ఆరతి హీరేమఠ (ఫైల్)
చిక్కబళ్లాపురం (బెంగళూరు): వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన చిక్కబళ్లాపురం నగరంలో చోటు చేసుకుంది. వివరాలు... ఇక్కడి ఇందిరా నగరలో నివాసం ఉంటున్న ఆరతి హీరేమఠ (35) నగరంలోని కోర్టులో ఎఫ్‌డీఏగా విధులు నిర్వహిస్తోంది. భర్త రామకృష్ణయ్య బెంగళూరులోని ఓ ప్రైవేట్ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తూ అక్కడే ఓ ఇంటిలో బిడ్డలతో నివాసం ఉంటున్నాడు.
చిక్కలో ఆరతి ఓ అద్దె ఇంటిలో ఉంటోంది. ఇదిలా ఉంటే గురువారం ఉదయం ఆరతి బయటకు రాకపోవడంతో ఇంటి పక్కన వారు పోలీసులకు, రామకృష్ణయ్యకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఇంటి వద్దకు చేరుకుని తలుపులు తెరచి చూడగా ఆరతి ఉరి వేసుకున్న స్థితిలో కనిపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment