
సాక్షి, సోంపేట (శ్రీకాకుళం): కొర్లాం పంచాయతీ గొనకపాడు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఇదే గ్రామానికి చెందిన వివాహిత సివంగి యశోద (28) నేల బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. బారువ పోలీసులు, మృతురాలి తల్లి లక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం.. యశోద భర్త మోహనరావు వలస కార్మికుడిగా చిత్తూరులో ఉంటున్నాడు. దీంతో అత్తమామలను చూసుకుంటూ, పిల్లలను చదివిస్తూ యశోద గొనకపాడు గ్రామంలోనే ఉంటుంది.
ఆదివారం రాత్రి అత్తాకోడళ్ల మధ్య చిన్నపాటి గొడవ తలెత్తింది. దీంతో మనస్తాపం చెందిన ఆమె అర్ధరాత్రి 12 గంటల సమయంలో సమీపంలో ఉన్న నేలబావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈమెకు ఇద్దరు పిల్లలు షర్మిళ, క్రాంతి ఉన్నారు. అందరితో కలివిడిగా ఉండే యశోద మృతి చెందడంతో గొనకపాడు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతురా లి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు బారువ ఎస్సై రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: (గచ్చిబౌలి: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య.. సహోద్యోగికి ఫోన్ చేసి..)
Comments
Please login to add a commentAdd a comment