మణెమ్మ ,అంజన్‌కుమార్ ,దత్తాత్రేయ
సికింద్రాబాద్ :సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అభ్యర్థులు ఎవరూవరుసగా మూడుసార్లు గెలవలేదు. ఇక్కడి నుంచి వరుసగా రెండుసార్లు గెలిచినపలువురు నేతలకు మూడోసారిఆశాభంగం తప్పలేదు. ఈ నియోజకవర్గం 1956లో ఆవిర్భవించగా, ఇప్పటి వరకు 17సార్లు (ఉప ఎన్నికతో 1987–89)ఎన్నికలు జరిగాయి. ఇక్కడి నుంచి పోటీ చేసిన వారిలో ఐదుగురురెండుసార్లు వరుసవిజయాలు సాధించారు. మూడోసారి పోటీ చేసేఅవకాశం లభించక కొందరు, పోటీ చేసి పరాజయం పాలవడంతో మరికొందరు హ్యాట్రిక్ చేజార్చుకున్నారు. ఒకరు మూడుసార్లు, మరొకరు నాలుగు సార్లు ఎంపీగా గెలిచినప్పటికీ హ్యాట్రిక్ మాత్రం దక్కలేదు.
♦ సికింద్రాబాద్ స్థానం నుంచి పోటీ చేసిన నరాల సాయికిరణ్ యాదవ్ 1957, 62 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు.ఆ తర్వాత ఎన్నికలకు పోటీకి దూరమైన ఆయన తిరిగి 1971లో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు.
♦ కాంగ్రెస్ నేత పి.శివశంకర్ 1979, 1980 ఎన్నికల్లో గెలుపొందారు. ఆ తర్వాత ఎన్నికల్లో ఆయనకు పోటీ చేసే అవకాశం రాలేదు.
♦ 1987, 89 ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి టి.అంజయ్యమరణానంతరం ఆయన సతీమణి మణెమ్మ రెండుసార్లుఎంపీగా గెలుపొందారు.
♦ 1991 ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ.. ఆ తర్వాతి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి, పీవీ తనయుడు రాజేశ్వరావు చేతిలో పరాజయం పాలయ్యారు.
♦ తిరిగి 1998, 99 ఎన్నికల్లో రెండుసార్లు వరుస విజయాలు సాధించిన దత్తాత్రేయ... 2004లో ఓటమిపాలై హ్యాట్రిక్ చేజార్చుకున్నారు. 2014లో నాలుగోసారి ఎంపీగా గెలిచారు.
♦ 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున అంజన్‌కుమార్‌యాదవ్ తొలి విజయం సాధించారు. 2009లోనూ రెండోసారి గెలుపొందారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయి హ్యాట్రిక్ మిస్ అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment