‘మాటలతో ఆటలాడవద్దు.. మీ గేమ్స్ చెల్లవు’ | Mallu Bhatti Vikramarka On MLA Prabhakar Reddy Comments | Sakshi
Sakshi News home page

‘మాటలతో ఆటలాడవద్దు.. మీ గేమ్స్ చెల్లవు’

Published Tue, Apr 15 2025 7:48 PM | Last Updated on Tue, Apr 15 2025 8:10 PM

Mallu Bhatti Vikramarka On MLA Prabhakar Reddy Comments

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వాన్నికూల్చేయబోతున్నారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మాటలతో ఆటగాడవద్దు. మీ గేమ్స్ చెల్లవు’ అంటూ అని తీవ్రంగా స్పందించారు. ఈ అంశం‍లో చట్టం తనపని తాను చేసుకుపోతుందని, బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించే వారే ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తారని మండిపడ్డారు. (ఇదీ చదవండి: ‘ఆ టెస్టులు మీరే చేయించుకుంటే మీ అసలు రంగు బయటకొస్తది’)

ఇదిలా ఉంచితే,. ఈరోజు(మంగళవారం) హైదరాబాద్ నగరంలో నోవాటెల్ హెటల్ లో జరిగిన సీఎల్పీ సమావేశంలో మల్లు భట్టివిక్రమార్క మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో సంక్షేమం ఒక ఎత్తు అయితే.. ఎస్సీ వర్గీకరణ, బీసీ కుల గణన పకడ్బందీగా పూర్తి చేశాం.  ఈ రెండు అంశాలు గత కొన్ని దశాబ్దాలుగా గొప్ప గొప్ప నాయకులే చేయలేకపోయారు మన ప్రభుత్వం అందరికీ చెప్పి చేసింది. 

ఈ రెండు అంశాలు చేయాలని ఇప్పుడు దేశవ్యాప్తంగా డిమాండ్ మొదలవుతుంది. ఎన్నికల ముందు  రాహుల్ గాంధీ ఇచ్చిన మాట మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లు ఆమోదించాము. ఎస్సీ కుల వర్గీకరణ జరిగింది. దేశంలో కొద్దిమందికి ఇష్టం లేకపోయినా భూసంస్కరణలు వంటి గొప్ప నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీ గతంలో చేపట్టింది.  అందుకే ఈ దేశంలో సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ అధికారంలో కొనసాగింది. 

బీసీ కుల గణన, sc వర్గీకరణ పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన బి ఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీలను మూట కట్టి మూలన పడేసే విషయాలు.. ఇవి వారి అస్తిత్వానికే ప్రమాదం కాబట్టి బీఆర్ఎస్, బిజెపి చేతులు కలిపి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చిత్రీకరిస్తున్నారు.

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని భావించి కంచ గచ్చిబౌలిలో ఏనుగులు, పులులు తిరుగుతున్నట్టు బిజెపి, బీఆర్ఎస్ కలిసి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ని ఉపయోగించి కుట్రలు చేస్తున్నాయి. బీసీ కుల సర్వే మీ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది.  ఏకంకండి, మాతో కలిసి రండి అని చెప్పి బహుజన వర్గాలను చైతన్యం చేయాలి. కులగణన ద్వారా పొందాల్సిన ఫలితాలను అందుకున్నాము. సంక్షేమ పథకాలు, బీసీ కుల సర్వే, ఎస్సీ వర్గీకరణ నిశ్శబ్ద విప్లవాలు’ అంటూ ఆయన స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement