![doctor nori dattatreyudu met cm revanth reddy at chief minister residence - Sakshi](/styles/webp/s3/article_images/2023/12/25/DR.NORI%20DATTATEYUDUR.jpg.webp?itok=UQ-Cju1Y)
సాక్షి, హైదరాబాద్: ప్రఖ్యాత ఆంకాలజిస్టు నోరి దత్తాత్రేయుడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిశారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసానికి ఆదివారం వచ్చిన దత్తాత్రేయుడు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.
వైద్య రంగంలో సంస్కరణలకు తన వంతుగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సహకారం కావాలన్నా అందిస్తానని సీఎంతో జరిగిన చర్చల్లో ఆయన వెల్లడించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. అమెరికాలోని మెమోరియల్ స్లోన్ కేటరింగ్ ఆస్పత్రిలో కేన్సర్ విభాగాధిపతిగా దత్తాత్రేయుడు పనిచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment