
సుమేధ(ఫైల్)
Sumedha Kapuria, the 12 year-old girl who lost her life after falling into a drain in Hyderabad: గత ఏడాది ఓపెన్ నాలాలో పడి మృతి చెందిన సుమేధ కేసులో ఆమె తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారు.
సాక్షి, నేరేడ్‌మెట్: వినాయకనగర్ డివిజన్ దీనదయాళ్‌నగర్ కాలనీలో గత ఏడాది ఓపెన్ నాలాలో పడి మృతి చెందిన 12 ఏళ్ల బాలిక సుమేధ కేసులో ఆమె తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారు. కేసుపై సోమవారం మల్కాజిగిరి కోర్టులో బాలిక తల్లి సుకన్య కపూరియా ప్రొటెస్ట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఘటనపై పోలీసులు ‘యాక్సిడెంటల్ డెత్’గా నివేదిక ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తిరిగి విచారణ చేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సుమేధ తల్లి కోర్టులో ప్రొటెస్ట్ పిటిషన్‌ను వేశారు.
చదవండి: జోగులాంబ గద్వాల్‌లో ఎస్సై వీరంగం.. వీడియో వైరల్
పిటిషన్‌పై విచారణను వచ్చే నెల 20కి కోర్టు వాయిదా వేసింది. ఈ ఘటనపై మల్కాజిగిరి డీఈఈ, ఏఈఈతోపాటు మంత్రి కేటీఆర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్, మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, అప్పటి మేయర్ బొంతురాంమోహన్ తదితరులపై నేరేడ్‌మెట్ ఠాణాలో అప్పట్లో కేసు నమోదైన సంగతి తెలిసిందే.
చదవండి: ఎస్‌ఐ కోచింగ్ సెంటర్‌లో పరిచయం.. వంచించి, అబార్షన్ ట్యాబ్లెట్లు వేసి..