open drain
-
బైకుతో సహా నాలాలో పడిన వ్యక్తి.. లక్ జగదీష్
సాక్షి, హస్తినాపురం: వనస్థలిపురం సమీపంలోని చింతల్‌కుంటలో శుక్రవారం రాత్రి నాలాలో కొట్టుకుపోయిన వ్యక్తి అదృష్టవశాత్తు బయటపడ్డాడు. మహేశ్వరం మండలం మంకాల్ గ్రామానికి చెందిన పి.జగదీష్ (45) భారీ వర్షంలో బైకుపై వనస్థలిపురం నుంచి ఎల్బీనగర్ వైపు బయలుదేరాడు. చింతల్‌కుంట వద్దకు రాగానే బైకుతో సహా నాలాలో పడి కొట్టుకుపోయాడు. పోలీసులు కాపాడే ప్రయత్నం చేసినా ఫలించలేదు. డ్రైనేజీ నుంచి వాహనాన్ని బయటకు తీశారు. ఈ క్రమంలో రాత్రి 11 గంటల సమయంలో జగదీష్ ఆచూకీ లభించింది. నాలాలో పడిపోగానే తాడు దొరకడంతో దాని సాయంతో జగదీష్ బయటపడ్డాడు. అనంతరం ఆయన కర్మన్‌ఘాట్ లోని తన సోదరుడి నివాసానికి వెళ్లాడు. ఈ విషయాన్ని జగదీష్ సోదరుడు వెల్లడించారు. చదవండి: లారీ డ్రైవర్ నిర్లక్ష్యం.. టైర్ నడుముపై నుంచి వెళ్లడంతో -
నాలా విషాదం: మణికొండ డీఈ సస్పెన్షన్!
సాక్షి, మణికొండ: వరదలో ఓ వ్యక్తి కొట్టుకు పోయి మృతిచెందిన సంఘటనలో మరో అధికారిపై వేటు పడింది. సెప్టెంబర్ 25న మణికొండ మునిసిపాలిటీ గోల్డెన్ టెంపుల్ ఎదుట నిర్మాణంలో ఉన్న డ్రైనేజీ కాలువలో కొట్టుకుపోయిన రజినీకాంత్(42) రెండు రోజుల తరువాత నెక్నంపూర్ చెరువులో తేలిన విషయం తెలిసిందే. ఆ సంఘటనకు నిర్లక్ష్యంగా పనులు చేపట్టడమే కారణంగా చూపుతూ ఇప్పటికే జిల్లా కలెక్టర్ అమయ్‌కుమార్ ఏఈ విటోభను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా గురువారం మణికొండ, షాద్‌నగర్, పరిగి మునిసిపాలిటీలతో పాటు మిషన్‌భగీరథకు ఇంచార్జిగా పనిచేస్తున్న డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సాజిద్‌ను సస్పెండ్ చేసినట్టు సమాచారం. ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ శాఖ రాష్ట్ర అధికారులు తమ కార్యాలయానికి పిలిచి సస్పెన్షన్ ఉత్తర్వులను అందించినట్టు తెలిసింది. ఇదే విషయాన్ని మణికొండ మునిసిపల్ కమిషనర్ జయంత్ వివరణ కోరగా సస్పెన్షన్ ఉత్తర్వులు ఇచ్చినట్టు తెలిసిందని నిర్ధారించారు. కాగా, మునిసిపల్ కమిషనర్ జయంత్‌పై కూడా ఆ శాఖ దృష్టి సారించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇతనిపై వేటు పడే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెబుతున్నారు. చదవండి: మణికొండలో గల్లంతైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతదేహం లభ్యం కాంట్రాక్టర్‌తో పాటు సబ్‌కాంట్రాక్టర్‌పైనా విచారణ : ఈ సంఘటనపై ఇప్పటికే మునిసిపాలిటి కమిషనర్ కాంట్రాక్టర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అధికారికంగా టెండర్ తీసుకున్నది రాజ్‌కుమార్ కాగా పనులను మాత్రం కుమార్ అనే మరో సబ్ కాంట్రాక్టర్ చేపడుతున్నాడు. దీంతో పూర్తి వివరాలను అందించాలని నార్సింగి పోలీసులు మునిసిపల్ కమిషనర్‌కు లేఖ రాశారు. వివరాలు అందగానే పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి బాధ్యులందరిపై చర్యలు తీసుకుంటామని నార్సింగి సీఐ గంగాధర్ పేర్కొన్నారు. చదవండి: ఇంటి ఆవరణలో నాలుగు లారీల చెత్త జమ చేసి.. ఓ మహిళ వింత ప్రవర్తన -
మణికొండ నాలా విషాదం: బాధిత కుటుంబానికి పరిహారం
హైదరాబాద్: మణికొండ నాలా ఘటనపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. దీనిలో భాగంగా.. నాలాను తవ్వి ఎలాంటి హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయకుండా అశ్రద్ధగా వ్యవహరించినందుకు... కాంట్రాక్టర్ రాజ్‌కుమార్‌పై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, విధుల్లో అలసత్వం వహించినందుకు... మున్సిపాలిటీ అసిస్టెంట్ ఇంజనీర్ వితభానును కూడా సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్వర్వులను జారీచేసింది. మృతుని కుటుంబానికి రూ. 5లక్షలను పరిహారంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. కాగా, ఈనెల 25న రాత్రి 9 గంటల సమయంలో భారీ వర్షం కారణంగా మరమ్మతుల కోసం తీసిన గుంతలోపడి సాఫ్ట్వేర్ ఇంజనీర్ రజనీకాంత్ గల్లంతయ్యారు. ఆ తర్వాత రెండు రోజుల తర్వాత నెక్నాంపూర్ చెరువులో బాధితుడి మృతదేహం లభించిన విషయం తెలిసిందే. చదవండి: మణికొండలో గల్లంతైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతదేహం లభ్యం -
యాక్సిడెంటల్ డెత్: సుమేధ ఘటనపై కోర్టులో ప్రొటెస్ట్ పిటిషన్
సాక్షి, నేరేడ్మెట్: వినాయకనగర్ డివిజన్ దీనదయాళ్నగర్ కాలనీలో గత ఏడాది ఓపెన్ నాలాలో పడి మృతి చెందిన 12 ఏళ్ల బాలిక సుమేధ కేసులో ఆమె తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారు. కేసుపై సోమవారం మల్కాజిగిరి కోర్టులో బాలిక తల్లి సుకన్య కపూరియా ప్రొటెస్ట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఘటనపై పోలీసులు ‘యాక్సిడెంటల్ డెత్’గా నివేదిక ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తిరిగి విచారణ చేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సుమేధ తల్లి కోర్టులో ప్రొటెస్ట్ పిటిషన్‌ను వేశారు. చదవండి: జోగులాంబ గద్వాల్లో ఎస్సై వీరంగం.. వీడియో వైరల్ పిటిషన్‌పై విచారణను వచ్చే నెల 20కి కోర్టు వాయిదా వేసింది. ఈ ఘటనపై మల్కాజిగిరి డీఈఈ, ఏఈఈతోపాటు మంత్రి కేటీఆర్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్, మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, అప్పటి మేయర్ బొంతురాంమోహన్ తదితరులపై నేరేడ్మెట్ ఠాణాలో అప్పట్లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. చదవండి: ఎస్ఐ కోచింగ్ సెంటర్లో పరిచయం.. వంచించి, అబార్షన్ ట్యాబ్లెట్లు వేసి.. -
మణికొండలో గల్లంతైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతదేహం లభ్యం
సాక్షి, హైదరాబాద్: మణికొండ: డ్రైనేజీ కాలువలో కొట్టుకు పోయిన వ్యక్తిని ఎట్టకేలకు గుర్తించారు. సంఘటనా స్థలానికి పక్కనే ఉండే బాబానివాస్ అపార్ట్మెంట్ నుంచి శనివారం రాత్రి బయటకు వచ్చిన గోపిశెట్టి రజనీకాంత్ (42)నే మృతుడిగా తేల్చారు. డ్రైనేజీ కాలువలో పడిన స్థలం నుంచి మూడు కిలోమీటర్ల దూరంలోని నెక్నాంపూర్ చెరువు ప్రవేశంలో సోమవారం డీఆర్ఎఫ్ బృందం మృతదేహాన్ని గుర్తించి బయటకు తీశారు. మృతుడి అన్న, బావలు అతని చాతీపై ఉన్న ‘సప్పు’ అనే టాటూ గుర్తించి రజనీకాంత్‌గా నిర్ధారించారు. 35 గంటల పాటు మురుగునీటిలో ఉండటంతో శవం కుళ్లిపోయింది. నార్సింగి ఇన్స్పెక్టర్ గంగాధర్, ఎస్సై రాములుల ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. రజనీకాంత్ షాద్‌నగర్‌లోని ఓ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ కాగా, అతని భార్య స్వప్న హైటెక్ సిటీలోని ఓ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరి స్వస్థలం హైదరాబాద్ నగరంలోని రాంనగర్ కాగా మణికొండలో ఫ్లాట్ కొనుగోలు చేసి ఇక్కడ నివసిస్తున్నట్టు బంధువులు తెలిపారు. చేతిలో పెరుగు ప్యాకెట్‌తో... డ్రైనేజీ కాలువలో కొట్టుకుపోయిన రజనీకాంత్ చేతిలో పెరుగు ప్యాకెట్‌ను అలాగే పట్టుకుని ఉన్నాడు. శనివారం రాత్రి ఇంట్లోనుంచి బయటకు వచ్చి ఓ షాపులో పెరుగు ప్యాకెట్‌ను కొనుగోలు చేసి పక్కనే ఉన్న మరో షాపులో సిగరెట్ కొనుగోలు చేసేందుకు రోడ్డు దాటుతూ వరదనీటిలో పడిపోయారు. అతను దాటిన ప్రదేశంలో అంతకు ముందు మట్టి ఉండటం, వరదకు అది కొట్టుకుపోయిందని గమనించకుండా కాలుపెట్టడంతోనే సంఘటన జరిగిందని స్థానికులు పేర్కొన్నారు. -
తెలంగాణ అసెంబ్లీలో నేటి వాయిదా తీర్మానాలు
-
జీహెచ్ఎంసీ అధికారులపై కేసు నమోదు
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ అధికారులపై సికింద్రాబాద్ గోపాలపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. కాగా సికింద్రాబాద్ రెతి ఫైల్ బస్‌స్టేషన్ సమీపంలోని ఉప్పల్ బస్టాండ్ వద్దనున్న నాలాలో పడి నిన్న రాత్రి ఓ మహిళ దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. శామీర్‌పేట మండలం అలియాబాద్‌కు చెందిన సత్యవాణి(25) కుటుంబ సభ్యులతో కలిసి సికింద్రాబాద్‌లోని బంధువుల ఇంటికి వెళ్లి వస్తుండగా భారీ వర్షం కురిసింది. ఉప్పల్ బస్‌స్టాప్ వైపు వెళుతుండగా నీటి ఉద్ధృతికి నాలాలో చిక్కుకుపోయింది. స్థానికులు ఆమెను కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం కనిపించలేదు. సత్యవాణి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. -
తెలంగాణ అసెంబ్లీలో నేటి వాయిదా తీర్మానాలు
హైదరదాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో గురువారం విపక్షాలు వివిధ అంశాలపై వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టాయి. గిరిజన ప్రాంతాల్లో జ్వరాలు, ప్రజారోగ్య సమస్యలపై వైఎస్ఆర్ సీపీ, ఫాస్ట్ పథకం, ఇంజనీరింగ్, మెడికల్ అడ్మిషన్ల సమస్యలపై టీడీపీ, భారీ వర్షాలకు హైదరాబాద్ ఉప్పల్ నాలాలో పడి చనిపోయిన సత్యవాణి అంశం, హైదరాబాద్-లో నాలాల దుస్థితిపై బీజేపీ, గ్రామ సేవకుల సర్వీసుల క్రమబద్దీకరణపై సీపీఎం, పెండింగ్‌లో ఉన్న రూ.30 కోట్ల సీఎం రిలీఫ్ ఫండ్ విడుదలపై సీపీఐ వాయిదా తీర్మానాలు ఇచ్చాయి.