sompeta
-
అత్తాకోడళ్ల మధ్య గొడవ.. అర్ధరాత్రి 12 గంటల సమయంలో
సాక్షి, సోంపేట (శ్రీకాకుళం): కొర్లాం పంచాయతీ గొనకపాడు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఇదే గ్రామానికి చెందిన వివాహిత సివంగి యశోద (28) నేల బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. బారువ పోలీసులు, మృతురాలి తల్లి లక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం.. యశోద భర్త మోహనరావు వలస కార్మికుడిగా చిత్తూరులో ఉంటున్నాడు. దీంతో అత్తమామలను చూసుకుంటూ, పిల్లలను చదివిస్తూ యశోద గొనకపాడు గ్రామంలోనే ఉంటుంది. ఆదివారం రాత్రి అత్తాకోడళ్ల మధ్య చిన్నపాటి గొడవ తలెత్తింది. దీంతో మనస్తాపం చెందిన ఆమె అర్ధరాత్రి 12 గంటల సమయంలో సమీపంలో ఉన్న నేలబావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈమెకు ఇద్దరు పిల్లలు షర్మిళ, క్రాంతి ఉన్నారు. అందరితో కలివిడిగా ఉండే యశోద మృతి చెందడంతో గొనకపాడు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతురా లి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు బారువ ఎస్సై రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (గచ్చిబౌలి: సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య.. సహోద్యోగికి ఫోన్ చేసి..) -
నీరు మిగిల్చిన కన్నీరు
నీరు కన్నీరు మిగిల్చింది. రాఖీ పౌర్ణమి నాడు ఉప్పుటేరు అన్నాచెల్లెళ్ల కుటుంబాల్లో విషాదం నింపింది. తండ్రులతో పాటు విహారానికి వెళ్లిన బిడ్డలు తిరిగి ఇంటికి రాలేకపోయారు. చందమామ వంటి రూపాలు, ముద్దుగారే మాటలతో ఇళ్లంతా సందడిగా తిరిగిన పిల్లలు నిశ్శబ్దమైపోయారు. అమ్మానాన్న ఊరెళితేనే తట్టుకోలేని ప్రాయంలో వారిని శాశ్వతంగా వదిలి వెళ్లిపోయారు. సోంపేట: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం సిరిమామిడి గ్రామానికి సమీపంలో గల ఉప్పుటేరులో పడి కారాగి హర్షిత్ (6), దున్న శ్రీశాంత్ (8) అనే ఇద్దరు బాలలు మృతి చెందారు. రాఖీ పండగ రోజు జరిగిన ఈ విషాదం ఇద్దరు అన్నాచెల్లెల కుటుంబాల్లో తీరని శోకం మిగిల్చింది. పోలీసులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన కారాగి ప్రకాష్, దున్న కాంతారావులు బావబామ్మర్దులు. కారాగి ప్రకాష్ చెల్లి నీలవేణిని కాంతారావుకు ఇచ్చి వివాహం చేసి ఉన్నారు. ఆదివారం సాయంత్రం బావబామ్మర్దులు పిల్లలు కారాగి హర్షిత్, దున్న శ్రీశాంత్‌లతో పాటు సముద్ర తీరానికి వెళ్లారు. తీరంలోని ఉప్పుటేరు వద్ద పిల్లలను కూర్చోబెట్టి అక్కడే ఉండమని చెప్పి వారు సముద్రం వైపు వెళ్లారు. తండ్రులు దగ్గర లేకపోవడంతో పిల్లలిద్దరూ ఉప్పుటేరులో స్నానానికి దిగారు. నీటి లోతును అంచనా వేయలేక మునిగిపోయారు. తండ్రులు అక్కడకు వచ్చి చూసే సరికి పిల్లలు లేకపోవడంతో కంగారు పడి అంతా వెతికారు. ఉప్పుటేరు చిన్నారులు కాస్త తేలుతూ కనిపించడంతో వారికి బయటకు తీసి స్థానికుల సాయంతో హరిపురం సామాజిక ఆస్పత్రికి హుటాహుటిన తరలించారు. అయితే అప్పటికే చిన్నారులు మృతి చెందినట్లు వైద్యులు చెప్పడంతో వారు గుండెలవిసేలా రోదించారు. ఇద్దరు చిన్నారుల మృతితో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. కారాగి ప్రకాష్, కల్పనలకు హర్షిత్ తో పాటు మూడేళ్ల పాప ఉంది. ఆదివారం ఉదయమే తన అన్నకు ఆ చిన్నారి రాఖీ కట్టింది. సాయంత్రానికి ఆ బాలుడు చనిపోయాడనే వార్త తెలిసి ఆ కుటుంబం కంటికి మింటికి ఏకధారగా రోదించింది. దున్న కాంతారావు, దున్న నీలవేణిలకు శ్రీశాంత్‌తో పాటు మరో ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. పెద్ద కుమారుడిని ఉప్పుటేరు మింగేయడంతో ఆ కుటుంబం బోరున విలపించింది. సోంపేట సీఐ డీవీవీ సతీష్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బారువ ఎస్ఐ రమేష్, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ఊరెళ్లిపోదాం అన్న కాసేపటికే.. -
చేతిలో తుపాకీ, ఒంటిపై గాయాలు.. ఏం జరిగిందంటే?
సోంపేట: ఆ వ్యక్తి చేతిలో తుపాకీ.. ఒంటిపై గాయాలు.. దుస్తులపై రక్తపు మరకలు.. ఆపై స్థానికులతో ఘర్షణ. సోంపేట మండలం కొర్లాంలోని ఓ టిఫిన్ షాపు వద్ద ఆదివారం ఉద్రిక్తత రేపిన ఘటన ఇది. జైపూర్ నుంచి భువనేశ్వర్ వెళ్లే ఒడిశాకు చెందిన ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సులో కొర్లాం వద్ద టిఫిన్ల కోసం ఆగింది. అందులో నుంచి దిగిన ప్రదీప్‌కుమార్ అనే వ్యక్తి హొటల్ సమీపంలో మూత్ర విసర్జనకు వెళ్లే ప్రయత్నంలో సిబ్బందితో గొడవ పడ్డాడు. తగాదా జరుగుతున్న సమయంలో సినిమా హీరోలా బస్సులోని తన బ్యాగ్‌లో ఉన్న తుపాకీ తెచ్చి బెదిరించాడు. అతని ఒంటిపై గాయాలు ఉండడం, దుస్తులపై రక్తపు మరకలు కనిపించడంతో తోటి ప్రయాణికులు, హొటల్ సిబ్బంది కూడా భయపడ్డారు. అయితే బారువ పోలీసులు సీన్లోకి దిగితే గానీ అసలు విషయం తెలియలేదు. ప్రదీప్‌కుమార్ ఓ సినిమా కార్మికుడు. అతని చేతిలో ఉన్నది నకిలీ తుపాకీ. ఒంటిపై గాయాలు షూటింగ్లో కింద పడిపోతే తగిలినవి. పోలీసులు విచారణ తర్వాత అసలు విషయం చెప్పడంతో హొటల్ సిబ్బందితో సహా అక్కడున్న వారంతా నవ్వుకున్నారు. పోలీసులే ప్రదీప్‌కుమార్‌ను బారువ ఆస్పత్రిలో చేర్చి వైద్యం చేయించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. చదవండి: అమ్మో ఆర్సెనిక్! -
చిన్నారిని చిదిమేసిందెవరు?
పాలబుగ్గల చిన్నారి.. ముద్దులొలికే పొన్నారి.. బుడిబుడి అడుగులతో ముచ్చట గొలుపుతుంది.. ఊసులాడుతూ మంత్రముగ్ధుల్ని చేస్తుంది.. చందమామలాంటి ఆ పసిపాపను చూస్తే ఎంతటి పాపాత్ముడిలోనైనా పరివర్తన వస్తుంది.. మరి ఆ బుజ్జాయి ప్రాణాలు తీసేందుకు ఎలా మనసొచ్చింది..? ఎంతటి కిరాతక హృదయులో ఇంతటిదారుణానికి ఒడిగట్టారు.. ఆడుకుంటున్న పాపాయి ఊపిరి తీశారు.. అంత ఎత్తున ఉన్న నీళ్ల ట్యాంకులో ఎలా పడిందో.. కాదు కాదు ఎవరు పడదోశారో ప్రశ్నార్థకంగా మిగిలింది. సాక్షి, సోంపేట(శ్రీకాకుళం జిల్లా): మూల దుర్యోధన, కావ్య దంపతుల ముద్దుల పాపాయి హేమశ్రీ. సోంపేట మండలం టి.శాసనాం గ్రామానికి చెందిన వీరికి పెళ్లయిన రెండేళ్ల తర్వాత పుట్టింది. 11 నెలల ఈ చిన్నారంటే అందరికీ ముద్దే. అందుకే పక్కింట్లో ఉండే వి.నిర్మల ప్రతి రోజు ఈ పాపను వాళ్లింటికి తీసుకెళ్లి కాసేపు ఆడిస్తుంది. శుక్రవారం కూడా అలాగే జరిగింది. ఉదయం 10.30 గంటల ప్రాంతంలో పాపను ఆడిస్తానని తీసుకెళ్లిన నిర్మల.. 20 నిమిషాల తరువాత కంగారుగా పరిగెత్తుకు వచ్చింది. పాప కనిపించడంలేదని చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది వీధిలో వెదకడం ప్రారంభించారు. అంతలో తమ ఇంటిపై ఉన్న నీళ్ల ట్యాంకులో హేమ పడివుందని నిర్మల తెలిపింది. కొన ఊపిరితో ఉన్న చిన్నారిని బయటకు తీసి హుటాహుటిన సోంపేట సామాజిక ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే హేమశ్రీ మృతి చెందిందని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు బోరుమన్నారు. బారువ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాప మృతిపై అనుమానాలు ఇంటి పైనున్న ట్యాంకు వరకు చిన్నారి వెళ్లలేదు. ఎవరో తీసుకువెళ్లి ఉండాలి. ట్యాంకుకు పైకప్పు ఉంది. కప్పుతీసి నీటిలో పడేసి మూత పెట్టారు. పాపను చంపే ఉద్దేశంతోనే ఎవరో ట్యాంకులో పడవేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఎవరు ఎందుకు చేశారో తల్లిదండ్రులకు అర్థం కావడంలే దు. పాపను ఇంట్లో ఆడిస్తూ పెరట్లోకి వెళ్లానని, అంతలోనే మాయమైందని నిర్మల చెబుతోంది. హేమశ్రీ తండ్రి దుర్యోధన వలస కార్మికుడిగా ముంబైలో పనులు చేస్తున్నారు. ఇచ్ఛాపురం సీఐ వినోద్ బాబు, బారువ ఎస్ఐ పి.నారాయణస్వామి టి. శాసనాం గ్రామానికి వెళ్లి వివరాలు సేకరించారు. చిన్నారి అంత ఎత్తు ట్యాంకులో ప్రమాదవశాత్తూ పడిపోయే అవకాశం లేదని, అందుకే హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. అనుమానితులను గుర్తించలేదని, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు కేసు దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
అన్నయ్యా.. నా పిల్లలను బాగా చూసుకో...
సాక్షి, సోంపేట(శ్రీకాకుళం) : ‘నా భార్య పిల్లలను నీవే చూసుకోవాలి’ అని తన అన్నయ్య శ్రీనివాసరావుకు బాధాతప్తం హృదయంతో ఫోన్ చేసి మాట్లాడిన పలుకులే తమ్ముడు పిట్ట ఢిల్లీరావు(32)కు చివరివయ్యాయి. తన తలలో ఏర్పడిన కణితి బాధ భరించలేక, కుటుంబ సభ్యులకు భారం కాకూడదని నిర్ధారించుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సోంపేట పట్టణంలోని తెలగవీధికి చెందిన ఈయన ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడటంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. సోంపేట పోలీసుల వివరాల ప్రకారం... పట్టణంలో బైక్ మెకానిక్ షాపు నిర్వహిస్తున్న ఈయన తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తరచుగా తలనొప్పి రావడంతో వైద్య పరీక్షలు చేయించారు. తలలో కణితి ఏర్పడిందని, ప్రమాదస్థాయిలో ఉందని వైద్యులు వెల్లడించారు. ఇక తలనొప్పి తగ్గదని నిర్ధారించుకుని శుక్రవారం మధ్యాహ్నం 12 గంట ప్రాంతంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదే విషయాన్ని అరగంట ముందు హైద్రాబాద్‌లో ఉంటున్న తన అన్నయ్యకు సమాచారం అందించాడు. స్థానిక ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న పెద్ద కుమారుడికి భోజనం క్యారేజ్ తీసుకెళ్లిన భార్య తేజేశ్వరికి విషయం తెలిసి బోరుమని రోదించింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ మేరకు ఎస్ఐ కే వెంకటేష్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నన్ను ప్రేమించలేదు..అందుకే చంపేశాను
సాక్షి, సోంపేట(శ్రీకాకుళం) : ఒడిశా విద్యార్థిని తృప్తిమయి పండా హత్య కేసు నిందితుడు మూడేళ్ల తర్వాత సోంపేట పోలీసులకు నేరుగా లొంగిపోయాడు. 2016లో బేసిరామచంద్రాపురం పరిసరాల్లో సంచలనం సృష్టించిన విద్యార్థిని హత్య కేసు మిస్టరీ వీడింది. మూడేళ్లుగా నిందితుడి కోసం దేశంలో ప్రధాన పట్టణాలైన ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, గోవా, పూణే తదితర ప్రాంతాల్లో సోంపేట సర్కిల్ పోలీస్ స్టేషన్ అధికారులు గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ లభ్యం కాలేదు. ఎట్టకేలకు నిందితుడే నేరుగా సోంపేట పోలీసులకు లొంగిపోవడం గమనార్హం. పెను సంచలమైన కేసు.. సోంపేట సీఐ కె.శ్రీనివాసరావు మంగళవారం విలేకర్ల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. మండలంలోని బేసిరామచంద్రాపురం జాతీయ రహదారి పక్కన గుర్తు తెలియని యువతి (23) మృతదేహం 2016 ఆగస్టు 27వ తేదీన లభ్యం అయ్యింది. అప్పట్లో ఈ కేసు పెను సంచలనమైంది. ఒడిశాలోని ఛత్రపురం గ్రామానికి చెందిన బివేకానంద పండా, స్వర్ణమయు పండాల కుమార్తె తృప్తిమయి పండాగా తర్వాత గుర్తించారు. ఈ హత్య కేసు ఛేదించేందుకు పోలీసులు రంగంలోకి దిగి వివరాలు సేకరిస్తే పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. తృప్తిమయి పండా, తన డిగ్రీ క్లాస్మేట్ సిక్కల్ కుమార్ బెహరాలు సన్నితంగా మేలిగేవారు. ఒడిశాలోని ఛత్రపురంలో డిగ్రీ పూర్తి చేసుకున్న తృప్తిమయి పండా బరంపురం కల్లికట్ కళాశాలలో ఎం.సీ.ఏ ప్రథమ సంవత్సరంలో చేరింది. స్నేహితురాలు అనురాధతో కలిసి ప్రైవేట్ వసతిగృహంలో ఉండేది. అనుమానంతోనే హత్య.. సిక్కల్ కుమార్ బెహరాది ఫ్యాక్షన్ కుటుంబం కావటంతో సోదరుడు సుకుడా బెహరాను వ్యతిరేకవర్గం హత్య చేసింది. సిక్కల్ కుమార్ బెహరా వర్గంలోని కొందరు సభ్యులు అవతలి వర్గం వారిని మట్టుపెట్టారు. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి సక్కల్ కుమార్ బెహరా హైదరాబాద్ వెళ్లాడు. ఇంతలో తృప్తిమయి పండా బరంపురంలో ఓ కానిస్టేబుల్‌తో ప్రేమలో పడిందని సుకుమార్ అనుమానించాడు. తనను దూరం పెడుతుందని మానసిక క్షోభకు గురయ్యాడు. తృప్తిమయి పండా స్నేహితురాలు అనురాధకు ఫోన్ చేసి తాను హైదరాబాద్ నుంచి బరంపురం వస్తున్నానని, తృప్తిమయి పండాను కలవాలనుకుంటున్నానని తెలిపాడు. అనురాధ వీరిద్దరినీ 2016 ఆగస్టు 25న బరంపురంలో కలిపింది. తృప్తిమయి పండాకు మాయమాటలు చెప్పి ద్విచక్ర వాహనంపై బరంపురం నుంచి బారువ బీచ్‌కు తీసుకువచ్చాడు. ఆగస్టు 26వ తేదీ రాత్రి బారువ నుంచి బరంపురం తిరుగు ప్రయాణం సమయంలో బేసిరామచంద్రాపురం లేఅవుట్ వద్ద కాసేపు ఆగారు. ఇద్దరి మధ్యన తీవ్ర గొడవ జరిగింది. నిందితుడు తీసుకువచ్చిన కత్తితో తృప్తిమయి పండా గొంతుకోసి, పొట్టపై మూడుసార్లు పొడిచి హత్య చేశాడు. ఆ కత్తిని అక్కడే దాచి పెట్టాడు. అక్కడి నుంచి బరంపురం వెళ్లాడు.తనకు హైదరాబాద్‌లో పని ఉందని ఇంటి వద్ద చెప్పి వెళ్లిపోయాడు. పోలీసులు కేసును అప్పుడే ఛేదించినా నిందితుడు ఆచూకీ లభ్యం కాలేదు. నిందితుడే స్వయంగా పోలీసులకు లొంగిపోయి తాను చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. ఈ మేరకు నిందితుడ్ని అరెస్టు చేసి కోర్టుకు (రిమాండ్‌కు) తరలించినట్లు సీఐ తెలిపారు. బారువ ఎస్ఐ నారాయణస్వామి, పోలీసు సిబ్బంది సతీస్‌కుమార్, లోకనాథం, మథు, ప్రసాద్, చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు. -
ప్రాణం తీసిన బిందె
సాక్షి, సోంపేట(శ్రీకాకుళం) : తాగునీటి కోసం మహిళల మధ్య తలెత్తితున్న చిన్నపాటి ఘర్షణలతో ప్రాణాలు పోతున్న ఉదంతాలు ఎన్నో చోటు చేసుకుంటున్నాయి. తాజాగా పట్టణంలోని పల్లివీధిలో ఇద్దరు మహిళల మధ్య తలెత్తిన గొడవ ఓ మహిళా ప్రాణం తీసేందుకు కారణమైంది. రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఎస్ఐ కే వెంకటేశ్ వివరాల ప్రకారం... సోమవారం ఉదయం 6–30 గంటల సమయంలో ఉద్దానం రక్షిత పథకం నుంచి తాగునీరు సరఫరా అయ్యింది. రోజూ నీటి సరఫరా సమయంలో లైన్లో బిందెలు పెట్టుకోవడం వీధివారికి ఆనవాయితీ. ఈ సమయంలో తాతపూడి పద్మ(36), ఈమె తల్లి తెప్పల ఈశ్వరమ్మల కంటే వెనుక వచ్చిన అదేవీధికి చెందిన తెప్పల సుందరమ్మ బిందెలు పెట్టడంతో చిన్నపాటి ఘర్షణ ఏర్పడింది. ఆ తర్వాత సుందరమ్మ కుళాయి నుంచి తన ఇంటికి వెళ్లిపోయింది. వారిద్దరూ ఎన్నో మాటలు అంటున్నారని కుళాయి దగ్గర ఉన్న మరో మహిళ గున్నమ్మ సుందరమ్మకు చెప్పింది. వెంటనే సుందరమ్మ అక్కడకు వచ్చి గొడవ పడింది. ఖాళీ బిందెతో దాడి చేసి, పద్మను జుత్తు పట్టి లాగడంతో కింద పడి పోయింది. దీంతో ఎడమ చెంపపై బయటకు కనిపించని తీవ్ర గాయం కావడంతో పద్మ అక్కడికక్కడే మృతి చెందింది. ఊహించని పరిణామంతో ఒక్కసారిగా వీధివాసులంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. మృతురాలు పద్మ, సుందరమ్మ కుటుంబీకులు దగ్గర బంధువులు కావడంతో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతురాలికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. తల్లి మృతదేహం వద్ద కుమార్తె రోదిస్తున్న తీరు స్థానికులను కన్నీళ్లు తెప్పించింది. పద్మ భర్త ప్రసాద్ ఫిర్యాదు మేరకు సోంపేట ఎస్ఐ 304/2 కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పదిసార్లు గెలిచిన తండ్రీ కొడుకులు
సాక్షి, అమరావతి : సరద్దయిన సోంపేట నియోజకవర్గానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక్కడ తండ్రీ కొడుకు కలిసి పదిసార్లు గెలుపొందారు. సీనియర్ నాయకుడు గౌతు లచ్చన్న 1952 నుంచి వరుసగా నాలుగుసార్లు, 1978లో ఒకసారి విజయం సాధించగా, ఆయన కుమారుడు గౌతు శ్యామ సుందర శివాజీ 1985 నుంచి వరుసగా మరో ఐదుసార్లు గెలుపొందడంతో వీరిద్దరే దాదాపు 50 సంవత్సరాలు సోంపేట నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహించారు. మరో ప్రత్యేకత ఏమిటంటే గౌతు కుటుంబం కాకుండా మజ్జి కుటుంబం మాత్రమే రెండు సార్లు గెలిచింది. గెలిచిన లచ్చన్న, తులసీదాస్, శివాజీలు ముగ్గురు మంత్రి పదవులు నిర్వహించిన వారిలో ఉన్నారు. లచ్చన్న గతంలో ప్రకాశం పంతులు క్యాబినెట్లో ఉన్నారు. రాష్ట్రం ఏర్పాటు సమయంలో పెద్దమనుషుల ఒప్పందంపై సంతకం చేసిన ప్రముఖులలో ఈయన కూడా ఒకరు. -
దిగుబడి లేదు.. ధరా లేదు
సాక్షి, సోంపేట(శ్రీకాకుళం) : ఖరీఫ్ సీజన్లో వచ్చి తిత్లీ తుపానుతో నియోజకవర్గంలోని వరి పంట మొత్తం నాశనమైంది. రైతులకు ఖరీఫ్ వరి పంట పెట్టుబడి కూడా మిగల్లేదు. రబీ సీజన్లో అపరాల పంటలపై ఆశలు పెట్టుకున్నారు. నియోజకవర్గంలో ఈ ఏడాది అపరాల విస్తీర్ణం పెరిగినప్పటకీ వరుణుడు కరుణించకపోవడం, చీడపీడలు అధికం అవ్వడంతో ఆశించిన స్థాయిలో దిగుబడులు రాలేదు. గత సంవత్సరంతో పోల్చుకుంటే ధర కూడా తక్కువగా ఉండడంతో రైతులు నిరాశ చెందుతున్నారు. రైతులకు అందని మద్దతు ధర కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న మద్దతు ధర మాత్రం అపరాల పంట పండించే రైతులకు అందడంలేదు. నియోజకవర్గంలో సుమారు 8 వేల ఎకరాల్లో రబీ సీజన్లో అపరాల పంటను సాగు చేశారు. వ్యవసాయ శాఖ ద్వారా రాయితీపై సరఫరా చేసిన విత్తనాలను కొనుగోలు చేసి పండించారు. పంట చేతికందక ముందు ధరలు విపరీతంగా పెంచి, పంట చేతికందే సమయానికి గిట్టు బాటు ధర లేకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. ఈ సంవత్సరం విత్తనాలు వేసిన నాటి నుంచి వర్షాలు లేవు. వాతావరణం అనుకూలించక పోవడంతో పంటకు చీడపీడలు ఆశించి దిగుబడులు కూడా రాలేదు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రకటనలకే పరిమితమవుతోంది. మద్దతు ధరకు బయట మార్కెట్ ధరలకు పొంతన ఉండడం లేదు. కేంద్ర ప్రభుత్వం అందించిన మద్దతు ధర రైతులకు అందజేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని రైతులు అంటున్నారు. బయట మార్కెట్లో 100 కిలోల పెసల ధర రూ.5 వేలు, మినుములు బస్తా రూ.3200లకు కొనుగోలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పెసలు వంద కిలోలకు రూ.7 వేలు, మినుములు వంద కిలోలకు రూ.5,600 మద్దతు ధర ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం రైతుల వద్ద నుంచి పెసలు, మినుములు కొనుగోలు చేయడంలేదు. అపరాల పంటను ఎండ వేస్తున్న రైతు పెరిగిన పెట్టుబడి.. అపరాల పంట ఎకరాకు కనీసం 4 నుంచి 5 వందల కిలోల దిగుబడులు వస్తుండేవి. ఈ సంవత్సరం అందులో సగం కూడా రాని పరిస్థితి. పంటకు అనుకూలించక పోవడంతో రెండు నుంచి మూడు సార్లు పురుగు మందులు పిచికారీ చేయాల్సి వచ్చింది. విత్తనాల పెట్టుబడి, పంట తీయడానికి, నూర్పుడిలు చేయడానికి ఎకరానికి సుమారు రూ.8 వేలవరకు ఖర్చు అవుతుందని రైతులు అంటున్నారు. కనీస దిగుబడులు కూడా రాకపోవడంతో మినుము, పెసర పంటను తీయకుండా ఆవులకు మేతగా చాలా చోట్ల విడిచిపెడుతున్నారు.ప్రభుత్వం స్పందించి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దిగుబడి పూర్తిగా తగ్గింది ఖరీఫ్ సీజన్లో వరి పంట పూర్తిగా నష్టపోయాం. అపరాల పంటపై ఆశలు పెట్టుకున్నాం. పంట దిగుబడి తగ్గడంతో కూలీలు ఖర్చు కూడా గిట్టు బాటయ్యే పరిస్థితి కనిపించడం లేదు. – ఎం.సోమేశ్వరరరావు, రైతు, లక్కవరం -
వైఎస్సార్సీపీ నేత సాయిరాజ్‌పై కేసు
సాక్షి, సోంపేట: తిత్లీ తుపాన్ బాధితులను ఆదుకునే విషయంలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ శరీరంపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పిరియా సాయిరాజ్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సోంపేట ఎస్సై సిహెచ్ దుర్గాప్రసాద్ బుధవారం తెలిపారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లా సోంపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి, ఆత్మాహత్యాయత్నం చేసుకున్నందుకు గాను సాయిరాజ్‌పై 309, 341, 353 సెక్షన్ల కింద నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు. సాయిరాజ్ శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడిన నేతపై కేసులు పెట్టడం దారుణమని తుపాన్ బాధితులు మండిపడుతున్నారు. సాయిరాజ్‌పై కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. -
సోంపేట ఎమ్మార్వో కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత
సాక్షి, శ్రీకాకుళం : జిల్లాలోని సోంపేట ఎమ్మార్వో కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. తుపాను బాధితుల పట్ల అధికారులు నిర్లక్ష్య ధోరణిని నిరసిస్తూ వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తమకు తాగునీరు, ఆహారం, పునరావాసం కల్పించాలంటూ తుపాను బాధితులు ఆందోళనకు దిగారు. బాధితుల ఆందోళనకు వైఎస్సార్సీపీ మద్దతు తెలిపింది. తుపాను బాధితుల సమస్యలు తక్షణమే తీర్చాలని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు. అధికారులు తీరుని నిరసిస్తూ వైఎస్సార్సీపీ నేత సాయిరాజ్ ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోవడానికి యత్నించారు. పోలీసులు అతన్ని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలకు, పోలీసులకి మధ్య వాగ్వాదం జరిగింది. పార్టీ కార్యకర్తలు, తుపాను బాధితులు అధికారుల తీరును నిరసిస్తూ ఆందోళన చేయడంతో ఎమ్మార్వో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. -
ధరదడలాడించారు!
సోంపేట : సోంపేట మండలం బెంకిలి, జింకిభద్ర రైతులు నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఇన్నాళ్లూ ఇతరులు ధర నిర్ణయిస్తే పంట కోసి అప్పగించేవారు. కానీ గిట్టుబాటు ధర కోసం భీష్మించుకుని కూర్చుని దళారులనే తమ వద్దకు రప్పించుకున్నారు వీరు. ధర కోసం పంటను సైతం త్యాగం చేయడానికి సిద్ధపడి సాటి రైతుల్లో స్ఫూర్తి నింపారు. గిట్టుబాటు ధర అందజేస్తే గానీ పంట కోసేది లేదని, గ్రామానికి టమాటా కో సం ఎవరు వచ్చినా విక్రయించే ప్రసక్తే లేదని ఆదివారం భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో దళారులే ధర పెంచి రైతులను బుజ్జగించారు. అయినా రైతులు వెనక్కి తగ్గలేదు. సోంపేట మండలంలోని బెంకిలి, జింకిభద్ర గ్రామాల రైతులు ఖరీఫ్, రబీ సీజన్లలో కాయగూరలు సాగు చేసి జీవనాధారం పొందుతుంటారు. అయి తే ఈ సంవత్సరం రబీ సీజన్లో వేసిన టమాటా పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో పంట పొల్లాలో పాడైనా ఫర్వాలేదు గానీ గిట్టుబాటు ధర రాకపోతే విక్రయించేది లేదని రైతులంతా ఏకగ్రీవంగా తీర్మానించారు. చివరి వరకూ అలాగే ఉండి తమ పంతం నెగ్గించుకున్నారు. పెరిగిన సాగు విస్తీర్ణం బెంకిలి, జింకిభద్ర గ్రామాల్లో గత నాలుగేళ్ల రబీ సీజన్లో సుమారు 4 వందల ఎకరాల్లో టమాటా పంటను సాగుచేసేవారు. అయితే ఈ ఏడాది పరిసర గ్రామాలైన పలాసపురం, లక్కవరం, బారువ, కంచిలి మండలంలోని కుత్తమ, మండపల్లి గ్రామాల్లో కూడా టమాటా సాగు చేశారు. సోంపేట, కంచిలి మండలాల పరిధిలో సుమారు 8 వందల ఎకరాల్లో టమాటా పంట రబీ సీజన్లో సాగు చేశారు. గిట్టుబాటు కాని ధర కౌలుతో కలుపుకుని ఎకరాకు సుమారు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు పెట్టుబడులు పెట్టారు. పంట దిగుబడులు వచ్చే సరికి మార్కెట్లో ధర లేకుండా పోయింది. దళారులంతా కుమ్మక్కై టమాటా కిలో రూ.2 రూ.3కు కొనుగోలు చేస్తున్నారు. దీంతో కూలీ ఖర్చు కూడా రాని పరిస్థితి ఎదురైంది. 30 కిలోల ట్రే రూ.70కు విక్రయించాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో థర్మల్ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని రైతులంతా ఏకమయ్యారు. గిట్టుబాటు ధర వస్తే గానీ పంట కోయబోమని దళారులకు తేల్చి చెప్పారు. దీంతో 30 కిలోల ట్రేను రూ.70కు కొంటామని వచ్చిన వారు రూ.130 ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఒక్కసారిగా ధర రెట్టింపు చేయడం చూసి రైతులు కూడా ఆశ్చర్యపోయారు. అయినా ఇంకా ధర పెంచితే గానీ పంట కోసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. నిన్నటి వర కు మార్కెట్లో లేని ధర ఇప్పుడు ఎలా వచ్చిందని దళారులను ప్రశ్నించారు. బయట మార్కెట్లో ధర పెరిగినా రైతులకు ఆ ధర ఇవ్వకుండా మోసం చేస్తున్నారని గ్రామానికి చెందిన రైతులు ఎం.బుద్దేశ్వరరావు, ఎం.లోకనాథం, కె.భీమయ్య, పి.సురేష్, టి. బాబూరావు, కె.రామారావు, పి.దుర్యోధన తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు రైతుకు మద్దతు ఇస్తే ఇలాంటి సమస్యలు రావని వారు పేర్కొన్నారు. దళారులు ధర పెంచక పోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని, దళారులు దిగి రావడంతో పంట పెరిగే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. కోల్డ్ స్టోరేజీలు నిర్మించాలి ప్రభుత్వాలు కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేస్తే పంట దాచుకునే వీలుంటుంది. కోల్డ్ స్టోరేజీలు లేకపోవడంతో పంట నిల్వ ఉండే అవకాశం లేకపోయింది. దీంతో దళారులు చెప్పిన ధరకే పంట ఇవ్వాల్సి వచ్చేది. – మడ్డు బుద్దేశ్వరరావు బెంకిలి, రైతు గిట్టుబాటు ధర రావడం లేదు టమాటాను కష్టపడి సాగు చేస్తుంటే గిట్టుబాటు ధర రావడం లేదు. మార్కెట్లో ధర ఉన్నా రైతులకు మాత్రం దళారులు గిట్టుబాటు ధర ఇవ్వ డం లేదు. దీంతో పంట పాడైనా ఫర్వాలేదు గానీ కోయకూడదని తీర్మానించాం. – కె.భీమయ్య, బెంకిలి టమాటా రైతు -
రైల్వే స్థలాల్లో ఆక్రమణల తొలగింపు
కంచిలి : మండల కేంద్రంలోని సోంపేట రైల్వేస్టేషన్ స్థలంలో ఉన్న ఆక్రమణలను రైల్వే అధికారులు శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తొలగింపు చర్యలు చేపట్టారు. వాస్తవానికి రైల్వేస్టేషన్‌కు రెండు వైపులా గోడకు ఆనించి, స్టేషన్ సమీపంలోనూ చాలా మంది పేదలు ఇళ్లు నిర్మించుకొని జీవిస్తున్నారు. ఇటీవల కొందరు పక్కా నిర్మాణాలు చేపట్టారు. ఈ విషయం రైల్వే అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో అధికారులు శనివారం ఆకస్మికంగా తొలగింపు చర్యలు చేపట్టారు. ముందస్తు నోటీసులు గానీ, సమాచారం గానీ ఇవ్వకుండా పూర్తి ఫోర్స్‌తో పకడ్బందీగా వచ్చి అక్రమ కట్టడాలను తొలగించేందుకు సిద్ధమయ్యారు. మొత్తంగా ఎనిమిది ఆక్రమణలను ఈ దశలో తొలగించారు. మిగతా వాటిని దశలవారీగా తొలగిస్తామని అధికారులు తెలిపారు. ఈ ఆక్రమణల్లో కొందరు కోర్టు నుంచి స్టే తెచ్చుకోవడంతో అటువంటి నిర్మాణాల జోలికి, పాత నిర్మాణాల జోలికి వెళ్లలేదు. చిన్న బడ్డీలను కూడా వదిలేశారు. త్వరలో వీటిపైనా చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ స్థలంలో ఎవరూ పక్కా నిర్మాణాలు చేపట్టవద్దని సంబంధిత వర్గాలు ఎప్పటి నుంచో సూచిస్తున్నాయి. తాజాగా ఈ చర్యతో స్థానికంగా ఆందోళన వ్యక్తమైంది. రైల్వే స్థలాల్లో చాలా మంది చిన్నపాటి వ్యాపారాలు చేసుకొని పొట్టనింపుకొంటున్నారు. మరికొందరు సొంత స్థలాలు లేక ఎప్పటి నుంచో షెడ్లు వేసుకొని నివసిస్తున్నారు. ప్రస్తుత పరిణామంతో ఆయా వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఆక్రమణల తొలగింపును రైల్వే ఎస్ఎస్ఈ వి.కిశోర్‌కుమార్, ఆర్పీఎఫ్ సీఐ దిలీప్‌కుమార్‌ల నేతృత్వంలో చేపట్టారు. జేఈలు శివపాత్రో, పాపారావు, ఏఎస్ఐ బి.రావు, ఆర్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఏమయిందో ఏమో ..
సోంపేట: శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం గుండా వెళ్లే జాతీయ రహదారిపై గల బేసిరామచంద్రాపురం గ్రామ సమీపంలో గుర్తుతెలియని యువతి మృతదేహం లభించిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఆ మృతదేహం ఒడిశాలోని చత్రపురం గ్రామానికి చెందిన తృప్తిమయి పండా(23)గా గుర్తించారు. రెండు బృందాలుగా ఏర్పడిన దర్యాప్తు అధికారులు.. ఈనెల 26న యువతి అదృశ్యమైనట్లు బివేకానంద పండా, స్వర్ణమయు దంపతులు బరంపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుచేసినట్లు గుర్తించారు. ఆ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లిన పోలీసులు.. సోంపేటలో మరణించిన యువతి ఫొటోలను చూపించగా అది తమ కూతురిదేమోననే అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు వారిని సోంపేట పట్టణాని తీసుకొచ్చారు. మృత దేహాన్ని పరిశీలించి.. తమ కుమార్తెనే అని నిర్థారణ చేశారు. మృతురాలు ఎంసీఏ విద్యార్థిని ఒడిశాలోని చత్రపురం పోలీస్ క్వార్టర్స్ లో నివసించే కుటుంబంలో కలిసి నివసించే తృప్తిమయి పది రోజుల కిందటే బరంపురంలోని కళ్లికోట్ కళాశాలలో ఎంసీకే ఫస్ట్ ఇయర్ లో చేరింది. అక్కడే ఓ ప్రైవేటు హాస్టల్ లో ఉంటూ కాలేజీకి వెళుతోంది. అయితే ఈ నెల 25న గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి ఆమెను బయటికి తీసుకెళ్లారు. అప్పటి నుంచి కనిపించకుండాపోయిన తృప్తి అనూహ్యంగా శ్రీకాకుళం జిల్లాలో శవమై కనిపించింది. తృప్తి కనిపించడంలేదంటూ ఆమె తల్లిదండ్రులు ఈ నెల 26న బరంపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుచేశారు. తృప్తి తండ్రి బికేకానంద పండా చత్రపురం పోలీస్ క్వార్టర్స్ లో మెడికల్ షాపు నిర్వహిస్తున్నారు. ఎలా జరిగిందో..! ఈ హత్యోదంతంపై సోంపేట సీఐ సూరియాయుడు మాట్లాడుతూ.. ఈ నెల 27న బేసిరామచంద్రాపురం వద్ద యువతి మృతదేహాన్ని గుర్తించామని, ఆమె ఎవరో, ఎందుకు హత్యకు గురైందో తెలుసుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏర్పాటుచేశామని, చివరికి ఆమె పేరు, తల్లిదండ్రుల వివరాలు గుర్తించామని, నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. కేసు దర్యాప్తును వేగవంతంగా నిర్వహిస్తున్న సోంపేట, కంచిలి, బారువ ఎస్ఐలకు, పోలీసు సిబ్బందికి సీఐ అభినందనలు తెలిపారు. సోమవారం సోంపేట ఆసుపత్రి వద్దకు చేరుకున్న తృప్తి తల్లిదండ్రులు కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తమకు ఎవరితో ఎలాంటి తగాదాలు లేవని, ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావటం లేదని వారు చెప్పారు. -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు
సోంపేట : హరిపురం నుంచి సోంపేట వస్తున్న టాటా మేజిక్ వాహనం తాళభద్ర పంచాయతీ రాణిగాం జంక్షన్ పాత జాతీయ రహదారిపై మంగళవారం బోల్తా పడింది. దీంతో డ్రైవర్ తిరుపతి రెడ్డిబాలాజితో పాటు ఇద్దరు ప్రయూణికులు తీవ్రంగా గాయపడ్డారు. బారువ పోలీసులు తెలిపిన వివరాలు... హరిపురం నుంచి ప్రయాణికులతో సోంపేట వస్తున్న టాటా మేజిక్ వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో డ్రైవర్ బాలాజీకి తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్‌ను విశాఖపట్టణం ఆసుపత్రికి తరలించారు. అందులో ప్రయూణిస్తున్న మందస మండలం చిన్నకేశపురం గ్రామానికి చెందిన వరాలమ్మ (54),సవరబాణాపురం గ్రామానికి చెందిన శాంతమ్మ(43)లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని పలాస ఆసుపత్రికి తరలించారు. బారువ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యుత్ సమస్యపై టీడీపీ ఎమ్మెల్యేల ఆందోళన
నిరంతర విద్యుత్ అని చెప్పుకోవడం ఆత్మవంచనే: గౌతు శివాజీ విద్యుత్ కోతలపై సబ్‌స్టేషన్ వద్ద ధర్నా సోంపేట: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అంతరా యం లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నామని చె ప్పుకోవడం ఆత్మవంచన చేసుకోవడమేనని ప లాస ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ అన్నా రు. ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల్లో విద్యు త్ సరఫరాలో సమస్య పరిష్కరిచాలంటూ ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌తో కలిసి బుధవారం సోంపేట సబ్‌స్టేషన్ వద్ద ధర్నా చేశారు. సోంపేట మండలంలో మే నెల 15 నుంచి జూన్ 3 వరకు 20 రోజుల్లో ఎన్ని గంటలు విద్యుత్ సరఫరా ఆపారో తెలపాలని ఎమ్మెల్యే శివాజీ సబ్‌స్టేషన్ ఏడీఈ అప్పారావుకు 20 రోజుల కిందట దరఖాస్తు చేసుకున్నా ఇప్పటికీ సమాధానం రాలేదు. దీంతో ఇద్దరు ఎమ్మెల్యేలు ధర్నాకు దిగారు. బారువలోని ఓ కార్యక్రమానికి వచ్చిన వీరు ఆందోళన కు దిగడంతో సిబ్బంది కాస్త టెన్షన్ పడ్డారు. ఏఈ లక్ష్మణరావు, ఏడీఈ అప్పారావులను సమస్యలపై ప్రశ్నలు అడగ్గా... సమాధానాలు సరిగ్గా రాలేదు. ఈ ధర్నాపై కలెక్టర్ లక్ష్మీనృసింహం, జిల్లా ట్రాన్స్ కో ఎస్ఈ శరత్, జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, సీఎం పేషీ అధికారులకు శివాజీ సమాచారం అందించారు. అలాగే 11 గంటల సమయంలో బరంపురం గ్రిడ్ మేనేజర్ అనిల్ కుమార్‌కు ఫోన్ చేసి విద్యుత్ అంతరాయానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. త ర్వాత సీఎం పేషీ అధికారి రాజ్‌గోపాల్‌తోనూ మాట్లాడారు. విశాఖ ట్రాన్స్‌కో సీఎండీ ముత్యాలరాజుతో కూడా ఫోన్లో ఇద్దరు ఎమ్మెల్యేలు మాట్లాడారు. నిరంతర విద్యుత్ లేదు... గ్రామాల్లోకి వెళ్లి నిరంతర విద్యుత్ అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందని ఎమ్మెల్యేలు అన్నారు. కలెక్టర్ ట్రాన్స్‌కో ఎస్ఈని వెనకేసుకు వస్తున్నారని ఆ రోపించారు. చివరకు టెక్కలి డీఈ జీఎన్ ప్రసాద్ వచ్చి అంతరాయానికి క్షమాపణలు చెప్పినా ఆం దోళన విరమించలేదు. ఆఖరకు ట్రాన్స్‌కో సీఎండీ విజయేందర్ హైదరాబాద్ నుంచి శివాజీతో ఫో న్లో మాట్లాడారు. సీఎండీ రాజు సమక్షంలో స మావేశం నిర్వహించి సమస్య పరిష్కరిస్తానని చె ప్పడంతో ఆందోళన విరమించారు. గ్రామాల్లో నిరంతర విద్యుత్ అందడం లేదని సీఎంకు చెప్పడానికే ఈ ఆందోళన చేసినట్లు శివాజీ తెలిపారు. ధర్నా చేస్తున్నామని కలెక్టర్, మంత్రికి చెప్పినా స్పందించకపోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చే శారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలతో పాటు స్థానిక నాయకులు జెడ్పీటీసీ సూరాడ చంద్రమోహన్, మద్దిలి నాగేశ్వరరావు, గోపీ, తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో శివాజీ ఇచ్ఛాపురం ఎ మ్మెల్యే అశోక్‌తో మాట్లాడుతూ ‘ధర్నాతో నాకు ఎలాంటి సంబంధం లేదని సీఎంతో అనవద్దు’ అంటూ చలోక్తి విసిరారు. అనంతరం ఎస్ఈ జీఎ న్ ప్రసాద్ సోంపేట చేరుకుని విద్యుత్ శాఖాధికారులతో సమావేశం నిర్వహించారు. అధికారుల్లో సమన్వయం లేకపోవడంతో ఇలా జరుగుతందన్నారు. అధికారులు సమన్వయం చేసుకుని విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని అధికారులను కోరారు. -
ఆర్మీ హవల్దార్ బలవన్మరణం
సోంపేట (శ్రీకాకుళం జిల్లా) : శ్రీకాకుళం జిల్లా సోంపేట రైల్వే స్టేషన్లో గూడ్సు రైలు కింద పడి ఆర్మీ హవల్దార్ ఆత్మహత్య చేసుకున్నాడు. సోంపేటకు చెందిన తామాడ కోటేశ్వరరావు ఆర్మీలో హవల్దార్‌గా పనిచేస్తున్నాడు. సెలవుపై ఇంటికి వచ్చిన ఆయన ఆదివారం ఉదయం గూడ్సు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు దారితీసిన కారణాలు తెలియరాలేదు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఊపిరి తీసిన విషవాయువు
సోంపేట:మాయదారి విషవాయువు రెండు ప్రాణాలను బలితీసుకుంది. కూటికోసం పనులు చేసుకునే ఇద్దరు కార్మికుల్ని పొట్టన పెట్టుకుంది. ఆ రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. సోంపేట పట్టణం మొత్తం నిర్ఘాంతపోయిన ఈ సంఘటన మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. రోజువారీ కూలీకి తాపీ మేస్త్రీలుగా పనిచేస్తూ, చక్కని నైపుణ్యంతో రాణిస్తున్న ఇద్దరు యువకులు పొందర సురేష్(21), తోటి మేస్త్రి గొరగ షణ్ముఖరావు(30)లు ఎప్పటిలాగే మంగళవారం తమ తోటిపనివారితో పట్టణంలోని చిన్నజాలారి వీధిలో జి.హేమరాజు ఇంట్లో పనికి వెళ్లారు. అక్కడ నిర్మిస్తున్న సెప్టిక్ ట్యాంకు సెంటరింగ్ను తీయటానికి ఇరుకైన రంధ్రంలోంచి మొదట గొరగ షణ్ముఖరావు దిగాడు. కొంతసేపటికి ఊపిరాడక రక్షించమని కేకలు వేయటంతో... ఏమైందోనని పొందర సురేష్‌కూడా లోనికి దిగాడు. అతనికీ అదే పరిస్థితి ఎదురవ్వటంతో ఇద్దరూ లోపలి నుంచి రక్షించండంటూ పెద్దగా కేకలు వేశారు. అక్కడ ఉన్న స్థానికులు, పై అంతస్థులో పనిచేస్తున్న తోటి పనివారికి సమాచారం అందజేయటంతో అంతాకలిసి సెప్టిక్ ట్యాంకులో ఇరుక్కొని అపస్మారక స్థితిలో ఉన్న సురేష్, షణ్ముఖరావులను బయటికి తీసి హుటాహుటిన స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఇద్దరూ మృతిచెందారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న కంచిలి ఎస్ఐ కె.వెంకటసురే ష్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మరణంలోనూ వీడని స్నేహ బంధం సెప్టిక్ ట్యాంకులో ఊపిరాడక మృతిచెందిన భవన నిర్మాణ కార్మికులు సురేష్, షణ్ముఖరావులు మంచి స్నేహితులు. చివరికి మృత్యువొడికి కూడా కలిసే చేరుకున్నారు. వీరు మంగళవారం పనికి ఉపక్రమించిన సెప్టిక్ ట్యాంక్ రంధ్రం చాలా చిన్నదిగా ఉండటం, అందులో దిగిన నీటికి సూర్యరశ్మి తగలకపోవడంతో అదికాస్తా మురిగిపోయి విషవాయువు విడిచిపెట్టినట్టుంది. అది తెలియక అందులో దిగి పనికి ఉపక్రమించారు. అదే వారిపాలిట మృత్యువుగా మారిందని స్థానికులు అనుమానిస్తున్నారు. మృతుల్లో గొరక షణ్ముఖరావు పలాసపురం గ్రామంలో చేనేత కార్మిక కుటుంబానికి చెందిన వ్యక్తి. చేనేత కార్మికులకు వారి వృత్తిపరంగా సరైన ఉపాధిలేకపోవటంతో అలవాటులేని తాపీమేస్త్రి పనికి పొట్టకూటికోసం వచ్చి ఇలా అర్ధంతరంగా మృతిచెందటంతో అతడి కుటుంబం ఆసరా కోల్పోయింది. ఇతనికి భార్య వెంకటలక్ష్మి, ఇద్దరు కుమారులు అవినాష్, ఆకాష్‌లు, తండ్రి గవరయ్య, తల్లి పార్వతి ఉన్నారు. వీరందరికీ షణ్ముఖరావే ఆధారం. ఇతడి మృతితో ఆ కుటుంబమంతా వీధిన పడింది. ఇక మరో మృతుడు సోంపేట పట్టణం సీతారాంపేటకు చెందిన పొందర సురేష్ అవివాహితుడు. ఇతనికి తల్లి పార్వతి, ఒక సోదరుడు ఉన్నారు. అందివచ్చిన కుమారుడు తిరిగిరాని అనంతలోకాలు వెళ్ళిపోవటంతో ఆ తల్లి హృదయవేదన చూసే వార్ని కలచివేసింది. మృతిచెందిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని తోటి కార్మికులు, కుటుంబసభ్యులు కోరుతున్నారు. -
సెప్టిక్ ట్యాంకులో దిగి ఊపిరాడక ఇద్దరు మృతి
శ్రీకాకుళం (సోంపేట) : శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం జాలారు వీధిలో ఉన్న ఓ సెప్టిక్ ట్యాంక్‌లో సెంట్రింగ్ పని చేస్తుండగా ప్రమాదవశాత్తూ దాంట్లో పడి ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో వరకల షణ్ముఖరావు(30), బందరు సురేష్(27) అనే ఇద్దరు యువకులు మరణించారు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీయిస్తున్నారు. -
‘థర్మల్’ అనుమతులు రద్దు ఎప్పుడు?
సోంపేట : బారువ ప్రాంతంలో థర్మల్ పవర్ ప్లాంట్ అనుమతులు రద్దు జీవో ఇంకెప్పుడు ఇస్తారంటూ మండలంలోని రుషికుడ్డ గ్రామానికి చెందిన గండు తులసి నారాయణ, కామేశ్వరరావు, లక్ష్మీనారాయణ తదితరులు ఎమ్మెల్యే బి.అశోక్‌బాబును నిలదీశారు. గ్రామంలో గురువారం నిర్వహించిన రైతు సాధికార సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యేను ఈ మేరకు ప్రశ్నించారు. దీంతో ఆయన మాట్లాడుతూ జీవోను ప్రభుత్వం తొందర్లోనే విడుదల చేస్తుందన్నారు. దీనికోసం మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు, పలాస ఎమ్మెల్యే శ్యామ సుందర శివాజీ కృషి చేస్తున్నారని అన్నారు. ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. టీడీపీ చెప్పిన మాట ప్రకారం రుణమాఫీ చేసిందన్నారు. మత్స్యకారులకు తుపాను పరిహారం, రైతులకు రుణమాఫీ పత్రాలు అందించారు. తమ పింఛన్లు అన్యాయంగా తొలగించారంటూ పలువురు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. అలాగే మండలంలోని ఇస్కలపాలెం, గొల్లగండి, సోంపేట, సిరిమామిడి గ్రామ పంచాయితీల్లో రైతు సాధికార సదస్సులు నిర్వహించారు. ఎంపీపీ చిత్రాడ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ సభ్యుడు చంద్రమోహన్, మండల ప్రత్యేకాధికారి కరుణాకరరావు, వ్యవసాయ శాఖ ఏడీ వెంకటేశ్వరులు, తహశీల్దార్ గోపాలరత్నం, ఎంపీడీవో పట్నాయక్ పాల్గొన్నారు. -
సోంపేటకు.. మళ్లీ షాకు!
‘పచ్చ’ ప్రభుత్వం పవర్ దగారక్తమోడిన చోటే మళ్లీ థర్మల్ విద్యుత్ కేంద్రంరగులుతున్న శ్రీకాకుళం.. ఉద్యమ బాట పడుతున్న జనం సాక్షి, హైదరాబాద్: కలత నిద్రలో ఉన్న సోంపేటను చావు దెబ్బ తీసేందుకు సర్కారు సిద్ధమైంది. రక్తపు మరకలు మాయకముందే మరో రణాన్ని పురికొల్పే తెరచాటు వ్యూహాన్ని రచించింది. వారం పది రోజుల్లోనే గతంలో ప్రతిపాదించిన థర్మల్ ప్రాజెక్టు జీవోను రద్దు చేస్తామని చెప్పిన ప్రభుత్వం, జపాన్‌లో గుట్టుచప్పుడు కాకుండా అంతకంటే భారీ ప్రాజెక్టు కోసం ఒప్పందం కుదుర్చుకుంది. గతంలో 2,500 మెగావాట్ల ప్రాజెక్టు ప్రతిపాదనకే అక్కడ రక్తపాతం చోటు చేసుకుంది. తాజాగా చంద్రబాబు సర్కారు 4 వేల మెగావాట్ల ప్రాజెక్టు స్థాపనకు రహస్యంగా ఒప్పందాలు చేసుకుంది. జపా న్ పర్యటనలో ఉన్న సీఎం సోంపేట మండలం బారువాలో అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. జైకా, నెడో, జపాన్ ఆర్థిక సహకార బ్యాంకులు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఈ మేరకు అక్కడి సంస్థ ‘సుమితొమొ’తో ఒప్పందం జరిగిందన్న వార్తతో శ్రీకాకుళం జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పేరు, ఊరు మార్చి చంద్రబాబు జనాన్ని బురిడీ కొట్టిస్తున్నారని అక్కడి ప్రజలు మండిపడుతున్నారు. యుద్ధానికి సిద్ధమంటూ ప్రకటించారు. నమ్మక ద్రోహం శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బీలా గ్రామంలో 2008లో 2,500 మెగావాట్ల బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాన్ని ప్రతిపాదించారు. నాగార్జున కన్స్ట్రక్షన్ లిమిటెడ్ ముందుకు రావడంతో అప్పట్లో ప్రభుత్వం 973 ఎకరాలను సోంపేట బీలా ప్రాంతంలో కేటాయించింది. మరో 1500 ఎకరాలను రైతుల నుంచి సేకరించుకునేందుకు అనుమతిస్తూ 1107 జీవోను విడుదల చేసింది. దీన్ని గ్రామస్తులు వ్యతిరేకించారు. ఇదే అదనుగా ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆందోళనలు చేసింది. 2010లో సోంపేటలో జరిగిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. పోలీసు కాల్పుల్లో ముగ్గురు చనిపోయారు. దీంతో నాగార్జున సంస్థ వెనక్కు తగ్గింది. దీన్ని టీడీపీ రాజకీయంగా తనకు అనుకూలంగా మలుచుకుంది. కాల్పుల సందర్భంగా ఆ ప్రాంతానికొచ్చిన చంద్రబాబు 1107 జీవోను రద్దు చేసే వరకూ పోరాడాలని స్థానికులను పురమాయించారు. ఎన్నికల సందర్భంగా అధికారంలోకి వస్తే జీవో రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా సర్కారు ఇదే మాట చెప్పింది. ఇప్పుడు అదే ప్రాంతంలో అంతకన్నా మరింత ఎక్కువ సామర్థ్యం గల విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. సుమితొమొకే సర్వాధికారాలు.. ప్రభుత్వం తాజాగా చేసుకున్న ఒప్పందం ప్రకారం.. సూపర్ క్రిటికల్ థర్మల్ ప్రాజెక్టు ఆర్థిక పెట్టుబడి మొత్తాన్ని జపాన్ సంస్థలే భరిస్తాయి. అంటే ఆ దేశానికి చెందిన సుమితొమొ సంస్థకే ప్రాజెక్టు నిర్వహణను అప్పగిస్తారు. ఆ స్థలం కాదు: ఏపీ జెన్కో సీఎండీ సుమితొమొ ఏర్పాటు చేసే థర్మల్ కేంద్రం కోసం మందస-బారువా మధ్య జాతీయ రహదారికి సమీపంలో స్థలాన్ని ఎంపిక చేశామని ఏపీ జెన్కో సీఎండీ విజయానంద్ తెలిపారు. సోంపేటకు దీనికి సంబంధం లేదన్నారు. దారుణం: మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ థర్మల్ విద్యుత్ కేంద్ర ప్రతిపాదననే రద్దు చేస్తామన్న ప్రభుత్వం అంతకన్నా ఎక్కువ సామర్థ్యం కలిగిన ప్రాజెక్టు కోసం ఒప్పందాలు చేసుకోవడం దారుణం. ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తాం. ప్రాణాలకు తెగించి పోరాతాం. -
త్వరలోనే థర్మల్ అనుమతుల రద్దు జీవో
సోంపేట : మండలంలోని బీల ప్రాంతం లో నిర్మించదల పెట్టిన థర్మల్ విద్యుత్ కర్మాగారం అనుమతుల రద్దు జీవోను ప్రభుత్వం త్వరలోనే విడుదల చేస్తుందని శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, నియోజకవర్గ ఎమ్మెల్యే బి.అశోక్ తెలిపారు. ఆదివారం వారు స్థానిక విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గంలోని ప్రజలకే ప్రధాన సమస్యగా మారిన థర్మల్ విద్యుత్ కేంద్రం అనుమతులు రద్దు జీవోపై ఇప్పటికే జిల్లాకు చెందిన ప్రజాప్రతినిథులతో సీఎం చంద్రబాబు నాయుడిని కలిసి చర్చించినట్టు చెప్పారు. త్వరలోనే జీవో విడుదల చేస్తామని ఆయన స్పష్టం చేసినట్టు తెలిపారు. అలాగే కంచిలి, ఇచ్చాపురం మండలాల్లోని సాగునీటి వనరుల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. వలస కార్మికుల ఉపాధికి కొబ్బరి ఆధారిత తదితర పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారు. ఉపాధి పథకంలో కొబ్బరి తోటల అభివృద్ధికి కొబ్బరి మొక్కలు ఇవ్వడంతో పాటు కొంత ఆర్థిక సాయం చేయడానికి చూస్తున్నట్టు చెప్పారు. సోంపేట ప్రధాన రహదారి విస్తరణ చేపడతామన్నారు. పైలీన్ నష్ట పరిహారం వివరాలను అప్పటి ప్రభుత్వం సక్రమంగా సేకరించకపోవడంతో రైతులకు పరిహారం అందించడంలో ఇబ్బందులు ఉన్నాయన్నారు. అలాగే అర్హులైన వారందరికీ పింఛన్లు అందుతాయన్నారు. ఎంపీపీ చిత్రాడ శ్రీనివాసరావు, టీడీపీ వాణిజ్య విభాగం కార్యదర్శి జి.కె.నాయుడు, నాయకులు పొందల కృష్ణారావు, బి.బాబూరావు, ఆర్.వెంకటరావు, పి.రాజు తదితరులు పాల్గొన్నారు. -
సోంపేట.. షేక్
సోంపేట:దాదాపు దశాబ్దం క్రితం.. ఆనంద్ జ్యూయలర్స్ యజమాని కుటుంబం హత్య, భారీ దోపిడీ.. అక్కడికి కొన్నాళ్ల వ్యవధిలోనే.. పైడిశెట్టి ప్రతాప్ షాపు మూసి ఇంటికి వెళుతుండగా.. అతనిపై దాడి, దోపిడీ.. ఆ తర్వాత నుంచి చిన్నా చితకా చోరీలు తప్ప దాదాపు ప్రశాంతంగానే ఉన్న సోంపేట మళ్లీ బుధవారం ఉలిక్కిపడింది. భయంతో వణికిపోతోంది. కారణం..బుధవారం రాత్రి ఒక వ్యాపారస్తుని స్కూటర్ డిక్కీలో ఉంచిన లక్షల విలువైన బంగారు నగలు, నగదు అనూహ్య రీతిలో చోరీకి గురి కావడ మే.. పోలీస్ స్టేషన్ ఎదురుగానే జరిగిన ఈ ఘటన పట్టణంలో తీవ్ర కలకలం రేపింది. ఏం జరిగిందంటే.. తంగుడు ఆనందరావు పట్టణంలోని పెద్దబజారు వీధిలో బాబా జ్యూయలర్స్ షాపు పెట్టుకొని నగల వ్యాపారం చేస్తున్నారు. రోజూ మాదిరిగానే బుధవారం రాత్రి 8.20 గంటల ప్రాంతంలో షాపు మూసివేశారు. అంతకు ముందు ఆయన ఇంటికి కావలసిన టిఫిన్ కోసం పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న వెంకటసాయి హోటల్‌కు ఫోన్లో ఆర్డరు ఇచ్చారు. అనంతరం షాపులో ఉన్న సుమారు కిలో బంగారు నగలు, రూ.1.50 లక్షల నగదు బ్యాగులో సర్ది షాపుకు తాళం వేశారు. నగల బ్యాగును తన ద్విచక్ర వాహనం సీటు కింద డిక్కీలో పెట్టి ఇంటికి బయలుదేరారు. మధ్యలో హోటల్ వద్ద ఆగి టిఫిన్ పార్శిల్ తీసుకొని చర్చి వీధిలో ఉన్న తన ఇంటికి వెళ్లిపోయారు. వాహనం పార్క్ చేసి నగల బ్యాగు కోసం చూస్తే అది కనిపించలేదు. దాంతో కంగారు పడిన ఆయన టిఫిన్ కోసం హోటల్ దగ్గర వాహనం ఆపినప్పుడే ఎవరో బ్యాగు కొట్టేసి ఉంటారని భావించారు. వెంటనే హోటల్ వద్దకు వెళ్లి వాకబు చేసినా ఫలితం లేకపోయింది. దాంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బ్యాగులో ఉన్న నగల విలువ సుమారు రూ.30 లక్షలు ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. సర్వత్రా ఆందోళన షాపు మూసిన తర్వాత హోటల్ దగ్గర తప్ప ఎక్కడా ఆగలేదని బాధితుడు ఆనందరావు చెప్పారు. టిఫిన్ ముందుగానే ఆర్డర్ ఇచ్చినందున అక్కడ కూడా ఎక్కువ సేపు ఆగలేదని, ఈలోగానే దారుణం జరిగిపోయిందని చెబుతూ భోరున విలపించారు. తెలిసిన వారు. తన దినచర్యను గమనిస్తున్న వారి పనే అయ్యుంటుందన్న అనుమానం వ్యక్తం చేశారు. కాగా ఈ సంఘటనతో పట్టణ ప్రజలు, ముఖ్యంగా వ్యాపారస్తులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. పదేళ్ల క్రితం ఇదేస్థాయిలో రెండు దోపిడీలు జరిగిన విషయాన్ని వారు గుర్తు చేసుకున్నారు. అప్పట్లో ఆనంద్ జ్యూయలర్స్ యజమాని వూనా తాతారావు ఇంటిలోకి దుండగులు చొరబడి , తాతారావుతోపాటు ఆయన తల్లి, కుమార్తెలను హత్య చేసి నగదు, బంగారం దోచుకుపోయారు. ఆ తరువాత కొద్ది రోజుల్లోనే పైడి శెట్టి ప్రతాప్ అనే వ్యాపారి షాపు మూసి, బంగారంతో ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళుతుండగా, ఇంటి సమీపంలోనే అతనిపై దాడి చే సి బంగారం ఎత్తుకెళ్లారు. ఆ తర్వాత నుంచి చిన్న చిన్న చోరీలు తప్ప పెద్ద సంఘటనలేవీ లేకపోవడంతో ప్రజలు ప్రశాంతంగా ఉంటున్నారు. బుధవారం రాత్రి జరిగిన ఘటనతో బంగారం వ్యాపారుల్లో ఆందోళన మొదలైంది. సమాచారం అందుకున్న వెంటనే కాశీబుగ్గ డీఎస్పీ దేవప్రసాద్ సోంపేటకు చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. సోంపేట ఎస్సై శ్రీనివాసరావు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కాల్చుకుతిన్నాడు
సోంపేట: ఆదర్శాన్ని తగులబెట్టేశాడు. 13 ఏళ్ల ప్రేమ బంధాన్ని తెంచేశాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యనే కాల్చి చంపేశాడో కర్కోటకుడు. తీరిగ్గా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన భార్య ఆత్మహత్య చేసుకుందని నమ్మించబోయాడు. సోంపేటలో జరిగిన ఈ సంఘటన పట్టణంలో కలకలం రేపింది. బంధువులు, స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక పల్లి వీధికి చెందిన లొట్ల క్రిష్టారావు అలియాస్ మధు(36), బాలమ్మలు ప్రేమించుకున్నారు. పెద్దలు అంగీకరించకపోవడంతో పోలీసుల సమక్షంలో 13 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. చివరికి బాలమ్మ కుటుంబ సభ్యులు వీరి వివాహాన్ని అంగీకరించి, ఆదరించారు. దాంతో నాలుగేళ్లపాటు వారింటి వద్దే ఉన్న ఈ దంపతులు, అనంతరం వేరు కాపురం పెట్టుకున్నారు. పాన్‌షాప్ ఏర్పాటు చేసుకుని జీవనం సాగించేవారు. వీరికి ఇద్దరు పిల్లలు కొడుకు పవన్(11) ఆరో తరగతి, కూతురు కీర్తి(9) నాలుగో తరగతి చుదువుతున్నారు. కాలక్రమంలో క్రిష్ణారావు మద్యానికి బానిసయ్యాడు. రోజూ తాగి వచ్చి భార్యను కొట్టడం, వేధించడం మొదలుపెట్టాడు. దాంతో కుటుంబం కలతలు రేగాయి. సుమారు ఈ 10 సార్లు స్దానిక పోలీస్టేషణ్లో బాలమ్మ పిర్యాదు చేసింది.గొడవలు పడుతూ జీవితాన్ని గడుపుతూ ఉండేవారు. వీటిని తట్టుకోలేక బాలమ్మ సుమారు పదిసార్లు భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో క్రిష్టారావు హడావుడి బ్యాగు పట్టుకొని వెళ్లిపోతుండటం, ఇంటి నుంచి పొగలు వస్తున్నట్లు కనిపించడంతో స్థానికులు అనుమానంతో బాలమ్మ తల్లి లక్ష్మికి సమాచారం పం పారు. ఆమె వచ్చి ఇంటి తలుపులు తెరిచి చూడగా ఇళ్లంతా పొగతో నిండిపోయింది. బాలమ్మ తీవ్రంగా కాలిన గాయాలతో పడి ఉండి. గదిలోనూ, అరుగు మీద రక్తపు మరకలు కనిపించాయి. దాంతో స్థానికుల సాయంతో బాలమ్మను లక్ష్మి స్థానిక సామాజిక ఆస్పత్రికి తరలించింది. ఆస్పత్రికి చేరిన వెంటనే బాలమ్మ మృతి చెందింది. క్రిష్ణారావు బాలమ్మను తీవ్రంగా కొట్టి, కిరోసిన్ పోసి నిప్పంటించినట్లు ఇంటిలోని పరిస్థితులను బట్టి తెలుస్తోంది. ఆత్మహత్యగా చెప్పిన నిందితుడు కాగా ఇంటి నుంచి హడావుడిగా వెళ్లిపోయిన క్రిష్టారావు నేరుగా సోంపేట పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తన భార్య నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుందని ఫిర్యాదు చేశాడు. అతని శరీరంపైన కూడా కాలిన గాయాలు ఉండటాన్ని పరిశీలించిన పోలీసులు, అదే విషయం ప్రశ్నించగా భార్యను రక్షించే ప్రయత్నంలో తనకు కూడా గాయాలయ్యాయని బుకాయించాడు. తాగిన మైకంలో తూలుతున్న అతన్ని వాలకాన్ని గమనించిన పోలీసులు చికిత్స కోసం ఆస్పత్రికి పంపారు. సోం పేట ఎస్.ఐ శ్రీనువాసరావు హత్యానేరం కింద కేసు నమోదు చేశారు. డీఎస్పీ దేవప్రసాద్ సంఘటన స్దలానికి చేరుకుని పరిశీలించారు. అమ్మానాన్న రోజూ గొడవపడేవారు అమ్మానాన్న రోజూ గోడవ పడేవారని వారి పిల్లలు పవన్, కీర్తి చెప్పారు. ప్రతి రోజు నాన్న తాగి వచ్చి అమ్మను కొట్టి హింసించే వాడన్నారు. అతనే అమ్మను చంపి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. బాలమ్మ తల్లి, సోదరులు కూడా ఇదే ఆరోపణ చేశా రు. నిత్యం బాలమ్మను వేధించేవాడని, ఇప్పుడు ఆమె ను శాశ్వతంగా దూరం చేశాడంటూ విలపించారు. -
పాథమిక పాఠశాలకు రక్షణ ఏదీ?
పాథమిక పాఠశాలకు రక్షణ ఏదీ? సోంపేట : మామిడిపల్లి కాలనీలోని ప్రాథమికోన్నత పాఠశాలకు రక్షణ గోడ లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. పాఠశాల భవనాలు పాత ఎన్‌హెచ్-5 పక్కన ఉం డడంతో విద్యార్థులు బయటకు వచ్చేటప్పుడు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే పశువులు ఆవరణలోకి ప్రవేశిస్తున్నాయని, అధికారులు తక్షణం స్పందించి ప్రహరీ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు రామారావు, సత్యం, రమణ కోరుతున్నారు.