Falaknuma Express
-
ఫలక్ నుమా రైలు ప్రమాదంపై పోలీసుల విచారణ వేగవంతం
-
ఫలక్‌నుమా రైలు ప్రమాదానికి అదే కారణమా.. రైల్వే అధికారులు ఏం చెప్పారంటే!
సాక్షి,యాదాద్రి/బీబీనగర్: ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలు ఎస్–4లో షార్ట్ సర్క్యూట్‌తోనే అగ్ని ప్రమాదం జరిగిందని ఫోరెన్సిక్ నిపుణులు ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు సమాచారం. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మాయపల్లి– పగిడిపల్లి మధ్యన శుక్రవారం ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలుకు జరిగిన అగ్ని ప్రమాదంపై రైల్వే అధికారులు శనివారం ఉన్నత స్థాయి విచారణ చేపట్టారు. రైల్వే శాఖకు చెందిన ఎలక్ట్రానిక్ విభాగం సిబ్బంది బోగీలకు కింది భాగంలో గల బ్యాటరీలను క్షుణంగా పరిశీలించారు. బ్యాటరీల ద్వారా షార్ట్‌సర్క్యూట్ తలెత్తివుండవచ్చని అనుమానిస్తున్నారు. సిగరెట్ తాగి ప్రయాణికులు ఎవరైనా టాయిలెట్లలో పడివేయడంతో అగ్గి రాజుకుందా అన్న కోణంలో విచారణ చేయగా అలాంటి ఆనవాళ్లు లేనట్లు అధికారులు ఒక స్పష్టతకు వచ్చారు. విచారణకు సంబంధించిన పూర్తి నివేదికను సిద్ధం చేశారు. 32విభాగాల అధికారుల విచారణ ఘటనపై 32 విభాగాలకు చెందిన రైల్వే, రాష్ట్ర పోలీస్ అధికారులు విచారణ ప్రారంభించారు. బీబీనగర్ రైల్వేస్టేషన్లో ఉంచిన కాలిపోయిన బోగీలను శనివారం సుమారు 50 మంది అధికారులు పరిశీలించారు. ఎస్–4 బోగీతో పాటు కాలిపోయిన అన్ని బోగీల బ్యాటరీలను క్షుణ్ణంగా పరిశీలించారు. రిజర్వేçషన్ బోగీల్లో సెల్‌ఫోన్ చార్జింగ్ సాకెట్లలో ఏమైనా స్పార్క్ వచ్చిందా, లేక రైలు చక్రాల కింద నిప్పు రవ్వలు లేచి బోగీ అంటుకుందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. కాగా, కాలిపోయిన బోగీల్లో అధికారులకు బంగారు, వెండి ఆభరణాలు లభించాయి. అవి కాలిపోయి నల్లగా మారాయి. అలాగే లాప్టాప్, సెల్ఫోన్లు, సెల్‌ఫోన్ చార్జర్లు కాలిపోయి కన్పించాయి. -
ఫలక్‌నుమా ప్రమాదానికి కారణం అదే.. ఫోరెన్సిక్ నిపుణుల గుర్తింపు!
సాక్షి, హైదరాబాద్: ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో శుక్రవారం ఉదయం మంటలు వ్యాపించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో దాదాపు ఏడు బోగీలు దగ్ధమయ్యాయి. ఇక ప్రయాణికులంతా దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇక, ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ ప్రమాద కారణాలపై సందేహాలు ఇంకా నివృత్తి కావాల్సి ఉంది. క్లూస్ టీం చెబుతున్నట్లు.. షార్ట్‌సర్క్యూటేనా, ప్రయాణికుల్లో ఎవరిదైనా నిర్లక్ష్యమా, కుట్రకోణం ఏమైనా ఉందా అనేది తేలాల్సి ఉంది. మరోవైపు.. ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ అగ్నిప్రమాద ఘటనపై క్లూస్ టీం దర్యాప్తు ముగిసింది. ప్రమాదంపై క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. కాలిపోయిన బోగీలను ఫోరెన్సిక్ నిపుణులు క్షుణ్ణంగా పరిశీలించింది. ఎస్-4 బోగోలోని బాత్రూమ్ వద్ద పొగలు వ్యాపించినట్టు నిర్ధారణ చేశారు. ఎస్-4 బోగీలోని మంటలు ఇతర బోగీలకు వ్యాపించినట్టు తెలిపారు. బోగీలోని విద్యుత్ తీగల లోపాల వల్లే ప్రమాదం జరిగినట్టు గుర్తించారు. ఈ క్రమంలో ఫోరెన్సిక్ నివేదిక తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు వెల్లడించారు. క్లూస్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: ‘మోదీజీ.. గవర్నర్ తమిళిసైకు ఆ విషయం చెబితే బాగుండేది’ -
ఫలక్‌నుమా ప్రమాదానికి కారణం ఇదే!
సాక్షి, యాదాద్రి: ఫలక్‌నుమా ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రాథమిక అంచనా వేస్తున్నారు రైల్వే అధికారులు. ఈ మేరకు శనివారం బీబీ నగర్‌కు చేరుకున్న క్లూస్ టీం.. దగ్ధమైన బోగీలను పరిశీలించింది. సమగ్ర దర్యాప్తునకు 12 మంది అధికారులతో కూడిన బృందాన్ని దక్షిణ మధ్య రైల్వే పంపించగా .. ఈ టీం ఘటనకు సంబంధించి మరిన్ని ఆధారాలు సేకరించే పనిలో ఉంది. ఇదిలా ఉంటే.. ఎస్-4 కోచ్ బాత్రూమ్లో ముందుగా మంటలు చెలరేగినట్లు దర్యాప్తులో ప్రాథమికంగా తేలింది. అయితే దర్యాప్తు పూర్తి అయ్యాకే ప్రమాదం వెనక కారణాలపై స్పష్టత ఇస్తామని క్లూస్ టీం అంటోంది. హౌరా నుంచి సికింద్రాబాద్ ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్.. శుక్రవారం ఉదయం నల్లగొండ దాటి యాదాద్రి భువనగిరి జిల్లా పగిడిపల్లి-బొమ్మాయిపల్లి మధ్యలో.. రెండు బోగీల నుంచి దట్టమైన పొగలు రావడం ప్రారంభమైంది. అది గమనించి కొందరు ప్రయాణికులు కేకలు వేయడంతో.. రైలు నిలిచిపోయింది. ఇక ప్రయాణికులంతా దిగిపోయి పెను ప్రమాదం తప్పింది. మంటలు క్రమంగా 6 బోగీలకు వ్యాపించగా.. 5 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అయితే.. అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు తిట్టిపోస్తున్నారు. అయితే.. ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ ప్రమాద కారణాలపై సందేహాలు ఇంకా నివృత్తి కావాల్సి ఉంది. క్లూస్ టీం చెబుతున్నట్లు.. షార్ట్‌సర్క్యూటేనా, ప్రయాణికుల్లో ఎవరిదైనా నిర్లక్ష్యమా, కుట్రకోణం ఏమైనా ఉందా, రైలు నిర్వహణ సరిగా లేదా.. అనేది స్పష్టత రావాల్సి ఉంది. -
ఫలక్‌నూమా రైలులో మంటల కలకలం.. ఉలిక్కిపడ్డ ప్రయాణికులు
కోల్‌కతా నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న ఫలక్‌నూమా ఎక్స్‌ప్రెస్(రైలు నెంబర్ 12703)లో ప్రయాణికులు మరో అరగంటలో గమ్యస్థానానికి చేరుకోబోతున్నామనే ఆనందంలో ఉండగా.. ఒక్కసారిగా చెలరేగిన మంటలతో భీతిల్లిపోయారు. శుక్రవారం ఉదయం 10 గంటల తర్వాత రైలు బొమ్మాయిపల్లి – పగిడిపల్లి రైల్వే స్టేషన్ల మధ్యకు రాగానే ఒక్క కుదుపుతో ఆగింది. ఏం జరుగుతుందో తెలిసేలోపే కొందరు ప్రయాణికులు కిందకు దూకి దూరంగా పరుగెత్తారు. ముందుగా ఒక బోగీ నుంచి మంటలు, పొగ రావడం చూసి అన్ని బోగీలలోని ప్రయాణికులు ఉన్నఫలంగా కిందకు దిగి ప్రాణాలు కాపాడుకున్నారు. -సాక్షి, యాదాద్రి అప్పటి వరకు సాఫీగా సాగిపోతున్న ప్రయాణంలో ఒక్కసారిగా కలకలం రేగింది. సెల్‌ఫోన్ చాటింగ్‌లో కొందరు, వస్తున్నామంటూ తమ బంధువులకు సమాచారం ఇచ్చే వారు మరికొందరు, నిద్రలో ఉన్నవారు ఇంకొందరు ఇలా ఎవరి పనుల్లో వారు ఉండగా.. బోగీలకు మంటలు వ్యాపించాయనే సమాచారంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దట్టమైన పొగలు రావడంతో అరుపులు, కేకలు పెట్టారు. ఏమైందో అర్ధంకాక, ఏం చేయాలో తెలియక, భయం ఆందోళనతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కిందకు దిగి పరుగులు తీశారు. పొగల వెంట మంటలు వస్తుండడంతో ప్రాణాలతో బయటపడతామా అంటూ కొందరు ఏడుపు మొదలు పెట్టారు. రైలు ఆగడంతో ఒక్క ఉదుటున ప్రాణాలు కాపాడుకునేందుకు శక్తినంతా కూడగట్టుకుని రైల్లోంచి కిందికి దూకారు. రైలు పక్కన ఉన్న ఎత్తయిన మట్టిదిబ్బలను ఎక్కి ప్రాణాలు దక్కించుకున్నారు. బతుకుజీవుడా అంటూ దొరికిన వాహనం పట్టుకుని గమ్యస్థానం వైపు వెళ్లిపోయారు. అయితే, ఈ ప్రమాదంలో తమ ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నంలో విలువైన లగేజీని మాత్రం రైల్లోని వదిలివేయడంతో మంటలకు కాలిబూడిదైంది. షార్ట్ సర్క్యూటో.. లేక ఎవరైనా కావాలని చేశారో, మానవ తప్పిదంతో జరిగిందో తెలియదు కానీ, పెద్ద ప్రమాదం సంభవించింది. ప్రయాణికులు బోగీల నుంచి బయటకు దూకేశారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. అత్యవసర కిటికీలో నుంచి బయటపడ్డారు. లగేజీ తక్కువగా ఉన్నవారు, మొత్తం లగేజీ లేని వారు ఒక్కో బ్యాగు ఉన్న వారు ముందుగా బయటపడ్డారు. ఓ వైపు మంటలు పెరిగిపోతున్నాయి.. బోగీ నుంచి మరో బోగీకి మంటలు వ్యాపిస్తున్నాయి. మరో వైపు కిక్కిరిసిన ప్రయాణికుల నుంచి బయటపడాలి. ఇంకో వైపు బ్యాగులు వెంట తీసుకుపోలేక నానా యాతనపడ్డారు. చూస్తుండగానే మంటలు బోగీ లకు వ్యాపించాయి. ప్రయాణికులంతా అప్పటికే దిగిపోవడంతో ప్రాణ నష్టం జరగలేదు. ఎవరెక్కడున్నారో తెలియని అయోమయం బోగీల్లో దట్టమైన పొగలు వ్యాపిస్తుండడంతో ఒకరికొకరు కనిపించని భయానక పరిస్థితి, కుటుంబ సభ్యులు ఎక్కుడున్నారో తెలియని ఆందోళన. అయినా తమ ప్రాణాలకంటే ఏదీ ఎక్కువ కాదని బతికి బయట పడాలన్న తపనతో ధైర్యం చేశారు. ప్రాణాలతో బయటపడితే చాలు అనుకుని తమ చేతికి అందిన లగేజీ బ్యాగులతో బయటపడ్డారు. బోగీ వెనక బోగీకి మంటలు చిన్నగా రేగిన మంటలు వరుసగా బోగీలకు వ్యాపించాయి. దట్టమైన పొగలతో పగిడిపల్లి ప్రాంతం అంతా భయానక వాతావరణం నెలకొంది. ఎస్4, ఎస్5, ఎస్6, ఎస్3, ఎస్2 బోగీలు మంటలో చిక్కుకున్నాయి. మంటల ధాటికి ఇనుప చువ్వలు, సీట్లు, బోగి పైబర్ అన్ని కాలుకుంటూ బోగీ మొత్తం వ్యాపించాయి. ఒక దాని తర్వాత మరొకటి చొప్పున మొత్తం 5 బోగీలు కాలిపోయాయి. మరో రెండు బోగీలు స్వల్పంగా కాలిపోయాయి. మైనారిటీ గురుకుల విద్యార్థుల సహాయక చర్యలు రైలులో మంటలు చెలరేగిన ఘటనా స్థలానికి దగ్గరలో ఉన్న తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాల ప్రిన్సి పాల్ శ్రీకాంత్ గుర్తించి మీడియా, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అలాగే పాఠశాల టీచర్లు, విద్యార్థులు వెంటనే స్పందించి ప్రయాణికులను రైలు నుంచి జాగ్రత్తగా దింపి వారికి సహాయపడ్డారు. వారందరిని మైనారిటీ పాఠశాలకు చేర్చి మంచినీరు, పిల్లలకు పాలు, బిస్కెట్లు అందించారు. ఆటోలో హైవే వరకు చేర్చటం, అలాగే మిగిలిన ప్రయాణికులకు, పోలీసులకు, సహాయక సిబ్బందికి భోజనం వసతి ఏర్పాటు చేశారు. కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, ఆర్డీఓ భూపాల్ రెడ్డి, పోలీసు అధికారులు పాఠశాల సిబ్బందిని, విద్యార్థులను అభినందించారు. సహాయక చర్యలను పరిశీలించిన ఎమ్మెల్యే ఫలక్‌నూమా రైలు అగ్ని ప్రమాదానికి గురైన విషయాన్ని తెలుసుకున్న భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పరిశీలించారు. అధికారులతో ప్రమాదం జరిగిన తీరును తెలుసుకొని అక్కడ పరిస్థితిని సమీక్షించారు. నా సర్టిఫికెట్లు కాలిపోయాయి నేను ప్రయాణం చేస్తున్న రైలు బోగి దగ్ధమైంది. నేను, మా అమ్మనాన్నతో కలిసి హైదరాబాద్‌కు వెళ్తున్నాం. మా వద్ద మొత్తం 9 లగేజీ బ్యాగులు ఉన్నాయి. భయంతో నాలుగు బ్యాగులు మాత్రమే తీసుకుని కిందికి దిగాం. పదవ తరగతి, ఇంటర్, ఇంజనీరింగ్ సర్టిపికెట్లు అన్నీ బ్యాగులోనే ఉన్నాయి. బ్యాగులన్నీ కాలిపోయాయి. అక్కడికి వచ్చిన జిల్లా కలెక్టర్‌కు నా బాధను చెప్పాను. సర్టిఫికెట్లు జారీ కోసం సహాయం చేస్తాని హామీ ఇచ్చారు. – యశ్విత, ప్రయాణికురాలు, ఒడిశా చైన్ లాగి కిందికి దూకిన రాజు రైలులో పొగలు, మంటలు చెలరేగుతుండడంతో ప్రమాదాన్ని పసిగట్టి అందులో ప్రయాణిస్తున్న రాజు అనే ప్రయాణికుడు రైలు చైన్ లాగి పక్కనే ఉన్న తన తల్లితో చెప్పి కిందికి దూకేశాడు. దీంతో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. స్పృహతప్పి కింద పడిపోయాడు. పోలీస్‌లు రాజును భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించారు. అనంతరం లాలాగూడ రైల్వే ఆస్పత్రికి తరలించారు. సమన్వయంతో అదుపులోకి – కలెక్టర్ పమేలా సత్పతి అన్ని శాఖల సమన్వయంతో మంటలు ఆర్పినట్లు భువనగిరి కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ప్రయాణికులకు ఆహార సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. మెడికల్ టీమ్స్ అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. రాచకొండ సీపీ ఆధ్వర్యంలో.. రైలు అగ్నిప్రమాదానికి గురైన ప్రదేశాన్ని రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ సందర్శించారు. రైల్వే శాఖ అధికారులు, సిబ్బందితో కలిసి.. శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. ట్రాఫిక్ డీసీపీ అభిషేక్ మహంతి, యాదాద్రి డీసీపీ రాజేష్ చంద్ర, ఇతర అధికారులు కమిషనర్ వెంట ఉన్నారు. -
ప్రమాదమా ? కుట్రా ?
-
బూడిదైన ఫలక్‌నుమా.. కేసు నమోదు
సాక్షి, యాదాద్రి: ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ దగ్ధం ఘటనలో కేసు నమోదు చేశారు. ఐదు బోగీలు పూర్తిగా దగ్ధమైనట్లు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఫలక్‌నుమా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఘటనపై.. రైల్వే యాక్ట్ సెక్షన్ 80/2023 కింద కేసు నమోదు చేశారు. హౌరా(కోల్‌కతా) నుంచి సికింద్రాబాద్ వస్తున్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ (Falaknuma express)లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రెండు బోగీల్లోంచి దట్టమైన పొగలు వస్తున్నట్లు గమనించిన సిబ్బంది అప్రమత్తమై రైలును నిలిపివేశారు. ఆ రెండు బోగీల్లోని ప్రయాణికులను కిందికి దించేశారు. దీంతో ప్రాణనష్టం తప్పింది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలోని పగిడిపల్లి - బొమ్మాయిపల్లి మధ్య జరిగింది. మంటలు క్రమంగా 6 బోగీలకు వ్యాపించగా.. 5 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటల్లో ఫలక్‌నుమా.. ఫొటోలు ప్రయాణికుల మండిపాటు అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆరోపించారు. ఒడిశా బాలాసోర్‌లో దాదాపు 300 మందిని పొట్టనబెట్టుకున్న ఘోర ప్రమాదం తర్వాత కూడా ఎలాంటి భద్రతా చర్యలు పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాగులు కాలిపోయాయని కొందరు.. మరికొందరు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీశామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకొందరు నగదు, సామగ్రి కోల్పోయామని పేర్కొన్నారు. ఇదీ చదవండి: ఫలక్‌నుమా అంటే అర్థం తెలుసా? -
సికింద్రాబాద్ చేరుకున్న ఫలక్‌నుమా.. ప్రయాణీకులు చెబుతున్నది ఇదే..
సాక్షి, సికింద్రాబాద్: ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ చేరుకుంది. ప్లాట్ఫ్లామ్-1పైకి ఫలక్‌నుమా రైలు చేరుకుంది. అగ్నిప్రమాదం అనంతరం.. 11 బోగీలతో ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్‌కు చేరుకుంది. అనంతరం, రైల్వే అధికారులు ప్రయాణీకులు వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఇక, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ప్రయాణీకులు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ప్రత్యక్ష సాక్షి మాట్లాడుతూ.. ఛార్జింగ్ పాయింట్ దగ్గర సిగరెట్ తాగడం వల్లే ప్రమాదం జరిగింది. అతి పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాం. రైలులో సిగరెట్లను స్నాక్స్ అమ్ముతున్నట్టుగా అమ్ముతున్నా టీటీ సహా ఎవరూ పట్టించుకోలేదు. సిగరెట్లు, గుట్కాలను రైలు అమ్ముతున్నారు. ఎవరో చైన్ లాగడంతో రైలు ఆగింది. ముందుగా ఎస్4 బోగీలో మంటలు వ్యాపించాయి. ప్రమాదంలో రైలు నుంచి పరుగులు తీశాం. మా లగేజీ మొత్తం కాలిబూడిదైపోయింది. వస్తువులు, బ్యాగులు, డబ్బులన్నీ కాలిపోయాయి. పగలు ప్రమాదం జరగడంతో పెను ప్రమాదం తప్పింది. అదే రాత్రి సమయంలో అయితే భారీగా ప్రాణ నష్టం జరిగి ఉండేదన్నారు. ఇదిలా ఉండగా.. హౌరా నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలు అగ్నిప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఒక బోగిలో మంటలు వ్యాపించిన విషయాన్ని గమనించిన ఓ ప్రయాణీకుడు వెంటనే చైన్ లాగడంతో రైలు ఆగింది. దీంతో, ఆ బోగిలో ఉన్న ప్రయాణికులు వెంటనే కిందకు దిగారు. మిగతా బోగీల ప్రయాణికులను సైతం కిందకు దింపారు. చూస్తుండగానే మంటలు పక్క బోగీలకు అంటుకున్నాయి. చైన్ లాగకుండా ఉండి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో తలుచుకుంటే భయమేస్తుంది అంటూ ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, చైన్‌లాగిన వ్యక్తి అస్వస్థతకు గురైనట్లు సమాచారం. మంటలు అంటుకున్నపుడు భయపడి ఆందోళనకు గురయ్యాడో ఏమో మొత్తం మీద అతన్ని రైల్వే సిబ్బంది ఆసుత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. చైన్ లాగిన వ్యక్తిది శ్రీకాకుళం జిల్లా పలాస అని తెలుస్తున్నది. ఇది కూడా చదవండి: ఫలక్‌నుమా రైలు ప్రమాదం.. పలు రైళ్లు రద్దు, దారి మళ్లింపు -
ఎప్పుడూ రద్దీనే.. ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌కి ఆ పేరెలా వచ్చిందంటే..
అగ్ని ప్రమాదం ఘటన నేపథ్యంలో ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ Falaknuma Express ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ఎవరికీ ఏం కాకపోవడంతో అధికారులూ ఊపిరి పీల్చుకున్నారు. జరిగింది ప్రమాదమా? లేదంటే కుట్ర ఏమైనా ఉందా? అనే కోణంలోనూ చర్చ నడుస్తోంది. ఈ తరుణంలో రైలు నేపథ్యం గురించీ కొందరు గూగుల్ తల్లిని ఆరాలు తీస్తున్నారు. ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌కు Falaknuma Express ఆ పేరు హైదరాబాద్ నగరంలోని ఫలక్‌నుమా ప్యాలెస్ పేరు మీద నుంచే వచ్చింది. ఫలక్‌నుమా అనేది పర్షియా పదం. దాని అర్థం గగన ప్రతిబింబం లేదా స్వర్గ ప్రతిబింబం అని. 🚆 ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ దక్షిణ మధ్య రైల్వే ఆధీనంలో నడిచే సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్. 🚆 1993 అక్టోబర్ 15వ తేదీన ఫలక్‌నుమా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ తొలి సర్వీస్ పట్టాలెక్కింది. 🚆హౌరా జంక్షన్ నుంచి ఉదయం ప్రారంభమయ్యే ఫలక్‌నుమా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్.. మరుసటి రోజు ఉదయం సికింద్రాబాద్ జంక్షన్ స్టేషన్‌కు చేరుకుంటుంది. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో సికింద్రాబాద్ జంక్షన్ నుంచి ప్రారంభమై.. మరుసటిరోజు సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో చేరుకుంటుంది. 🚆 నిత్యం నడిచే ఈ రైలు.. 1,544 కిలోమీటర్లు (959 మైళ్ల) ప్రయాణిస్తుంది. 🚆 సగటు వేగం.. గంటకు 60కిలోమీటర్లు. గరిష్ట వేగం 110 కిలోమీటర్లుగా ఉంటుంది. 12703 హౌరా టు సికింద్రాబాద్, అలాగే 12704 సికింద్రాబాద్-హౌరా రూట్లోనే ఇదే సగటు వేగంగా.. దాదాపు 26 గంటలకు తన ట్రిప్ ముగిస్తుంది. 🚆 నిత్యం కిక్కిరిసిపోయే ప్రయాణికులతో తీవ్రరద్దీ మధ్య ఈ రైలు పరుగులు పెడుతుంది. అందుకు ప్రధాన కారణం.. తక్కువ స్టేషన్లలో ఈ రైలు ఆగడం. 🚆 సికింద్రాబాద్-హౌరా మధ్యలో 24 స్టేషన్లలో మాత్రమే ఈ రైలు ఆగుతుంది. ఏసీ ఫస్ట్‌క్లాస్‌తో పాటు ఏసీ టూ టైర్, ఏసీ త్రీ టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ అన్రిజర్వ్డ్ కోచ్‌లు ఉంటాయి. క్యాటరింగ్ సౌకర్యమూ ఉంది. 🚆 రైలు సాధారణంగా 24 ప్రామాణిక ICF కోచ్‌లను కలిగి ఉంటుంది. 🚆 నల్లగొండ, గుంటూరు జంక్షన్, విజయవాడ జంక్షన్, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట జంక్షన్, విశాఖపట్నం, విజయనగరం జంక్షన్, శ్రీకాకుళం రోడ్, పలాస, బ్రహ్మపూర్, ఖుర్దా రోడ్ జంక్షన్, భువనేశ్వర్, కటక్ జంక్షన్, భద్రక్, బాలాసోర్(తాజాగా ప్రమాదం జరిగింది ఈ పరిధిలోనే), ఖరగ్‌పూర్ జంక్షన్, హౌరా.. ఇలా ప్రధాన స్టేషన్లలో హాల్టింగ్ ఉంది. 🚆గతంలో ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్.. నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్(సికింద్రాబాద్-తిరుపతి) రేక్స్(కోచ్‌లను) మార్చుకునేది. ప్రస్తుతం 17063/17064 అజంతా ఎక్స్‌ప్రెస్(సికింద్రాబాద్-మన్మాడ్(మహారాష్ట్ర) రైలుతో పంచుకుంటోంది. 🚆శతాబ్ధి, రాజధాని, దురంతో సూపర్‌ఫాస్ట్ రైళ్ల మాదిరి ఈ రైలును శుభ్రంగా మెయింటెన్ చేస్తుంది భారతీయ రైల్వేస్. అందుకే ప్రయాణికులు ఈ రూట్లో ఈ రైలుకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. 🚆🔥 అయితే.. గత కొంతకాలంగా ఈ రైలు నిర్వహణపై విమర్శలు వినిపిస్తున్నాయి. తాజా ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడి సికింద్రాబాద్ చేరుకున్న ప్రయాణికులు కొందరు.. ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో సిగరెట్లు, గుట్కాలు అమ్ముతున్నారంటూ ఆరోపించడం గమనార్హం. ఇదీ చదవండి: ఫలక్‌నుమా ప్రమాదం.. రాత్రిపూట జరిగి ఉంటేనా? -
రైల్వే ప్రమాదంపై బెదిరింపు లేఖ.. పోలీసుల అదుపులో ఆగంతకుడు!
సాక్షి, హైదరాబాద్: యాదాద్రి జిల్లాలో ఫలక్‌నుమా ఎక్స్రైలుకు మంటలు అంటుకున్న విషయం తెలిసిందే. షాట్ సర్క్యూట్‌తో బోగీలకు మంటలు చెలరేగడంతో బొమ్మాయిపల్లి-పగిడిపల్లి మధ్య రైలును ఆపేశారు. అప్రమత్తమైన ప్రయాణికులు ట్రైన్ దిగి వెళ్లడంతో ఘోర ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో దాదాపు ఏడు బోగీలు దగ్ధమైనట్టు సమాచారం. ఇదిలా ఉండగా.. ఇటీవలే దక్షిణ మధ్య రైల్వేకు ఓ ఆగంతకుడు బెదిరింపు లేఖ రాసిన విషయం తెలిసిందే. త్వరలో ఘోర రైలు ప్రమాదం జరుగుతుందని లేఖలో రైల్వే అధికారులను హెచ్చరించాడు. వారంలో ఒడిశా తరహాలోనే ప్రమాదం జరుగుతుందని బెదిరింపులకు పాల్పడ్డాడు. హైదరాబాద్ – ఢిల్లీ మార్గంలో ఘటన జరుగుతుందని హెచ్చరించాడు. అయితే, ఆగంతకుడి నుంచి గతవారం హెచ్చరిక లేఖ రైల్వే అధికారులకు అందింది. దాంతో అప్రమత్తమైన అధికారులు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ఈ లేఖపై గోపాలపురం పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా బీహెచ్ఈఎల్ ప్రాంతానికి చెందిన అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక, అతడిని పోలీసులు విచారిస్తున్నట్టు తెలిపారు. కాగా, ఈ ప్రమాదానికి లేఖకు సంబంధంలేదని అధికారులు చెబుతున్నారు. మరోవైపు.. ఫలక్నామా ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం కారణంగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు పలు రైళ్లను రద్దు చేశారు. ఇది కూడా చదవండి: ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. 3 బోగీలు దగ్ధం -
Falaknuma Express: రైలు ప్రమాద ఘటనపై స్పందించిన డీజీపీ, రైల్వే జీఎం
సాక్షి, యాదాద్రి: ఫలక్‌నుమా రైలు ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించామని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ పేర్కొన్నారు. దర్యాప్తు తర్వాత ప్రమాద కారణాలు తెలుస్తాయని తెలిపారు. మంటల్లో 7 బోగీలు దగ్ధమయ్యాయని చెప్పారు. మిగతా 11 బోగీలతో సికింద్రాబాద్‌కు రైలును తరలించామని పేర్కొన్నారు. ఈ మేరకు ఘటనా స్థలాన్ని అరుణ్‌కుమార్ పరిశీలించారు. మరోవైపు ఫలక్‌నుమా రైలు ప్రమాద ఘటనపై డీజీపీ అంజనీ కుమార్ ట్వీట్ చేశారు. ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని తెలిపారు. ప్రమాదానికి కారణాలను విశ్లేషిస్తున్నామని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. కాలిపోయిన బోగీల్లోని ప్రయాణికులను బస్సుల్లో తరలించామని తెలిపారు. All passengers are safely evacuated and shifted in buses after a fire broke out in the Falaknuma Express near Bhongir rural PS limits. Police, Fire Dept, and Railways are working in coordination. So far, no fatalities have been reported. Out of 18 coaches 11 are detached and… pic.twitter.com/TtgD5BzFP6 — DGP TELANGANA POLICE (@TelanganaDGP) July 7, 2023 కాగా యాదాద్రి జిల్లాలోని పగిడిపల్లి వద్ద ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలు శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో ప్రమాదానికి గురైంది. షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగి 7 బోగీలు దగ్ధమయ్యాయి. ప్రయాణికులు ముందుగానే దిగిపోవడంతో ప్రాణనష్టం తప్పింది. రైలు హౌరా నుంచి సికింద్రాబాద్ వస్తుండగా ప్రమాదం జరిగింది. All passengers are safely evacuated and shifted in buses after a fire broke out in the Falaknuma Express near Bhongir rural PS limits. Police, Fire Dept, and Railways are working in coordination. So far, no fatalities have been reported. Out of 18 coaches 11 are detached and… pic.twitter.com/TtgD5BzFP6 — DGP TELANGANA POLICE (@TelanganaDGP) July 7, 2023 -
రైల్లో మంటలు కారణం ఇదేనా...
-
ఫలక్‌నుమా రైలు ప్రమాదం.. విద్రోహ చర్యా?
సాక్షి, యాదాద్రి జిల్లా: యాదాద్రి జిల్లాలో ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌కు మంటలు అంటుకున్న విషయం తెలిసిందే. షాట్ సర్క్యూట్‌తో బోగీలకు మంటలు చెలరేగడంతో బొమ్మాయిపల్లి-పగిడిపల్లి మధ్య రైలును ఆపేశారు. అప్రమత్తమైన ప్రయాణికులు ట్రైన్ దిగి వెళ్లడంతో ఘోర ప్రమాదం తప్పింది. మంటల ధాటికి మూడు బోగీలు(S4,S5,S6) పూర్తిగా దగ్ధమయ్యాయి. శుక్రవారం ఉదయం 11.25 నిమిషాలకు ప్రమాదం జరగ్గా.. సమాచారం అందుకున్న రైల్వే, ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సహాయక చర్యలను జీఎం అరుణ్ కుమార్ పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఫలక్‌నుమా రైలు ప్రమాదానికి గల కారణాలు ఏంటనేది చర్చనీయాంశంగా మారింది. చార్జింగ్ పాయింట్ వద్ద ఓ ప్రయాణికుడు సిగరెట్ తాగుతున్నట్లు గమనించామని, మంటలు అలుముకున్నాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అయితే ప్రమాదం వెనుక విద్రోహ చర్య ఉండవచ్చని అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో రైల్వేశాఖ అధికారులు విచారణ చేపట్టారు. సంబంధిత వార్త: Yadadri: ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. నాలుగు బోగీలు దగ్ధం కాగా కొన్ని రోజుల క్రితం సౌత్ సెంట్రల్‌కు వచ్చిన బెదిరింపు లేఖ పలు అనుమానాలకు తావిస్తోంది. హైదరాబాద్, ఢిల్లీ రూట్లో బాలాసోర్ వంటి ప్రమాదం జరుగుతుందని ఓ అంగతకుడు లేఖలో హెచ్చరించారు. ఈ లేఖపై అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆ లేఖకు దీనికి ఏమైనా లింక్ అందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. రైలు ప్రమాదంపై అధికారులు హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశారు. 36912, 82819 టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేశారు. ఇక హైరా నుంచి హైదరాబాద్‌కు 1550 కిలోమీటర్ల దూరం ఉండగా.. గమ్యం మరో 40 కిలో మీటర్లు ఉందనగా ఈ ప్రమాదం జరిగింది. పగలు కావడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. ప్రయాణికులు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటన రాత్రిపూట జరిగితే ఎన్ని ప్రాణాలు పోయేవోనని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిగతా బోగీలతో సికింద్రాబాద్‌కు రైలు ప్రయాణమైంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Falaknuma Express : ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో మంటలు (ఫొటోలు)
-
Yadadri: ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. మూడు బోగీలు దగ్ధం
సాక్షి, యాదాద్రి: ఫలక్‌నుమా సూపర్‌ఫాస్ట్ రైలులో శుక్రవారం మంటలు చెలరేగాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలోని బొమ్మాయిపల్లి-పగిడిపల్లి మధ్య ఈ ఘటన జరిగింది. ఇప్పటివరకు కారణం ఏంటన్నది అధికారికంగా వెల్లడించలేదు. ప్రాథమికంగా షాట్ సర్క్యూట్ జరిగిందా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మంటలు పూర్తిగా పెరగకముందే బోగీల్లోని ప్రయాణికులను దించేయడంతో ప్రాణ నష్టం తప్పింది. రైళ్ల రాకపోకలకు అంతరాయం ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం జరిగినప్పటికీ ప్రాణనష్టం జరగకపోవడం స్వల్ప ఉపశమనం. మంటల ధాటికి మూడు బోగీలు పూర్తిగా దగ్ధమైమయ్యాయి. రైలు హౌరా నుంచి సికింద్రాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద ఘటన కారణంగా ఈ రూటులో వెళ్లే పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. తప్పిన పెనుముప్పు మంటలు చెలరేగడానికి కచ్చితంగా కారణం ఏంటన్నది తెలియకపోయినా.. కొందరు ప్రయాణీకులు మాత్రం రైలులో ఓ వ్యక్తి సిగరెట్ తాగుతున్నట్టు గమనించామని తెలిపారు. ఛార్జింగ్ పాయింట్ వద్ద ఓ ప్రయాణికుడు సిగరెట్ తాగుతూ కనిపించాడని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. తొలుత S4లో మంటలు వ్యాపించాయని చెప్పారు. ఉదయం 11 -11.30 గంటల మధ్య ప్రమాదం జరిగిందని, మంటలు రావడంతో ప్రయాణీకులు చైన్ లాగి రైలుని ఆపివేశారు. ప్రయాణికులు అప్రమత్తమై దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. చైన్ లాగకపోయి ఉంటే భారీ ప్రమాదం జరిగి ఉండేదని పేర్కొన్నారు. కాగా కాలిపోయిన బోగీల్లో ఎక్కువ మంది విశాఖ వాసులు ఉన్నారు. రిజర్వేషన్ లేకున్నా.. కొందరు స్లీపర్ బోగీల్లో ఎక్కినట్టు గుర్తించారు. మొత్తం మూడు బోగీలకు మంటలు వ్యాపించాయి. ఫలక్‌నుమా S4, S5, S6 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. పక్క బోగీలకు మంటలు వ్యాపించకుండా అధికారులు లింక్ తొలగించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: హైదరాబాద్‌లో ‘కేరళ స్టోరీ’ ఉదంతం.. కూతురు జాడ చెప్పాలంటూ.. -
నీలగిరిలో విషాదం: తొమ్మిదేళ్ల క్రితం ప్రేమ వివాహం.. ఇద్దరు పిల్లలతో కలిసి..
నల్లగొండ క్రైం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా నడికుడ రైల్వేస్టేషన్ సమీపంలో ఓ మహిళ ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవడంతో నీలగిరిలో విషాదఛాయలు అలుముకున్నాయి. నార్కట్‌పల్లి మండలం ఔరవాణి గ్రామానికి చెందిన జాన్‌రెడ్డి, గాదె రమ్య(28) ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో తొమ్మిదేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వీరికి రిషిక్ రెడ్డి(8), హంసిక (6) సంతానం.జాన్‌రెడ్డి నార్కట్‌పల్లి పాత ఇనుప సామగ్రి కొనుగోలు చేసే వ్యాపారం చేస్తూ కుటుంబంతో కలిసి నల్లగొండలోని చైతన్యపురికాలనీలో నివాసం ఉంటున్నారు. రమ్య బిందెలపై డిజైన్ బొమ్మలు వేస్తూ భర్తకు చేదోడువాదోడుగా ఉంటోంది. చదవండి👉🏻 'ఫోన్ నెంబర్ ఇవ్వు.. లేకపోతే లైంగికదాడి చేస్తాం' కుటుంబ కలహాలే కారణమా? రమ్య కొద్ది రోజులుగా పుట్టింట్లో ఉంటోంది. సోమవారం ఉదయం పిల్లలను బడికి పంపించేందుకు ఔరవాణి నుంచి నల్లగొండకు బయలుదేరింది. అయితే, రమ్య నల్లగొండకు రాకుండా పల్నాడు జిల్లాకు వెళ్లి పలక్‌నూమా రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు అక్కడి అధికారుల ద్వారా తెలిసింది. అయితే, రమ్య నల్లగొండకు రాకుండా పల్నాడు జిల్లాకు ఎందుకు వెళ్లిందని కుటుంబ సభ్యులకు అంతు చిక్కడం లేదు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే రమ్య తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుని ఉంటుందని భావిస్తున్నారు. చదవండి👉🏻కొట్టుకుని కేసులు పెట్టుకున్న సీఐలు -
పట్టాలు తప్పిన ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్
కటక్: సికింద్రాబాద్-హౌరా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌కు గురువారం పెను ప్రమాదం తప్పింది. గురువారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ గార్డ్ బోగీ పట్టాలు తప్పింది. ఈ ఘటన ఒడిశాలోని కటక్ సమీపంలో చోటుచేసుకుంది. దీంతో రైలును వెంటనే ఆపేశారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మరమ్మతులు చేపట్టారు. దీంతో ఆ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కానట్టుగా తెలుస్తోంది. గార్డ్ బోగీ కాకుండా ఇతర బోగీలు పట్టాలు తప్పి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా రైలు పట్టాలు తప్పడానికి గల కారణాలు తెలియరాలేదు. -
ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో బాంబు!
-
ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో బాంబు!
ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌కు పెద్ద ముప్పు తప్పింది. ఆ రైల్లో గుర్తుతెలియని వ్యక్తులు పెట్టిన బాంబును రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది గుర్తించారు. పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలోని హౌరా రైల్వేస్టేషన్లో ఈ రైలు ఆగి ఉన్న సమయంలో బాంబును గుర్తించారు. రైల్లో ఓ సిలిండర్ అనుమానాస్పదంగా కనిపించడంతో వాళ్లు దాన్ని తనిఖీ చేశారు. వెంటనే బాంబు డిస్పోజల్ స్క్వాడ్‌కు సమాచారం అందించడంతో వాళ్లు వచ్చి, ఆ సిలిండర్‌ను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి, అక్కడ దాన్ని నిర్వీర్యం చేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. స్టేషన్లో ఉన్న సమయంలో రైల్లో పేలుడు సంభవించి ఉంటే, నష్టం తీవ్రత ఎక్కువగానే ఉండేదని నిపుణులు అంటున్నారు. -
పోలీసుల అదుపులో 60 మంది బాలకార్మికులు
విశాఖపట్నం: నిన్నమొన్నటి వరకు హైదరాబాద్ పాతబస్తీలో బాలకార్మికుల ఉదంతాలు వరుసగా వెలుగులోకిరాగా.. బుధవారం విశాఖపట్టణంలో 60 మంది బాలకార్మికులను పోలీసులు గుర్తించారు. ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలులో పశ్చిమబెంగాల్ నుంచి వస్తున్నట్లుగా భావిస్తున్న 60 మంది బాలలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలలను ఎక్కడి తరిస్తున్నారు? ఈ ముఠా వెనుక ఎవరున్నారు? అనే విషయాలు తెలియాల్సిఉందని పోలీసులు చెప్పారు. -
ఫలక్‌నుమా లో మంటలు:భయంతో పరుగులు తీసిన ప్రయాణికులు
శ్రీకాకుళం: ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ లో శనివారం అకస్మికంగా మంటలు వ్యాపించాయి. జిల్లాలోని నందిగామ మండలం రౌతుపురం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. మంటలు వ్యాపించడాన్ని రైల్వే సిబ్బంది పసిగట్టడంతో ట్రైన్ ను నిలిపివేశారు. ఒక్కసారిగా చోటు చేసుకున్న ఈ పరిణామానికి ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. ట్రైన్ ను నిలిపి వేసిన అనంతరం మంటలను అదుపు చేశారు. ప్రస్తుతం మరమ్మత్తులు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. -
ఆలస్యంగా నడుస్తున్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్
గుంటూరు : సికింద్రాబాద్ నుంచి కోల్కత్తా మధ్య నడిచే ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం తప్పింది. గుంటూరు జిల్లా మంగళగిరి వద్ద ఇంజిన్ నుండి రెండు బోగీలు విడిపోయాయి. విజయవాడ నుంచి ఈరోజు తెల్లవారుజామున నాలుగు గంటలకు బయల్దేరిన రైలు మంగళగిరి సమీపంలోకి రాగానే బోగీలకు, ఇంజిన్‌కు మధ్య లింక్ తెగిపోవటంతో ఈ ఘటన జరిగింది. అయితే రైలు నెమ్మదిగా నడుస్తుండటంతో ప్రమాదం తప్పింది.సకాలంలో గుర్తించిన సిబ్బంది రైలును నిలిపివేశారు. అనంతరం రైలును కృష్ణా కెనాల్ జంక్షన్‌కు తీసుకువెళ్లి మరమ్మతులు నిర్వహించారు.ఆ తర్వాత రైలు సికింద్రాబాద్ బలయద్ఏరింది. దీంతో ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రెండు గంటలు ఆలస్యంగా నడుస్తోంది.