విద్యుత్ సమస్యపై టీడీపీ ఎమ్మెల్యేల ఆందోళన
నిరంతర విద్యుత్ అని చెప్పుకోవడం ఆత్మవంచనే: గౌతు శివాజీ
విద్యుత్ కోతలపై సబ్‌స్టేషన్ వద్ద ధర్నా
సోంపేట: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అంతరా యం లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నామని చె ప్పుకోవడం ఆత్మవంచన చేసుకోవడమేనని ప లాస ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ అన్నా రు. ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల్లో విద్యు త్ సరఫరాలో సమస్య పరిష్కరిచాలంటూ ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌తో కలిసి బుధవారం సోంపేట సబ్‌స్టేషన్ వద్ద ధర్నా చేశారు.
సోంపేట మండలంలో మే నెల 15 నుంచి జూన్ 3 వరకు 20 రోజుల్లో ఎన్ని గంటలు విద్యుత్ సరఫరా ఆపారో తెలపాలని ఎమ్మెల్యే శివాజీ సబ్‌స్టేషన్ ఏడీఈ అప్పారావుకు 20 రోజుల కిందట దరఖాస్తు చేసుకున్నా ఇప్పటికీ సమాధానం రాలేదు. దీంతో ఇద్దరు ఎమ్మెల్యేలు ధర్నాకు దిగారు. బారువలోని ఓ కార్యక్రమానికి వచ్చిన వీరు ఆందోళన కు దిగడంతో సిబ్బంది కాస్త టెన్షన్ పడ్డారు. ఏఈ లక్ష్మణరావు, ఏడీఈ అప్పారావులను సమస్యలపై ప్రశ్నలు అడగ్గా... సమాధానాలు సరిగ్గా రాలేదు.
ఈ ధర్నాపై కలెక్టర్ లక్ష్మీనృసింహం, జిల్లా ట్రాన్స్ కో ఎస్‌ఈ శరత్, జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, సీఎం పేషీ అధికారులకు శివాజీ సమాచారం అందించారు. అలాగే 11 గంటల సమయంలో బరంపురం గ్రిడ్ మేనేజర్ అనిల్ కుమార్‌కు ఫోన్ చేసి విద్యుత్ అంతరాయానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. త ర్వాత సీఎం పేషీ అధికారి రాజ్‌గోపాల్‌తోనూ మాట్లాడారు. విశాఖ ట్రాన్స్‌కో సీఎండీ ముత్యాలరాజుతో కూడా ఫోన్‌లో ఇద్దరు ఎమ్మెల్యేలు మాట్లాడారు.
నిరంతర విద్యుత్ లేదు...
గ్రామాల్లోకి వెళ్లి నిరంతర విద్యుత్ అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందని ఎమ్మెల్యేలు అన్నారు. కలెక్టర్ ట్రాన్స్‌కో ఎస్‌ఈని వెనకేసుకు వస్తున్నారని ఆ రోపించారు. చివరకు టెక్కలి డీఈ జీఎన్ ప్రసాద్ వచ్చి అంతరాయానికి క్షమాపణలు చెప్పినా ఆం దోళన విరమించలేదు. ఆఖరకు ట్రాన్స్‌కో సీఎండీ విజయేందర్ హైదరాబాద్ నుంచి శివాజీతో ఫో న్‌లో మాట్లాడారు.
సీఎండీ రాజు సమక్షంలో స మావేశం నిర్వహించి సమస్య పరిష్కరిస్తానని చె ప్పడంతో ఆందోళన విరమించారు. గ్రామాల్లో నిరంతర విద్యుత్ అందడం లేదని సీఎంకు చెప్పడానికే ఈ ఆందోళన చేసినట్లు శివాజీ తెలిపారు. ధర్నా చేస్తున్నామని కలెక్టర్, మంత్రికి చెప్పినా స్పందించకపోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చే శారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలతో పాటు స్థానిక నాయకులు జెడ్పీటీసీ సూరాడ చంద్రమోహన్, మద్దిలి నాగేశ్వరరావు, గోపీ, తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమంలో శివాజీ ఇచ్ఛాపురం ఎ మ్మెల్యే అశోక్‌తో మాట్లాడుతూ ‘ధర్నాతో నాకు ఎలాంటి సంబంధం లేదని సీఎంతో అనవద్దు’ అంటూ చలోక్తి విసిరారు. అనంతరం ఎస్‌ఈ జీఎ న్ ప్రసాద్ సోంపేట చేరుకుని విద్యుత్ శాఖాధికారులతో సమావేశం నిర్వహించారు. అధికారుల్లో సమన్వయం లేకపోవడంతో ఇలా జరుగుతందన్నారు. అధికారులు సమన్వయం చేసుకుని విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని అధికారులను కోరారు.