సాక్షి, హైదరాబాద్: సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, లోక్‌సభ నియోజకవర్గాల స్థాయిలో ఈ ప్రక్రియను మరింత పకడ్బందీగా ముందుకు తీసుకెళ్లాలని తీర్మానించింది. సభ్యత్వ నమోదుపై సమీక్ష గాంధీభవన్‌లో మంగళవారం జరిగింది.
ఈ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శులు శ్రీనివాస కృష్ణన్, జి. చిన్నారెడ్డి, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు బి. మహేశ్‌కుమార్‌గౌడ్, జె. గీతారెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్ సీనియర్ నేతలు జి. నిరంజన్, సంభాని చంద్రశేఖర్, ఎం.ఆర్‌జీ.వినోద్‌రెడ్డి, గాలి అనిల్‌కుమార్, మల్లురవి, రాములు నాయక్, రోహిణ్‌రెడ్డి, తోటకూర జంగయ్య, చామల కిరణ్‌లతో పాటు పార్టీ అను బంధ సంఘాల చైర్మన్లు పాల్గొన్నారు.
అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులు, జిల్లాలు, లోక్‌సభ నియోజకవర్గాల వారీగా పోలింగ్‌బూత్ ఇన్‌చార్జులు, సభ్యత్వాల సంఖ్యపై నేతలు సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు 6లక్షల డిజిటల్ సభ్యత్వం పూర్తయిందని తేల్చారు. ఈ సందర్భంగా ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాస కృష్ణన్ మాట్లాడుతూ... జనవరి 26 నాటికి 30లక్షల సభ్య త్వం పూర్తయ్యేలా కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని, ప్రతి పార్టీ సభ్యుడికి రూ.2లక్షల ప్రమాదబీమా వస్తుందన్న విషయాన్ని చెప్పాలని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment