హైదరాబాద్ : జీహెచ్ఎంసీ అధికారులపై సికింద్రాబాద్ గోపాలపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. కాగా సికింద్రాబాద్ రెతి ఫైల్ బస్‌స్టేషన్ సమీపంలోని ఉప్పల్ బస్టాండ్ వద్దనున్న నాలాలో పడి నిన్న రాత్రి ఓ మహిళ దుర్మరణం చెందిన విషయం తెలిసిందే.
శామీర్‌పేట మండలం అలియాబాద్‌కు చెందిన సత్యవాణి(25) కుటుంబ సభ్యులతో కలిసి సికింద్రాబాద్‌లోని బంధువుల ఇంటికి వెళ్లి వస్తుండగా భారీ వర్షం కురిసింది. ఉప్పల్ బస్‌స్టాప్ వైపు వెళుతుండగా నీటి ఉద్ధృతికి నాలాలో చిక్కుకుపోయింది. స్థానికులు ఆమెను కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం కనిపించలేదు. సత్యవాణి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.