శ్రీకాకుళం జిల్లా సోంపేట రైల్వే స్టేషన్‌లో గూడ్సు రైలు కింద పడి ఆర్మీ హవల్దార్ ఆత్మహత్య చేసుకున్నాడు.
సోంపేట (శ్రీకాకుళం జిల్లా) : శ్రీకాకుళం జిల్లా సోంపేట రైల్వే స్టేషన్‌లో గూడ్సు రైలు కింద పడి ఆర్మీ హవల్దార్ ఆత్మహత్య చేసుకున్నాడు. సోంపేటకు చెందిన తామాడ కోటేశ్వరరావు ఆర్మీలో హవల్దార్‌గా పనిచేస్తున్నాడు.
సెలవుపై ఇంటికి వచ్చిన ఆయన ఆదివారం ఉదయం గూడ్సు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు దారితీసిన కారణాలు తెలియరాలేదు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.