తిరువళ్లూరు: వివాహమై ఏడాది కాకముందే యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ సంఘటనలో ఆమె భర్తను వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ యువతి బంధువులు తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాల వద్ద రాస్తారోకో నిర్వహించారు. వివరాల్లోకి వెళితే.. తిరువళ్లూరు జిల్లా తిరువొత్తియూర్ కక్కన్ నగర్‌కు చెందిన పుష్పనాథన్ కుమార్తె షాలిని(24)కు వేపంబట్టు భారతీనగర్‌కు చెందిన మురళీధరన్‌తో తొమ్మిది నెలల క్రితం వివాహం జరిగింది. మురళీధరన్ అంబత్తూరులోని ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. వివాహమై తొ మ్మిది నెలలు దాటుతున్నా ఇంత వరకు సంతానం కలగలేదు.
ఈ విషయంపై భార్యాభర్తలు తరచూ ఘర్షణ పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సోమవారం భార్యాభర్త వైద్యశాలకు వెళ్లి రక్త పరీక్ష చేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే బ్లడ్ టెస్టులో నెగటివ్ రావడంతో మనస్తాపం చెందిన యువతి కుటుంబ సభ్యులతో ఎవరితోనూ మాట్లాడ కుండా ముభావంగా ఉన్నట్టు భర్త కుటుంబ సభ్యు లు కొందరు తెలిపారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి షాలిని అనుమానాస్పద స్థితిలో ఫ్యాన్‌కు ఉరివే సుకుని కనిపించింది. పుట్టింటికి సమాచారం ఇవ్వకుండానే భర్త బంధువులు వైద్యశాలకు తరలించా రు.
అయితే తన కుమార్తె ఆత్మహత్య చేసుకోలేదని, చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపిస్తూ యువతి బంధువులు మంగళవారం ఉదయం తిరుపతి–చైన్నె జాతీయ రహదారిలో రాస్తారోకో చేశారు. సంతానం లేదన్న కారణంతోనే హత్య చేశారని, భర్తతో పాటు బంధువులను అరెస్టు చేయాలని కోరుతూ నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న టౌన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చలు జరిపి రాస్తారోకో ను విరమింపచేశారు. కాగా బాధితుల రాస్తారోకో తో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
Comments
Please login to add a commentAdd a comment