
హైదరాబాద్: మణికొండ నాలా ఘటనపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. దీనిలో భాగంగా.. నాలాను తవ్వి ఎలాంటి హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయకుండా అశ్రద్ధగా వ్యవహరించినందుకు... కాంట్రాక్టర్ రాజ్‌కుమార్‌పై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, విధుల్లో అలసత్వం వహించినందుకు... మున్సిపాలిటీ అసిస్టెంట్ ఇంజనీర్ వితభానును కూడా సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్వర్వులను జారీచేసింది.
మృతుని కుటుంబానికి రూ. 5లక్షలను పరిహారంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. కాగా, ఈనెల 25న రాత్రి 9 గంటల సమయంలో భారీ వర్షం కారణంగా మరమ్మతుల కోసం తీసిన గుంతలోపడి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రజనీకాంత్ గల్లంతయ్యారు. ఆ తర్వాత రెండు రోజుల తర్వాత నెక్నాంపూర్ చెరువులో బాధితుడి మృతదేహం లభించిన విషయం తెలిసిందే.
చదవండి: మణికొండలో గల్లంతైన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతదేహం లభ్యం
Comments
Please login to add a commentAdd a comment