
అనిత (ఫైల్)
ఆదిలాబాద్: మండలంలోని మన్మద్ గ్రామానికి చెందిన జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు దొడ్లి అనిత(50) ఆత్మహత్య చేసుకుంది. ఏఎస్సై దిగంబర్ కథనం ప్రకారం..మృతురాలు నాలుగు నెలలుగా మానసికంగా బాధపడుతోంది. ఈ క్రమంలో శనివారం రాత్రి ఇంట్లో సూపర్ వాస్మోల్ తాగింది.
గమనించిన కుటుంబ సభ్యులు ఆదివారం తెల్లవారుజాము నిర్మల్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమద్యలో మృతిచెందింది. మృతురాలి కుమారుడు పవన్ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్తు ఏఎస్సై తెలిపారు. కాగా, పార్థివదేహం వద్ద డీఆర్‌డీవో విజయలక్ష్మి పుష్కగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. అనంతరం అంతక్రియల్లో పాల్గొంది. బాధిత కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment