Kurian
-
పార్లమెంట్ అభ్యర్థులతో భేటీ అయిన కురియన్ కమిటీ
-
గాంధీ భవన్ కు చేరుకున్న కురియన్ కమిటీ
-
ఫలితాలపై పోస్ట్‌మార్టమ్.. గాంధీభవన్‌లో కురియన్ కమిటీ
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులతో ఏఐసీసీ ఏర్పాటు చేసిన త్రీ మెన్ కమిటీ ప్రత్యేకంగా భేటీ అయ్యింది. అభ్యర్థులతో విడివిడిగా మాట్లాడుతున్న కురియన్ కమిటీ.. ఒక్కో అభ్యర్థికి 30 నిమిషాలు సమయం కేటాయించింది. తమ వాదన సైతం కురియన్ కమిటీకి వినిపిస్తామంటున్నారు టికెట్ రాని నేతలు.. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యాలపై అధ్యయనానికి పలు రాష్ట్రాల్లో ఏఐసీసీ నిజనిర్ధారణ కమిటీలు వేసింది.మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిస్సా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలలో నిజనిర్ధారణ కమిటీలు వేసింది. కురియన్‌తో పాటు రక్హిబుల్ హుసేన్, పర్గత్ సింగ్‌లతో తెలంగాణ కమిటీ ఏర్పాటు చేశారు. రెండు మూడు రోజుల పాటు తెలంగాణలోనే ఉండి పలు నియోజకవర్గాల్లో కురియన్ కమిటీ తిరగనుంది.పార్లమెంటు ఎన్నికల్లో ఎందుకు ఓటమి చెందారు? పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో అసెంబ్లీ, లోక్‌సభ ఫలితాల్లో వచ్చిన ఓటింగ్ శాతం ఎంత? లోపాలు ఏంటి? వంటి అంశాలపై కురియన్ కమిటీ ఆరా తీస్తోంది. ఓటమికి కారణాలపై వివరాలను కురియన్ కమిటీ అభ్యర్థుల నుంచి సేకరిస్తోంది. -
గాంధీ భవన్ కు కురియన్ కమిటీ
-
‘సుప్రీం’ సరైన దిశలో సాగలేదు
న్యూఢిల్లీ: మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలో సుప్రీంకోర్టు కార్యకలాపాలు సరైన దిశలో సాగలేదని మాజీ జడ్జి జస్టిస్ కురియన్ జోసెఫ్ అన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే నలుగురు జడ్జీలు జస్టిస్ దీపక్ మిశ్రాకు వ్యతిరేకంగా మీడియా సమావేశం నిర్వహించాల్సి వచ్చిందని తెలిపారు. శుక్రవారం పదవీ విరమణ పొందిన ఆయన వార్తా సంస్థ ఏఎన్‌ఐకిచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు చెప్పారు. ‘కోర్టు పనితీరుకు సంబంధించిన ఎన్నో విషయాల్ని జస్టిస్ మిశ్రా దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. అందుకే ఇక ప్రజల్లోకి వెళ్లడం మినహా మరో మార్గం లేదని నిర్ణయించుకునే మీడియా సమావేశం నిర్వహించాం’ అని ఆయన వెల్లడించారు. అత్యున్నత న్యాయస్థానంలో ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి? అని ప్రశ్నించంగా..క్రమంగా మార్పు వస్తోందని తెలిపారు. అత్యున్నత న్యాయ వ్యవస్థపై వచ్చిన అవినీతి అరోపణలన్నీ నిరాధారమని కొట్టిపారేశారు. -
ఆధార్ డేటా సురక్షితం
న్యూఢిల్లీ: యూపీ కాస్గంజ్లో మతఘర్షణలు, ఢిల్లీలో సీలింగ్ డ్రైవ్ అంశాలపై ప్రతిపక్షాల నిరసనలతో శుక్రవారం ఉదయం కొంతసేపు రాజ్యసభ వాయిదా పడింది. ఉదయం సమావేశం ప్రారంభం కాగానే ఎస్పీ, ఆప్ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేయటంతో డిప్యూటీ స్పీకర్ కురియన్ సభను ఉదయం కొద్దిసేపు వాయిదా వేశారు. అనంతరం ఆధార్ డేటా లీకేజీ వార్త అవాస్తవమని ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ రాజ్యసభలో స్పష్టంచేశారు. ఏ వ్యక్తికి సంబంధించిన ఆధార్ సమాచారమైనా ఎవరైనా రూ.500కే కొనుక్కోవచ్చంటూ మీడియాలో వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. రాజ్యసభలో ప్రవేశపెట్టిన వివాదాస్పద గో సంరక్షణ బిల్లును బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ఉపసంహరించుకున్నారు. సుప్రీంకోర్టు సీజేఐ, నలుగురు సీనియర్ న్యాయమూర్తుల మధ్య వివాదాన్ని పరిష్కరించుకునే సామర్ధ్యం న్యాయవ్యవస్థకు ఉందని న్యాయశాఖ సహాయ మంత్రి చౌదరి తెలిపారు. రైలు ప్రయాణికుల సంఖ్యతోపాటు ఆదాయాన్ని పెంచే ఫ్లెక్సి–చార్జీల విధానం అమలు చేయాలని యోచిస్తున్నట్లు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. -
క్షీర భగీరథుడు
మన దిగ్గజాలు - జూన్1 ప్రపంచ పాల దినోత్సవం దేశంలో క్షీరవిప్లవాన్ని తెచ్చిన దార్శనికుడు ఆయన. ఒకప్పుడు పాల కోసం అల్లాడిన భారతదేశాన్ని పాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిపిన ఘనత ఆయన సొంతం. ఆయనే వర్ఘీస్ కురియన్. ‘ఆపరేషన్ ఫ్లడ్’ పేరిట ఆయన చేపట్టిన ఈ భగీరథ ప్రయత్నం ప్రపంచంలోనే అతిపెద్ద వ్యవసాయానుబంధ కార్యక్రమంగా గుర్తింపు పొందింది. ఈ క్షీరవిప్లవమే కురియన్ను ‘మిల్క్‌మ్యాన్ ఆఫ్ ఇండియా’గా ప్రజలకు చేరువ చేసింది. దేశంలో పాడి పరిశ్రమ స్వయంసమృద్ధి సాధించిందంటే, అది ఆయన చలవే! అంతేనా, వంటనూనెల ఉత్పత్తిలోనూ దేశాన్ని స్వయంసమృద్ధి సాధించేలా చేయడంలోనూ గురుతర పాత్ర పోషించారాయన. కేరళ జన్మస్థలం... గుజరాత్ కార్యక్షేత్రం అప్పటి ఉమ్మడి మద్రాసు ప్రావిన్స్‌లోని కాలికట్లో (ప్రస్తుతం ఇది కేరళలో ఉంది. దీనిపేరు కోజికోడ్గా మారింది) 1921 నవంబర్ 26న సిరియన్ క్రైస్తవ కుటుంబంలో జన్మించారు వర్ఘీస్ కురియన్. కేరళలో పాఠశాల విద్య పూర్తయ్యాక కాలేజీ చదువుల కోసం మద్రాసు చేరుకున్నారు. మద్రాసులోని లయోలా కాలేజీ నుంచి ఫిజిక్స్‌లో బీఎస్సీ పొందారు. ఆ తర్వాత మద్రాసు వర్సిటీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేశారు. కొన్నాళ్లు జెమ్షెడ్పూర్లోని టాటా స్టీల్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్లో పనిచేశారు. భారత ప్రభుత్వం అందించిన స్కాలర్‌షిప్‌తో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. అక్కడ మిషిగాన్ స్టేట్ వర్సిటీ నుంచి 1948లో మెటలర్జికల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఉన్నత విద్యార్హతలతో దేశానికి తిరిగి వచ్చిన ఆయనను భారత ప్రభుత్వం గుజరాత్‌లోని ఆనంద్‌లో ప్రారంభించిన ప్రయోగాత్మక పాలకేంద్రం విధులను అప్పగించింది. ఇక అప్పటి నుంచి ఆనంద్ ఆయన కార్యక్షేత్రంగా మారింది. మధ్యలోనే మానేద్దామనుకున్నారు ప్రభుత్వం పంపగా కురియన్ తొలుత అయిష్టంగానే ఆ పని చేపట్టారు. మధ్యలోనే ఆ ఉద్యోగం మానేసి, వేరే ఏదైనా పని వెదుక్కోవాలని భావించారు. అయితే, కైరా జిల్లా పాల ఉత్పత్తిదారుల సంఘం వ్యవస్థాపకుడు త్రిభువన్దాస్ పటేల్ నచ్చచెప్పడంతో కురియన్ ఆనంద్‌లోనే ఉండిపోయారు. పటేల్ పాడి రైతులందరినీ ఏకతాటిపైకి తెచ్చి, వారందరూ ప్రభుత్వ పాల కేంద్రానికే పాలు సరఫరా చేసేలా చూశారు. అయితే, పాల కేంద్రం కార్యకలాపాల్లో తరచూ అధికారులు జోక్యం చేసుకుంటుండటంతో కురియన్ విసుగెత్తిపోయారు. దీనికి ఏదైనా పరిష్కారం సాధించాలనుకున్నారు. ఈ విషయమై తనకు మార్గదర్శిగా ఉన్న పటేల్‌తో చర్చించారు. అమూల్... అలా మొదలైంది సహకార పద్ధతిలో పాల సేకరణ మంచి ఫలితాలనే ఇస్తున్నా, అధికారుల జోక్యమే అభివృద్ధికి ఆటంకంగా నిలుస్తోందని కురియన్, పటేల్ భావించారు. అందుకే స్వయంగానే ఏదైనా చేద్దామని భావించారు. వారి ఆలోచన నుంచి ‘అమూల్’ పుట్టింది. ఆనంద్‌లో ఏర్పాటు చేసిన ‘అమూల్’ ప్లాంట్‌ను అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రారంభించారు. ‘అమూల్’ ద్వారా పాలపొడి, చీజ్, వెన్న ఉత్పత్తులు ప్రారంభమైన కొద్ది సంవత్సరాలలోనే దేశవ్యాప్తంగా ఆదరణ పొందాయి. సహకార పద్ధతిలో పాలసేకరణ ద్వారా సాధించిన ఈ విజయం అప్పటి ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రిని ఎంతగానో ఆకట్టుకుంది. దాంతో ఆయన కురియన్ను ఆహ్వానించి, దేశానికి పాల కొరత తీర్చాలనే సంకల్పంతో జాతీయ పాడి అభివృద్ధి మండలి (నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్) నాయకత్వ బాధ్యతలను అప్పగించారు. దీంతో దేశంలో క్షీరవిప్లవానికి నాందీప్రస్తావన జరిగింది. ఇక ఆ తర్వాత కురియన్ సాధించిన విజయాలన్నీ చరిత్రను సృష్టించాయి. ఆయన సారథ్యంలోనే పాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రగామిగా కొనసాగుతున్న అమెరికాను భారత్ అధిగమించగలిగింది. కురియన్ చలవ వల్ల లక్షలాది మంది పాడి రైతులు పేదరికం నుంచి బయటపడి స్వయంసమృద్ధిని సాధించగలిగారు. ఈ విజయాలన్నీ కురియన్‌కు ‘పద్మవిభూషణ్’ సహా పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులను తెచ్చిపెట్టాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే, ‘అమూల్’ విజయం స్ఫూర్తితో బాలీవుడ్ దర్శకుడు శ్యామ్ బెనగల్ రూపొందించిన ‘మంథన్’ చిత్రం బాక్సాఫీసు వద్ద ఘనవిజయం సాధించడం మరో విశేషం. - వర్ఘీస్ కురియన్ -
నయనతార పెళ్లి చేసుకుందా..?
సౌత్ ఇండస్ట్రీలో ప్రస్తుతం అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న లిస్ట్‌లో అందరికంటే ముందున్న హీరోయిన్ నయనతార. తమిళ్లో వరుస బ్లాక్ బస్టర్స్ సాధించిన ఈ బ్యూటి తెలుగులోనూ ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్స్‌లో నటిస్తోంది. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిరంజీవి 150వ చిత్రంతో పాటు వెంకటేష్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాబు బంగారం సినిమాల్లోనూ నటిస్తోంది. అయితే బాబుబంగారం యూనిట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం పాటల చిత్రీకరణ కోసం ఫారిన్లో ఉన్న యూనిట్ సభ్యులు హీరో హీరోయిన్లతో పాటు నిర్మాత నాగ వంశీ, దర్శకుడు మారుతిలు కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కుర్చీలలో కూర్చున్న ఈ నలుగురిని వెనకనుంచి తీసినట్టుగా ఉన్న ఈ ఫోటోలో నాగవంశీ చైర్ మీద ప్రొడ్యూసర్ అని, మారుతి చైర్ మీద డైరెక్టర్ అని, వెంకీ చైర్ మీద మిస్టర్ వెంకటేష్ అని ఇంగ్లీష్‌లో రాసి ఉంది. అయితే నయనతార కూర్చున చైర్ మీద మాత్రం మిసెస్ కురియన్ అని రాసి ఉంది. నయనతార అసలు పేరు డయానా మరియమ్ కురియన్, అయితే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తరువాత తన పేరును నయనతారగా మార్చుకుంది. అయితే సమస్య నయన్ పేరు కాదు ఆ పేరుకు ముందు మిసెస్ అని రాయటం. ఇంత వరకు పెళ్లి కానీ నయన్ పేరుకు ముందు మిసెస్ అని ఉండటం పై అభిమానులు షాక్ అవుతున్నారు. నిజంగానే నయన్ పెళ్లి చేసుకుందా..? లేక బాబు బంగారం సినిమాలో వెంకీ, నయన్ లు తమ సొంతం పేర్లతోనే కనిపిస్తున్నారా..? లేక ప్రొడక్షన్ యూనిట్ తప్పిదం కారణంగా మిస్ ప్లేస్‌లో మిసెస్ అని రాశారా..? అసలు ఏం జరిగిందో తెలియాలంటే బాబు బంగారం యూనిట్ క్లారిటీ ఇవ్వాల్సిందే. -
రాజ్య సభలో పెద్ద రభస
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు), లోక్‌సభ సభ్యులు రాజ్యసభలోకి ప్రవేశం, సభల పరువు, రాజ్యాంగ నిబంధనలు, రాజ్యసభ చైర్మన్ విచక్షణాధికారాలు... తదితర అంశాలపై ఈరోజు రాజ్యసభలో పెద్ద రభస జరుగుతోంది. వాయిదాలపై వాయిదాలు వేస్తున్నారు. తెలంగాణ బిల్లుపై తీవ్ర ఆందోళన, గందరగోళం చోటు చేసుకున్నాయి. ఇప్పటికే లోక్‌సభ పరువు, ప్రతిష్టలు పోయాయని బిజెపి సీనియర్ నేత వెంకయ్య నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి రాజ్యసభ పరువైనా కాపాడండి, సభ గౌరవం మంటగలపొద్దు అని విజ్ఞప్తి చేశారు. సభను బుల్డోజ్ చేసి బిల్లు తీసుకొచ్చే ప్రయత్నం చేయకండని కోరారు. పెద్దలసభలో గౌరవంగా వ్యవహరించాలని తెలిపారు. కాంగ్రెస్ మంత్రులు సభ మర్యాదలు పాటించాలన్నారు. లోక్‌సభ సభ్యుడు, కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావును ఉద్దేశించి లోక్‌సభ సభ్యులు వచ్చి రాజ్యసభను ఆటంకపరచకూడదని డిప్యూటీ చైర్మన్ టిజి కురియన్ చెప్పారు. రాజ్యాంగంలో ఈ నిబంధన స్పష్టంగా ఉందని పేర్కొన్నారు. దయచేసి లోక్‌సభ్యులు సభను విడిచి వెళ్లాలని కురియన్ కోరారు. సీమాంధ్ర సభ్యులు వెల్‌లోకి వెళ్లడంతో, వెల్‌లో నిరసన తెలపాలంటే ముందు రాజీనామా చేయండని డిప్యూటీ చైర్మన్ చెప్పారు. సభ సజావుగా సాగేలా సభ్యులు నడుచుకోవాలని కోరారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులు సభను అడ్డుకోవద్దని డిప్యూటీ చైర్మన్ కురియన్ కోరారు. నచ్చకపోతే సభ నుంచి వెళ్లిపోవాలన్నారు. రాజ్యసభ సభ్యుడు కానప్పుడు సభను ఎలా అడ్డుకుంటారని రాజ్యసభలో విపక్ష బిజెపి నేత అరుణ్ జైట్లీ కావూరిని ఉద్దేశించి ప్రశ్నించారు. మంత్రిగా మాత్రమే సభకు రావొచ్చని తెలిపారు. అంతేతప్ప సభను అడ్డుకోవద్దని కోరారు. రాజ్యసభలో కాంగ్రెస్ డ్రామాలాడుతోందని బిజెపి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ రవిశంకర్ ప్రసాద్ విమర్శించారు. వాళ్ల మంత్రులే బిల్లు ప్రవేశపెడతారు, వాళ్ల మంత్రులే వెల్‌లోకి వెళ్లి అడ్డుకుంటారని అన్నారు. నిబంధనల ప్రకారం రాష్ట్ర విభజన బిల్లు పెట్టడానికి వీళ్లేదని విపక్షాలు పట్టుపట్టాయి. కనీసం ఒక రోజు గడువు ఇవ్వాలని కోరాయి. బిల్లుపై చైర్మన్‌కు విచక్షణాధికారం ఉందని కురియన్ తెలిపారు. ఎప్పుడైనా సభ ముందు బిల్లు పెట్టవచ్చునని చెప్పారు.