Person Who Wrote Threatening Letter On Train Accident Was Arrested - Sakshi
Sakshi News home page

ఫలక్‌నుమా రైలు ప్రమాదం.. పలు రైళ్లు రద్దు, దారి మళ్లింపు

Published Fri, Jul 7 2023 2:40 PM | Last Updated on Fri, Jul 7 2023 2:57 PM

Person Who Wrote Threatening Letter On Train Accident Was Arrested - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: యాదాద్రి జిల్లాలో ఫలక్‌నుమా ఎక్స్‌రైలుకు మంటలు అంటుకున్న విషయం తెలిసిందే. షాట్‌ సర్క్యూట్‌తో బోగీలకు మంటలు చెలరేగడంతో బొమ్మాయిపల్లి-పగిడిపల్లి మధ్య రైలును ఆపేశారు. అప్రమత్తమైన ప్రయాణికులు ట్రైన్‌ దిగి వెళ్లడంతో ఘోర ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో దాదాపు ఏడు బోగీలు దగ్ధమైనట్టు సమాచారం. 

ఇదిలా ఉండగా.. ఇటీవలే దక్షిణ మధ్య రైల్వేకు ఓ ఆగంతకుడు బెదిరింపు లేఖ రాసిన విషయం తెలిసిందే. త్వరలో ఘోర రైలు ప్రమాదం జరుగుతుందని లేఖలో రైల్వే అధికారులను హెచ్చరించాడు. వారంలో ఒడిశా తరహాలోనే ప్రమాదం జరుగుతుందని బెదిరింపులకు పాల్పడ్డాడు. హైదరాబాద్‌ – ఢిల్లీ మార్గంలో ఘటన జరుగుతుందని హెచ్చరించాడు. అయితే, ఆగంతకుడి నుంచి గతవారం హెచ్చరిక లేఖ రైల్వే అధికారులకు అందింది. దాంతో అప్రమత్తమైన అధికారులు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

అయితే, ఈ లేఖపై గోపాలపురం పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా బీహెచ్‌ఈఎల్‌ ప్రాంతానికి చెందిన అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక, అతడిని పోలీసులు విచారిస్తున్నట్టు తెలిపారు. కాగా, ఈ ప్రమాదానికి లేఖకు సంబంధంలేదని అధికారులు చెబుతున్నారు. మరోవైపు.. ఫలక్‌నామా ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదం కారణంగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు పలు రైళ్లను రద్దు చేశారు. 

ఇది కూడా చదవండి: ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. 3 బోగీలు దగ్ధం


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement