నయనతార పెళ్లి చేసుకుందా..? | She is mrs nayanathara | Sakshi
Sakshi News home page

నయనతార పెళ్లి చేసుకుందా..?

Published Sun, May 15 2016 1:10 PM | Last Updated on Mon, Sep 4 2017 12:10 AM

నయనతార పెళ్లి చేసుకుందా..?

నయనతార పెళ్లి చేసుకుందా..?

సౌత్ ఇండస్ట్రీలో ప్రస్తుతం అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న లిస్ట్లో అందరికంటే ముందున్న హీరోయిన్ నయనతార. తమిళ్లో వరుస బ్లాక్ బస్టర్స్ సాధించిన ఈ బ్యూటి తెలుగులోనూ ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్స్లో నటిస్తోంది. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిరంజీవి 150వ చిత్రంతో పాటు వెంకటేష్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాబు బంగారం సినిమాల్లోనూ నటిస్తోంది.

అయితే బాబుబంగారం యూనిట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం పాటల చిత్రీకరణ కోసం ఫారిన్లో ఉన్న యూనిట్ సభ్యులు హీరో హీరోయిన్లతో పాటు నిర్మాత నాగ వంశీ, దర్శకుడు మారుతిలు కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కుర్చీలలో కూర్చున్న ఈ నలుగురిని వెనకనుంచి తీసినట్టుగా ఉన్న ఈ ఫోటోలో నాగవంశీ చైర్ మీద ప్రొడ్యూసర్ అని, మారుతి చైర్ మీద డైరెక్టర్ అని, వెంకీ చైర్ మీద మిస్టర్ వెంకటేష్ అని ఇంగ్లీష్లో రాసి ఉంది.

అయితే నయనతార కూర్చున చైర్ మీద మాత్రం మిసెస్ కురియన్ అని రాసి ఉంది. నయనతార అసలు పేరు డయానా మరియమ్ కురియన్, అయితే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తరువాత తన పేరును నయనతారగా మార్చుకుంది. అయితే సమస్య నయన్ పేరు కాదు ఆ పేరుకు ముందు మిసెస్ అని రాయటం. ఇంత వరకు పెళ్లి కానీ నయన్ పేరుకు ముందు మిసెస్ అని ఉండటం పై అభిమానులు షాక్ అవుతున్నారు.

నిజంగానే నయన్ పెళ్లి చేసుకుందా..? లేక బాబు బంగారం సినిమాలో వెంకీ, నయన్ లు తమ సొంతం పేర్లతోనే కనిపిస్తున్నారా..? లేక ప్రొడక్షన్ యూనిట్ తప్పిదం కారణంగా మిస్ ప్లేస్లో మిసెస్ అని రాశారా..? అసలు ఏం జరిగిందో తెలియాలంటే బాబు బంగారం యూనిట్ క్లారిటీ ఇవ్వాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement