తెలంగాణ అసెంబ్లీలో గురువారం విపక్షాలు వివిధ అంశాలపై వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టాయి.
హైదరదాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో గురువారం విపక్షాలు వివిధ అంశాలపై వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టాయి. గిరిజన ప్రాంతాల్లో జ్వరాలు, ప్రజారోగ్య సమస్యలపై వైఎస్ఆర్ సీపీ, ఫాస్ట్ పథకం, ఇంజనీరింగ్, మెడికల్ అడ్మిషన్ల సమస్యలపై టీడీపీ, భారీ వర్షాలకు హైదరాబాద్ ఉప్పల్ నాలాలో పడి చనిపోయిన సత్యవాణి అంశం, హైదరాబాద్-లో నాలాల దుస్థితిపై బీజేపీ, గ్రామ సేవకుల సర్వీసుల క్రమబద్దీకరణపై సీపీఎం, పెండింగ్లో ఉన్న రూ.30 కోట్ల సీఎం రిలీఫ్ ఫండ్ విడుదలపై సీపీఐ వాయిదా తీర్మానాలు ఇచ్చాయి.