Membership registration process
-
సభ్యత్వ నమోదు వేగం పెంచాలి..
సాక్షి, హైదరాబాద్: సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, లోక్‌సభ నియోజకవర్గాల స్థాయిలో ఈ ప్రక్రియను మరింత పకడ్బందీగా ముందుకు తీసుకెళ్లాలని తీర్మానించింది. సభ్యత్వ నమోదుపై సమీక్ష గాంధీభవన్‌లో మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శులు శ్రీనివాస కృష్ణన్, జి. చిన్నారెడ్డి, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు బి. మహేశ్‌కుమార్‌గౌడ్, జె. గీతారెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్ సీనియర్ నేతలు జి. నిరంజన్, సంభాని చంద్రశేఖర్, ఎం.ఆర్జీ.వినోద్‌రెడ్డి, గాలి అనిల్‌కుమార్, మల్లురవి, రాములు నాయక్, రోహిణ్‌రెడ్డి, తోటకూర జంగయ్య, చామల కిరణ్‌లతో పాటు పార్టీ అను బంధ సంఘాల చైర్మన్లు పాల్గొన్నారు. అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులు, జిల్లాలు, లోక్‌సభ నియోజకవర్గాల వారీగా పోలింగ్‌బూత్ ఇన్చార్జులు, సభ్యత్వాల సంఖ్యపై నేతలు సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు 6లక్షల డిజిటల్ సభ్యత్వం పూర్తయిందని తేల్చారు. ఈ సందర్భంగా ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాస కృష్ణన్ మాట్లాడుతూ... జనవరి 26 నాటికి 30లక్షల సభ్య త్వం పూర్తయ్యేలా కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని, ప్రతి పార్టీ సభ్యుడికి రూ.2లక్షల ప్రమాదబీమా వస్తుందన్న విషయాన్ని చెప్పాలని తెలిపారు. -
కమలంలో జోష్
రాష్ట్రంలో తమ బలం పెరుగుతుండడంతో కమలనాథుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలో నాలుగున్నర లక్షల మంది కమలం తీర్థం పుచ్చుకున్నారు. సభ్యత్వ నమోదు ప్రక్రియను వేగవంతం చేయడానికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ సిద్ధమయ్యారు. సభ్యత్వ నమోదు ప్రక్రియ నిమిత్తం 234 మంది సిబ్బందిని నియమించారు. వీరికి శిక్షణ ఇచ్చి ప్రజల్లోకి పంపించేందుకు నిర్ణయించారు. - నాలుగున్నర లక్షల మంది చేరిక - సభ్యత్వ నమోదు వేగవంతం సాక్షి, చెన్నై: రాష్ర్టంలో అసెంబ్లీ ఎన్నికల ద్వారా తమ సత్తా చాటుకోవడం లక్ష్యంగా కమలనాథులు ఉరకలు పరుగులు తీస్తున్నారు. కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టినానంతరం పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తమ హవా కొనసాగడంతో రాష్ర్టంలోని కమలనాథులు ఆశల పల్లకిలో ఊగిసలాడుతున్నారు. తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్ర త్యామ్నాయ శక్తిగా తాము అవతరించడం ఖాయం అన్న ధీమాతో ఉన్నారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేపట్టడం లేదా, అధికారాన్ని శాసించే స్థాయికి ఎదగాలన్న కాంక్షతో ముందుకు దూసుకెళ్తున్నారు. జోష్: సభ్యత్వ నమోదు పర్వానికి గత నెల మొదటి వారంలో శ్రీకారం చుట్టినా, పది రోజుల క్రితం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా చెన్నై పర్యటనతో స్పందన పెరిగింది. మోబైల్టోల్ ఫ్రీ నంబర్లను అమిత్‌షా ప్రకటించడం, ఈ నంబర్లకు ప్రచారం పెరగడంతో కమలం వైపు చూసే వారిసంఖ్య పెరుగుతోంది. మార్చి నెలా ఖరులోపు 60 లక్షల మందిని చేర్పించే లక్ష్యం గా చేపట్టిన సభ్యత్వ నమోదు పర్వానికి స్పంద న పెరగడం కమలనాథుల్లో ఆనందాన్ని రేకెత్తిస్తోంది. ఇదే ఉత్సాహంలో ముందుకు సాగి అమిత్‌షా నిర్ణయించిన లక్ష్యాన్ని చేరుకునేందు కు ఉరకలు పరుగులు తీసే పనిలో పడ్డారు. వేగవంతం: సభ్యత్వ పర్వాన్ని వేగవంతం చేయడమే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణకు నిర్ణయించారు. రాష్ట్రంలోని 234 అసెంబ్లీ నియోజకవర్గాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఒక్కో నియోజకవర్గానికి ఒక నిరంతర సిబ్బం దిని సభ్యత్వ నమోదు ప్రక్రియకు ఎంపిక చేశారు. వీరందరికీ శిక్షణ ఇప్పించే పనిలోపడ్డారు. శుక్రవారం ఉదయం పూందమల్లిలోని ఓ హాల్లో ఈ సిబ్బందికి శిక్షణ తరగతులు ఆరంభమయ్యాయి. బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధరరావు, రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్, ప్రధాన కార్యదర్శి సంతోష్‌ల నేతృత్వంలో శిక్షణ తరగతులు ఉదయం నుంచి రాత్రి వరకు జరిగాయి. కేంద్రంలో గతంలో వాజ్‌పేయ్ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు, ప్రస్తుతం ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని ప్రభుత్వ సేవలను, పార్టీ పరంగా ప్రజల్ని ఆకర్షించే అస్త్రాలతో ఈ శిక్షణ తరగతులు జరిగాయి. ఛేదిస్తాం: పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా నిర్ణయించిన లక్ష్యాన్ని మార్చి నెలాఖరులోపు ఛేదిస్తామని తమిళి సై సౌందరరాజన్ ధీమా వ్యక్తం చేశారు. శిక్షణ తరగతుల్లో భాగంగా ఆమె విలేకరులతో మాట్లాడారు. అమిత్‌షా చెన్నై పర్యటనతో పార్టీలో ఉత్సాహం రెట్టింపు అయిందన్నారు. అందరూ కలసి కట్టుగా సభ్యత్వ నమోదును వేగవంతంచేసే పనిలో పడ్డారన్నారు. సభ్యత్వ నమోదు ప్రక్రియ నిమిత్తం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించిన ఘనత తమ పార్టీకే దక్కుతుందన్నారు. రో జుల వ్యవధిలో నాలుగున్నర లక్షల మంది తమ పార్టీలోకి వచ్చారని, మున్ముందు తమ బలం పెరగనుందని, తామే ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించబోతున్నామని తెలిపారు. -
సభ్యత్వం.. ఆరంభశూరత్వం!
మూడు పార్టీలకూ పరీక్షగా మారిన సభ్యత్వ నమోదు ఓటమి నుంచి తేరుకోని కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ శ్రేణులు సగానికి కూడా చేరుకోని లక్ష్యాలు సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లాలో మూడు ప్రధాన రాజకీయ పార్టీలకు సభ్యత్వ నమోదు ప్రక్రియ కత్తిమీద సాములా మారింది. సార్వత్రిక ఎన్నికల ఓటమి నుంచి తేరుకోని పార్టీ శ్రేణులు సభ్యత్వ నమోదుకు ఉత్సాహం చూపకపోవడంతో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారుతోంది. ప్రధానంగా కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీలు పోటాపోటీగా సభ్యత్వ నమోదు షెడ్యూల్‌ను ప్రకటించినప్పటికీ క్షేత్రస్థాయిలో అంత సీన్ లేకపోవడం గమనార్హం. ఆయా పార్టీల సీనియర్లు కూడా ఈ కార్యక్రమానికి మొక్కుబడిగా హాజరవుతున్నారన్న వి మర్శలు వినిపిస్తున్నాయి. ప్రధాన ప్రతి పక్షం కాంగ్రెస్‌పార్టీ వచ్చే ఏడాది మార్చిలోగా రెండు లక్షల క్రియాశీల సభ్యత్వా లు నమోదు చేయించాలని లక్ష్యం నిర్దేశించుకున్నప్పటికీ ఇప్పటివరకు కనాకష్టంగా 60 వేల సభ్యత్వాలునమోదు చేయించి చతికిల పడింది. స్వయంగా టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఈ కార్యక్రమాన్ని జిల్లాలో లాంఛనంగా ప్రారంభించినప్పటికీ ఫలితం ఆశాజనకంగా లేకపోవడం గమనార్హం. ఎన్నికలకు ముందు గ్రూపు రాజకీయాలతో సతమతమైన కాంగ్రెస్.. ఘోరపరాభవంతో గుణపాఠం నేర్చుకుంది. ఈ క్రమంలోనే సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సమష్టిగా నడుంబిగించింది. టీపీసీసీ చీఫ్ పొన్నాల పాల్గొన్న కార్యక్రమానికి హాజరైన జిల్లాకు చెందిన నేతలు ఆ తర్వాత సభ్యత్వ నమోదుకు ఊపు తీసుకురావడంలో విఫలమయ్యారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీ యాదవరెడ్డి గులాబీ గూటికి చేరడంతో నైరాశ్యంలో కూరుకుపోయిన పార్టీ శ్రేణులు సభ్యత్వ నమోదుపై అంతగా దృష్టి కేంద్రీకరించలేదు. ఎన్నికలకు ముందు గ్రూపు రాజకీయాలతో సతమతమైన సీనియర్లు ఓటమితో గుణపాఠం నేర్చుకున్నట్లు కనిపిస్తోంది. సభ్యత్వ నమోదు కార్యక్రమంపై కలిసికట్టుగా ముందుకు సాగుతున్నప్పటికీ దిగువశ్రేణి నేతలను ఏకతాటిమీదకు తేలేకపోతున్నారు. ఈ ప్రభావం సభ్యత్వంపై పడుతోంది. ‘దేశం’లోనూ అదే తీరు.. ఎన్నికల్లో మంచి ఫలితాలే సాధించినా.. అనంతరం జరిగిన పరిణామాలతో కుదేలైన తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదులో చతికిలపడింది. జిల్లాలో రెండు లక్షల మందిక్రియాశీల కార్యకర్తలతో సభ్యత్వ నమోదు చేయించాలని టార్గెట్‌గా పెట్టుకున్న తెలుగుతమ్ముళ్లు.. లక్ష్యంలో సగానికి కూడా చేరుకోలేకపోయారు. గురువారం నాటికి గడువు ముగిసినా లక్ష్యం చేరకపోవడంతో గడువును వారం రోజులపాటు పొడిగించారు. ఎన్నికల అనంతరం పలువురు ముఖ్య నేతలు అధికారపార్టీ గూటికి చేరడంతో టీడీపీలో నైరాశ్యం అలుముకుంది. ఉన్న కొద్దిపాటి నేతలు కూడా ఊగిసలాడుతుండడంతో సభ్యత్వ నమోదు ఊపందుకోలేదు. తాండూరు, మహేశ్వరం, ఎల్బీ నగర్, చేవెళ్ల, వికారాబాద్ నియోజకవర్గాల్లో పార్టీకి సారథ్యం వహించే నేతలు లేకపోవడం.. ఉన్న నాయకుల మధ్య అంతర్గత విభేదాలు పొడచూపడం టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. కమలంలోనూ నైరాశ్యమే.. గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీ.. రంగారెడ్డి జిల్లాలో ఐదు లక్షల సభ్యత్వాలు చేయించాలని టార్గెట్ పెట్టుకోగా ఇప్పటివరకు రెండు లక్షలు కూడా దాటలేకపోయింది. నియోజకవర్గాలవారీగా ఇన్చార్జీలను నియమించినా ఫలితంలేకుండా పోతోంది. పార్టీకి ప్రజల్లో విస్తృత ఆదరణ కనిపిస్తున్నా.. దాన్ని ప్రోది చేసుకోవడంలో విఫలమవుతోంది.