
- 28 అంశాలపై చర్చించాం
- రాష్ట్ర ప్రయోజనాల కోసం అంతా ఏకం కావాలి
- డిప్యూటీ సీఎం మల్లు
హైదరాబాద్: రాష్ట్ర ప్రయోజనాల కోసం అంతా ఏకం కావాల్సిన అవసరం ఉందని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రజాభవన్ లో అఖిలపక్ష ఎంపీల సమావేశంలో భట్టి పాల్గొన్నారు. ఈ సందర్భంగా 28 అంశాలపై చర్చ జరిగినట్లు భట్టి తెలిపారు.‘కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, హామీలపై చర్చించాం. రాష్ట్రానికి రావాల్సిన అంశాలను కేంద్రం నెరవేర్చాలని కోరుతూ ప్రతిపాదనలు ఇప్పటికే ఇచ్చాం మళ్ళీ ఇస్తాం.
కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ అంశాలపై చర్చించాం. కేంద్రమంత్రులను కూడా ఆహ్వానించాం.. సమావేశానికి రావాలని బీజేపీ, బీఆర్ఎస్ ఎంపీలను ప్రత్యేకంగా ఆహ్వానించినా రాలేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరూ ఏకం కావాల్సిన అవసరం ఉంది. విభజన చట్టం నుండి రావాల్సిన రాష్ట్ర హక్కుల పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాం. రెసిడెంట్ కమిషనర్ కార్యాలయం నుండి ఎంపీల అందరికీ వివరాలు పంపిస్తాం.
బీఆర్ఎస్ ఆనాడు చేయాల్సిన ప్రయత్నం సరిగా చేయలేదు. మేము అధికారంలోకి వచ్చాక కొంచెం ఒత్తిడి పెంచాం. పార్లమెంట్ లో కేంద్రం మీద ఒత్తిడి చేయాలని మ ప్రయత్నం. కేంద్రం నుండి రావాల్సిన నిధులు..ప్రాజెక్టులు అందాలి. రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని పార్టీల ఎంపీలు కలిసి రావాలి. ఇంకో సమావేశం ఏర్పాటు చేసి మళ్ళీ చెప్తం. ముందే సమాచారం ఇస్తాం. అప్పుడైనా బీజేపీ..brs వాళ్ళు కలిసి వస్తారు. కేంద్రం కి ఇచ్చిన లేఖలు..సమాచారం బుక్ లెట్ గా రూపొందించాం’ అని భట్టి పేర్కొన్నారు.
నిధుల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం
తెలంగాణ ప్రభుతవం ఏర్పాటు చేసిన అఖిలపక్ష ఎంపీల సమావేశాన్ని స్వాగతిస్తున్నామన్నారు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. కేంద్ర ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహారించడం లేదు. నిధుల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం జరుగుతోంది. తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు’ అని ఓవైసీ అన్నారు.