దుబాయ్‌లో పనిచేసేందుకు వెళ్లింది ఆంధ్రప్రదేశ్‌కి చెందిన మణెమ్మ. అనుకోకుండా ప్రాణాంతక వ్యాధి బారినపడింది. దీంతో తన సొంతూరుకి ఎలా పయనమవ్వాలో తెలియని దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. అయితే దుబాయ్ కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా(సీజీఐ) ఏపిఎన్‌ఆర్టీఎస్ సాయంతో మణెమ్మను సురక్షితంగా స్వదేశంలోని హెల్త్‌కేర్‌సెంటర్‌కి పంపింది.
వివారాల్లోకెళ్తే..ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లాకు చెందిన ఎమ్ మణెమ్మ సెప్టెంబర్ 2022లో దుబాయ్‌లో ఓ ఇంట్లో పనిచేయడానికి వెళ్లింది. కానీ దురదృష్ణవశాత్తు డిసెంబర్ 22న ఆమెకు ప్రాణాంతక వ్యాధి టీబీ ఉందని వైద్య పరీక్షల్లో తేలింది. అప్పటి నుంచి మణెమ్మకు దుబాయ్‌లోనే ట్రీట్‌మెంట్ జరుగుతుంది. ఐతే ఇప్పుడు ఆమె పూర్తి స్థాయిలో కోలుకుంది. భారతదేశం ప్రయాణించడానికి ఎలాంటి సమస్య లేదని వీల్‌చైర్ ద్వారా నర్సు సాయంతో పంపిచొచ్చని వైద్యులు సూచించారు. దీంతో దుబాయ్ సీజేఐ మణెమ్మను తన వివరాలను చెప్పల్సిందిగా కోరింది.
అయితే తనకు కుటుంబసభ్యులు, స్నేహితులు ఎవ్వరూ లేరని చెప్పడంతో ఆమె సొంతూరుకు దగ్గరలో ఉన్న హెల్త్‌కేర్ సెంటర్లు గురించి తెలియజేయమంటూ ఏపిఎన్‌ఆర్టీఎస్ ప్రెసిడెంట్ వెంకట్ మేడపాటికి ఈ మెయిల్ పంపింది దుబాయ్ సీజేఐ. దీంతో ఏపీఎన్‌ఆర్టీఎస్ ఈ విషయాన్ని ఏలూరు కలెక్టర్ కార్యాలయానికి తెలియజేసింది. కలెక్టర్ కార్యాలయం వారు సెయింట్ ఆన్స్ లయోలా ప్రేమ్ నివాస్ రిహాబిలేషన్ సెంటర్‌లో ఉండటానికి అనుమతివ్వడంతో ఏపీఎన్‌ఆర్టీఎస్ ఆ విషయాన్ని దుబాయ్ సీజేఐకి తెలిపింది.
దుబాయ సీజే మణెమ్మకు నర్సుని తోడుగా ఇచ్చి హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి పంపగా, అక్కడ నుంచి ఏపీఎన్‌ఆర్టీసి అంబులెన్స్ సాయంతో లయోలా ప్రేమ్ నివాస్ రిహాబిలిటేషన్ సెంటర్కు మణెమ్మను సురక్షితంగా చేర్చారు. ఈ విషయంలో తమకు సహకరించినందుకు గానూ దుబాయ సీజేఏ ఏపీఎన్‌ఆర్టీఎస్ వారికి కృతజ్ఞతలు తెలిపింది. అలాగే ఏపీఎన్‌ఆర్టీఎస్ కూడా మణెమ్మను సురక్షితంగా తరలించడంలో సాయం చేసిన ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఐఏఎస్ గారికి, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి విజయ లక్ష్మి, డిఆర్ఓ మూర్తి, జిల్లా పరిపాలన శాఖ అధికారులకు, దుబాయ్ సీజేఐకి ధన్యవాదాలు తెలిపింది.
(చదవండి: యూరప్‌లో వైభవంగా మలయప్ప స్వామి కల్యాణం)
Comments
Please login to add a commentAdd a comment