రమ్య, రిషిక్‌రెడ్డి, హంసిక (ఫైల్)
నల్లగొండ క్రైం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా నడికుడ రైల్వేస్టేషన్ సమీపంలో ఓ మహిళ ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవడంతో నీలగిరిలో విషాదఛాయలు అలుముకున్నాయి. నార్కట్‌పల్లి మండలం ఔరవాణి గ్రామానికి చెందిన జాన్‌రెడ్డి, గాదె రమ్య(28) ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో తొమ్మిదేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వీరికి రిషిక్ రెడ్డి(8), హంసిక (6) సంతానం.జాన్‌రెడ్డి నార్కట్‌పల్లి పాత ఇనుప సామగ్రి కొనుగోలు చేసే వ్యాపారం చేస్తూ కుటుంబంతో కలిసి నల్లగొండలోని చైతన్యపురికాలనీలో నివాసం ఉంటున్నారు. రమ్య బిందెలపై డిజైన్ బొమ్మలు వేస్తూ భర్తకు చేదోడువాదోడుగా ఉంటోంది.
చదవండి👉🏻 'ఫోన్ నెంబర్ ఇవ్వు.. లేకపోతే లైంగికదాడి చేస్తాం'
కుటుంబ కలహాలే కారణమా?
రమ్య కొద్ది రోజులుగా పుట్టింట్లో ఉంటోంది. సోమవారం ఉదయం పిల్లలను బడికి పంపించేందుకు ఔరవాణి నుంచి నల్లగొండకు బయలుదేరింది. అయితే, రమ్య నల్లగొండకు రాకుండా పల్నాడు జిల్లాకు వెళ్లి పలక్‌నూమా రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు అక్కడి అధికారుల ద్వారా తెలిసింది. అయితే, రమ్య నల్లగొండకు రాకుండా పల్నాడు జిల్లాకు ఎందుకు వెళ్లిందని కుటుంబ సభ్యులకు అంతు చిక్కడం లేదు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే రమ్య తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుని ఉంటుందని భావిస్తున్నారు.
చదవండి👉🏻కొట్టుకుని కేసులు పెట్టుకున్న సీఐలు
Comments
Please login to add a commentAdd a comment