కేసీఆర్ కంటే రేవంత్ అత్యంత ప్రమాదకారి: కిషన్‌రెడ్డి | bjp kishan reddy slams on kcr and revanth reddy hyderabad | Sakshi
Sakshi News home page

కేసీఆర్ కంటే రేవంత్ అత్యంత ప్రమాదకారి: కిషన్‌రెడ్డి

Published Sat, May 11 2024 2:11 PM | Last Updated on Sat, May 11 2024 2:18 PM

bjp kishan reddy slams on kcr and revanth reddy hyderabad

సాక్షి, హైదరాబాద్‌: రోజు రోజుకు బీజేపీకి ఆదరణ పెరుగుతోంది. అంతే స్థాయిలో కాంగ్రెస్, బీఅర్ఎస్.. బీజేపీపై విష ప్రచారం చేస్తున్నాయని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. శనివారం కిషన్‌రెడ్డి  మీడియాతో  మాట్లాడారు.

‘‘సీఎం రేవంత్, కేసిఆర్‌.. తెలంగాణ ప్రజలను గొర్రెలు అనుకుంటున్నారు. మీరు ఏది చెప్పినా నమ్మేస్తారని ఊహాలోకంలో ఉన్నారు. ఇష్టమొచ్చినట్టు అబద్ధాలు చెప్తున్నారు.  మీ ప్రకటనలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. రజాకార్లతో విరోచిత పోరాటం చేసిన చరిత్ర తెలంగాణ ప్రజలకు ఉంది. కాంగ్రెస్ అంటేనే అవినీతి. పచ్చ కామెర్లు ఉన్నోడికి అంత పచ్చగానే కనిపిస్తుంది. కాంగ్రెస్ దేశంలో అవినీతిని పెంచి పోషించింది. 

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నుంచి చేసిందేమీ లేదు కాబట్టి మాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు.  ఎన్నికల ప్రచారంలో ప్రజలకు  రేవంత్ నిజస్వరూపం తెలిసిపోయింది. కేసిఆర్ కంటే రేవంత్ అత్యంత ప్రమాదకారి. అధికారం కోసం ఎంతకైనా తెగించి... అబద్ధాలు అవలీలగా చెప్తారు.  రేవంత్, కేసీఆర్ దొందూ దొందే.  ఇద్దరు అబద్దాల ఆడటంలో ఆరిదేరారు.

కాంగ్రెస్ అబద్ధాలను ఇంటి పేరుగా మార్చుకొని 75 ఏళ్లుగా రాజకీయం చేస్తుంది. ఏనాడు కాంగ్రెస్‌కి భద్రత దళాల మీద నమ్మకం లేదు. వారిని అవమాన పరిచే విధంగా అనేక సార్లు మాట్లాడారు.

పాకిస్తాన్ దగ్గర ఆటంబాంబులు ఉన్నాయి.. వారికి మనం అణిగిమణిగి ఉండాలని కాంగ్రెస్ నేత ఒకాయన మాట్లాడుతున్నారు. ఈరోజు ఢిల్లీలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు.. బీజేపి ప్రభుత్వం. పాకిస్థానీ ఎత్తుగడలను తిప్పికొట్టి.. వాళ్ల తొక కట్ చేసి నడ్డి విరిచాం. కాంగ్రెస్ అసమర్థతతో పాకిస్తాన్ ఆడింది ఆటగా సాగింది. 

పాకిస్తాన్ దగ్గర అణుబాంబులు ఉంటే భారత్ భయపడదు. అసమర్థతతో కాంగ్రెస్ పాకిస్తాన్‌ను పెంచి పోషించింది. ఇటువంటి కాంగ్రెస్ పుల్వామ మీద మాట్లడటామా?. కాంగ్రెస్ కూటమి వ్యక్తీ ఫరూఖ్ అబ్దుల్లా దేశంలో ఉంటూ.. పార్లమెంట్ సభ్యుడిగా ఉంటూ.. పాకిస్తాన్‌కి మద్దతుగా మాట్లాడతారా?’’ అని కిషన్‌రెడ్డి మండిపడ్డారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement