చదివించలేనిదాన్ని మాత్రం కాదు. నువ్వు చిన్నప్పుడు ‘కలెక్టరైత నాయనా’ అని మీ నాయనతో అంటే ‘కలెక్టర్ కావాలె బిడ్డా... మన కాలనీ పవర్ చూపియ్యాలే బిడ్డా’ అని మీ నాయనన్న మాటలు నువ్వు మరచినవేమో... నేను మరవలేదు. ఇన్ని రోజులు కష్టపడ్డదాన్ని ఇంకో ఏడాది కష్టం చేయలేనా... నువ్వు ధైర్యంగా మళ్ల ఢిల్లీ రెలైక్కు. కలెక్టర్ అయినంకనే ఊరికి తిరిగిరా!’’ అంటూ ఆంజనేయుల్ని ముందుకు నడిపించింది మణెమ్మ. ఒక్కరోజు కూలీ పని మానితే వంద రూపాయలు పోతాయని... ఎండనకా, వాననకా కూలిపని చేసి, కొడుకును చదివించింది మణెమ్మ. భర్త కోరిక... పంచాయతీ కార్యాలయంలో నల్లాలు విప్పే పని చేసే పోచయ్యకు కొడుకును కలెక్టర్‌గా చూడాలనే ఆశ ఉండేది కానీ, తన ఆర్థిక పరిస్థితి ఆ కోరిక తీర్చదనే భావనలో ఉండేవాడు. ఆంజనేయులు పదోతరగతి స్కూల్ ఫస్ట్ వచ్చాడన్న వార్త విన్నాక మణెమ్మ, పోచయ్యల ఆనందానికి అవధుల్లేవు. అందరూ ఆంజనేయుల్ని పాలిటెక్నిక్ చదివిస్తే మంచిదని చెప్పగానే అప్పుచేసి కాలేజీలో చేర్పించారు. తండ్రి మరణంతో ఆంజనేయులు తన కలలకు సెలవు చెప్పాడు. చదువైపోగానే ఏదో ఒక ఉద్యోగం చూసుకుని తల్లికి సాయపడదామనుకున్నాడు. అప్పటికి హైదరాబాద్‌లో వాసవి ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నాడు. అమ్మతోపాటు అక్కాబావ కూడా ఆంజనేయులుకి ఆర్థికసాయం చేశారు. తల్లి మాట... ఇంజనీరింగ్ పూర్తయ్యాక ఆంజనేయులకి హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం వచ్చింది. అక్కడ కొడుకు, ఇక్కడ ఊళ్లో మణెమ్మ పనులు చేసుకుంటూ అప్పులు తీర్చుకునే పనిలో పడ్డారు. ఇంతలో మణెమ్మకు బిడ్డ కలెక్టర్ కల గుర్తుకొచ్చింది. ‘నువ్వు కలెక్టర్ కావాలన్న నాయన కోరిక తీరదంటవా ఆంజనేయులూ’ అంది.‘‘చాలమ్మా...ఇప్పటిదాక పడ్డ తిప్పలు చాలవా... కలెక్టర్ అంటే మాటలు కాదు. ఢిల్లీకి పోయి చదువుకోవాలే. చాలా ఖర్చు అవుతుంది’’ అన్నాడు. ‘‘ఇప్పటిదాకా ఏమైనా ఉచితంగా చదువుకున్నవా! పైసల్లేకుండా చదువెట్లొస్తది. నేనున్న కదా’’ అని తల్లి చెప్పిన మాటలు ఆంజనేయులు గుండెలో కొండంత ధైర్యాన్ని నింపాయి. అనుకున్నదే తడవుగా ఢిల్లీకి బయలుదేరాడు. అక్కడే ఉండి సివిల్స్ కోసం చదువుకున్నాడు. 60 ఏళ్ల మణెమ్మ వ్యవసాయ పనులు లేనపుడు ఉపాధి హామీ పనులకు కూడా వెళ్లి డబ్బులు పోగు చేసింది. మూడోసారి... మాటిమాటికీ గుర్తొచ్చే తల్లి కష్టం గురించి ఆంజనేయులు తలచుకోని రోజులేదు. ‘‘2011లో శిక్షణ పూర్తయ్యాక జార్ఘాండ్‌లో గుర్మాలో సబ్‌కలెక్టర్ ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం గుర్మాలోనే ఉన్నాను. అమ్మ ఊళ్లోనే ఉంటోంది. నేను ఐఎఎస్ శిక్షణలో ఉన్నప్పుడు కూడా అమ్మ ఊళ్లో వ్యవసాయం పనికి వెళ్లింది. అమ్మ ధైర్యం, పట్టుదల ముందు నేనెప్పటికీ పసివాణ్ణే’’ అని చెబుతున్నప్పుడు ఆంజనేయులు మాటల్లో ‘అమ్మ’ అన్న పదం ఎంతో కమ్మగా వినిపించింది. ‘‘చూస్తే... భర్త లేడు, ఉన్న బిడ్డను యాడ్నో పెట్టి చదివిస్తుంది. మణెమ్మకు ఆకాశమంత ఆశగాకపోతే...లక్షలు ఖర్చుపెట్టెటోళ్లకే దిక్కులేదు. అట్లాంటిది..ఈమొక్కామె కష్టంతోనే బిడ్డ కలెక్టర్ అయిపోతడా’’ అంటూ సాగిన చుట్టుపక్కలవారి మాటల్ని లెక్కచేయకుండా పట్టుదలతో బిడ్డను కలెక్టర్‌ని చేసిన మణెమ్మ రెండేళ్లక్రితమే ఆంజనేయులుకి పెళ్లి చేసి ఆ బాధ్యత కూడా తీర్చుకుంది. బిడ్డ జార్ఘాండ్‌లో సబ్‌కలెక్టర్‌గా ఉద్యోగం చేస్తుంటే మణెమ్మ ఊళ్లో కొడుకు కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తోంది. మణెమ్మ నిజంగా గొప్ప తల్లి. ఆంజనేయులు మాటల్లో చెప్పాలంటే ‘మా అమ్మ మణిపూస’. - భువనేశ్వరి ఫొటోలు: కొలగాని రాజేందర్ ************************* ఇంజనీరింగ్‌లో సీటు వచ్చిందని తెలియగానే పోచయ్య జేబు తడుముకున్నాడు. ‘మన వల్ల కాదేమోనే...’ అన్న భర్త మాటలకు అడ్డు చెబుతూ...‘‘ఇప్పటి దాకా పడ్డ కష్టమొకెత్తు, ఇప్పుడు పడాల్సిన కష్టమొకెత్తు. ఒక్క మూడేళ్లు కళ్లు మూసుకుంటే బిడ్డ ఇంజనీర్ అయితడు. మంచి ఉద్యోగమొస్తది. ఇద్దరం కష్టపడదం. నువ్వు ఇల్లు చూడు... నేను వాడి చదువు చూసుకుంట’’ అంటూ భర్తను ఒప్పించింది. ఆలుమగలూ ఒక్కమాటపై బిడ్డకోసం పడుతున్న కష్టానికి మరో పెద్ద కష్టం అడ్డుపడింది. కాలేయ వ్యాధితో పోచయ్య మంచం పట్టాడు. వ్యాధి ముదిరిపోవడంతో ఎంత వైద్యం చేయించినా లాభం లేకపోయింది. తండ్రి మరణంతో ఆంజనేయులు తన కలలకు సెలవు చెప్పాడు. ************************* ‘రెండుసార్లు సివిల్స్‌లో ర్యాంకు రాకపోయేసరికి నాకు విసుగొచ్చింది. అమ్మ పడుతున్న కష్టం గుర్తొచ్చినపుడల్లా ఊరికెళిపోవాలనిపించి వచ్చేశాను. ‘‘నువ్వు వస్తే కలెక్టర్‌గానే ఇంటికి రా... ఎంత కష్టమైనా నేను పడతాను. ఆ తర్వాత నువ్వు ఏం చెబితే అది చేస్తాను’’ అన్న అమ్మ మాటలు నాలో పట్టుదలను నింపాయి. ఆ పట్టుదలే నన్ను మూడో ప్రయత్నంలో విజేతను చేసింది. -
ఎమ్మెల్యే మణెమ్మపై వరకట్న వేధింపుల కేసు