గుంటూరు, సాక్షి: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రిషితేశ్వరి ఆత్మహత్య కేసును శుక్రవారం గుంటూరు కోర్టు కొట్టేసింది. సరైన సాక్ష్యాధారాలు లేనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు జడ్జి తీర్పు వెల్లడించారు. అయితే సాక్ష్యాలు ఇచ్చినా కూడా వాటిని కోర్టు ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదో అర్థం కావడం లేదని, ఈ కేసులో న్యాయం కోసం పోరాడతామని రిషితేశ్వరి తల్లి మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకుంది.
రిషితేశ్వరి స్వస్థలం వరంగల్. నాగార్జున యూనివర్శిటీలో ఆర్కిటెక్చర్ కోర్సు చేసిన ఆమె.. 2015 జులై 14వ తేదీన అనుమానాస్పద స్థితిలో ఫ్యాన్‌కు వేలాడుతూ విగతజీవిగా కనిపించింది. అయితే తన ఆత్మహత్యకు ర్యాగింగే కారణమంటూ ఆమె రాసిన సూసైడ్ నోట్ దొరికింది. ఈ కేసు అప్పట్లో సంచలనం సృష్టించింది. అయితే.. ర్యాగింగ్ వేధింపులతోనే ఆమె బలవన్మరణానికి పాల్పడినట్లు సాక్ష్యాధారాలు లేవంటూ గుంటూరు జిల్లా ఐదవ కోర్టు .. తొమ్మిదేళ్ల విచారణ తర్వాత ఇప్పుడు కేసు కొట్టేసింది.
‘‘మా పాప కేసులో మాకు అన్యాయం జరిగింది. ఈ కేసులో అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. మా పాప రాసిన డైరీ ని కూడా కోర్టుకు సబ్మిట్ చేశాం. మాకు న్యాయం చేయమని అప్పట్లో సీఎం చంద్రబాబు నాయుడిని, అప్పటి ఎస్పీ త్రిపాఠిని కలిశాం. మా పాపను ర్యాగింగ్ పేరుతో ఎలా వేధించారు రాసిన డైరీ ని కూడా ఒక కాపీ ఇచ్చాం. ఈ కేసులో 170 మంది సాక్షులు ఉన్నారు. మా అమ్మాయి రాసిన సూసైడ్ లెటర్‌ను ప్రతీ అధికారికి వాటిని సమర్పించాం. పది సంవత్సరాల నుంచి కోర్టు చుట్టూ తిరుగుతున్నాం..
.. కానీ, మేమిచ్చిన సాక్ష్యాన్ని కోర్టు ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు అర్థం కావట్లేదు. న్యాయం కోసం అవసరమైతే సీఎం, డిప్యూటీ సీఎంలను కలుస్తాం. మాకు పైకోర్టుల్లో పోరాడే ఆర్థిక శక్తి లేదు. ప్రభుత్వమే సాయం చేయాలి. కేసులో న్యాయం జరగకపోతే మాకు మరణమే శరణ్యం’’ అని రిషితేశ్వరి తల్లి కన్నీళ్లు పెట్టకుంది.
‘‘రిషితేశ్వరి ఆత్మహత్యకు ప్రేరేపించిన వారి పేర్లు డైరీలో ఉన్నాయి. ఆమె ఏ విధంగా వేధింపులకు గురైందో డైరీ ల్లో ఉన్నాయి. అవి అన్నీ కోర్టు ముందు ఉన్నాయి. తోటి విద్యార్థులు, సీనియర్లు ఏ విధంగా వేధించారో స్పష్టంగా ఉంది. ప్రిన్సిపాల్ బాబురావుకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదు. హాయ్ ల్యాండ్ లో ప్రెషర్స్ పార్టీలో లైంగికంగా వేధించారు. నిందితులకు శిక్ష పడుతుందని భావించాం. కానీ, కోర్టు కేసు కొట్టేసింది. ఈ తీర్పు న్యాయమైనది కాదని భావిస్తున్నాం. తీర్పుపై అప్పీల్ కు వెళ్ళాలన్నది నా నిర్ణయం. ఇదే విషయాన్ని పోలీసులకు తెలియజేస్తాను.
::: రిషితేశ్వరి కేసులో స్పెషల్ పీపీ వైకే
Comments
Please login to add a commentAdd a comment