సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులతో ఏఐసీసీ ఏర్పాటు చేసిన త్రీ మెన్ కమిటీ ప్రత్యేకంగా భేటీ అయ్యింది. అభ్యర్థులతో విడివిడిగా మాట్లాడుతున్న కురియన్ కమిటీ.. ఒక్కో అభ్యర్థికి 30 నిమిషాలు సమయం కేటాయించింది. తమ వాదన సైతం కురియన్ కమిటీకి వినిపిస్తామంటున్నారు టికెట్ రాని నేతలు.. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యాలపై అధ్యయనానికి పలు రాష్ట్రాల్లో ఏఐసీసీ నిజనిర్ధారణ కమిటీలు వేసింది.
మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిస్సా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలలో నిజనిర్ధారణ కమిటీలు వేసింది. కురియన్‌తో పాటు రక్హిబుల్ హుసేన్, పర్గత్ సింగ్‌లతో తెలంగాణ కమిటీ ఏర్పాటు చేశారు. రెండు మూడు రోజుల పాటు తెలంగాణలోనే ఉండి పలు నియోజకవర్గాల్లో కురియన్ కమిటీ తిరగనుంది.
పార్లమెంటు ఎన్నికల్లో ఎందుకు ఓటమి చెందారు? పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో అసెంబ్లీ, లోక్‌సభ ఫలితాల్లో వచ్చిన ఓటింగ్ శాతం ఎంత? లోపాలు ఏంటి? వంటి అంశాలపై కురియన్ కమిటీ ఆరా తీస్తోంది. ఓటమికి కారణాలపై వివరాలను కురియన్ కమిటీ అభ్యర్థుల నుంచి సేకరిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment