Married Woman Suicide
-
వంట త్వరగా చేయమన్నందుకు వివాహిత ఆత్మహత్య
అగనంపూడి: క్షణికావేశంలో వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన దువ్వాడ పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. దువ్వాడ సీఐ వావిలపల్లి ఎర్రం నాయుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కణితిలో నివాసముంటున్న వ్యాన్ డ్రైవర్ వియ్యపు బాలాజీ గవర కంచరపాలెంకు చెందిన జ్యోతి (26)ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఏడాది పాప (యోక్షిత) ఉంది. సోమవారం ఉదయం తన తండ్రికి క్యారేజ్ పట్టుకెళ్లాలి వేగంగా వంట చేయమని బాలాజీ భార్య జ్యోతికి చెప్పాడు. ఇంట్లో పనులన్నీ తానే చేయాలా అంటూ జ్యోతి రుసరుసలాడుతూ చంటిపాపను కింద దించేసి బెడ్రూమ్లోకి వెళ్లి తలుపు గడియపెట్టి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బాలాజీ గట్టిగా కేకలు వేశాడు. చుట్టుపక్కలవాళ్లు పిలిచినా పలకపోవడంతో బాలాజీ తలుపు గెడను విరగ్గొట్టి లోపలికి వెళ్లి రక్షించే ప్రయత్నం చేశాడు. ముందుగా ఆమెను ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో అగనంపూడిలోని ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అయితే అప్పటికే జ్యోతి మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. సంఘటనా స్థలానికి సౌత్ ఏసీపీ టి.త్రినాథ్, దువ్వాడ సీఐ ఎర్రంనాయుడు చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం కేజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఉరేసుకుని యువతి ఆత్మహత్య
మేడ్చల్‌రూరల్: ఇంట్లో ఎవరూ లేని సమయంలో వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన రాఘవేంద్రనగర్ కాలనీలో జరిగింది. ఎస్సై మురళీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆమనగల్లుకు చెందిన రత్తం నవీన్ భార్య స్వప్న (24), ముగ్గురు పిల్లలతో కలిసి రాఘవేంద్రనగర్ కాలనీలో ఉంటున్నారు. మంగళవారం ఉదయం భర్త నవీన్ పనికి వెళ్లగా.. ఇంట్లో ఉన్న ఆమె సీలింగ్ రాడ్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రాత్రి 8 గంటల సమయంలో భర్త ఇంటికొచ్చే సరికి ఉరేసుకుని కనిపించింది. లోపలి నుంచి గడియ ఉండటంతో తలుపులు పగులగొట్టి చూడగా.. అప్పటికే ఆమె మృతిచెందింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. మరో ఘటనలో మేడ్చల్‌రూరల్: ఉరేసుకుని యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఒడిశాకు చెందిన మాధవరావు కుటుంబంతో కలిసి మేడ్చల్‌లో నివసిస్తున్నారు. కుమార్తె శైలజ (24), స్థానికంగా ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తుంది. కాగా మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సాయంత్రం కుటుంబసభ్యులు ఇంటికొచ్చేసరికి శైలజ విగత జీవిగా పడి ఉండటం, వీడియో కాల్ ఆన్‌చేసి ఉండటాన్ని పోలీసులు గమనించారు. ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. -
అనుమానాస్పదస్థితిలో వివాహిత మృతి
తిరువళ్లూరు: వివాహమై ఏడాది కాకముందే యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ సంఘటనలో ఆమె భర్తను వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ యువతి బంధువులు తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాల వద్ద రాస్తారోకో నిర్వహించారు. వివరాల్లోకి వెళితే.. తిరువళ్లూరు జిల్లా తిరువొత్తియూర్ కక్కన్ నగర్‌కు చెందిన పుష్పనాథన్ కుమార్తె షాలిని(24)కు వేపంబట్టు భారతీనగర్‌కు చెందిన మురళీధరన్‌తో తొమ్మిది నెలల క్రితం వివాహం జరిగింది. మురళీధరన్ అంబత్తూరులోని ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. వివాహమై తొ మ్మిది నెలలు దాటుతున్నా ఇంత వరకు సంతానం కలగలేదు. ఈ విషయంపై భార్యాభర్తలు తరచూ ఘర్షణ పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సోమవారం భార్యాభర్త వైద్యశాలకు వెళ్లి రక్త పరీక్ష చేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే బ్లడ్ టెస్టులో నెగటివ్ రావడంతో మనస్తాపం చెందిన యువతి కుటుంబ సభ్యులతో ఎవరితోనూ మాట్లాడ కుండా ముభావంగా ఉన్నట్టు భర్త కుటుంబ సభ్యు లు కొందరు తెలిపారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి షాలిని అనుమానాస్పద స్థితిలో ఫ్యాన్‌కు ఉరివే సుకుని కనిపించింది. పుట్టింటికి సమాచారం ఇవ్వకుండానే భర్త బంధువులు వైద్యశాలకు తరలించా రు. అయితే తన కుమార్తె ఆత్మహత్య చేసుకోలేదని, చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపిస్తూ యువతి బంధువులు మంగళవారం ఉదయం తిరుపతి–చైన్నె జాతీయ రహదారిలో రాస్తారోకో చేశారు. సంతానం లేదన్న కారణంతోనే హత్య చేశారని, భర్తతో పాటు బంధువులను అరెస్టు చేయాలని కోరుతూ నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న టౌన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చలు జరిపి రాస్తారోకో ను విరమింపచేశారు. కాగా బాధితుల రాస్తారోకో తో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. -
పిల్లలకోసం వేధింపులు
ఆదిలాబాద్: అత్తింటి వేధింపులతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన తాండూర్‌లో చోటు చేసుకుంది. కన్నెపల్లి మండలం జన్కాపూర్ గ్రామానికి చెందిన దర్వాజల లచ్చన్న, భాగ్య దంపతుల కుమార్తె శ్రీలత(25)కు తాండూర్‌కు చెందిన పెద్దబోయిన మహేందర్‌తో 2021లో వివాహమైంది. ఆదివారం ఉదయం అత్తగారింటి నుంచి వెళ్లిన శ్రీలత తాండూర్ పాత గోదాంల సమీపంలోని రైల్వేట్రాక్‌పై శవమై కనిపించింది. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహానికి సోమవారం బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో పంచనామా నిర్వహించారు. కాగా తన కూతుర్ని భర్త మహేందర్, అత్త గౌరక్క, ఆడపడుచులు అదనపు కట్నం తీసుకురావాలని, పిల్లలు కావడంలేదని మానసికంగా వేధించేవారని ఆరోపించారు. అత్తింటి వారే చంపి రైలు పట్టాలపై పడేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి తల్లి భాగ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. -
భార్యను బాగా చూసుకుంటానన్నాడు.. కానీ ఆ భర్త.. చివరికి..
పీఎం పాలెం (భీమిలి): కట్నం వేధింపులకు ఓ వివాహిత బలైపోయింది. అదనపు కట్నం కోసం భర్త పేట్టే హింసలకు తాళలేక ఉరి వేసుకుని తనువు చాలించిది. పీఎం పాలెం రెండో బస్టాపు లక్ష్మివానిపాలెంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సబంధించి పీఎం పాలెం పోలీస్ స్టేషన్ సీఐ రవికుమార్ తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. విజయనగరం జిల్లా తెర్లాం మండలానికి చెందిన భారతి(35)కి పీఎం పాలెం లక్ష్మివానిపాలెంకు చెందిన నరవ రామారావుతో 2008లో వివాహం జరిగింది. వివాహ సమయంలో పుట్టింటి వారు అల్లుడికి కట్నకానుకలు సమర్పించుకున్నారు. అయినప్పటికీ వివాహం జరిగిన కొన్నాళ్ల నుంచే రామారావు క్రూరత్వం బయటపడింది. చదవండి: పెళ్లయి రెండేళ్లు.. వివాహిత షాకింగ్ నిర్ణయం.. భార్య భారతిని అదనంగా కట్నం తీసుకురావాలని వేధించసాగాడు. ఆ వేధింపులు భరించలేక అప్పట్లో పుట్టింటికి వెళ్లిపోయి తెర్లాం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు కూడా నమోదుకావడంతో భార్యను బాగా చూసుకుంటానని రామారావు పెద్దల సమక్షంలో 2016 రాజీ పడ్డాడు. తర్వాత కూడా రామారావు ప్రవర్తనలో మార్పు రాలేదు. ఆ బాధలు భరించలేక శనివారం మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు భారతి ఉరి వేసుకుంది. రాత్రి పొద్దుపోయే వరకూ ఈ విషయం బయటకు తెలియలేదు. భారతి ఉరి వేసుకున్న విషయం ఆమె కుమారుడు కౌసిక్ కుమార్ (12) నగరంలోని మాధవధారలో నివసిస్తున్న మేనమామ చిప్పాడ శ్రీనివాస్‌కు తెలియజేయగా ఆయన పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పీఎం పాలెం పోలీసులు వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు తరలించారు. చిప్పాడ శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
పెట్రోలు పోసుకుని వివాహిత ఆత్మహత్యాయత్నం
(కోనసీమ) రాజోలు: ఒంటిపై పెట్రోలు పోసుకుని ఓ వివాహిత రాజోలు సర్కిల్ పోలీసు కార్యాలయం వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. స్థానికులు, బంధువుల కథనం ప్రకారం.. సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలేనికి చెందిన యర్రంశెట్టి విజయలక్ష్మి ఈ ఘాతుకానికి ఒడిగట్టింది. ఆమె విజయలక్ష్మి ఏ1 టీవీ తెలుగు న్యూస్ ఛానల్ రిపోర్టర్‌గా, ఆమె భర్త రమేష్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ పని చేసుకుంటూ సుమారు రూ.80 లక్షల అప్పులు చేశారు. కొన్ని బకాయిల నిమిత్తం విజయలక్ష్మి పుట్టిల్లు ఇరుసుమండలో ఉన్న స్థలాన్ని, కేశవదాసుపాలెంలోని డాబా ఇంటిని అమ్మేందుకు.. అప్పులు ఇచ్చిన వ్యక్తులతో పెద్దల సమక్షంలో చర్చలు జరుపుతున్నారు. ఇదిలా ఉండగా అప్పు ఇచ్చిన కొందరు బకాయి కింద ఇరుసుమండలోని భూమిని స్వాధీనం చేసుకున్నారు. దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్, భూసర్వే పనుల్లో వివాదం తలెత్తింది. దీనిపై ఫిర్యాదు చేసేందుకు విజయలక్ష్మి తన స్కూటర్‌పై రాజోలు సర్కిల్ పోలీసు కార్యాలయానికి వచ్చింది. వెంట లీటరు బాటిల్లో పెట్రోలు పోయించి తెచ్చుకుంది. సర్కిల్ కార్యాలయం ఎదుట సిమెంట్ బల్లపై కూర్చుని సీఐ ఎప్పుడు వస్తారని అక్కడున్న సెంట్రీ కానిస్టేబుల్‌ను అడిగింది. సీఐ శిక్షణలో ఉన్నారని, సోమవారం వస్తారని కానిస్టేబుల్ చెప్పాడు. వెంటనే ఆమె కూడా తెచ్చుకున్న పెట్రోలును ఒంటిపై పోసుకుని నిప్పు పెట్టుకుంది. మంటలు పూర్తిగా వ్యాపించడంతో హాహాకారాలతో పరుగులు తీస్తూ పక్కనే ఉన్న ట్రెజరీ, రెవెన్యూ కార్యాలయాల సమీపానికి వచ్చింది. అక్కడ ఉన్న పలువురు ఆమెను రక్షించేందుకు తడి గోనె సంచులు, ఇసుక వేసి, మంటలను ఆదుపు చేశారు. హుటాహుటిన రాజోలు ప్రభుత్వాసుపత్రికి తీసుకు వెళ్లారు. డాక్టర్ రాంజీ ఆధ్వర్యంలో ప్రథమ చికిత్స చేశారు. విజయలక్ష్మి శరీరం సుమారు 80 శాతం కాలిపోవడంతో మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆమె వాంగ్మూలాన్ని రాజోలు మెజి్రస్టేట్ జి.సురేష్‌బాబు నమోదు చేశారు. దీనిపై కేసు నమోదు చేస్తామని ఎస్సై కృష్ణమాచారి తెలిపారు. -
ఎలుకల మందు తిని వివాహిత ఆత్మహత్య
ప్రకాశం: ఎలుకల మందు తిని వివాహిత ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మర్రిపూడి నడిగడ్డకు చెందిన ఆకుమళ్ల తిరుమలయ్య కుమార్తె వెంకటేశ్వరి(22)ని మూడేళ్ల క్రితం బేస్తవారిపేట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన రమణయ్యతో వివాహమైంది. అయితే కొద్ది రోజుల్లోనే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చి నిత్యం గొడవలు జరుగుతుండటంతో విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి వెంకటేశ్వరి పుట్టింట్లో ఉంటోంది. ఈ క్రమంలో మనస్తాపం చెందిన వెంకటేశ్వరి ఈ నెల 21న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఎలుకల మందు తినింది. కుటుంబసభ్యులు గమనించి ఒంగోలులోని ప్రైవేట్ వైద్యశాలలో చేర్పించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు ఎస్సై అంకమ్మరావు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని గ్రామానికి తీసుకువచ్చారు. మృతురాలి తండ్రి తిరుమలయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని తహసీల్దార్ జి.విజయలక్షి్మ, వీఆర్ఓ శామ్యేలు పరిశీలించారు. -
నీలగిరిలో విషాదం: తొమ్మిదేళ్ల క్రితం ప్రేమ వివాహం.. ఇద్దరు పిల్లలతో కలిసి..
నల్లగొండ క్రైం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా నడికుడ రైల్వేస్టేషన్ సమీపంలో ఓ మహిళ ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవడంతో నీలగిరిలో విషాదఛాయలు అలుముకున్నాయి. నార్కట్‌పల్లి మండలం ఔరవాణి గ్రామానికి చెందిన జాన్‌రెడ్డి, గాదె రమ్య(28) ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో తొమ్మిదేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వీరికి రిషిక్ రెడ్డి(8), హంసిక (6) సంతానం.జాన్‌రెడ్డి నార్కట్‌పల్లి పాత ఇనుప సామగ్రి కొనుగోలు చేసే వ్యాపారం చేస్తూ కుటుంబంతో కలిసి నల్లగొండలోని చైతన్యపురికాలనీలో నివాసం ఉంటున్నారు. రమ్య బిందెలపై డిజైన్ బొమ్మలు వేస్తూ భర్తకు చేదోడువాదోడుగా ఉంటోంది. చదవండి👉🏻 'ఫోన్ నెంబర్ ఇవ్వు.. లేకపోతే లైంగికదాడి చేస్తాం' కుటుంబ కలహాలే కారణమా? రమ్య కొద్ది రోజులుగా పుట్టింట్లో ఉంటోంది. సోమవారం ఉదయం పిల్లలను బడికి పంపించేందుకు ఔరవాణి నుంచి నల్లగొండకు బయలుదేరింది. అయితే, రమ్య నల్లగొండకు రాకుండా పల్నాడు జిల్లాకు వెళ్లి పలక్‌నూమా రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు అక్కడి అధికారుల ద్వారా తెలిసింది. అయితే, రమ్య నల్లగొండకు రాకుండా పల్నాడు జిల్లాకు ఎందుకు వెళ్లిందని కుటుంబ సభ్యులకు అంతు చిక్కడం లేదు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే రమ్య తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుని ఉంటుందని భావిస్తున్నారు. చదవండి👉🏻కొట్టుకుని కేసులు పెట్టుకున్న సీఐలు -
ఆర్థిక ఇబ్బందులుతో ఒకరు.. వరకట్న వేధింపులు తాళలేక మరొకరు..
సాక్షి, వరంగల్: వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన వివాహిత పోగుల మౌనిక ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఎస్సై కె.కిశోర్ కథనం ప్రకారం.. మౌనికకు 10 సంవత్సరాల క్రితం విద్యాసాగర్‌తో వివాహం జరిగింది. పర్వతగిరిలో కంగన్‌హాల్ నిర్వహిస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో భార్యభర్తలు తరచు మనస్తాపానికి గురయ్యేవారు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో మౌనిక దూలానికి చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి ఇద్దరు కుమారులు ఉన్నారు. భర్త విద్యాసాగర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. వరకట్న వేధింపులకు వివాహిత బలి.. సంగెం: వరకట్న వేధింపులు తాళలేక విష గుళికలు మింగి ఆత్మహత్యాయత్నం చేసుకున్న వివాహిత చికిత్స పొందుతూ మృతి చెందింది. చేసుకుంది. వరంగల్ జిల్లా సంగెం మండలం లోహితలో ఆదివారం ఈ సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బొల్లేపల్లి ఉమామహేశ్వరి(20)ని హైదరాబాద్ బొల్లారానికి చెందిన కొప్పుల కమలాకర్ అలియాస్ కిరణ్‌కు ఇచ్చి గత ఏడాది ఆగష్టు 18న వివాహం జరిపించారు. ఆ సమయంలో రూ.2 లక్షల నగదు, 6 తులాల బంగారు ఆభరణాలు, ఇతర లాంచనాలు కట్నంగా ఇచ్చారు. కొద్ది రోజులకే భర్త కమలాకర్, అత్త పద్మ, మామ పాండు రూ.6 లక్షల అదనపు కట్నం తీసుకురావాలని వేధించసాగారు. రెండు నెలల క్రితం కొట్టి తల్లిగారింటికి పంపించారు. అప్పటి నుంచి లోహితలోనే ఉంటున్న ఉమామహేశ్వరి.. అదనపు కట్నం ఇవ్వలేక, కాపురానికి వెళ్లలేక మనస్తాపం చెంది ఈ నెల 11న విష గుళికలు మింగింది. గమనించిన కుటుంబ సభ్యులు ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. మృతురాలి తల్లి బొల్లేపల్లి సుమలత ఫిర్యాదు మేరకు కమలాకర్, పద్మ, పాండులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సిద్దోజు కిరణ్మయి తెలిపారు. చదవండి: (ప్రియుడితో సహజీనవం, బుల్లితెర నటి ఆత్మహత్య) -
Sri Sathya Sai: పద్మావతి కథ విషాదాంతం
ఓడీ చెరువు (సత్యసాయి): పుట్టింటికి పంపలేదనే మనస్తాపంతో బిడ్డతో సహా బావిలోకి దూకిన వివాహిత కథ విషాదాంతమైంది. శుక్రవారమే చిన్నారి మృతదేహం లభ్యం కాగా, శనివారం తల్లి శవం బయటపడింది. వివరాలు.. అమడగూరు మండలం గొల్లపల్లికి చెందిన వెంకటేష్ భార్య పద్మావతి (26) రెండు రోజుల క్రితం తన మూడేళ్ల కుమార్తె నిహస్వి (3)తో కలిసి గ్రామ సమీపంలో ఉన్న బావిలో పడిన విషయం తెలిసిందే. నీటిపై తేలాడుతున్న చిన్నారి మృతదేహాన్ని అదే రోజు బయటకు తీశారు. పద్మావతి ఆచూకీ లభ్యం కాకపోవడంతో మండల ఎస్ఐ రమణ, ఏఎస్ఐ కిషోర్‌రెడ్డి, అటవీ శాఖ అధికారులు రాత్రంతా బావిలోని నీటిని మోటారుతో తోడించారు. శనివారం ఉదయం తల్లి శవం బయటపడింది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చదవండి: (‘బంగారు తల్లి’ అంటూ మురిసిపోయావు.. అంతలోనే ఏమైంది తల్లీ?) -
కోర్టు ఉద్యోగిని ఆత్మహత్య
చిక్కబళ్లాపురం (బెంగళూరు): వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన చిక్కబళ్లాపురం నగరంలో చోటు చేసుకుంది. వివరాలు... ఇక్కడి ఇందిరా నగరలో నివాసం ఉంటున్న ఆరతి హీరేమఠ (35) నగరంలోని కోర్టులో ఎఫ్‌డీఏగా విధులు నిర్వహిస్తోంది. భర్త రామకృష్ణయ్య బెంగళూరులోని ఓ ప్రైవేట్ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తూ అక్కడే ఓ ఇంటిలో బిడ్డలతో నివాసం ఉంటున్నాడు. చిక్కలో ఆరతి ఓ అద్దె ఇంటిలో ఉంటోంది. ఇదిలా ఉంటే గురువారం ఉదయం ఆరతి బయటకు రాకపోవడంతో ఇంటి పక్కన వారు పోలీసులకు, రామకృష్ణయ్యకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఇంటి వద్దకు చేరుకుని తలుపులు తెరచి చూడగా ఆరతి ఉరి వేసుకున్న స్థితిలో కనిపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
ఏం కష్టం వచ్చిందో ఏమో.. పుట్టింటికి వచ్చి మరీ వివాహిత..
సాక్షి, నెల్లూరు రూరల్: ఏం కష్టం వచ్చిందో ఏమో గానీ ఓ వివాహిత పుట్టింటికి వచ్చి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నెల్లూరురూరల్ పరిధిలోని పెద్దచెరుకూరులో గురువారం చోటుచేసుకుంది. రూరల్ పోలీసుల కథనం మేరకు స్థానికుడైన పులి దేవదానం కెనరా బ్యాంకులో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఇతడి రెండో కుమార్తె సురేడ్డి కీర్తన(30)కు రాజా అనే వ్యక్తితో వివాహమైంది. రాజా సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తుండేవాడు. వీరికి కుమారుడు శ్రీఫల్, కుమార్తె శ్రీషా ఉన్నారు. వీరు హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో నివాసం ఉంటున్నారు. బుధవారం కీర్తన హైదరాబాద్ నుంచి పెద్దచెరుకూరులోని తండ్రి వద్దకు చేరుకుంది. గురువారం ఉదయం కీర్తన ఇంటి మిద్దెపైన ఉన్న బెడ్రూంకు వెళ్లింది. కుటుంబసభ్యులు గది వద్దకు వెళ్లి కీర్తనను పిలవగా ఎంతకీ తలుపులు తెరవకపోవడంతో తలుపులు పగలగొట్టి ఇంట్లోకి వెళ్లి చూడగా ఆమె ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఉండటాన్ని గుర్తించారు. వెంటనే కీర్తనను నగరంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అయితే కీర్తన అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. చదవండి: ప్రియురాలికి స్నేహితురాలు వీడియోకాల్.. వక్రబుద్ధితో.. రూరల్ పోలీసులకు సమాచారం అందడంతో అక్కడికి చేరుకుని విచారించారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: తొమ్మిదేళ్ల క్రితం ప్రేమ వివాహం.. మూడు రోజులుగా భర్త మృతదేహంతోనే.. -
భార్య మీద అనుమానం.. పండుగపూట దారుణం
నిర్మల్(ఆదిలాబాద్): మహాశివరాత్రి పండుగరోజే జిల్లాకేంద్రంలో విషాదం, ఆందోళన చోటు చేసుకున్నాయి. అనుమానాస్పదస్థితిలో వివాహిత చనిపోవడం ఉద్రిక్తతకు దారితీసింది. తనను అత్తింటివారే చంపారంటూ బాధిత కుటుంబసభ్యులు స్థానిక రూరల్ పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక మంజులాపూర్‌కు చెందిన అరుగుల సాయికృష్ణకు ఎనిమిదేళ్ల క్రితం కుంటాల మండల కేంద్రానికి చెందిన ప్రణీత(24)తో వివాహమైంది. వీరి ఆరేళ్ల కాపురానికి పండంటి ఇద్దరు బిడ్డలు పుట్టారు. సజావుగా సాగుతున్న వీరి కాపురంలో అనుమానం చిచ్చుపెట్టింది. సాయికృష్ణ భార్య మీద అనుమానంతో వేధించేవాడని ప్రణీత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నాలుగు నెలల క్రితం పంచాయితీ పెట్టి ఇద్దరి మధ్య సయోధ్య కూడా కుదిర్చారు. మళ్లీ భార్యాభర్తల మధ్య గొడవ కావడంతో మంగళవారం ప్రణీత బాత్రూంలో షవర్‌కు ఉరి వేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు అంబులెన్స్‌లో జిల్లా ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. అత్తింటి వారే చంపారని.. ప్రణీత మృతి విషయం తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు కుంటాల నుంచి వచ్చారు. భర్త, అత్తలే చంపారని ఆరోపించారు. వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ రూరల్ పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. ఎస్సై వినయ్‌కుమార్ వారితో చర్చించి, న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో విరమించారు. ప్రణీత అన్న ప్రవీణ్ ఫిర్యాదు మేరకు భర్త సాయికృష్ణ, అత్త లక్ష్మిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. తల్లి చనిపోవడం, తండ్రిపై కేసు కావడంతో 6, 4ఏళ్లు వయసున్న ఇద్దరు ఆడబిడ్డలు ఏడుస్తున్న తీరు స్థానికులను కలచివేసింది. -
అత్తాకోడళ్ల మధ్య గొడవ.. అర్ధరాత్రి 12 గంటల సమయంలో
సాక్షి, సోంపేట (శ్రీకాకుళం): కొర్లాం పంచాయతీ గొనకపాడు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఇదే గ్రామానికి చెందిన వివాహిత సివంగి యశోద (28) నేల బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. బారువ పోలీసులు, మృతురాలి తల్లి లక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం.. యశోద భర్త మోహనరావు వలస కార్మికుడిగా చిత్తూరులో ఉంటున్నాడు. దీంతో అత్తమామలను చూసుకుంటూ, పిల్లలను చదివిస్తూ యశోద గొనకపాడు గ్రామంలోనే ఉంటుంది. ఆదివారం రాత్రి అత్తాకోడళ్ల మధ్య చిన్నపాటి గొడవ తలెత్తింది. దీంతో మనస్తాపం చెందిన ఆమె అర్ధరాత్రి 12 గంటల సమయంలో సమీపంలో ఉన్న నేలబావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈమెకు ఇద్దరు పిల్లలు షర్మిళ, క్రాంతి ఉన్నారు. అందరితో కలివిడిగా ఉండే యశోద మృతి చెందడంతో గొనకపాడు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతురా లి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు బారువ ఎస్సై రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (గచ్చిబౌలి: సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య.. సహోద్యోగికి ఫోన్ చేసి..) -
సుజన, వెంకటకృష్ణ మధ్య మనస్పర్థలు.. అర్ధరాత్రి దాటాకా..
సాక్షి, ధర్మవరం (అనంతపురం): అదనపు కట్నం వేధింపులు తాళలేక ఓ బ్యాంక్ ఉద్యోగి భార్య ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. ధర్మవరంలోని నేసేపేటకు చెందిన వెంకటకృష్ణ.. తాడిమర్రిలోని ఎస్బీఐ శాఖలో పనిచేస్తున్నారు. 2016లో వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన కొండయ్య, గంగాదేవి దంపతుల కుమార్తె వెంకట సుజన (26)ను పెళ్లి చేసుకున్నారు. పెళ్లి సమయంలో రూ.18 లక్షల కట్నం, 30 తులాల బంగారు నగలను సుజన తల్లిదండ్రులు అందజేశారు. కొన్నేళ్లు వీరి కాపురం సజావుగా సాగింది. ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొంత కాలంగా సుజన, వెంకటకృష్ణ మధ్య మనస్పర్థలు చెలరేగి తరచూ గొడవపడేవారు. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంటిపైన మూడో అంతస్తులో సుజన ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చదవండి: (ఇంటర్ విద్యార్థినితో పరిచయం పెంచుకొని.. పలుమార్లు అత్యాచారం) ఆదివారం ఉదయం ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, అదనపు కట్నం కోసమే వేధింపులకు గురిచేసి తమ కుమార్తెను హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరించారంటూ వెంకటకృష్ణ కుటుంబసభ్యులతో మృతురాలి తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగారు. ఈ మేరకు డీఎస్పీ రమాకాంత్‌కు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు... మృతురాలి భర్తను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. -
విషాదం: సుగుణ తలుపులు తీయ్.. కిటికీలో నుంచి చూడగా..
సాక్షి, విశాఖపట్నం: ఎంవీపీకాలనీ సెక్టార్–6లోని ఓ ఇంట్లో వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలివీ.. పత్రుల సుగుణ(25), దూడ ఉపేంద్ర దంపతులు రెండు నెలలుగా సెక్టార్–6లోని అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. సుగుణ మద్దిలపాలెంలోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. సోమవారం ఉదయం ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది. కొంత సమయం తర్వాత ఉపేంద్ర ఇంటికి వచ్చి సుగుణ తలుపులు తీయ్ అంటూ గట్టిగా అరిచాడు. ఇది గమనించిన ఇంటి యజమాని పుసర్ల సూర్యారావు వచ్చి ఏమైందని అడిగాడు. తలుపులు తీయడం లేదని ఉపేంద్ర బదులిచ్చాడు. దీంతో ఇద్దరూ కిటికీలో నుంచి చూడగా.. ఆమె ఉరివేసుకుని చనిపోయినట్లు గుర్తించారు. ఈ సమాచారం అందుకున్న ఎంవీపీ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనపై ఇంటి యజమాని సూర్యారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎంవీపీ పోలీసులు తెలిపారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. చదవండి: (మసాజ్‌సెంటర్ ముసుగులో వ్యభిచారం.. ఏడుగురు అరెస్ట్) -
అన్నతోనే ‘సంబంధం’ అని పంచాయితీ.. భార్యపై చేయిచేసుకోవడంతో..
సాక్షి, కొండపాక(గజ్వేల్., సిద్దిపేట): కుటుంబ కలహాలతో రెండేళ్ల కుమారుడికి నిప్పంటించి తల్లి కూడా ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శనివారం సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని సిర్సనగండ్ల గ్రామంలో చోటు చేసుకుంది. సిర్సనగండ్లకు చెందిన గవ్వల అయ్యల్లం, బీరవ్వల రెండో కుమారుడు స్వామికి చేర్యాల మం డలం వేచరేణికి చెందిన పోశయ్య, మల్లవ్వల చిన్న కుమార్తె నవితను ఇచ్చి పదేళ్ల క్రితం వివాహం చేశారు. స్వామి వ్యవసాయ పనులతో పాటు కూలీ పను లు చేసుకుంటూ భార్య నవిత (25), కుమారుడు మణిదీప్ (2)ను పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో స్వామి అన్న భాస్కర్‌కు నవితకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో తరచూ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయంలో వారం రోజుల క్రితం కులపెద్దలు సముదాయించి స్వామికి నచ్చజెప్పారు. ఈ క్రమంలో శనివారం స్వామి వ్యవసాయ బావి వద్ద పత్తి ఏరేందుకు భార్యను రమ్మని చెప్పగా.. ఆమె రానని అనడంతో ఇద్దరికి గొడవ జరిగింది. దీంతో స్వామి భార్య పై చేయి చేసుకొని వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. ఈ ఘటనతో మనస్తాపానికి గురైన నవిత మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కుమారుడు మణిదీప్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించి తాను కూడా నిప్పంటించుకుంది. చదవండి: ఇంతమంది చనిపోతుంటే ఎన్ఫోర్స్మెంట్ ఏం చేస్తోంది? ఇంట్లో నుంచి వస్తున్న పొగను గమనించిన చుట్టుపక్కల వారు తలుపులు పగుల గొట్టి చూడగా ఇద్దరూ విగత జీవులై కనిపించా రు. తమ కూతురు నవితపై లేనిపోని అభాండాలు వేసి, వేధించి చంపారని మృతురాలి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. కూతురు మృతికి కారణమయ్యారని అత్త బీరవ్వ, బావ భాస్కర్, భర్త స్వామిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. త్రీటౌన్ సీఐ ప్రవీణ్‌కుమార్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. చదవండి: బాత్రూంలో ఉరివేసుకొని బాలింత ఆత్మహత్య -
పెళ్లయిన నాటి నుంచి గొడవలే.. తట్టుకోలేక..
సాక్షి, జియాగూడ: పెళ్లయిన నాటి నుంచి ఇంట్లో తరచూ గొడవల కారణంగా మనస్థాపం చెందిన ఓ గృహిణి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళ్‌హాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. ఎస్ఐ రాజశేఖర్‌రెడ్డి వివరాల ప్రకారం.. పోలీస్ స్టేషన్ ఇంద్రానగర్‌లో ఉంటున్న కరణ్ ఖాళీ ఇంట్లోనే ఉంటున్నాడు. ఏడాదిన్నర క్రితం సికింద్రాబాద్ పాటిగడ్డ అస్మత్‌పేట్ ప్రాంతానికి చెందిన శ్వేత(22)తో వివాహం జరిగింది. ఇటీవల వారికి కూతురు కూడా జన్మించింది. అయినా గొడవలు తగ్గకపోవడంతో మనస్థాపం చెందిన శ్వేత శుక్రవారం ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పెళ్లయిన ఎనిమిది నెలలకే అఘాయిత్యం
సాక్షి, నేరడిగొండ(ఆదిలాబాద్): మండలంలోని సవర్గాం గ్రామానికి చెందిన నాలుగు నెలల గర్భిణి జాదవ్ సంగీత(22) శుక్రవారం ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. తమ కుమార్తెను అత్తింటి వారే హత్య చేశారంటూ నేరడిగొండ జాతీయ రహదారిపై మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు రాస్తారోకో చేపట్టారు. దీంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బజార్హత్నూర్ మండలం కాండ్లి గ్రామానికి చెందిన చౌహాన్ రామేశ్వర్, అనసూయ దంపతుల కూతురు సంగీతకు 2021 జనవరి 6న నేరడిగొండ మండలం సవర్గాం గ్రామానికి జాదవ్ విజయ్‌తో వివాహం జరిగింది. శుక్రవారం సవర్గాం గ్రామంలోని ఇంట్లో సంగీత పురుగుల మందు తాగి ఆత్మహత్య పాల్పడింది. ఈ విషయాన్ని స్థానికులు బజార్హత్నూర్ మండలం కాండ్లి గ్రామంలో ఉంటున్న మృతురాలి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతోవారు బంధువులతో కలిసి సవర్గాం చేరుకున్నారు. తమ కూమర్తెను చంపుతామని కొద్దిరోజులుగా సంగీత భర్త, మామ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వారే సంగీతను హత్య చేశారని నేరడిగొండ జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. విషయం తెలుసుకున్న బోథ్ సీఐ నైలు, ఎంపీపీ రాథోడ్ సజన్ ఆందోళన చేస్తున్న వారిని సముదాయించారు. గర్భిణిగా ఉన్న సంగీత కడుపునొప్పి భరించలేకే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందని ఎస్సై భరత్‌సుమన్ తెలిపారు. ఈ మేరకు మృతదేహాన్ని పంచనామా నిమిత్తం బోథ్ సివిల్ ఆస్పత్రికి తరలించి, అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. చదవండి: పెళ్లి బరాత్.. అంతలో సడన్‌గా పోలీసుల ఎంట్రీ ! -
మూడేళ్ల నుంచి లైంగిక వేధింపులు.. కేసు పెట్టిన మారలేదు.. చివరకు..
సాక్షి, పెంచికల్పేట్(ఆదిలాబాద్): ఇంటి పక్కన నివసించే వ్యక్తి లైంగిక వేధింపులకు వివాహిత బలైంది. పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేసినా అతడి వేధింపులు ఆగకపోవడంతో భరించలేక శనివారం ఆత్మహత్య చేసుకుంది.ఎస్సై సిహెచ్.రమేష్ తెలిపిన వివరాలు.. ఎల్కపల్లి గ్రామానికి చెందిన జునుగరి శ్రీనివాస్‌కు 20ఏళ్ల క్రితం ఈస్గాం గ్రామానికి చెందిన సుజాత(35)తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. సుజాత ఇంటి పక్కనే ఉంటున్న రాచర్ల కృష్ణ గత మూడేళ్ల నుంచి లైంగికంగా వేధిస్తున్నాడు. పద్ధతి మార్చుకోవాలని పలుమార్లు హెచ్చరించినా తీరు మారలేదు. వేధింపులు భరించలేక రెండేళ్ల క్రితం స్థానిక పెంచికల్పేట్ పోలీసుస్టేషన్లో సుజాత తన భర్తతో కలిసి ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి కృష్ణను అరెస్టు చేశారు. అయినా మళ్లీ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. తీవ్ర మనస్తాపం చెందిన సుజాత శనివారం ఇంట్లోనే పురుగుల మందు తాగగా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయింది. కారకుడైన కృష్ణను కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. మృతురాలి తల్లి రాధాబాయి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు. చదవండి: అప్పన్నకే శఠగోపం -
ఆడపిల్లలు పుట్టారని రోజూ వేధింపులు.. భార్య ఆత్మహత్య
అమీర్‌పేట: ఆడపిల్లలు పుట్టారని భర్త వేధిస్తుండటంతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... నల్లగొండ జిల్లా పెద్ద అరిశర్లపల్లి మండలం నార్ల తండాకు చెందిన రమావత్ లింగం పెద్ద కుమార్తె వి.అనిత (25)ను 2015లో రేగులవర తండా మాచర్లకు చెందిన బాబూరావుకు ఇచ్చి వివాహం జరిపించారు. వీరికి ఇద్దరు ఆడ పిల్లలు పుట్టారు. రెండేళ్ల క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి బోరబండ ఇంద్రానగర్ ఫేస్–2లో నివాసముంటున్నారు. బాబూరావు కూలీ పనిచేయగా వచ్చిన డబ్బుతో రోజూ మద్యం తాగి వచ్చి భార్యను కొట్టేవాడు. శనివారం సాయంత్రం 5 గంటలకు అనిత తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఇద్దరు ఆడ పిల్లలు పుట్టారని రోజూ తాగి వచ్చి భర్త కొడుతున్నాడని చెప్పగా, వారు కూతురికి సర్ధిచెప్పారు. కొద్ది సేపటి తర్వాత తల్లి ఫోన్ చేయగా అనిత తీయలేదు. అల్లుడు బాబూరావుకు ఫోన్ చేస్తే అతను కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఇదిలా ఉండగా, ఆదివారం మధ్యాహ్నం 2గంటలకు బంధువులు రవీందర్, హన్మంత్ అతని తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ అమ్మాయి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుందని చెప్పారు. అల్లుడి వేధింపుల కారణంగానే అనిత ఆత్మహత్య చేసుకుందని, విచారణ జరిపి అతడిపై చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని లింగం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ప్రేమ వేధింపులు: అల్లుడిని హత్య చేసిన మామ -
వివాహేతర సంబంధం: భార్య ఆత్మహత్య
సాక్షి, కర్నూలు: భర్త వేధింపులు తాళలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఆదివారం నంద్యాల పట్టణంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.నంద్యాల టూటౌన్ పోలీసులు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల మేరకు.. ఆళ్లగడ్డ మండలం ముత్తలూరు గ్రామానికి చెందిన గండ్ర పుల్లయ్య వెల్దుర్తి మండలం రామళ్లకోట గ్రామానికి చెందిన కీర్తి (33)ని పదేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరిద్దరూ విద్యావంతులు కావటంతో పెళ్లి అనంతరం ఉద్యోగం కోసం నంద్యాల పట్టణానికి వచ్చి ఎస్బీఐ కాలనీలో ఉంటున్నారు. స్థానిక నాగార్జున ప్రైవేట్ కళాశాలలో లెక్చరర్‌గా పుల్లయ్య, గుడ్‌షెప్పర్డ్ స్కూల్లో టీచర్‌గా కీర్తి ఉద్యోగంలో చేరారు. వీరికి ఒక కుమార్తె, కుమారుడు సంతానం. సంతోషంగా సాగుతున్న వీరి సంసార జీవితంలో ఓ యువతి చిచ్చురేపింది. నాగార్జున కాలేజీలో చదువుకున్న సుభాషిణి ప్రస్తుతం నంద్యాల తహసీల్దార్ కార్యాలయం పక్కనే ఉన్న ట్రెజరీ కార్యాలయంలో అసిస్టెంట్ క్లర్క్‌గా పనిచేస్తోంది. ఈ యువతి పుల్లయ్య స్టూడెంట్. ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయంలో పుల్లయ్య, కీర్తి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఈ క్రమంలో నాలుగు నెలల క్రితం ఏకంగా సుభాషిణిని రెండో పెళ్లి చేసుకుని ఇద్దరు కలిసి దిగిన ఫొటోలను కీర్తి సెల్‌కు పంపి వేధించేవారు.తమకు అడ్డుగా ఉన్నావంటూ సుభాషిణి తరచూ ఆమె ఫోన్‌కు మెసేజ్‌లు పెట్టడం, మరోవైపు భర్త కూడా మానసికంగా వేధింపులకు గురిచేయడంతో జీవితంపై విరక్తి చెందిన కీర్తి శనివారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు కీర్తి మృతి చెందిన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని అనుమానం వ్యక్తం చేస్తూ పుల్లయ్యకు దేహశుద్ధి చేయడంతో అతను అక్కడి నుంచి పరారయ్యాడు. రెండో భార్య సుభాషిణి కూడా ఇంటికి తాళం వేసి వెళ్లింది. కాగా తన కుమార్తె చావుకు అల్లుడు, అతని రెండో భార్య సుభాషిణే కారణమని మృతురాలి తల్లి పద్మావతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ సీఐ కంబగిరిరాముడు తెలిపారు. -
వివాహిత ఆత్మహత్య.. అత్తింటి వారి ఇల్లు ధ్వంసం
మెదక్ రూరల్: కుటుంబ కలహాలతో వివాహిత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ మండలం జానకంపల్లి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. బాధిత కుటుంబీకులు, స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మార్గం దుర్గయ్య – పోచమ్మలకు శ్రీశైలం, రాములు, శేఖర్ ముగ్గురు కొడుకులు ఉన్నారు. ఇందులో చిన్న కుమారుడైన శేఖర్‌కు అదే గ్రామానికి చెందిన నిర్మల(28)ను ఇచ్చి 2011లో వివాహం జరిపించారు. శేఖర్, శ్రీశైలం ఇద్దరు ఒకే ఉంట్లో ఉంటుండగా, రాములు వేరేచోట నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆస్తి పంపకాలు, వేరు కాపురం వంటి చిన్నపాటి గొడవలు శేఖర్, శ్రీశైలం కుటుంబాల మధ్య జరిగినట్లు తెలిపారు. కొత్త ఇంటిని నిర్మించే విషయంలో అన్నదమ్ముల మధ్య తరచూ గొడవలు జరిగాయి. దీంతో కొంతకాలం సాఫీగా సాగిన శేఖర్–నిర్మల వివాహ బంధంలో కుటుంబ కలహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో అన్నిటికీ నిర్మల కారణమని ఆమెను తరచూ సూటీపోటి మాటలతో ఇబ్బందిపెట్టే వారని తెలిపారు. నిర్మలను ఉద్దేశించి అందరూ చస్తే.. చావు ఇంటి నిర్మాణం గురించి మాట్లాడకు అంటూ బెదిరించడంతో తీవ్ర మనస్థాపానికి గురైన నిర్మల గురువారం రాత్రి 12 గంటల సమయంలో ఇంట్లో అందరు నిద్రిస్తుండగా దూలానికి చీరతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. ఈ విషయం తెలిసిన అదే గ్రామంలో ఉంటున్న నిర్మల అన్న బిక్షపతి, సమీప బంధువులు మార్గం వెంకటేష్, మార్గం శ్రీనివాస్, మార్గం లింగం, మార్గం శంకర్‌లతో పాటు మరికొంత మంది ఆగ్రహంతో మృతురాలి భర్త ఇంటితో పాటు అతడి అన్నలు శ్రీశైలం, రాములు ఇళ్లను ద్వంసం చేశారు. ఈ క్రమంలో గ్రామంలో ఉద్రిక్త పరిస్తితులు నెలకొన్నాయి. పికెట్ నిర్వహించిన పోలీసులు.. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పికెటింగ్ ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపుచేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా భారీగా పోలీసులు మోహరించారు. మెదక్ డీఎస్పీ కృష్ణమూర్తి, సీఐ రాజశేఖర్, ఎస్ఐ అంజనేయులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. కాగా ఇరు వర్గాల పై పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉంటే నిర్మలకు ఉన్న ఇద్దరు అక్కలు భూలక్ష్మి, యశోదలు కూడా వేర్వేరు సందరా>్భల్లో గతంలో చనిపోవడం పట్ల వారి అన్న భిక్షపతి తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. తల్లి ప్రేమకు దూరమైన ఇద్దరు చిన్నారులు.. కుటుంబ కలహాలతో నిర్మల మృతి చెందడంతో సాత్విక్, మనిదీప్ అనే ఆరేళ్లలోపు ఇద్దరు చిన్నారులు తల్లి ప్రేమకు దూరమయ్యారు. తల్లి మృతి చెందగా, ఇళ్లను బంధువులు ధ్వంసం చేసి ఘర్షణ వాతావరణం నెలకొనగా ఏమి తెలియని పరిస్థితిలో చిన్నారులు బిక్కుబిక్కుమంటూ రోదించడం అక్కడివారిని కంటతడిపెట్టించింది. -
వివాహిత ఆత్మ‘హత్య’
కర్నూలు, కృష్ణగిరి: ఆరు రోజుల కిత్రం అదృశ్యమైన మహిళ బుధవారం హంద్రీ కాలువలో శవమై తేలింది. మృతురాలి తలపై గాయం ఉండటంతో భర్తే హత్య చేసి కాలువలో పడేశాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. కృష్ణగిరి మండలం లక్కసాగరం గ్రామానికి చెందిన సుధాకర్‌కు ఎరుకలచెర్వు గ్రామానికి చెందిన రామకృష్ణమ్మ(23)కు మూడేళ్ల కిత్రం వివాహమైంది. వీరికి ఏడాది పాప ఉంది. ఈ నెల 7న సాయంత్రం పొలం వద్దకు నీరు పెట్టేందుకు దంపతులిద్దరూ వెళ్లారు. ఆ తర్వాత రామకృష్ణమ్మ ఇంటికి రాలేదు. మరుసటి రోజు రామకృష్ణమ్మ అదృశ్యమైనట్లు తల్లి నాగ తిమ్మమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మూడు రోజులుగా పోలీసులు హంద్రీనీవా కాలువ, పొలాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. భర్తను సైతం అదుపులోకి తీసుకుని విచారించారు. కాగా బుధవారం హంద్రీనీవా కాలువలో గుండ్లకొండ పంప్‌హౌస్ వద్ద రామకృష్ణమ్మ శవమై తేలింది. విషయం తెలుసుకున్న డోన్ సీఐ సుధాకర్‌రెడ్డి, కృష్ణగిరి ఎస్ఐ రామాంజనేయరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. డోన్ వైద్యులతో అక్కడే పోస్టుమార్టం నిర్వహించి, మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనంతరం పోలీసుల బందోబస్తు మధ్య లక్కసాగరంలో అంత్యక్రియలు పూర్తిచేశారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులుతెలిపారు. -
అత్తింటి ఆరళ్లకు యువతి బలి
సాక్షి, పెట్లూరు (ప్రకాశం): ఆ యువతికి వివాహమై ఏడాదిన్నరే. ఏమైందో ఏమో గానీ అత్తారింట్లో ఉరేసుకుని అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మండలంలోని పెట్లూరులో సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న యువతి తల్లిదండ్రులు, బంధువులు వచ్చి కుమార్తె శవాన్ని చూసి తమ కుమార్తెను భర్త, అత్తమామలు చంపి ఉరేశారని ఎస్ఐ, తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. పెట్లూరు ఎస్సీ కాలనీకి చెందిన ఆరితోటి వినోద్‌కు బల్లికురవ మండలం వైదన గ్రామానికి చెందిన మేరిమ్మ అలియాస్ స్వాతి (21)తో సుమారు ఏడాదిన్నర క్రితం వివాహమైంది. మేరిమ్మ తాను నిద్రించిన గది నుంచి బయటకు వచ్చి టాయిలెట్‌కి వెళ్లి పక్కనే ఉన్న మరో గదిలొ శ్లాబ్ కొక్కేనికి చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కోడలు గదిలో నిర్జీవంగా వేలాడుతూ ఉండటాన్ని చూసిన అత్త బిగ్గరగా కేకలేసింది. ఇంట్లోని కుమారులు, కాలనీలోని మరి కొందరు వచ్చి చూన్నీ కోసి మేరిమ్మను కిందకు దించగా అప్పటికే మృతి చెందింది. మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు వచ్చి ఇది ముమ్మాటికీ హత్యేనని పోలీసులు తహసీల్దార్ ఎదుట వాపోయారు. తమ కుమార్తెను అత్తింటివారే చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత అఘాయిత్యం ఎందుకు జరిగిందని చనిపోయిన కుమార్తె మృతదేహం వద్ద రోధించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కందుకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతురాని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రసాద్ తెలిపారు. తహసీల్దార్ సుజాత సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి మృతురాలి తల్లిదండ్రులు, అత్తమామలు, భర్తతో మాట్లాడి వివరా>లు సేకరించారు.