సాక్షి, హైదరాబాద్: లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అండగా నిలిచినవారికి సీఎం రేవంత్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ఫలితాలు సంతృప్తినిచ్చాయని అన్నారు. లోక్‌సభ ఫలితాలపై ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు.
‘‘ లోక్ ఎన్నికల ఫలితాలు మా 100 రోజుల పాలనకు రెఫరెండం. దేశవ్యాప్తంగా రాహుల్ జోడోయాత్ర పరిస్థితి మారిపోయింది. బీజేపీని గెలిపించేందుకు బీఆర్‌ఎస్ ఆత్మబలిదానం చేసుకుంది. 2019లో 3 సీట్లు గెలిస్తే.. ఇప్పుడు 8 సీట్లు గెలిచాం. సిద్దిపేటలో కూడా బీజేపీకి మెజార్టీ వచ్చింది.
బీఆర్‌ఎస్‌కు తెలంగాణ ప్రజలు గుండుసున్నా ఇచ్చారు. బీజేపీ అభ్యర్థుల కోసం బీఆర్‌ఎస్ బలహీన అభ్యర్థులను నిలబెట్టింది. బీజేపీ కూడా ఓట్లు, సీట్లు పెరిగాయి. ఇప్పటికైనా బీఆర్‌ఎస్ నేతల తీరు మార్చుకోవాలి. మోదీ గ్యారంటీకి ఉన్న వారంటీ ముగిసింది.
మోదీ వెంటనే ప్రధాని పదవికి రాజీనామా చేయాలి. తెలంగాణ లోక్‌సభ ఫలితాలు ఉగాది పచ్చడిలాగా సగం తియ్యగా, సగం పులుపుగా ఉన్నాయి. మల్కాజిగిరిలో ఓడినా.. కంటోన్మెంట్‌లో విజయం సాధించాం. కేసీఆర్ ఉన్నంతకాలం కుట్రలు, కుతంత్రాలు ఉంటాయి. ఎప్పటికప్పుడుతెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment