Anjan Kumar
-
నేషనల్ హెరాల్డ్ కేసులో నాకు ఈడీ నోటీసులు అందలేదు : అంజన్ కుమార్
-
డ్రగ్స్‌పై సిట్ ఏర్పాటు చేయాలి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో డ్రగ్స్ వ్యవహారంపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసి సమగ్ర విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. హైదరాబాద్‌లో వెలుగు చూసిన పబ్‌లో డ్రగ్స్ వినియోగం కేసులో ఎంతటి వారున్నా కఠినంగా శిక్షించాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ కోరారు. ఆదివారం గాంధీభవన్‌లో మరో వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుత కేసులో ఏసీపీకి మెమో ఇచ్చి సీఐని సస్పెండ్ చేస్తే సరిపోదన్నారు. నిజాయితీగా విచారించి దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని, గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా అమ్ముతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో డ్రగ్స్ వ్యవహారంపై ఒక డాక్టర్‌గా, గవర్నర్ తమిళిసై స్పందించాలని మహేశ్‌గౌడ్ కోరారు. అన్ని పబ్‌లు మూసివేయాలి నగరంలోని అన్ని పబ్‌లను మూసివేయాలని మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. తన కొడుకు పుట్టిన రోజు వేడుకలకు పబ్‌కు వెళ్లిన మాట వాస్తవమేనన్నారు. స్నేహితులతో కలిసి వెళ్తే అభాండాలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయంగా ఎదుగుతున్న తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. -
సభ్యత్వ నమోదు వేగం పెంచాలి..
సాక్షి, హైదరాబాద్: సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, లోక్‌సభ నియోజకవర్గాల స్థాయిలో ఈ ప్రక్రియను మరింత పకడ్బందీగా ముందుకు తీసుకెళ్లాలని తీర్మానించింది. సభ్యత్వ నమోదుపై సమీక్ష గాంధీభవన్‌లో మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శులు శ్రీనివాస కృష్ణన్, జి. చిన్నారెడ్డి, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు బి. మహేశ్‌కుమార్‌గౌడ్, జె. గీతారెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్ సీనియర్ నేతలు జి. నిరంజన్, సంభాని చంద్రశేఖర్, ఎం.ఆర్జీ.వినోద్‌రెడ్డి, గాలి అనిల్‌కుమార్, మల్లురవి, రాములు నాయక్, రోహిణ్‌రెడ్డి, తోటకూర జంగయ్య, చామల కిరణ్‌లతో పాటు పార్టీ అను బంధ సంఘాల చైర్మన్లు పాల్గొన్నారు. అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులు, జిల్లాలు, లోక్‌సభ నియోజకవర్గాల వారీగా పోలింగ్‌బూత్ ఇన్చార్జులు, సభ్యత్వాల సంఖ్యపై నేతలు సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు 6లక్షల డిజిటల్ సభ్యత్వం పూర్తయిందని తేల్చారు. ఈ సందర్భంగా ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాస కృష్ణన్ మాట్లాడుతూ... జనవరి 26 నాటికి 30లక్షల సభ్య త్వం పూర్తయ్యేలా కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని, ప్రతి పార్టీ సభ్యుడికి రూ.2లక్షల ప్రమాదబీమా వస్తుందన్న విషయాన్ని చెప్పాలని తెలిపారు. -
హైదరాబాద్ సీపీగా బాధ్యతలు చేపట్టిన సీవీ ఆనంద్
-
ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ అరెస్టు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ సమీప బంధువుల కిడ్నాప్ కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ నాయకురాలు భూమా అఖిలప్రియ అరెస్ట య్యారు. హాకీ మాజీ ఆటగాడు ప్రవీణ్‌రావుతోపాటు ఆయన సోదరులను మంగళవారం రాత్రి సినీఫక్కీలో కిడ్నాప్ చేయడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో అఖిలప్రియను ఏ1గా నిర్ధారించిన హైదరాబాద్ పోలీసులు.. బుధవారం ఆమెను అరెస్టు చేసి మారేడుపల్లిలోని 11వ ఏసీఎంఎం కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆశాలత 14 రోజుల రిమాండ్ విధించడంతో అఖిలప్రియను చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ కేసులో మరో నిందితుడిగా ఉన్న అఖిలప్రియ భర్త భార్గవరామ్ పరారీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనతోపాటు మిగిలిన నిందితులను అరెస్టు చేయడానికి 15 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్టు సీపీ అంజనీకుమార్ వెల్లడించారు. భూవివాదమే కారణం.. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని హఫీజ్‌పేటలో 40 ఎకరాల భూమికి సంబంధించిన వివాదమే ఈ కిడ్నాప్‌నకు కారణమని తెలుస్తోంది. ప్రవీణ్‌రావుతో పాటు ఆయన సోద రులు సునీల్‌రావు, నవీన్‌రావులను కిడ్నాప్ చేసి బెదిరించడం ద్వారా ఆ స్థలాన్ని తమ పేరుతో రాయించుకోవాలని అఖిల ప్రియ, ఆమె భర్త భార్గవ్‌రామ్ పథ కం వేశారు. ఈ బాధ్యతల్ని తమ అనుచరుడైన శ్రీనివాస్ చౌదరి అలియాస్ గుంటూరు శ్రీనుకు అప్పగించారు. నేరచరిత్ర ఉన్న ఇతడిపై గుంటూరులో రౌడీషీట్ ఉన్నట్లు తెలిసింది. మంగళవారం సాయంత్రం రంగంలోకి దిగిన గుంటూరు శ్రీను.. సాయి, చంటి, ప్రకాష్ సహా 14మంది శ్రీకృష్ణనగర్‌లో ఉన్న భార్గవ్‌కు చెందిన ఎంజీఎం ఇంటర్నేషనల్ స్కూల్లో సమావేశమయ్యారు. అక్కడే తాము వినియోగించుకోవాలని నిర్ణయించుకున్న ఇన్నోవా, స్విఫ్ట్ డిజైర్, మహేంద్ర వాహనాల నెంబర్ ప్లేట్లు మార్చి నకిలీవి తగిలించారు. అధికారుల్లా కనిపించేందుకు అందరూ ఫార్మల్ వస్త్రాలు, మెడలో టైలు ధరించారు. ఓ నిందితుడు పోలీసు యూనిఫాం వేసుకుని చేతితో లాఠీ కూడా పట్టున్నాడు. ఇవన్నీ ఫిల్మ్‌నగర్‌లో సినిమా షూటింగ్స్‌కు అద్దెకు ఇచ్చే దుకాణం నుంచి తెచ్చినట్లు అనుమానిస్తున్నారు. నకిలీ గుర్తింపుకార్డులు, బోగస్ సెర్చ్ వారెంట్లు కూడా తయారు చేసుకున్నారు. సోదాల పేరుతో హడావుడి చేసి... అంతా సిద్ధమైన తర్వాత మూడు వాహనాల్లో బయలుదేరి రాత్రి 7.20 గంటల ప్రాంతంలో బోయిన్‌పల్లిలో ప్రవీణ్ ఇంటికి చేరుకున్నారు. ఆదాయపు పన్ను అధికారులమని చెప్పి ఇంట్లోకి వెళ్లారు. ప్రవీణ్, సునీల్, నవీన్‌లను హాలులో ఉంచిన నిందితులు.. మిగిలిన కుటుంబ సభ్యులందరినీ ఓ బెడ్రూమ్లో బంధించారు. దాదాపు 20 నిమిషాలు సోదాల పేరుతో హడావిడి చేశారు. అనంతరం ఆ ముగ్గురి కళ్లకూ గంతలు కట్టి బయటకు తీసుకొచ్చారు. ముగ్గురినీ వేర్వేరు వాహనాల్లో ఎక్కించుకుని వారి చేతులు, కాళ్లూ కట్టేశారు. బోయిన్పల్లి నుంచి సికింద్రాబాద్, ప్యాట్నీ, మెహదీపట్నం మీదుగా చిలుకూరులో ఉన్న భార్గవ్ స్నేహితుడి ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్లారు. అక్కడే ముగ్గురినీ నిర్బంధించి ఖాళీ కాగితాలపై సంతకాలు చేయించుకున్నారు. మరోవైపు రాత్రి 8.20 గంటల ప్రాంతంలో పొరుగింట్లో ఉండే సచిత అనే మహిళ ప్రవీణ్‌రావు ఇంటికి వచ్చారు. ఓ గది నుంచి శబ్దాలు రావడం, బయట నుంచి గడియపెట్టి ఉండటం గమనించిన ఆమె.. తలుపు తీశారు. దీంతో గది బయటకు వచ్చిన కుటుంబీకులు ప్రవీణ్, నవీన్, సునీల్ కనిపించకపోయే సరికి సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించి కిడ్నాప్ జరిగినట్టు నిర్ధారణకు వచ్చారు. జల్లెడ పట్టిన ప్రత్యేక బృందాలు... ప్రవీణ్‌రావు తదితరులు కిడ్నాప్ అయిన విషయాన్ని వారి బంధువు కె.మనీష్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అఖిలప్రియతోపాటు ఆమె భర్త భార్గవరామ్, ఏవీ సుబ్బారెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. 15 బృందాలను రంగంలోకి దింపారు. మూడు కమిషనరేట్లలో పోలీసులు జల్లెడ పడుతుండటం, ఇరుగుపొరుగు రాష్ట్రాలకూ సమాచారం ఇవ్వడం, మీడియా హడావుడి నేపథ్యంలో నిందితులు పునరాలోచనలో పడ్డారు. బుధవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో కోకాపేట వద్ద బందీలను వదిలేశారు. బాధితులు ఆ విషయాన్ని నార్త్‌జోన్ డీసీపీ కల్మేశ్వర్‌కు చెప్పడంతో పోలీసులు అక్కడకు వెళ్లి ముగ్గురినీ ఇంటికి తీసుకెళ్లారు. అనంతరం బుధవారం ఉదయం 11.20 గంటలకు బోయిన్పల్లి పోలీసులు అఖిలప్రియను అదుపులోకి తీసుకుని బేగంపేటలోని మహిళా ఠాణాకు తీసుకువచ్చారు. విచారణ అనంతరం 12.40కి అరెస్టు చేసి వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాంధీలో హైడ్రామా.. అఖిలప్రియ అరెస్టు అనంతరం గాంధీ ఆస్పత్రి వద్ద స్వల్ప హైడ్రామా చోటుచేసుకుంది. ఆస్పత్రి ప్రాంగణంలో వాహనం దిగుతూనే తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ఆమె.. స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అత్యవసర విభాగంలో చేర్పించి వైద్యసేవలు అందించడంతో కోలుకున్నారు. ఈ క్రమంలో అఖిలప్రియతోపాటు కుటుంబసభ్యులు హంగామా చేశారు. అఖిలప్రియకు ఫిట్స్ వచ్చి ప్రాణాపాయస్థితిలో ఉన్నారని వైద్యులపై ఒత్తిడి తెచ్చారు. ఆమె గర్భవతి అని కూడా అబద్ధాలు చెప్పారు. ఈ నేపథ్యంలో దాదాపు ఐదు గంటలపాటు అఖిలప్రియకు అన్ని రకాల పరీక్షలు చేసిన వైద్యులు.. ఆమె గర్భవతి కాదని, సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని నిర్దారించారు. అనంతరం అఖిలప్రియను మీడియా కంటపడనీయకుండా పోలీసులు అక్కడ నుంచి న్యాయమూర్తి వద్దకు తీసుకెళ్లారు. పోలీసుల అదుపులో సుబ్బారెడ్డి ఈ కిడ్నాప్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏవీ సుబ్బారెడ్డిని నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. గచ్చిబౌలిలో నివసించే సుబ్బారెడ్డి.. ఈ కేసులో తన పేరు రావడంతో మీడియాతో మాట్లాడారు. మాదాపూర్‌లోని ఓ రెస్టారెంట్ వద్ద మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ విషయం గుర్తించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు అక్కడకు వెళ్లి ఆయన్ను అదుపులోకి తీసుకుని సికింద్రాబాద్‌లోని టాస్క్‌ఫోర్స్ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఫిర్యాదులోని అంశాల ఆధారంగానే సుబ్బారెడ్డిని నిందితుడిగా చేర్చి అదుపులోకి తీసుకున్నామని, విచారణలో వెలుగులోకి వచ్చిన వివరాలను బట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని ఓ ఉన్నతాధికారి తెలిపారు. కిడ్నాప్లతో నాకు సంబంధం లేదు ప్రవీణ్‌రావుతో కొన్ని అంశాల్లో వివాదాలు ఉన్నాయి. బోయిన్‌పల్లిలో జరిగిన కిడ్నాప్లతో ఎలాంటి సంబంధం లేదు. ఆ కేసులో నన్ను నిందితుడిగా ఎందుకు పెట్టారో అర్థం కావడం లేదు. గతంలో భూమా అఖిలప్రియ తదితరులు నన్ను చంపడానికి ప్రయత్నించారు. కొందరికి సుపారీ కూడా ఇచ్చారు. అలాంటివారితో కలిసి ఎలా పనిచేస్తాను? – మీడియాతో ఏవీ సుబ్బారెడ్డి ఆ భూమి విలువ రూ.400 కోట్ల పైమాటే.. హఫీజ్‌పేట్: ఈ కిడ్నాప్ వ్యవహారానికి కారణమైన భూమి అత్యంత విలువైనదేనని తెలుస్తోంది. శేరిలింగంపల్లి మండలం న్యూ హఫీజ్‌పేట్‌లోని సర్వే నంబర్ 80లోని 25 ఎకరాల భూమిపై ఏళ్లుగా వివాదం నెలకొంది. బహిరంగ మార్కెట్లో ఈ భూమి విలువ రూ.400 కోట్ల పైమాటే. ఈ భూమి తమదంటే తమదంటూ ప్రభుత్వానికి, ప్రైవేటు వ్యక్తుల మధ్య వివాదం కొనసాగుతోంది. అయితే, అది ప్రభుత్వ భూమేనని ఆధారాలతో నిర్ధారించలేకపోవడంతో 2003లో హైకోర్టులో ప్రైవేటు వ్యక్తులకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అయితే, ఆ భూమిపై యాజమాన్య హక్కులు కలిగి ఉన్నామని కిడ్నాప్‌కు గురైన ప్రవీణ్‌రావు తదితరులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఈ వివాదం ముదిరి కిడ్నాప్‌కు దారితీసినట్టు తెలుస్తోంది. 17 ఏళ్ల క్రితం ప్రైవేటు వ్యక్తులకు అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చినా.. సర్కారు మాత్రం అది ప్రభుత్వ భూమేనని పేర్కొంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో ఈ కేసును పున:సమీక్షించాలని గత నెలలో సుప్రీంకోర్టు హైకోర్టును ఆదేశించినట్లు రెవెన్యూ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. (చదవండి: సికింద్రాబాద్ కోర్టుకు అఖిలప్రియ!) -
నేను సోనియమ్మను మోసం చేయను: మాజీ ఎంపీ
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల నగరా మోగడంతో రాజకీయ పార్టలో హాడావుడి మొదలైంది. ఈ ఎన్నికలో గెలిచేందుకు ప్రముఖ పార్టీ నాయకులు ఎత్తుకు పైఎత్తులు వేస్తుంటే ఆయా పార్టీ అభ్యర్థులు మాత్రం తమ పార్టీలోనే ఉండాలా లేక ఇతర పార్టీలో చేరాలా అనే అయోయంలో ఉన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ భరిలో దిగే తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన సందర్భంగా మాజీ ఎంపీ అంజన్ కమార్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రావన్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సాక్షితో సమావేశమ్యారు. ఈ సందర్భంగా అంజన్ కుమార్ మాట్లాడుతూ... తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. పార్టీలో సమస్యలు ఉన్నమాట వాస్తవమే కానీ అవన్ని సర్దుకుంటాయని ధీమా వ్యక్తం చేశారు. కమిటీ వేసే ముందు తనను సంప్రదించలేదని కొంత అసంతృప్తితో ఉన్నానన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్న సోనియా గాంధీ నాయకత్వంలో పనిచేస్తానని, ఒక సీటు గెలిచిన బీజేపీ, హామీలు నెరవేర్చని టీఆర్ఎస్ను ప్రజలు నమ్మరన్నారు. తాను పార్టీ మారే ప్రసక్తి లేదని, సోనియాగాంధీని మోసం చేసి వెళ్లను అన్నారు. (చదవండి: ‘గ్రేటర్’ ఎన్నికలు; కాంగ్రెస్ తొలి జాబితా ఇదే) అలాగే కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రావన్ మాట్లాడుతూ.. గ్రేటర్లో వేలాది మంది ప్రజలు మీసేవ కేంద్రాల వద్ద వేచి చూస్తున్న దయనీయ పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. పదివేల కోసం తిండి, తిప్పలు మాని రాత్రి, పగలు తేడా లేకుండా లైన్ల్లో నిలబడుతున్నారన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నిర్వాకం వల్ల ప్రజలు చివరికి చనిపోయే పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. కేసీఆర్, కేటీఆర్‌లు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారన్నారు. ప్రతీ ఒక్కరి ఖాతాలో డబ్బులు వేసే అవకాశం ఉన్నప్పటికీ.. ఆ పని చేయడం లేదని, ఓట్ల కోసం చిల్లర రాజకీయాలకు పాల్పడుతూ.. పేదలను బలిచేస్తున్నారని ఆరోపించారు. అధికారులు ఏం చేస్తున్నారు.. ప్రజల వివరాలు సేకరించి డబ్బులు వేయవచ్చు కదా అని ధ్వజమెత్తారు. ప్రతీ బాధితుడిని ఆదుకోవాలని సూచించినా.. అధికార పార్టీ వినకుండా ఎన్నికల రాజకీయం చేస్తుందని ధ్వజమెత్తారు. ఇప్పటి వరకు ఎంత వరద నష్టం జరిగిందనే దానిపై సమగ్ర సమాచారం గుర్తించారా అని, ఈ విషయంలో గవర్నర్ ఉత్సవ విగ్రహంగా మారిపోయారని విమర్శించారు. వరద అవినీతిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదని, వరద సహాయం తీసుకురావడంలో బీజేపీ విఫలమైందని దాసోజు వ్యాఖ్యానించారు. (చదవండి: తొలి రోజు 17 మంది.. 20 నామినేషన్లు) అదే విధంగా మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ... ‘అధికార పార్టీ టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతున్నందున ఎవరికి టైం ఇవ్వకుండా ఎన్నికలు పెట్టేశారు. తమ పార్టీ నాయకులు బిక్షపతి యాదవ్, రవికుమార్ యాదవ్ చెప్పకుండా వెళ్లిపోయారు. ఆయన పార్టీ మారడం వల్ల కాంగ్రెస్‌కు వచ్చిన ఇబ్బంది ఏంలేదు. కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని బీజేపీ ప్రచారం చేస్తోంది, అలాంటి పరిస్థితి ఏమీ లేదు. ప్రజాస్వామ్యం నిలబడాలంటే.. కాంగ్రెస్ ఉండాలి. గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ గట్టిగా పోరాడుతుంది. పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ రేపు 9 గంటలకు శేరిలింగంపల్లిలో సమావేశం నిర్వహిస్తున్నాం. శేరిలింగంపల్లిలో పది డివిజన్లలో కాంగ్రెస్ గెలుపుకు రేపటి మీటింగ్ ఉపయోగపడుతుంది. బీజేపీ అంత గట్టిగా ఉంటే.. మా పార్టీ నేతల వెంట ఎందుకు పడుతున్నారు. బీజేపీకి సరుకు లేక.. మా పార్టీ నేతల వెంటపడుతోంది. హైదరాబాద్ వరదలు వస్తే.. ఒక్క రూపాయి సహాయం చేయలేదు. 2009 కంటే మెరుగైన ఫలితాలు ఈ సారి సాధిస్తాం’ అని కొండా ధీమా వ్యక్తం చేశారు. -
‘కానిస్టేబుల్ అని పిల్లనివ్వడం లేదు’
సాక్షి, హైదరాబాద్ : కానిస్టేబుల్ ఉద్యోగంతో జీవితం మారట్లేదనే ఆవేదనతో ఓ కానిస్టేబుల్ చేసిన రాజీనామాను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ సోమవారం ఆమోదించారు. చార్మినార్ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న సిద్ధాంతి ప్రతాప్ సెప్టెంబర్‌లో కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేస్తూ పోలీస్ కమిషనర్‌కు రాసిన లేఖ రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. పూర్వాపరాలు పరిశీలించిన కమిషనర్.. రాజీనామా ఆమోదిస్తూ ఉత్తర్వులు (డీవో నెం.9583/2019) జారీ చేశారు. ఇంజనీరింగ్ పూర్తిచేసిన ప్రతాప్ 2014లో కానిస్టేబుల్‌గా చేరాడు. (చదవండి : కనీసం.. పిల్లనివ్వడం లేదు) కొన్నాళ్లుగా తన సీనియర్లను పరిశీలించగా.. పలువురు 35 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నా కానిస్టేబుల్‌గానే పదవీ విరమణ చేస్తున్న విషయాన్ని గుర్తించాడు. ఇంత సర్వీసు ఉన్న వారికి ఇతర విభాగాల్లో స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ లభిస్తోందని, సబ్ఇన్స్పెక్టర్ ఆపై స్థాయి అధికారులకు పదోన్నతులతో పాటు వాహనం, పెట్రోల్ వంటి ఇతర సౌకర్యాలు ఉన్నా.. కానిస్టేబుళ్లకు అలాంటివేవీ లేవని ఆవేదన వ్యక్తం చేశాడు. కానిస్టేబుల్ అని తెలియడంతో పెళ్లి సంబంధాలు కుదరట్లేదని వాపోయారు. తన రాజీనామాపై పునరాలోచన చేస్తానంటూ ఓ దశలో ప్రతాప్ పేర్కొన్నా.. చివరకు రాజీనామాను ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. -
పిన్నికి నిమ్మరసంలో నిద్రమాత్రలు కలిపి..
సాక్షి, హైదరాబాద్ : నల్లకుంటలో జరిగిన భారీ చోరీ కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు సీపీ అంజన్ కుమార్ శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి 53 తులాల బంగారం, 5.25 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 24 లక్షలు ఉంటుందని అంజన్ కుమార్ వెల్లడించారు. వివరాలు.. నల్లకుట పరిధిలో నివాసం ఉంటున్న పిల్లి వినయ కుమారి తెలంగాణ పోలీస్ అకాడమీలో టెలిఫోన్ ఆపరేటర్‌గా పని చేస్తున్నారు. ఆమెకు కూతురు వరస అయ్యే కుష్బూ నాయుడు అలియాస్ నక్కీ మారు తాళాలతో చోరీకి పాల్పడింది. పిన్ని వినయ కుమారికి నిమ్మ రసంలో నిద్ర మాత్రలు కలిసి ఇచ్చిన కుష్భూ అనంతరం తన ప్రియుడుతో పాటు అతడి స్నేహితుడి సాయంతో బంగారు నగలు, నగదుతో ఉడాయించింది. టెక్నాలజీని ఉపయోగించి బాధితురాలి కుటుంబ సభ్యుల కాల్ డేటా ఆధారంగా కేసును చేధించినట్లు తెలిపారు. నిందితులు అప్పటికే దొంగిలించిన సొత్తును అమ్మేయడానికి సిద్ధపడినట్లు, వీరిని బేగంపేట్‌లో అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఎక్కడ ఎలాంటి నేరం జరిగినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, అప్పుడే త్వరగా చేధించే అవకాశం ఉంటుందని తెలిపారు. గత సంవత్సరం నుంచి డయల్ 100 ద్వారా ప్రజలకు నమ్మకం పెరిగిందని పేర్కొన్నారు. కాగా ఈ కేసులో ఏ1 నిందితురాలిగా కుష్బూ నాయుడు, ఏ2 నిందితులుగా సుమల వంశీకృష్ణ, ఏ3 నిందితులు సూర్యగా పోలీసులు వెల్లడించారు. -
రాజాసింగే రాయితో కొట్టుకున్నాడు.. : పోలీసులు
సాక్షి, హైదరాబాద్ : జుమ్మెరాత్ బజార్లో స్వాతంత్ర్య సమరయోధురాలు రాణి అవంతి భాయ్ విగ్రహాన్ని పెట్టేందుకు రాజాసింగ్ ప్రయత్నించారని వెస్ట్‌జోన్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. అనుమతి లేకుండా విగ్రహం పెట్టడంతో అడ్డుకున్నామన్నారు. రాజా సింగ్‌పై తాము ఎలాంటి దాడి చేయలేదని పేర్కొన్నారు. రాజా సింగే తనకు తాను రాయితో కొట్టుకున్నాడని చెప్పారు. దీనికి సంబంధించి వీడియో ఆధారాలు ఉన్నాయని తెలిపారు. పోలీసులపై రాజాసింగ్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. కాగా, దీనికి సంబంధించి వీడియోను హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజన్‌కుమార్ ట్విటర్లో పోస్ట్ చేశారు. -
జస్ట్ మిస్!
సికింద్రాబాద్ :సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అభ్యర్థులు ఎవరూవరుసగా మూడుసార్లు గెలవలేదు. ఇక్కడి నుంచి వరుసగా రెండుసార్లు గెలిచినపలువురు నేతలకు మూడోసారిఆశాభంగం తప్పలేదు. ఈ నియోజకవర్గం 1956లో ఆవిర్భవించగా, ఇప్పటి వరకు 17సార్లు (ఉప ఎన్నికతో 1987–89)ఎన్నికలు జరిగాయి. ఇక్కడి నుంచి పోటీ చేసిన వారిలో ఐదుగురురెండుసార్లు వరుసవిజయాలు సాధించారు. మూడోసారి పోటీ చేసేఅవకాశం లభించక కొందరు, పోటీ చేసి పరాజయం పాలవడంతో మరికొందరు హ్యాట్రిక్ చేజార్చుకున్నారు. ఒకరు మూడుసార్లు, మరొకరు నాలుగు సార్లు ఎంపీగా గెలిచినప్పటికీ హ్యాట్రిక్ మాత్రం దక్కలేదు. ♦ సికింద్రాబాద్ స్థానం నుంచి పోటీ చేసిన నరాల సాయికిరణ్ యాదవ్ 1957, 62 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు.ఆ తర్వాత ఎన్నికలకు పోటీకి దూరమైన ఆయన తిరిగి 1971లో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. ♦ కాంగ్రెస్ నేత పి.శివశంకర్ 1979, 1980 ఎన్నికల్లో గెలుపొందారు. ఆ తర్వాత ఎన్నికల్లో ఆయనకు పోటీ చేసే అవకాశం రాలేదు. ♦ 1987, 89 ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి టి.అంజయ్యమరణానంతరం ఆయన సతీమణి మణెమ్మ రెండుసార్లుఎంపీగా గెలుపొందారు. ♦ 1991 ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ.. ఆ తర్వాతి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి, పీవీ తనయుడు రాజేశ్వరావు చేతిలో పరాజయం పాలయ్యారు. ♦ తిరిగి 1998, 99 ఎన్నికల్లో రెండుసార్లు వరుస విజయాలు సాధించిన దత్తాత్రేయ... 2004లో ఓటమిపాలై హ్యాట్రిక్ చేజార్చుకున్నారు. 2014లో నాలుగోసారి ఎంపీగా గెలిచారు. ♦ 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున అంజన్‌కుమార్‌యాదవ్ తొలి విజయం సాధించారు. 2009లోనూ రెండోసారి గెలుపొందారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయి హ్యాట్రిక్ మిస్ అయ్యారు. -
క్రైమ్స్ డౌన్
సాక్షి, సిటీబ్యూరో: సిటీ కమిషనరేట్ పరిధిలో నేరాలు తగ్గుముఖం పట్టాయి. వీటిని కొలిక్కి తేవడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషించాయి. పీడీ యాక్ట్ ప్రయోగం వంటి చర్యలతో నేరగాళ్ల దూకుడుకు కళ్లెం పడింది. దీంతో గత ఏడాదితో పోలిస్తే అన్ని రకాల నేరాలూ సరాసరి ఆరు శాతం తగ్గాయి. తీవ్రమైన నేరాల్లో పోలీసులు 92 శాతం రికవరీ సాధించారు. వరకట్న మరణాలు నగరంలో 38 శాతం నమోదు కాగా, మహిళలపై జరిగే దాడులు కూడా తగ్గాయి. హత్య కేసులు మాత్రం గత ఏడాదికంటే 8 శాతం పెరిగాయి. బుధవారం చౌమొహల్లా ప్యాలెస్‌లో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో కొత్వాల్ అంజనీ కుమార్ 2018 నేర గణాంకాలను విడుదల చేశారు. ప్రతి అంకంలోనూ టెక్నాలజీ వినియోగం... నేరాలు కొలిక్కి తీసుకురావడంలో సీసీ కెమెరాల కీలకపాత్ర... నేరాలు నిరోధించడంలో పీడీ యాక్ట్ ప్రయోగం వంటి చర్యలు... వెరసి నగరంలో నేరాలు నమోదు గణనీయంగా తగ్గింది. గత ఏడాదితో పోలిస్తే అన్ని రకాలైన నేరాల్లోనూ కలిపి సరాసరిన ఆరు శాతం తగ్గుదల నమోదు చేసుకుంది. సొత్తు సంబంధం నేరాలు 20.5 శాతం తగ్గాయి. తీవ్రమైన నేరాల్లో రికవరీ 92 శాతానికి చేరుకుంది. వరకట్న చావుల్లో 38 శాతం తగ్గుదల కనిపించడంతో పాటు మహిళలపై నేరాలు సైతం తగ్గాయి. కేవలం హత్య కేసులు మాత్రం గత ఏడాదితో పోలిస్తే 8 శాతం పెరిగాయి. పాతబస్తీలోని చౌమొహల్లా ప్యాలెస్‌లో బుధవారం నిర్వహించిన వార్షిక విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించిన కొత్వాల్ అంజనీ కుమార్ ఆ గణాంకాలను విడుదల చేశారు. కోర్టుల్లో కేసుల నిరూపణ సైతం 10 శాతం పెరిగి 34కి చేరిందని తెలిపారు. ట్రాఫిక్ విభాగం అధికారులు తీసుకున్న చర్యల కారణంగా నగరంలో మరణాలు, రోడ్డు ప్రమాదాలు తగ్గడంతో పాటు సరాసరి వేగం గంటలకు 18 నుంచి 25 కిమీకి చేరిందని వివరించారు. ఈ ఏడాది కొత్తగా సిటీ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, వెరీ ఫాస్ట్ యాప్, ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్, ఉమెన్ ఆన్ వీల్స్ (వావ్) బృందాలను రంగంలోకి దింపారు. ‘ఈ ఏడాది సాధించిన విజయాలపై నేను మాట్లాడుతున్నా... అవి సాధించడంలో కొత్వాల్ నుంచి కానిస్టేబుల్ వరకు అహర్నిశలు శ్రమించారు’ అని అంజనీకుమార్ పేర్కొన్నారు. ‘ఫోర్స్’ చూపిన ‘టాస్క్’... నగర పోలీసు కమిషనర్ టాస్క్‌ఫోర్స్‌లో ప్రస్తుతం డీసీపీ, అదనపు డీసీపీలతో పాటు ఐదు జోన్లకు ఐదుగురు ఇన్స్పెక్టర్లు ఉన్నారు. కేసుల్ని కొలిక్కి తీసుకురావడంతో పాటు ఇతర రాష్ట్రాల ముఠాలను చెక్ చెప్పడంతో వీటిది ప్రత్యేక పాత్ర. సిటీలో నమోదైన భారీ, సంచలనాత్మక నేరాల్లో దాదాపు 80 శాతం ఈ టీమ్స్ ద్వారానే కొలిక్కి వచ్చాయి. ఈ ఏడాది టాస్క్‌ఫోర్స్ టీమ్స్ 20 హత్య, 54 దోపిడీ, 4 బందిపోటు దొంగతనం, 100 చోరీలు, 33 స్నాచింగ్స్, 29 దాడులు, 63 డ్రగ్ కేసుల్లో నిందితుల్ని పట్టుకున్నాయి. 54 క్రికెట్ బెట్టింగ్ ముఠాలపై దాడులు చేసి 101 మందిని అరెస్టు చేశాయి. ఇతర నేరాల్లో 85 మందిని పట్టుకున్నాయి. 107 చీటింగ్ కేసుల్లో 121 మందిని అరెస్టు చేశాయి. వీటితో పాటు పెండింగ్‌లో ఉన్న 103 నాన్–బెయిలబుల్ వారెంట్లను ఎగ్జిక్యూట్ చేశాయి. -
ఆర్మీ జవాన్ కీచక చర్య
సాక్షి, హైదరాబాద్ : ఒంటరిగా ఉన్న జంటపై దాడిచేసి, యువతిపై అత్యాచార యత్నం చేసిన ఆర్మి జవాన్‌ను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఈ నెల 23న తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని అమ్మూగూడాలో ఇంటర్ చదువుతున్న ఓ యువతి మరో వ్యక్తితో ఉన్నప్పుడు బ్రిజేష్ కుమార్ అనే జవాన్ యువతిపై అత్యాచారయత్నం చేశాడు. అడ్డువచ్చిన ఆ యువకుడిని చితబాదాడు. ఈ మేరకు కేసు విచారించిన పోలీసులు నిందుతుడని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని మీడియా ముందు ప్రవేశపెట్టిన సీపీ అంజన్ కుమార్ మాట్లాడుతూ.. బ్రిజేష్ కుమార్ అనే ఆర్మీ జవాన్ అత్యాచారయత్నం చేసినట్లు ఆధారాలు లభించడంతో అతన్ని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. గత ఏడాది డిసెంబర్లో కూడా ఇలాంటి సంఘటనే జరిగిందని.. దానిపై మరింతగా విచారించిస్తే ఆ కేసుతో కూడా ఇతనికి సంబంధం ఉన్నట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. గతంలో బ్రిజేష్ ఎక్కడెక్కడ పని చేశాడో, అతనికి నేర చరిత్ర ఏమైన ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు అంజన్ కుమార్ మీడియాకు తెలిపారు. -
కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకో: అంజన్‌కుమార్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీని అమ్మ, బొమ్మ అంటున్న కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు అంజన్‌కుమార్ యాదవ్ హెచ్చరించారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌తో ఊదు కాలదు, పీరూ లేవదని మంత్రి కేటీఆర్ అంటున్నారని, కేటీఆర్ ఎక్కడో ఉన్నప్పుడే కాంగ్రెస్ తెలంగాణ కోసం ఆలోచించిందన్నారు. అమరవీరుల కోసం సోనియాగాంధీ తెలంగాణ ఇస్తే, సోనియాగాంధీని అమ్మ బొమ్మ అంటావా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ఎన్నికల హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్కు ప్రజలు గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. -
అంతర్రాష్ట్ర చీటింగ్ ముఠా అరెస్టు
సాక్షి, హైదరాబాద్: ప్రాపర్టీ లోన్స్, మెడిల్ సీట్లు ఇప్పిస్తామంటూ మోసం చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. ముఠాకు చెందిన ముగ్గురు వ్యక్తులను శుక్రవారం హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. హైదరాబాద్, చెన్నై నగరాల్లోని 9 పోలీస్ స్టేషన్లలో వీరిపై కేసులు ఉన్నట్లు వెల్లడించారు. తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల ప్రజల నుంచి దాదాపు మూడు కోట్ల రూపాయల వరకు వసూలు చేశారని పోలీసులు తెలిపారు. నిందితులు సతీషన్, రాం నివాస్, హరి నివాస్‌ల వద్ద నుంచి 45 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామని సీపీ అంజన్ కుమార్ తెలిపారు. -
విశ్వనగరం చేసింది మేమే
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణకు గుండెకాయలాంటి హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరం చేసింది తామేనని, తాము చేసిన అభివృద్ధి కారణంగానే హైదరాబాద్‌కు ఈ గుర్తింపు వచ్చిందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ హయాంలో హైద రాబాద్‌లో అభివృద్ధి జరగలేదన్నారు. నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఇటీవల నియమితులైన మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ ఆదివారం గాంధీభవన్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఉత్తమ్ మాట్లాడారు. మున్సిపల్ మంత్రిగా ఉన్న సీఎం తనయుడు కేటీఆర్‌కు సూటు, బూటు వేసుకుని విదేశాలకు తిరగడమే సరిపోతోందని, కానీ తండ్రి కొడుకుల ప్రచారం మాత్రం తారాస్థాయిలో ఉందని ఎద్దేవా చేశారు. కేంద్రానికి చెంచాగిరీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కేసీఆర్ చెంచాగిరీ చేస్తున్నారని ఉత్తమ్ ఆరోపించారు. ఆంధ్ర ప్రజలను హైదరాబాద్ నుంచి తరిమికొడతామన్న కేసీఆర్ మాటలను ఇక్కడ నివసిస్తున్న ఆంధ్రులు మర్చిపోలేదని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో నివసిస్తున్న వారందరూ కాంగ్రెస్‌కు సమానమేనని అన్నారు. ఆంధ్ర నుంచి వచ్చిన వారికి పార్టీలో, సీట్ల కేటాయింపులో సముచిత స్థానం కేటాయిస్తాయని చెప్పారు. రానున్న ఎన్నికల్లో పాతబస్తీలోని అన్ని సీట్లలో కాంగ్రెస్ పోటీ చేస్తుందని, 2019 ఎన్నికల్లో తామే గెలుస్తామని సర్వేలు చెబుతున్నాయని పేర్కొన్నారు. మోదీని ఓడించి రాహుల్‌కు ఓటేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారని, టీఆర్ఎస్, బీజేపీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్న ఎంఐఎంకు ఓటు వేయవద్దని హైదరాబాద్ నగర ప్రజలకు పిలుపునిచ్చారు. కొత్తగా నగర అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన అంజన్ కుమార్ అన్ని వర్గాలను కలుపుకుని పనిచేయాలని సూచించారు. త్వరలో నగరంలోని అన్ని డివిజన్లలో పోలింగ్ బూత్‌స్థాయిలో పార్టీ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. ‘సేవ్ హైదరాబాద్’: భట్టి పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. హైదరాబాద్ నిర్మాణానికి కాంగ్రెస్ ఎంతో కృషి చేసిందన్నారు. ఇప్పుడు మెట్రో రైలు గురించి గొప్పగా మాట్లాడుతున్న కేసీఆర్.. మెట్రోను కాంగ్రెస్ మొదలుపెట్టినప్పుడు వ్యతిరేకించారని గుర్తు చేశారు. నియంతృత్వ టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సేవ్ హైదరాబాద్ నినాదంతో కాంగ్రెస్ శ్రేణులు ముందుకెళ్లాలని సూచించారు. అంజన్ కుమార్ మాట్లాడుతూ.. నగర కాంగ్రె స్ను బలోపేతం చేయడానికి కృషి చేస్తానన్నారు. ఎంపీ కేవీపీ రామచంద్రరావు, మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి, మాజీ ఎంపీ రేణుకా చౌదరి, మండలిలో ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి, దాసోజు శ్రవణ్, బండ కార్తీకరెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అంజన్ ప్రమాణ స్వీకారానికి గుర్రాలు, ఒంటెలు, కళాకారులతో నాంపల్లి రెడ్‌రోజ్ ఫంక్షన్‌హాల్ నుంచి గాంధీభవన్ వరకు కాంగ్రెస్ కార్యకర్తలు నిర్వహించిన ర్యాలీ ఆకట్టుకుంది. టీఆర్ఎస్కు ప్రజలే బుద్ధి చెబుతారు: జానారెడ్డి నేడు హైదరాబాద్ ప్రజలు అనుభవిస్తున్న విద్య, ఉపాధి సౌకర్యాల కల్పన కాంగ్రెస్ పాలనలోనే జరిగిందని సీఎల్పీ నేత జానారెడ్డి అన్నారు. నగరంలో కోటిమందికి తాగునీరు కూడా కాంగ్రెస్ చలవేనని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో నియంతృత్వ టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. నరేంద్ర మోదీతో కేసీఆర్ చేస్తున్న స్నేహం అక్రమ సంబంధమని కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి విమర్శించారు. మోదీ అంటే కేసీఆర్‌కు ప్రేమ, భయం ఉన్నాయని, తెలంగాణ ఇచ్చిన సోనియాపై మాత్రం కృతజ్ఞతా భావం లేదని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి మాట్లాడుతూ.. 2019 ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ శ్రేణులు కలసికట్టుగా పనిచేయాలని సూచించారు. -
మహా ముదుర్లు!
సాక్షి,సిటీబ్యూరో: ఎవరికి వారు వేర్వేరుగా వచ్చి వెళ్లారు... ఎక్కడా సెల్ఫోన్లు, సొంత వాహనాలు వాడలేదు... స్థానికంగా షెల్టర్ సైతం తీసుకోలేదు... నగరంలోనే కాదు, రాష్ట్రంలోనూ ఎక్కడా మీటింగ్ స్పాట్ పెట్టుకోలేదు... పాతబస్తీలోని పేట్లబురుజులో ఉన్న నిథాయిదాస్‌కు చెందిన బంగారు నగల తయారీ కార్ఖానాలో పంజా విసిరిన బందిపోట్లు నేరం చేయడానికి ముందు తీసుకున్న జాగ్రత్తలు ఇవీ. సాధారణంగా దొంగల ముఠాలు, అంతరాష్ట్ర దొంగలు పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు నేరం చేయడానికి ముందు అనేక జాగ్రత్తలు తీసుకుంటాయి. ముంబైకి చెందిన ఈ బందిపోటు ముఠా మాత్రం నేరం చేసిన తర్వాత కూడా కోర్టులో కేసు వీగిపోయేందుకు పక్కా ప్రణాళిక రచిస్తుంటుందని తేలింది. ఈ గ్యాంగ్ లీడర్‌గా అనుమానిస్తున్న అమ్జను దక్షిణ మండల పోలీసులు గురువారం అరెస్టు చేసిన విషయం విదితమే. ఈ కేసు దర్యాప్తులో ముఠాకు సంబంధించి అనేక కీలకాంశాలు వెలుగులోకి వచ్చాయి. అరెస్టుకు ఒకరు సిద్ధం సాధారణంగా ఏదైనా నేరం చేసే నేరగాళ్లు ఆ తర్వాత పోలీసులకు పట్టుబడకుండా అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. సాధ్యమైనన్నాళ్లు అరెస్టు కాకుండా తప్పించుకుని తిరగాలని భావిస్తుంటారు. అయితే అలాంటి వారు పోలీసులకు చిక్కిన తర్వాత విచారణలో నేరం పూర్వాపరాలు వెల్లడించడంతో పాటు అవసరమైన ఆధారాలను అందిస్తుంటారు. అయితే ఈ బందిపోటు ముఠా పంథా మాత్రం దీనికి పూర్తి విరుద్ధం. ఎంత పక్కాగా ప్లాన్ చేసినా ఏదో ఒక ఆధారంతో పోలీసులు పట్టుకుంటారని వీరికి తెలుసు. ఈ నేపథ్యంలోనే నేరం చేసిన తర్వాత ఓ ప్రాంతంలో కలుసుకుని సొత్తును పంచేసుకుంటారు. ఆపై ముఠాకు చెందిన ఓ వ్యక్తిని పోలీసులకు చిక్కడానికి సిద్ధం చేస్తారు. అతను అధికారులకు ఎలాంటి అనుమానం రాకుండా వారికి పట్టుబడతాడు. ఆ తర్వాతే మరో కీలక ఘట్టం మొదలవుతుంది. ఇలాంటి సంచలనాత్మక కేసుల్లో నిందితులు చిక్కినప్పుడు పూర్తి వివరాలు, రికవరీ కోసం కొన్ని రోజులు విచారించాల్సి ఉంటుంది. అయితే చట్ట ప్రకారం పోలీసులు నిందితులను పట్టుకున్న 24 గంటల్లోనే కోర్టులో హాజరుపరచాల్సి ఉంటుంది. దీనిని తమకు అనుకూలంగా వినియోగించుకుంటున్న ముఠా... ఓ సభ్యుడిని పోలీసులు పట్టుకెళ్లిన వెంటనే అతడు తప్పిపోయాడంటూ మిస్సింగ్ కేసులు, కిడ్నాప్ కేసులు పెట్టడంతో పాటు హైకోర్టుల్లో హెబియస్ కార్పస్ రిట్ పిటిషన్లు దాఖలు చేస్తారు. దీంతో పోలీసులపై ఒత్తిడి పెరిగి వారు వెంటనే నిందితులను అరెస్టు చూపి ంచడంతో పూర్తిస్థాయి రికవరీ సాధ్యం కాదు. ‘అన్ని పేర్లూ’ కలిపి చెప్పేస్తారు... ఇలా అరెస్టు కావడంతో ఈ బందిపోట్ల స్కెచ్ పూర్తి కాదు. సాధ్యమైనంత వరకు కేసు వీగిపోయేలానూ పథకం వేస్తుంటారు. ఓ నిందితుడిని పట్టుకున్నప్పుడు సదరు నేరంలో తనతో పాటు పాల్గొన్న వారి వివరాలను అతడు చెబుతారు. అయితే ఈ గ్యాంగ్ సభ్యులు మాత్రం కొన్ని నేరంలో పాల్గొన్న వారి పేర్లు, మరికొన్ని నేరం జరిగిన సమయానికే వేరే కేసుల్లో అరెస్టై జైళ్ళల్లో ఉన్న వారి పేర్లు చెప్తుంటారు. ఇలా జైళ్ళల్లో ఉన్న వారి పేర్లు రికార్డుల్లో నమోదు చేస్తే భవిష్యత్తులో కేసు వీగిపోయే ప్రమాదం ఉంటుంది. అనేక నగరాల పోలీసులను ఈ బందిపోటు ముఠా ఈ పంథాలోనే బురిడీ కొట్టిస్తున్నట్లు సమాచారం. దీనిని గుర్తించిన సౌత్‌జోన్ పోలీసులు ఈ కేసు దర్యాప్తులో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోపక్క గురువారం పట్టుబడిన అమ్జ పోలీసుల విచారణలో తాను గ్యాంగ్ లీడర్‌ను కాదని, మనోజ్ అంథే అనే వ్యక్తి నాయకుడని చెబుతున్నట్లు తెలిసింది. మిగిలిన ముఠా సభ్యుల కోసం ముంబైలో గాలిస్తున్న ప్రత్యేక బృందం మరో నిందితుడు షాకీర్ అలియాస్ మియాను పట్టుకుంది. ఇతడిని నగరానికి తరలించిన పోలీసులు బంగారం రికవరీ కోసం ప్రయత్నిస్తున్నారు. ‘పత్రికల’ కోణంలో రెండో కేసు.. పేట్లబురుజు బందిపోటు దొంగతనం కేసు కొలిక్కి రావడానికి ఘటనాస్థలిలో దొరికిన ఓ ఆంగ్ల పత్రిక కీలక ఆధారంగా మారింది. నేరం చోటు చేసుకున్న ఈ నెల 6న అక్కడకు వెళ్ళిన నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) ఆధీనంలోని క్లూస్‌టీమ్ దీనిని సేకరించి పోలీసులకు అప్పగించింది. అయితే నగరంలో న్యూస్‌పేపర్ ఆధారంగా కొలిక్కి వచ్చిన భారీ కేసుల్లో ఇది రెండోది. ఈ రెండు కేసుల్లోనూ దుండగులు ముంబైకి చెందిన వారే కావడం గమనార్హం. 2006 మే నెలలో పంజగుట్ట పరిధిలోని అలుక్కాస్ నగల దుకాణంలో భారీ చోరీ జరిగింది. సౌత్ ముంబైలోని దహిసార్ ప్రాంతానికి చెందిన వినోద్ రాంబోలి సింగ్ ఈ నేరం చేశాడు. సింగిల్ హ్యాండ్‌తో హిట్ చేసి దాదాపు రూ.10 కోట్ల విలువైన సొత్తు ఎత్తుకుపోయాడు. అప్పట్లో అతడిని పట్టుకోవడానికి అలుక్కాస్ దుకాణం వెనుక బిల్డింగ్‌పై దొరికిన ‘గుజరాతీ సమాచార్’ పత్రిక కీలకంగా మారింది. దొంగతనానికి వచ్చిన రాంబోలీ సింగ్ జ్యువెలర్స్ వెనుక నిర్మాణంలో ఉన్న భవనంపై చాలా సేపు కూర్చున్నాడు. కాలక్షేపం కోసం తన వెంట తెచ్చుకున్న ‘గుజరాతీ సమాచార్’ను చదివి అక్కడే వదిలేశాడు. ఈ పత్రికను స్వాధీనం చేసుకున్న పోలీసులు గుజరాత్‌తో పాటు ముంబైలోనూ ఇది లభిస్తుందని గుర్తించారు. ముంబై వెళ్ళిన టీమ్ అక్కడి పోలీసులకు అలుక్కాస్‌లో రికార్డు అయిన సీసీ కెమెరా ఫీడ్ చూపించగా వారు రాంబోలీ సింగ్‌ను గుర్తించడమే కాకుండా, అతడితో పాటు రిసీవర్‌ను పట్టుకోవడంలో సొత్తు రికవరీలో సహకరించారు. -
కార్యకర్తల సమావేశంలో వీహెచ్‌కు చుక్కెదురు
-
ఓ కథానాయిక కథ
హీరోయిన్గా రాణించాలని ఎన్నో ఆశలతో సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఓ యువతి తన కలలను ఎలా సాకారం చేసుకుందో తెలియాలంటే ‘హీరోయిన్’ చిత్రం చూడాల్సిందే అంటున్నారు భరత్ పారేపల్లి. ఆయన దర్శకత్వంలో అంజన్‌కుమార్, అనుస్మృతి జంటగా జేవీఆర్ సినిమా పతాకంపై జల్లేపల్లి వెంకటేశ్వర్లు నిర్మించిన చిత్రం ఈ శుక్రవారం విడుదల కానుంది. అన్ని వర్గాల వారిని అలరించే చిత్రమిదని నిర్మాత తెలిపారు. -
'నేను తెలంగాణలోనే ఉంటాను'
హైదరాబాద్: హైదరాబాద్ అడిషనల్ సీపీ అంజన్ కుమార్ క్యాట్(కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్)లో పిటిషన్ దాఖలు చేశారు. తనను ఏపీ కేడర్‌కు కేటాయించడంపై ఆయన క్యాట్‌లో సవాల్ చేశారు. తాను తెలంగాణలోనే కొనసాగుతానని అంజన్ కుమార్ విజ్ఞప్తి చేశారు. అంజన్ కుమార్‌ను ఏపీకి కేటాయించడంపై క్యాప్ స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. -
హొలీ నాడు ఎంపీ కుమారుని వీరంగం