సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క.. ఆయన సోదరుడు, నాగర్‌కర్నూల్ లోక్‌సభ సభ్యుడు మల్లు రవి గుసగుసలాడుకున్నారు. అసెంబ్లీ లాబీల్లోని భట్టి చాంబర్‌కు మల్లురవి రాగా, ఆ సమయంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావుతో పాటు ఇతరులు భట్టి చాంబర్‌లోనే ఉన్నారు. దీంతో తన సోదరుడితో రహస్యంగా మాట్లాడి మల్లు రవి వెళ్లిపోయారు.
అయితే, అసెంబ్లీలో ఈ అన్నదమ్ములు ఎందుకు గుసగుసలాడారా అన్న విషయంపై ‘సాక్షి’ ఆరా తీయగా, రహస్యమేమీ లేదని ఎంపీ మల్లురవి చెప్పారు. అసెంబ్లీ ఆమోదం పొందిన మన్మోహన్‌సింగ్ సంతాప తీర్మానం ఇప్పించాలని, దానిపై తెలంగాణ ఎంపీల సంతకాలు పెట్టించి రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రికి ఇస్తానని భట్టికి చెప్పానని ఆయన వెల్లడించారు.
ఇదీ చదవండి: హుస్సేన్ సాగర్ చుట్టూ నో ఎంట్రీ... హద్దు మీరితే అంతే
Comments
Please login to add a commentAdd a comment