Satyavani
-
ఆర్వోల నిర్ణయమే అంతిమం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ సాధారణ ఎన్నికల నామినేషన్ల పరి శీలనలో రిటర్నింగ్ అధికారు (ఆర్వో)లు తీసుకున్న నిర్ణయాలే అంతిమమని, వాటిపై పునః సమీక్ష జరిపే అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికి సైతం లేదని రాష్ట్ర ఎన్నికల ఉప ప్రధాన అధికారి (డిప్యూటీ సీఈఓ) సత్యవాణి స్పష్టం చేశారు. కొందరు అభ్యర్థుల విషయంలో ఆర్వోల నిర్ణయాలపై వచ్చిన ఫిర్యాదులను తిరిగి వారికే పంపించినట్టు తెలిపారు. ఆర్వోలకు క్వాజీ జ్యుడీషియల్ అధికారాలుంటాయన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లను వివరించేందుకు శుక్రవారం ఆమె బీఆర్కేఆర్ భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ నెల 18లోగా పోస్టల్ బ్యాలెట్ పత్రాలు, 20 లోగా ఈవీఎంల బ్యాలెట్ పత్రాల ముద్రణ పూర్తి చేస్తామన్నారు. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం 299 అనుబంధ పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు అనుమతినిచ్చిందని, దీంతో రాష్ట్రంలో మొత్తం పోలింగ్ కేంద్రాల సంఖ్య 35,655కి పెరిగిందని చెప్పారు. ప్రతి జిల్లాలో కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటుకు ఈసీకి ప్రతిపాదనలు పంపించామన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్దే ఈవీఎంలను నిల్వ చేసే స్ట్రాంగ్ రూమ్స్ ఉంటాయని తెలిపారు. పోలింగ్‌లో వినియోగించిన ఈవీఎంలను కేటగిరీ–ఏ, పోలింగ్ సందర్భంగా మొరాయించిన ఈవీఎంలను కేటగిరీ–బీ కింద పరిగణించి ఒకే స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరుస్తామన్నారు. మాక్‌పోల్‌కి వాడిన ఈవీఎంలను కేటగిరీ–సీ, రిజర్వ్ ఈవీఎంలను కేటగిరీ–డీ కింద పరిగణించి వేర్వేరు స్ట్రాంగ్ రూమ్స్‌లో భద్రపరుస్తామని వివరించారు. 3 రోజుల పాటు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ వయోజన, దివ్యాంగ ఓటర్లకు ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయం కల్పించే తేదీలను స్థానిక రిటర్నింగ్ అధికారులు ప్రకటిస్తారని సత్యవాణి తెలిపారు. మూడు రోజుల పాటు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌ను నిర్వహిస్తారన్నారు. పోలింగ్ నవంబర్ 30న జరగనుండగా, దానికి 3 రోజుల ముందులోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుందని చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి పాస్‌లు రావడంలో జాప్యం కావడంతో పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కోసం జర్నలిస్టులు చేసుకున్న దరఖాస్తులను జిల్లాల కలెక్టర్లు తిరస్కరించిన అంశంపై పరిశీలన చేస్తామన్నారు. -
దుర్గమ్మకు రూ.7.50 లక్షల ఆభరణాల సమర్పణ
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు హైదరాబాద్‌కు చెందిన భక్తురాలు రూ.7.50 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు సమర్పించారు. హైదరాబాద్ ఏఎస్రావు నగర్‌కు చెందిన డి.వెంకట సత్యవాణి కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి 104 గ్రాముల బంగారపు లక్ష్మీకాసుల హారం, 29 గ్రాముల బంగారపు పచ్చల నక్లెస్, 391 గ్రాముల వెండి పళ్లెం దేవస్థానానికి సమర్పించారు. వీటిని అమ్మవారి ఉత్సవాలలో ఉపయోగించాలని దాత కోరారు. కాగా, దుర్గమ్మ సన్నిధిలో నిత్యాన్నదానానికి చెన్నై ఇందిరానగర్‌కు చెందిన భోగరం వెంకట మార్కాండేయ శర్మ కుటుంబం రూ.5 లక్షల విరాళాన్ని ఆలయ ఈవో భ్రమరాంబకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించి, అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవ్రస్తాలను అందచేశారు. -
నన్నపనేని వ్యాఖ్యలపై ఆగ్రహ జ్వాలలు
సాక్షి, అమరావతి: దళితుల వల్లే దరిద్రం అని అహంకారంగా మాట్లాడిన రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్మన్ నన్నపనేని రాజకుమారిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో ఉన్న చినకాకాని మహిళా ఎస్సై అనూరాధను ఉద్దేశించి అహంకారంగా మాట్లాడం సిగ్గుచేటన్నారు. గతంలో కూడా అనేక మంది ప్రజా ప్రతినిధులు దళితులపై రకరకాల పేరుతో అవమానకర వ్యాఖ్యలు చేశారని, వ్యంగ్యంగా మాట్లాడినా చర్యలు తీసుకున్న సందర్భాలు లేనందునే ఇటువంటి పరిస్థితులు వస్తున్నాయన్నారు. ఎస్సైకి తగిన రక్షణ కల్పించి, భవిష్యత్‌లో ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. దిష్టిబొమ్మల దగ్ధం తెనాలి : దళిత ఎస్ఐ విధులను ఆటంకపరుస్తూ ‘దళితుల వలన ఈ దరిద్రం పట్టింది’ అంటూ దళితులను కించపరచేలా మాట్లాడిన మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి వ్యాఖ్యలకు నిరసనగా, దీనిని ఖండించని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి ఆలపాటి రాజేంద్రప్రసాద్ దిష్టిబొమ్మలను పట్టణ గాంధీచౌక్‌లో గురువారం దహనం చేశారు. టీడీపీ పల్నాడులో హత్యారాజకీయాలను ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం, న్యాయవిభాగం సంయుక్త ఆధ్వర్యంలో నిరసన జరిగింది. జిల్లాలోని పెదకాకాని ఎస్ఐ అనూరాధ విధుల్లో ఉండగా, నన్నపనేని రాజకుమారి, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి వనితలు పరుష పదజాలంతో దూషించి దళితుల మనోభావాలను దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించారని ఆరోపించారు. అనంతరం వినతిపత్రాన్ని మండల తహసీల్దార్, తెనాలి ఆర్డీవో కార్యాలయాల్లో అందజేశారు. పార్టీ ఎస్సీ విభాగం తెనాలి నియోజకవర్గ అధ్యక్షుడు కనపర్తి అనిల్, రాష్ట్ర కార్యదర్శి కె.దేవయ్య, లీగల్‌సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కేఎం విల్సన్, డి.మల్లికార్జునరెడ్డి, జె.ఎలిజబెత్ రాణి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.ప్రసాదరావు, కొమ్ము రాయల్ పాల్గొన్నారు. దళితులకు క్షమాపణ చెప్పాలి తెనాలి టౌన్ : దళిత ఎస్ఐ విధులకు ఆటకం కలిగిస్తూ ఆమెను కించపరిచే విధంగా మాట్లాడిన మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు మాదిగ కార్పొరేషన్ పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు రావూరి రవిబాబు (జెవీఆర్) గురువారం ఒక ప్రకటనలో చెప్పారు. రాజకుమారి దళితులకు క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ సీపీ ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి దేవయ్య డిమాండ్ చేశారు. రాజకుమారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు మహిళా ఎస్ఐని అవమానించిన మహిళా కమిషన్ రాష్ట్ర మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని బడుగు, బలహీన వర్గాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కంతేటి యలమందరావు డిమాండ్ చేశారు. గురువారం పెదకాకాని పోలీస్‌స్టేషన్‌లో సీఐ యు.శోభన్‌బాబును కలసి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. విధులు నిర్వహిస్తున్న మహిళా ఎస్ఐపై రాజకుమారి బృందం వేలు చూపిస్తూ అవమానకరంగా మాట్లాడారని పేర్కొన్నారు. ఫిర్యాదు చేసిన వారిలో బడుగు, బలహీన వర్గాల సంక్షేమ సంఘం ప్రతినిధులు కుక్కల రాంప్రసాద్, కూరపాటి సరస్వతి, బెజ్జం గోపి, బండి ప్రసాద్, బండ్లమూడి బానుకిరణ్, పాటిబండ్ల విల్సన్‌బాబు తదితరులు ఉన్నారు. ఆళ్లమూడిలో నిరసనలు భట్టిప్రోలు: నన్నపనేని రాజకుమారి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా భట్టిప్రోలు మండలం ఆళ్లమూడి వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో గురువారం రాత్రి నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతర రాజకుమారి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ యువజన విభాగం కార్యదర్శి పంతగాని బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. సాటి మహిళ అని చూడకుండా పెదకాకాని మహిళా ఎస్ఐ అనూరాధపై దుర్భాషలాడటం విచారకరమన్నారు. కార్యక్రమంలో నాంచారయ్య, ప్రవీణ్‌కుమార్, వెంకట్రావు, అశోక్, ప్రశాంత్‌రాజ్, చంటి పాల్గొన్నారు. పెదపులివర్రు పంచాయతీ పరిధిలోని కోళ్లపాలెం అంబేడ్కర్ విగ్రహం వద్ద గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. నిరసనలో నాగరాజు, చీకటి నాగేశ్వరరావు, బుస్సా మణేశ్వరరావు, ఎన్ నాగరాజు, దోవా సంసోన్, సూర్యచంద్రరరావు పాల్గొన్నారు. రాజకుమారి ఇలా మాట్లాడటం సరికాదని వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు నాగమల్లేశ్వరరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అదే విధంగా మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మహిళా ఎస్ఐపై దురుసుగా ప్రవర్తించడం శోచనీయమన్నారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. (చదవండి: నోరు పారేసుకున్న నన్నపనేని) -
15రోజుల్లో వెళ్లిపోవాలనుకున్నా..
జిల్లాలో పనిచేయడం సంతోషంగా ఉంది అందరి సహకారంతో క్రీడాభివృద్ధికి కృషి డీఎస్డీఓ టీవీఎల్ సత్యవాణి మహబూబ్‌నగర్ క్రీడలు: ‘జిల్లాకు బదిలీ అయినప్పుడు అదో తెలియని భయం ఉండేది.. మహబూబ్‌నగర్‌లో రాజకీయాలు ఎక్కువని.. ఇక్కడ డీఎస్‌డీఓగా పనిచేయలేనని పలువురు పలురకాలుగా మాట్లాడేవారు. ఇక్కడికి వచ్చిన తర్వాత 15రోజుల్లో బదిలీ చేసుకుని వెళ్లాలనుకున్నాను. కానీ నెలరోజుల్లో ఇక్కడి వాతావరణం బాగా నచ్చింది. క్రీడాకారుల్లో ఏదో సాధించాలనే తపన క్రీడా అసోసియేషన్ల సపోర్ట్‌తో జిల్లాలో క్రీడాభివృద్ధికి కృషి చేయాలన్న లక్ష్యంతో మనసు మార్చుకున్నాను’ అని డీఎస్డీఓ టీవీఎల్ సత్యవాణి తన అనుభవాలను చెప్పారు. డీఎస్‌డీఓగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ‘సాక్షి’ ఆమె కాసేపు మాట్లాడారు. ఆ వివరాల్లో ఆమె మాటల్లోనే.. మాది వరంగల్ జిల్లా. 1993లో నిజామాబాద్‌లో, 1995 నుంచి 2000 వరకు వరంగల్‌లో, 2000 నుంచి 2009 వరకు కరీంనగర్ హ్యాండ్‌బాల్ కోచ్‌గా పనిచేశాను. 2009 నుంచి 2011 వరకు నల్లగొండ ఇన్చార్జ్ డీఎస్‌డీఓగా, 2011 నుంచి 2013వరకు మళ్లీ కోచ్‌గా విధులు నిర్వహించాను. ఆ తర్వాత 2013–2015లో కరీంనగర్ డీఎస్‌డీఓగా పనిచేశాను. గతేడాది సెప్టెంబర్‌లో ఇక్కడ డీఎస్‌డీఓగా బాధ్యతలు తీసుకున్నాను. కలెక్టర్ సహకారంతో క్రీడాభివృద్ధి.. నేను బాధ్యతలు స్వీకరించిన రోజే కలెక్టర్‌ను కలిసి క్రీడాభివృద్ధికి మీ వంతు సహకారం అందించాలని కోరగా ‘గోహెడ్’ అంటూ ఎంతో ప్రోత్సహించారు. గతేడాది ఎస్బీఐ సహకారంతో ఆర్జీకేఏ టోర్నీలకు వెళ్లే క్రీడాకారులకు క్రీడా దుస్తులతో పాటు బ్యాగులు అందజేశాం. జిల్లాలో నిర్మాణమవుతున్న గ్రీన్‌ఫీల్డ్ స్టేడియాల్లో ఇప్పటికే గద్వాల, కొల్లాపూర్, షాద్‌నగర్‌లలో పనులు పూర్తయ్యాయి. మిగతా ముగింపుదశలో ఉన్నాయి. ఈ ఏడాది వేసవిలో ఆంధ్రాబ్యాంక్ సహకారంతో జిల్లాలో 36ప్రాంతాల్లో సమ్మర్‌క్యాంప్‌లు విజయవంతంగా నిర్వహించాం. రాష్ట్రంలోని స్పోర్ట్స్ స్కూళ్లలో జిల్లా ప్రాతినిధ్యం ఎక్కువగా ఉండాలనే ఉద్దేశంతో కలెక్టర్ సహకారంతో ప్రత్యేక టాలెంట్ హంట్ నిర్వహించగా.. తొలిసారిగా జిల్లా నుంచి 25మంది విద్యార్థులు ఎంపిక కావడం ఎంతో గర్వంగా ఉంది. మాడ్రనైజేషన్ స్కీం కింద మహబూబ్‌నగర్, జడ్చర్ల, ఆత్మకూర్, అచ్చంపేట, వనపర్తి, నారాయణపేట, గద్వాల స్టేడియాల ఆధునికీకరణకు ఎమ్మెల్యేల సహకారంతో ప్రతిపాదనలు పంపగా మహబూబ్‌నగర్‌కు రూ.2.50 కోట్లు, నారాయణపేటకు రూ.2.65 కోట్లు మంజూరయ్యాయి. భవిష్యత్‌లో ప్రైవేట్ విద్యాసంస్థలు పాపులర్ గేమ్‌లను స్పాన్సర్ చేసేలా తగిన ప్రణాళికలు రూపొందిస్తున్నాం. తన 23 ఏళ్ల సర్వీస్ కంటే జిల్లాలో ఏడాది నుంచి పనిచేస్తుండడం సంతోషంగా ఉందని తెలిపారు. -
కోడిపందేలు వద్దన్నందుకు.. కడతేర్చారు
తాడేపల్లిగూడెం: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం పట్టింపాలెంలో ఓ వివాహితపై భర్త, అత్తలు కలసి పెట్రోల్ పోసి నిప్పంటించారు. తీవ్ర కాలిన గాయాలతో ఆమె మృతి చెందింది. పోలీసుల కథనం మేరకు... పట్టింపాలెం గ్రామానికి చెందిన సత్యవాణి (24)కి ఐదేళ్ల బాబు, ఎనిమిది నెలల పాప ఉన్నారు. భర్త తరచూ కోడిపందేలు ఆడుతూ ఉండడంతో ఈ విషయమై వారిద్దరి మధ్య కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి సమయంలోనూ గొడవ జరిగింది. దీంతో భర్త, అత్తలు సత్యవాణిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో ఆమె తీవ్ర కాలిన గాయాలతో మృతి చెందింది. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
సత్యవాణి మృతితో జీహెచ్ఎంసీపై కేసు
సికింద్రాబాద్ : సికింద్రాబాద్‌లోని ఒక నాలాలో పడి శామీర్‌పేట్ మండలం అలియాబాద్‌కు చెందిన ముక్కు సత్యవాణి (26) మృతి చెందిన ఘటన తో జీహెచ్ఎంసీ అధికారులపై కేసు నమోదైంది. మృతురాలి భర్త ప్రేంరాజ్ ఫిర్యాదు మేరకు గోపాలపురం పోలీసులు కేసు నమోదు చేశారు. బంధువుల ఇంట్లో జరిగే శుభకార్యానికి హాజరయ్యేందుకు హయత్‌నగర్ వెళ్లిన సత్యవాణి తిరిగి అలియాబాద్‌కు వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. బుధవారం రాత్రి ఒక్కమారుగా భారీ వర్షం కురవడంతో సికింద్రాబాద్ రహదారులన్నీ జలమయమయ్యాయి. గత్యంతరం లేని పరిస్థితితో ఒలిఫెంటా వంతెన సమీపంలోని ఒక నాలా పైకప్పుపై నుంచి నడిచేందుకు ప్రయత్నించింది. అప్పటికే పూర్తిగా శిథిలావస్థకు చేరిన నాలా పైకప్పు సత్యవాణి కాలు మోపడంతోనే కుప్పకూలింది. బంధువుల కళ్ల ముందే నాలాలోకి మునిగిపోయిన సత్యవాణి అక్కడికక్కడే మృతి చెందింది. జీహెచ్ఎంసీ అధికారులు నాలాపై కప్పును మరమ్మతు చేయని కారణంగానే తన భార్య నాలాలో పడిమృతి చెందిందని మృతురాలి భర్త ప్రేంరాజ్ గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు జీహెచ్ఎంసీపై 304 ఏ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
జీహెచ్ఎంసి నిర్లక్ష్యం వల్లే నా భార్య మృతి
-
'జీహెచ్ఎంసి అధికారుల నిర్లక్ష్యం వల్లే నా భార్య మృతి'
హైదరాబాద్: సికింద్రాబాద్ ఉప్పల్ బస్టాప్ వద్ద బుధవారం రాత్రి నాలాలో పడి గర్భిణి సత్యవాణి మృతి చెందడానికి జీహెచ్ఎంసి అధికారుల నిర్లక్ష్యమే కారణమా? సికింద్రాబాద్ ఉప్పల్ బస్టాప్ వద్ద నాలాను ఎందుకు మూసివేయలేదు? గతంలో స్థానికులు ఫిర్యాదు చేసినా ఎందుకు స్పందించలేదు? ఈ ఘటనలో జీహెచ్ఎంసి అధికారుల నిర్లక్ష్యమే తన భార్య సత్యవాణి మృతికి కారణమని ఆమె భర్త ప్రేమ్‌రాజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుంటూరు జిల్లా ఈపూరు మండల కేంద్రానికి చెందిన భాగ్యరావు అలియాస్ భాస్కర్, లక్ష్మిలు దంపతులు. వీరు 20 ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం అలియాబాద్‌కు వచ్చారు. భాస్కర్, లక్ష్మి దంపతుల కూతురు సత్యవాణికి ఏడేళ్ల క్రితం నాగార్జునసాగర్‌కు చెందిన ప్రేమ్‌రాజ్‌తో వివాహమైంది. ప్రేమ్‌రాజ్ స్థానికంగా ఉన్న సూర్యవంశీ స్పిన్నింగ్ మిల్లో మెకానికల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. బుధవారం రాత్రి సత్యవాణి తన కుటుంబ సభ్యులతో కలిసి సికింద్రాబాద్‌లో ఉంటున్న బంధువుల ఇంటికి వెళ్లింది. తిరిగి రాత్రి అలియాబాద్‌కు వెళ్లేందుకు ఉప్పల్ బస్టాండ్ వద్దకు వచ్చింది. అయితే అప్పటికే కురుస్తున్న భారీ వర్షం కారణంగా వచ్చిన నీటి ఉధృతికి బస్టాండ్ వద్ద నాలాలో చిక్కుకుపోయింది. కుటుంబసభ్యులు, స్థానికులు ఆమెను కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. నాలాలో పడి కొట్టుకుపోయింది. ఆ తర్వాత మృతదేహాన్ని బయటకుతీసి గాంధీ ఆస్పత్రికి తరలించారు. బుధవారం రాత్రి ఏడున్నర గంటలకు తన భార్య నాలాలో పడితే జీహెచ్ఎంసి రెస్క్యూ టీం ఎనిమిదిన్నర గంటల తర్వాత ఘటనా స్థలానికి చేరుకున్నారని సత్యవాణి భర్త అవేదన వ్యక్తం చేస్తున్నారు. తన భార్య మృతికి జీహెచ్ఎంసి అధికారులదే పూర్తి బాధ్యత అని అంటున్నారు. సత్యవాణి మృతి చెంది 15 గంటలు కావస్తున్నా ఇప్పటి వరకు జిహెచ్ఎంసి, రెవిన్యూ అధికారులు స్పందించలేదన్నారు. జిహెచ్ఎంసి అధికారులపై స్థానిక గోపాలపురం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ప్రేమ్‌రాజ్ చెప్పారు. సత్యవాణి మృతికి కారణమైన ఉప్పల్ బస్టాండ్ వద్ద నాలాను సంవత్సరం క్రితం నిర్మించారు. నాలా నిర్మిస్తున్న సమయంలో అది కూలిపోవడంతో స్ధానికులు అప్పుడే జీహెచ్ఎంసి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అధికారులు లంచాలకు అలవాటుపడి ప్రజల రక్షణను గాలికి వదిలేస్తున్నారని స్ధానికులు ఆరోపిస్తున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ గాంధీ ఆస్పత్రి ఆవరణలో బంధువులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం, జిహెచ్ఎంసి ఉన్నతాధికారులు స్పందించి ఓపెన్ నాలాలు మూసివేయడంతో పాటు గర్భిణి మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా, నాలాలో కొట్టుకుపోయి మృతి చెందిన సత్యవాణి కుటుంబానికి జీహెచ్ఎంసి రెండు లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ** -
జీహెచ్ఎంసీ అధికారులపై కేసు నమోదు
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ అధికారులపై సికింద్రాబాద్ గోపాలపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. కాగా సికింద్రాబాద్ రెతి ఫైల్ బస్‌స్టేషన్ సమీపంలోని ఉప్పల్ బస్టాండ్ వద్దనున్న నాలాలో పడి నిన్న రాత్రి ఓ మహిళ దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. శామీర్‌పేట మండలం అలియాబాద్‌కు చెందిన సత్యవాణి(25) కుటుంబ సభ్యులతో కలిసి సికింద్రాబాద్‌లోని బంధువుల ఇంటికి వెళ్లి వస్తుండగా భారీ వర్షం కురిసింది. ఉప్పల్ బస్‌స్టాప్ వైపు వెళుతుండగా నీటి ఉద్ధృతికి నాలాలో చిక్కుకుపోయింది. స్థానికులు ఆమెను కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం కనిపించలేదు. సత్యవాణి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. -
నాలాలో కొట్టుకుపోయిన మహిళ
శామీర్‌పేట్ : బంధువుల ఇంటికి వెళ్లి వస్తున్న క్రమంలో శామీర్‌పేట మండలంలోని అలియాబాద్‌కు చెందిన ఓ మహిళ ఉప్పల్ బస్టాండ్ వద్ద గల నాలాలో పడి కొట్టుకుపోయింది. ఈ ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా ఈపూర్ మండల కేంద్రానికి చెందిన భాగ్యరావు అలియాస్ భాస్కర్, లక్ష్మిలు దంపతులు. వీరు 20 ఏళ్ల క్రితం బతుకుదెరువుకోసం అలియాబాద్ గ్రామానికి వచ్చి ఉంటున్నారు. భాస్కర్ మేస్త్రీ పని చేస్తుంటాడు. వీరికి కూతురు సత్యవాణి(25)కు ఏడేళ్ల క్రితం నాగార్జునసాగర్‌కు చెందిన ప్రేమ్‌రాజ్‌తో వివాహమైంది. ప్రేమ్‌రాజ్ స్థానికంగా ఉన్న సూర్యవంశీ స్పిన్నింగ్ మిల్ కంపెనీలో మెకానికల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం సత్యవాణి తన కుటుంబీకులతో కలిసి సికింద్రాబాద్‌లో ఉంటున్న బంధువుల ఇంటికి వెళ్లింది. తిరిగి రాత్రి అలియాబాద్‌కు వచ్చే క్రమంలో ఉప్పల్ బస్టాండ్ వద్దకు రాగానే అప్పటికే కురుస్తున్న భారీ వర్షం కారణంగా వచ్చిన నీటి ఉధృతికి బస్టాండ్ వద్ద నాలాలో చిక్కుకుపోయింది. స్థానికులు ఆమెను కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. నాలాలో పడి కొట్టుకుపోయిన మహిళను సత్యవాణిగా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వాడ వాడలా సమైక్య ఉద్యమం
-
మాట్లాడింది నేను కాదు... భగవంతుడి లీల
కర్నూలు : ఎల్బీ స్టేడియంలో ఏపీఎన్జీవోల సభలో మాట్లాడింది తాను కాదని.... అదంతా భగవంతుడి లీల అని హిందూవాహిని సభ్యురాలు సత్యవాణి అన్నారు. గురువారం కర్నూలులో జరిగిన మహిళ గర్జన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ ఏపీ ఎన్జీవోల సభలో తాను మాట్లాడే షెడ్యూల్ ఏమీ లేకపోయినా ... సభకు హాజరైన తనను రెండు నిమిషాలు మాట్లాడాలని నిర్వహకుల కోరిక మేరకు మాట్లాడినట్లు తెలిపారు. అయితే అక్కడ తాను ఏమి మాట్లాడానో గుర్తు లేదని ... భగవంతుడు పలికించిన మాటలని అన్నారు. ఏపీ ఎన్జీవోల సభకు ఏ గేటు నుంచి లోపలకు వెళ్లాలో తెలియక తాను వెతుకుతున్నప్పుడు సీమాంధ్ర మహిళ ఉద్యోగులు తనను చేయి పట్టుకుని తీసుకు వెళ్లారని సత్యవాణి గుర్తు చేసుకున్నారు. ఆ దృశ్యం తనకు చికాగోలో జరిగిన సర్వ మత సమ్మేళనానికి వివేకానందుడు ఎలా వెళ్లారో... తనకు అలాగే జరిగిందని ఆమె తెలిపారు. ఎన్నికలప్పుడు స్వీటు స్వీటుగా ఓట్లు వేయించుకున్న రాజకీయ నేతలు .... ప్రస్తుతం ప్రజలను అనాధల్లా వీధిన పడేశారని సత్యవాణి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన విషయంలో నేతలు వైఖరిని ఆమె తప్పుపట్టారు. సీమాంధ్రులు గత 44 రోజుల నుంచి ఆందోళనలు, నిరసనలు తెలియచేస్తున్నా కేంద్రం పట్టించుకోకపోవటం దౌర్భగ్యమైన విషయమన్నారు. 'బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదె సుమతీ' అన్నట్లుగా కోట్లాదిమంది ప్రజలు చీమల్లా బారులుతీరి తమ హక్కు కోసం నినదిస్తున్నారని .... ప్రజల తీర్పుకు ఎవరైనా తలవంచాల్సిందేనని సత్యవాణి అన్నారు. -
మాట్లాడింది నేను కాదు... భగవంతుడి లీల
-
కర్ణుడు, మారీచుడు, శల్యుడు.. రాజకీయ నేతలపై సత్యవాణి ధ్వజం
మెడపై కత్తిపెట్టి జై తెలంగాణ అనమంటున్నారు.. అనకపోతే విద్రోహులుగా చూస్తున్నారు కేసీఆర్ తమ్ముడూ.. బతుకమ్మను కూడా ఒక ప్రాంత చట్రంలో ఇరికించింది మీ కూతురు కాదా? కర్రీ సెంటర్ అంటే నీకు అంత చులకన భావమా? నువ్వు మీ భార్య చేతి కూర తినవా? సాక్షి, హైదరాబాద్: మెడపై కత్తిపెట్టి జై తెలంగాణ అనాలంటూ ఒత్తిడి తెస్తున్నారని, అనకపోతే విద్రోహులు అంటూ ముద్ర వేస్తున్నారని హిందూవాహిని నాయకురాలు సత్యవాణి పేర్కొన్నారు. అందరికీ అమ్మ అయిన బతుకమ్మను కూడా మీ కూతురు ఒక ప్రాంత చట్రంలో ఇరికించడం తెలంగాణ సంస్కృతా? అంటూ కేసీఆర్‌ను ప్రశ్నించారు. తెలంగాణలోని తల్లులు, సోదరులు, సోదరీమణులు ప్రేమ, ఆప్యాయతలు కనబరుస్తారని కానీ విద్యావంతులు, వివేకం ఉన్న పార్లమెంట్ సభ్యులైన తమరు ఎందుకు పంచడం లేదని ప్రశ్నించారు. ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ బహిరంగ సదస్సులో ఆమె ప్రసంగం ఉద్యోగులను విశేషంగా ఆకట్టుకుంది. రాజకీయ ప్రతినిధులను మూడు రకాలుగా విభజించి కర్ణుడు, మారీచుడు, శల్యునితో పోల్చారు. ‘‘ప్రధానమంత్రికి అన్నీ ఉన్నా డైనమిజం లేదు. అధికారంలో ఉండి ఏం లాభం? ప్రజలకు న్యాయం చేయనప్పుడు..? పదవి ఇచ్చారు కదా అని కర్ణుని మాదిరిగా మౌనంగా ఉంటే ఎలా? ఇంత ఆందోళన జరుగుతున్నా మౌనం వీడకుంటే ఎలా? కేంద్ర మంత్రులు, ఎంపీలు మారీచుల్లా మారారు. మరొకరు శల్యుడిలా శల్యసారథ్యం చేస్తున్నారు’’ అని వ్యాఖ్యానించారు. ‘‘ఆనాటి మహాభారత సంగ్రామానికీ ఈనాటి సమైక్యాంధ్ర సంగ్రామానికి చాలా పోలికలు కనబడుతున్నాయి. ఆనాడు కౌరవులు హస్తినలో సూది మొన మోపేంత జాగా కూడా ఇవ్వమని ప్రకటిస్తే పాండవులు వెళ్లి ఇంద్రప్రస్థ నగరాన్ని నిర్మించుకున్నారు. నగరాన్ని చూడ్డానికొచ్చిన దుర్యోధనుడు మయసభను, భవనాలను చూసి అసూయ పడి అహంకారంతో కురుక్షేత్రానికి కాలుదువ్వాడు. ఇప్పుడూ రాష్ట్రంలో అదే పరిస్థితి కనిపిస్తోంది. టిఫిన్ సెంటర్లు, కర్రీపాయింట్ పెట్టుకోండని వ్యాఖ్యానించడం ఎంత వరకు సబబు? కేసీఆర్.. మీ భార్య చేసిన కూరలు తినకుండానే బతుకుతున్నావా? టిఫిన్ సెంటర్లు, కర్రీపాయింట్లు నీకంత తేలిగ్గా కనబడుతున్నాయా తమ్ముడూ? ఒక్కసారి ఆలోచించుకో! కోదండరాముడి పేరు పెట్టుకున్న కోదండరాం.. దయచేసి పిల్లల్లో విద్వేష భావాలు రెచ్చగొట్టొద్దు’’ అని సత్యవాణి అన్నారు. ‘‘అవసరమైతే మీరు 15 ఏళ్లు పాలించుకోండి.. కానీ రాష్ట్రాన్ని విడగొట్టవద్దు’’ అని కోరారు. శ్రీకృష్ణ కమిటీ హైదరాబాద్‌కు వచ్చినప్పుడు తాను వారికి నివేదిక ఇస్తూ ‘‘మహాభారతంలో శ్రీకృష్ణుని రాయబారం ఉంది. ఇప్పుడు శ్రీకృష్ణ కమిటీ రాయబారం నడుస్తోందని అన్నాను. జస్టిస్ శ్రీకృష్ణ స్పందిస్తూ ‘ఆ శ్రీకృష్ణ రాయబారం ఫెయిల్ అయింది. ఈ శ్రీకృష్ణ కమిటీ రాయబారం ఫెయిల్ కాదు అని అనుకుంటున్నా’ అని చెప్పారు. కానీ ఆ రాయబారం కూడా ఫెయిల్ అయింది’’ అని వ్యాఖ్యానించారు. సోనియాగాంధీని ప్రధాని కావద్దని అన్నందుకే ఆమె కక్ష కట్టినట్లు ఉందని వ్యాఖ్యానించారు. -
APNGOs "సేవ్ ఆంధ్రప్రదేశ్"లో సత్యవాణి ప్రసంగం