
చికిత్స పొందుతున్న అనిత
మంచిర్యాలక్రైం: మంచిర్యాల పట్టణంలోని శ్రీనివాస్ టాకీస్ ప్రాంతానికి చెందిన బ్రాహ్మణపల్లి అనిత(30) అలియాస్ లాస్య గురువారం రసాయనం తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం అనితకు వేధనాచారితో 2012లో వివాహం జరిగిది. అప్పటినుంచి అత్తమామలు భర్త తరుచూ వేధింపులకు గురిచేస్తున్నారు. గతంలో పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీలు నిర్వహించారు. ఇటీవల కాలంలో వేధింపులు అధికం కావడంతో భరించలేక గురువారం బాత్‌రూం క్లీనర్ తాగింది.
కుటుంబసభ్యులు పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతోంది. అనితకు కూతురు వింధ్య, కుమారుడు విశ్వన్ ఉన్నారు. అనిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు భర్త వేధనాచారి, మామ బ్రహ్మయ్య, అత్త మణమ్మలపై కేసు నమోదు చేసి దర్యాçప్తు జరుపుతున్నామని మహిళా పోలీస్ స్టేషన్ సీఐ చంద్రమౌళి తెలిపారు.