gopalapuram police station
-
రైల్వే ప్రమాదంపై బెదిరింపు లేఖ.. పోలీసుల అదుపులో ఆగంతకుడు!
సాక్షి, హైదరాబాద్: యాదాద్రి జిల్లాలో ఫలక్‌నుమా ఎక్స్రైలుకు మంటలు అంటుకున్న విషయం తెలిసిందే. షాట్ సర్క్యూట్‌తో బోగీలకు మంటలు చెలరేగడంతో బొమ్మాయిపల్లి-పగిడిపల్లి మధ్య రైలును ఆపేశారు. అప్రమత్తమైన ప్రయాణికులు ట్రైన్ దిగి వెళ్లడంతో ఘోర ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో దాదాపు ఏడు బోగీలు దగ్ధమైనట్టు సమాచారం. ఇదిలా ఉండగా.. ఇటీవలే దక్షిణ మధ్య రైల్వేకు ఓ ఆగంతకుడు బెదిరింపు లేఖ రాసిన విషయం తెలిసిందే. త్వరలో ఘోర రైలు ప్రమాదం జరుగుతుందని లేఖలో రైల్వే అధికారులను హెచ్చరించాడు. వారంలో ఒడిశా తరహాలోనే ప్రమాదం జరుగుతుందని బెదిరింపులకు పాల్పడ్డాడు. హైదరాబాద్ – ఢిల్లీ మార్గంలో ఘటన జరుగుతుందని హెచ్చరించాడు. అయితే, ఆగంతకుడి నుంచి గతవారం హెచ్చరిక లేఖ రైల్వే అధికారులకు అందింది. దాంతో అప్రమత్తమైన అధికారులు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ఈ లేఖపై గోపాలపురం పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా బీహెచ్ఈఎల్ ప్రాంతానికి చెందిన అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక, అతడిని పోలీసులు విచారిస్తున్నట్టు తెలిపారు. కాగా, ఈ ప్రమాదానికి లేఖకు సంబంధంలేదని అధికారులు చెబుతున్నారు. మరోవైపు.. ఫలక్నామా ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం కారణంగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు పలు రైళ్లను రద్దు చేశారు. ఇది కూడా చదవండి: ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. 3 బోగీలు దగ్ధం -
చెంప చెళ్లుమనిపించిన మహిళ, ఫుట్‌పాత్ వ్యాపారి దాడి
సాక్షి, రాంగోపాల్‌పేట్: వస్తువులు కొనుగోలు చేయలేదని మహిళను ఫుట్‌పాత్ వ్యాపారి అసభ్యకరంగా మాట్లాడాడు. దీంతో ఆగ్రహించిన మహిళ చెంప దెబ్బకొట్టింది. మరింత ఆగ్రహానికి లోనైన వ్యాపారి మహిళపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం అడ్డగుట్టకు చెందిన లక్ష్మి హౌస్‌కీపింగ్ చేస్తోంది. బుధవారం రెతిఫైల్ బస్టాప్ మీదుగా ఆటోలో ఇంటికి వెళ్లేందుకు నడుచుకుంటూ తన స్నేహితురాలితో కలిసి వెళ్తోంది. రేతిఫైల్ బస్టాండ్ ఎదురుగా ఖాజా వాటర్ బాటిళ్లు విక్రయిస్తుండగా లక్ష్మి ఎంత? అని అడిగింది. ధర ఎక్కువ చెప్పడంతో వద్దని వెళ్తుండగా ఖాజా ఆమెను బూతులు తిట్టాడు. ఆగ్రహానికి లోనైన ఆమె చెంప చెల్లుమనిపించింది. దీంతో ఫుట్‌పాత్ వ్యాపారి ఆమెపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. వెంటనే ఆమె గోపాలపురం పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే వ్యాపారి గతంలోనూ వినియోగదారుల పట్ల దురుసుగా ప్రవర్తించడంతో పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు అయినట్లు తెలిసింది. స్టేషన్ వద్ద వ్యాపారిపై దాడి మహిళ ఫిర్యాదు మేరకు గోపాలపురం పోలీసులు ఖాజాను పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. అదే సమయంలో మహిళ బంధువు ఒకరు అక్కడికి చేరుకుని ఖాజాపై దాడి చేశాడు. దీంతో అతడిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: లాఠీచార్జి అంటూ ప్రచారం: యూట్యూబ్ చానల్‌పై కేసు -
నీట మునిగిన పొలీస్ స్టేషన్
-
ఎవరో.. ఎందుకో...?
నిప్పంటించుకుని గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య రాంగోపాల్‌పేట్: ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం 35 ఏళ్ల యువకుడు శనివారం ఉదయం సికింద్రాబాద్ సంగీత్ ధియేటర్ వద్ద ఆటోలో దిగాడు. అక్కడే ఉండే పెట్రోల్ బంకులో బాటిల్లో లీటర్ పెట్రోల్ పోయించుకున్నాడు. అక్కడి నుంచి నడుచుకుంటూ బషీరా హోటల్ ఎదురుగా ఉండే మరో పెట్రోల్ బంకుకు వెళ్లి అక్కడ మరో బాటిల్లో పెట్రోల్ పోయించుకున్నాడు. అక్కడి నుంచి ఎస్పీరోడ్ వైపు వెళుతూ బిషప్ కార్యాలయం మూలమలుపు వద్ద ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. మంటలకు తట్టుకోలేక అరుస్తూ బిషప్ కార్యాలయం గేటు నుంచి లోపలికి వెళ్లగా వాచ్మెన్ రాంబాబు మంటలు ఆర్పేందుకు యత్నించి సాధ్యం కాకపోవడంతో 108కు సమాచారం అందించాడు. వారు వచ్చి చూడగా అప్పటికే 80శాతం కాలిన గాయాలతో మరణించాడు.ఉత్తర మండలం డీసీపీ సుమతి, ఏసీపీ శ్రీనివాస్‌లు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు ఎవరు అయితే మృతుడు ఎవరనేది అంతుపట్టడం లేదు. బిషప్ హౌజ్, సంగీత్ ధియేటర్ ప్రాంతంలోని పెట్రోల్‌బంకు పరిసరాల్లో సీసీ కెమెరాల పుటేజ్ పరిశీలించగా నీలం రంగు చొక్కా, నలుపు రంగు ఫ్యాంటు వేసుకున్న వ్యక్తి ఇన్‌షర్ట్ చేసి ఉన్నాడు. ఆ కెమెరాల్లోని చిత్రాలు అస్పష్టంగా ఉండటంతో మృతుడు ఎవరనేది మిస్టరీగా మారింది. అతని మెడలో క్రీస్తు ఫొటోతో ఉన్న లాకెట్ ఉండటంతో క్రైస్తవుడై ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి వద్ద ఉన్న బ్యాగు ఉన్నా అందులో ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
జీహెచ్ఎంసీ అధికారులపై కేసు నమోదు
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ అధికారులపై సికింద్రాబాద్ గోపాలపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. కాగా సికింద్రాబాద్ రెతి ఫైల్ బస్‌స్టేషన్ సమీపంలోని ఉప్పల్ బస్టాండ్ వద్దనున్న నాలాలో పడి నిన్న రాత్రి ఓ మహిళ దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. శామీర్‌పేట మండలం అలియాబాద్‌కు చెందిన సత్యవాణి(25) కుటుంబ సభ్యులతో కలిసి సికింద్రాబాద్‌లోని బంధువుల ఇంటికి వెళ్లి వస్తుండగా భారీ వర్షం కురిసింది. ఉప్పల్ బస్‌స్టాప్ వైపు వెళుతుండగా నీటి ఉద్ధృతికి నాలాలో చిక్కుకుపోయింది. స్థానికులు ఆమెను కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం కనిపించలేదు. సత్యవాణి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.