Ragging case
-
‘మా పాపకు అన్యాయం జరిగింది..’ రిషితేశ్వరి తల్లి కన్నీళ్లు
గుంటూరు, సాక్షి: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రిషితేశ్వరి ఆత్మహత్య కేసును శుక్రవారం గుంటూరు కోర్టు కొట్టేసింది. సరైన సాక్ష్యాధారాలు లేనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు జడ్జి తీర్పు వెల్లడించారు. అయితే సాక్ష్యాలు ఇచ్చినా కూడా వాటిని కోర్టు ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదో అర్థం కావడం లేదని, ఈ కేసులో న్యాయం కోసం పోరాడతామని రిషితేశ్వరి తల్లి మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకుంది.రిషితేశ్వరి స్వస్థలం వరంగల్. నాగార్జున యూనివర్శిటీలో ఆర్కిటెక్చర్ కోర్సు చేసిన ఆమె.. 2015 జులై 14వ తేదీన అనుమానాస్పద స్థితిలో ఫ్యాన్‌కు వేలాడుతూ విగతజీవిగా కనిపించింది. అయితే తన ఆత్మహత్యకు ర్యాగింగే కారణమంటూ ఆమె రాసిన సూసైడ్ నోట్ దొరికింది. ఈ కేసు అప్పట్లో సంచలనం సృష్టించింది. అయితే.. ర్యాగింగ్ వేధింపులతోనే ఆమె బలవన్మరణానికి పాల్పడినట్లు సాక్ష్యాధారాలు లేవంటూ గుంటూరు జిల్లా ఐదవ కోర్టు .. తొమ్మిదేళ్ల విచారణ తర్వాత ఇప్పుడు కేసు కొట్టేసింది.‘‘మా పాప కేసులో మాకు అన్యాయం జరిగింది. ఈ కేసులో అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. మా పాప రాసిన డైరీ ని కూడా కోర్టుకు సబ్మిట్ చేశాం. మాకు న్యాయం చేయమని అప్పట్లో సీఎం చంద్రబాబు నాయుడిని, అప్పటి ఎస్పీ త్రిపాఠిని కలిశాం. మా పాపను ర్యాగింగ్ పేరుతో ఎలా వేధించారు రాసిన డైరీ ని కూడా ఒక కాపీ ఇచ్చాం. ఈ కేసులో 170 మంది సాక్షులు ఉన్నారు. మా అమ్మాయి రాసిన సూసైడ్ లెటర్‌ను ప్రతీ అధికారికి వాటిని సమర్పించాం. పది సంవత్సరాల నుంచి కోర్టు చుట్టూ తిరుగుతున్నాం.. .. కానీ, మేమిచ్చిన సాక్ష్యాన్ని కోర్టు ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు అర్థం కావట్లేదు. న్యాయం కోసం అవసరమైతే సీఎం, డిప్యూటీ సీఎంలను కలుస్తాం. మాకు పైకోర్టుల్లో పోరాడే ఆర్థిక శక్తి లేదు. ప్రభుత్వమే సాయం చేయాలి. కేసులో న్యాయం జరగకపోతే మాకు మరణమే శరణ్యం’’ అని రిషితేశ్వరి తల్లి కన్నీళ్లు పెట్టకుంది.‘‘రిషితేశ్వరి ఆత్మహత్యకు ప్రేరేపించిన వారి పేర్లు డైరీలో ఉన్నాయి. ఆమె ఏ విధంగా వేధింపులకు గురైందో డైరీ ల్లో ఉన్నాయి. అవి అన్నీ కోర్టు ముందు ఉన్నాయి. తోటి విద్యార్థులు, సీనియర్లు ఏ విధంగా వేధించారో స్పష్టంగా ఉంది. ప్రిన్సిపాల్ బాబురావుకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదు. హాయ్ ల్యాండ్ లో ప్రెషర్స్ పార్టీలో లైంగికంగా వేధించారు. నిందితులకు శిక్ష పడుతుందని భావించాం. కానీ, కోర్టు కేసు కొట్టేసింది. ఈ తీర్పు న్యాయమైనది కాదని భావిస్తున్నాం. తీర్పుపై అప్పీల్ కు వెళ్ళాలన్నది నా నిర్ణయం. ఇదే విషయాన్ని పోలీసులకు తెలియజేస్తాను.::: రిషితేశ్వరి కేసులో స్పెషల్ పీపీ వైకే -
Kakinada: రంగరాయ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం
-
ఆంధ్రా యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం
సాక్షి,విశాఖపట్నం : ఆంధ్రా యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం రేగింది. ఆంధ్రా యూనివర్సిటీ అర్కిటెక్చర్ డిపార్ట్మెంట్లో జూనియర్ మహిళా విద్యార్థినులను సీనియర్ మహిళా విద్యార్థినులు ర్యాగింగ్ చేశారు. అసభ్యకరమైన డ్యాన్సులు చేయాలంటూ ఒత్తిడి చేశారు. అలా చెయ్యలేం. డ్యాన్స్ రాదు అంటే అబ్బాయిలు దగ్గరకి వెళ్లి నేర్చుకొని రమ్మని సీనియర్లు ఇబ్బంది పెట్టారు. అయితే ర్యాగింగ్ అంశం బయటకి రావడంతో వైస్‌ఛాన్సలర్ తూతూ మంత్రంగా చర్యలు తీసుకున్నారు. జూనియర్లను ర్యాగింగ్ చేసిన ఐదుగురు సీనియర్లను 15 రోజులు పాటు సస్పెండ్ చేశారు.ఇదీ చదవండి: స్టీల్‌ప్లాంట్ ఉద్యమం అణిచి వేతలో కూటమి ప్రభుత్వం -
కేఎంసీలో ర్యాగింగ్.. ఏడుగురిపై కఠిన చర్యలు
సాక్షి, వరంగల్: సీనియర్ ర్యాగింగ్, భరించలేక ప్రీతి బలవన్మరణానికి పాల్పడిన ఉదంతం మరువక ముందే.. కాకతీయ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ ఘటన వెలుగు చూసింది. ర్యాగింగ్‌కు పాల్పడిన ఏడుగురు ఎంబీబీఎస్ విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకున్నట్లు కేఎంసీ ప్రిన్సిపాల్ మోహన్ దాస్ ప్రకటించారు. ఏడాదిపాటు హాస్టల్ నుంచి బహిష్కరించడంతో పాటు మూడు నెలలపాటు కాలేజ్ నుంచి సస్పెండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి.. మరో 20 మంది విద్యార్థులకు షోకాజ్ నోటీసులు జారీ అయినట్లు తెలిపారు. సెప్టెంబర్ 14వ తేదీన కేఎంసీ హాస్టల్లో ఓ జూనియర్‌పై సీనియర్లు ర్యాగింగ్ కు పాల్పడి దాడి చేసి గాయపర్చారు. ఆ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ర్యాగింగ్ యాక్ట్ తోపాటు పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు అయింది. ర్యాగింగ్ పై కేఎంసీ లో ప్రిన్సిపల్ మోహన్ దాస్ అధ్యక్షతన యాంటీ ర్యాగింగ్ కమిటీ సమావేశమై.. ఆరుగంటల పాటు చర్చించింది. ర్యాగింగ్ నిర్ధారణ కావడంతో.. పాల్పడిన వైద్య విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది కమిటీ. అయితే.. కేఎంసీలో ర్యాగింగ్ జరగడం ఇదే తొలిసారని ప్రిన్సిపల్ అంటున్నారు. ప్రీతి ఘటన డిపార్ట్మెంట్ లో జరిగిందని, ప్రస్తుతం హాస్టల్ లో జరిగిందని చెప్తున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు కఠిన తీసుకోవాలని కమిటీ నిర్ణయించిందన్నారు. మొదటి తప్పుగా భావిస్తు మూడు నెలలు సస్పెండ్ చేయడంతో పాటు ఏడాది పాటు హాస్టల్ నుంచి బహిష్కరించాలని నిర్ణయించినట్టు చెప్పారు. అలాగే.. హాస్టల్ లో బర్త్ డే పార్టీలు నిషేధించామన్నారు. దాడికి పాల్పడ్డ 7గురి పై పోలీసులు కేసు నమోదు చేసిన నేపథ్యంలో వారి విచారణ ఇంకా కొనసాగుతుందని ప్రిన్సిపల్ మోహన్ దాస్ తెలిపారు. -
హాస్టల్లో ర్యాగింగ్ భూతం.. జూనియర్‌ను కర్రతో చితకబాదిన టెన్త్ క్లాస్ విద్యార్థి
సాక్షి, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని ఓ ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో జూనియర్ విద్యార్థిని ఓ 10వ తరగతి విద్యార్థి చితకబాదాడు. సోమవారం ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జడ్చర్ల హాస్టల్లో బాధిత బాలుడు 9వ తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో ఓ పదో తరగతి విద్యార్థి తాను చెప్పిందే వినాలని కొంతకాలంగా జూనియర్లను భయపెడుతూ మాటవిననివారిని కొడుతున్నాడు. హోలీ పండగ రోజు అర్ధరాత్రి నిద్రపోతున్న తనతోపాటు మరికొందరు విద్యార్థులను లేపి డాన్స్ చేయమని బెదిరించాడని, చేయకుంటే కొట్టాడని, ఈ విషయం ఎవరికైనా చెబితే నాలుగింతలు దెబ్బలు తింటారని బెదిరించడంతో ఎవరికీ చెప్పుకోలేదని బాధిత విద్యార్థి వాపోయాడు. శనివారం రాత్రి మరోమారు గదికి వచ్చి కర్రతో ఇష్టం వచ్చినట్లు కొట్టాడని, దెబ్బలు తాళలేక ఆదివారం ఉదయం జడ్చర్లలోని తన మేనత్త శాంతమ్మ వద్దకు వెళ్లినట్లు చెప్పాడు. అతడి మేనత్త వార్డెన్‌కు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడంతో సోమవారం ఉదయం హాస్టల్ వద్ద బాధిత విద్యార్థి, బంధువులు ఆందోళనకు దిగారు. ఏఎస్‌డబ్ల్యూవో విజయలక్ష్మి హాస్టల్‌కు వచ్చి విచారణ చేపట్టారు. ఆవేశంలో తప్పు చేశానని, ఇకపై చేయబోనని పదో తరగతి విద్యార్థి లిఖితపూర్వకంగా రాసిచ్చాడు. త్వరలో పరీక్షలు ఉండటంతో అతడిని మందలించి వదిలేసినట్లు తెలుస్తోంది. -
వీళ్లా డాక్టర్లయ్యేది? ర్యాగింగ్ చేసినందుకు కెరీర్ నాశనం
భోపాల్: ర్యాగింగ్ నెపంతో జూనియర్లను లైన్లో నిల్చోబెట్టి చెంపదెబ్బలు కొట్టిన సీనియర్ వైద్య విద్యార్థులపై కేసు నమోదైంది. ఈ ఘటనతో సంబంధం ఉన్న ఏడుగురు విద్యార్థులను ఏడాది పాటు సస్పెండ్ చేసింది కాలేజీ యాజమాన్యం. ఎవరైనా ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. జులై 28న మధ్యప్రదేశ్ రత్లాంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఘటన జరిగింది. సీనియర్ విద్యార్థులు జూనియర్లను వరుసగా నిల్చోబెట్టి చెంపదెబ్బలు కొట్టారు. వారితో దారుణంగా ప్రవర్తించారు. వద్దని చెప్పేందుకు వెళ్లిన హాస్టల్ వార్డెన్‌పైకి వాటర్ బాటిల్స్ విసిసారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇలాంటి విద్యార్థులా డాక్టర్లయ్యేది అని విమర్శలు వెల్లువెత్తాయి. How these idiots are going to become doctors? Who gave rights to these seniors to slap their Junior's ? & we are saying #ragging in banned? These so called seniors immediately needs to be put behind the bars😡 Video: #Ratlam #Medical #Collage of #MP#MBBS #MedTwitter #NEETUG2022 pic.twitter.com/Z3KNRxmn0u — Vivek pandey (@Vivekpandey21) July 30, 2022 ర్యాగింగ్ ఘటనపై హాస్టల్ వార్డెన్ ఫిర్యాదు మేరకు ఏడుగురు సీనియర్ విద్యార్థులపై కేసు నమోదు చేశారు పోలీసులు. అనంతరం వీరందరినీ ఏడాది పాటు సస్పెండ్ చేస్తున్నట్లు కాలేజ్ డీన్ ప్రకటించారు. అంతకుముందు ఇండోర్‌లోని మహాత్మాగాంధీ మెడికల్ కాలేజీలో దారుణమైన ర్యాగింగ్ ఘటన వెలుగుచూసింది. సీనియర్ విద్యార్థులు తమపై వికృత చర్యలకు పాల్పడ్డారని జూనియర్ విద్యార్థులు యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్‌కు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. ఘటనపై సీరియస్ అయిన యూజీసీ.. ర్యాగింగ్ చేసిన విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. చదవండి: ‘హ్యాపీడేస్’ మూవీని మించిన ర్యాగింగ్.. జూనియర్ అమ్మాయిలతో ఇంత దారుణమా.. -
ర్యాగింగ్ పేరుతో వికృత చేష్టలు.. హాస్టల్లో అమ్మాయిలపై పైశాచికత్వం!
Seniors ragging.. కాలేజ్ డేస్ అనగానే చాలా మందికి హ్యాపీడేస్ సినిమా గుర్తుకు వస్తుంది. ఆ సినిమాలో జూనియర్లను సీనియర్లు ర్యాగింగ్ చేసే సీన్స్ నవ్వుతో పాటుగా కోపాన్ని కూడా తెప్పిస్తుంది. అలాగే, కొందరు విద్యార్థులు తాము కాలేజీలో చేరిన మొదటి రోజుల్లో సీనియర్ల ర్యాగింగ్‌ను గుర్తు చేసుకుని కొందరు నవ్వుకుంటే.. మరికొందరు మాత్రం భయంతో వణికిపోతారు. తాజాగా ఇలాంటి ఘటనే ఓ మెడికల్‌లో చోటుచేసుకుంది. మానవత్వం మరిచిన సీనియర్స్.. జూనియర్ల పట్ల వికృత చర్యలకు దిగారు. జూనియర్ అమ్మాయిలతో కూడా అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, ఇష్టం వచ్చిన రీతిలో ప్రవర్తించారు. దీంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన మధప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఇండోర్‌లోని మహాత్మాగాంధీ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ పేరుతో సీనియర్లు రెచ్చిపోయారు. హాస్టల్లో జూనియర్లను తమ రూమ్స్‌లోకి పిలిపించుకుని ఓవర్‌గా బిహేవ్ చేశారు. దిండ్లతో శృంగారం చేయాలని వారిని బలవంతం చేశారు. ఈ క్రమంలోనే జూనియర్ అమ్మాయిలతో అసభ్యకరంగా ప్రవర్తించారు. ఒకరికొకరు కొట్టుకోవాలని బెదిరించారు. దీంతో, సీనియర్ల వేధింపులు భరించలేక జూనియర్లు.. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్‌కు చెందిన యాంటీ ర్యాగింగ్ హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేసి జరిగిన దారుణాన్ని వివరించారు. విద్యార్థుల ఫిర్యాదులో ర్యాగింగ్ ఘటనను సీరియస్‌గా తీసుకున్న యూజీసీ.. రంగంలోకి దిగి విచారణ జరిపింది. విద్యార్థులను వేధింపులకు గురిచేసిన సీనియర్లను గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాలని కళాశాల యాజమాన్యానికి యూజీసీ ఆదేశించింది. దీంతో, పోలీసులు యాంటీ ర్యాగింగ్ యాక్ట్ -2009 కింద సీనియర్లపై కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. ‘Have sex with pillows, abuse girls’: Freshers allege ragging in Indore's MGM Medical College#indorenews #MadhyaPradesh #CollageRagging #nvbcnews pic.twitter.com/fRiQUIX2gP — NVBC News (@NewsNvbc) July 30, 2022 ఇది కూడా చదవండి: రైల్వే స్టేషన్లో పోలీస్ వీరంగం.. వృద్ధుడ్ని తన్ని ఈడ్చుకెళ్లి టార్చర్.. వీడియో వైరల్ -
ర్యాగింగ్ ఘటనపై విచారణకు ఆదేశించాం: హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: సూర్యాపేట మెడికల్ కాలేజీలో జరిగిన ర్యాగింగ్ విషయం తెలిసిందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మెడికల్ కాలేజీలో జరిగిన ర్యాగింగ్ ఘటనపై విచారణ చేయాలని డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్‌ను ఆదేశించామని పేర్కొన్నారు. ఈ ఘటన కారకులను వదిలిపెట్టమని చెప్పారు. రాగ్గింగ్ అనేది నిషేధమని మంత్రి తెలిపారు. సూర్యాపేట మెడికల్ కాలేజీలో సీనియర్ విద్యార్ధులు ర్యాగింగ్‌కు పాల్పడుతున్నారని ఎంబీబీఎస్ మొదటి సంవత్సర చదువుతున్న ఓ విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చెసిన విషయం తెలిసిందే. ఈ నెల ఒకటో తేదీన బాధిత విద్యార్థి వంటిపై బలవంతంగా దుస్తులు తొలగించి ఫోటోలు తీశారని సీనియర్లపై జూనియర్ విద్యార్థి ఫర్యాదు చేశాడు. -
ర్యాగింగ్‌తో విద్యార్థిని మృతి.. కోర్టు సంచలన తీర్పు
భోపాల్ : ర్యాంగింగ్ కేసులో నలుగురు యువతులకు అయిదు సంవత్సరాల జైలు శిక్షను విధిస్తూ మధ్యప్రదేశ్‌లోని భోపాల్ జిల్లా కోర్టు శనివారం సంచలన తీర్పును వెల్లడించింది. 8 సంవత్సరాల క్రితం జరిగిన ఈ కేసులో ఓ విద్యార్థినిని సదరు యువతులు ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు రుజువు కావడంతో జిల్లా న్యాయస్థానం ఈ తీర్పిచ్చింది. వివరాల ప్రకారం.. ఓ ప్రైవేటు కళాశాలలో అనిత అనే విద్యార్థి బీఫార్మసీ స్టూడెంగ్గా చేరింది. అయితే అదే కళాశాలకు చెందిన నలుగురు సీనియర్లు విద్యార్థినిలు తమ కళాశాలలోకి జూనియర్‌గా వచ్చిన అనితపై ర్యాంగింగ్కు పాల్పడ్డారు. ఏడాది వరకు ఇదే తంతు కొనసాగడంతో విసిగిపోయిన విద్యార్థిని ఈ విషయాన్ని కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లగా వారు ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన బాధిత యువతి సుసైడ్ లేఖ రాసి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ లేఖలో నలుగురు యువతుల పేర్లు రాసి, తన చావుకు వాళ్లే కారణమని ఆరోపణలు చేసింది. (రేప్’ సవాల్‌పై క్యాంపస్‌లో కలకలం!) బాధిత యువతి లేఖలో ఈ విధంగా పేర్కొంది ‘నేను కాలేజీకి వచ్చినప్పటి నుంచి ఈ నలుగురు అమ్మాయిలు నన్ను ర్యాగింగ్ చేస్తూనే ఉన్నారు. ర్యాగింగ్‌ను నేను ఇప్పటి వరకు ఎలా అనుభవించానో నాకు మాత్రమే తెలుసు. కాలేజీలో సీనియర్లకు ఫిర్యాదు చేస్తే, సీనియర్లు కూడా అది సహజం అని నాకు చెప్పారు. కాలేజీ యాజమాన్యం కూడా స్పందించలేదు. చనిపోయాక సోదరుడు, తల్లిదండ్రులు నన్ను మిస్ కావొద్దు.’ అని ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన తర్వాత ఆ నలుగురు యువతులపై ఐపీసీ 306 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా దీనిపై తుది తీర్పును వెలువరించిన న్యాయస్థానం ర్యాగింగ్‌కు పాల్పడిన నలుగురు విద్యార్థినులకు జైలుశిక్షను ఖరారు చేసింది. కోర్టు తీసుకున్న నిర్ణయం కాలేజీలు, ఇతర విద్యాసంస్థల్లో ర్యాగింగ్ ఘటనలు జరగకుండా నిరోధించేందుకు కృషి చేయవచ్చు. -
రేప్’ సవాల్‌పై క్యాంపస్‌లో కలకలం!
సాక్షి, న్యూఢిల్లీ : యూనివర్శిటీ పరిధిలో, వెలుపలున్న ఇంటర్మీడియట్, డిగ్రీ కళాశాలల్లో విద్యార్థినీ విద్యార్థులు కొత్త విద్యా సంవత్సరాన్ని వినూత్నంగా జరుపుకునేందుకు ప్రయత్నిస్తారన్నది తెలిసిన విషయమే. సంప్రదాయ సంస్కతి కలిగిన భారత్‌లో ఒకలాగా, పాశ్చాత్య సంస్కతి కలిగిన దేశాల్లో ఒకలాగా విద్యార్థి లోకం ఈ వేడుకలు జరపుకుంటోంది. ఈ వేడుకల్లో భాగంగా సీనియర్లు, కొత్తగా కాలేజీల్లోకి అడుగుపెట్టే విద్యార్థులను ర్యాగింగ్ చేయడం సర్వ సాధారణమే. ఒక్కోసారి ఈ ఆట పట్టించడం శ్రుతి మించి రాగాన పడినట్లు వేధింపులకు దారి తీయడమే కాకుండా ఆత్మహత్యలకూ దారి తీస్తుండడంతో భారత్‌లోనే కాకుండా పాశ్చాత్య దేశాల్లో కూడా విద్యార్థుల ‘ర్యాగింగ్’ నివారణకు కఠిన చట్టాలు తీసుకొచ్చారు. అయినాసరే! అక్కడక్కడ విద్యార్థులను ఆటపట్టించడం శ్రుతిమించి జరుగుతున్నాయి. (ర్యాగింగ్: 600 గుంజీలు తీయించిన సీనియర్లు..) ఇంగ్లండ్‌లోని డుర్హామ్ యూనివర్శిటీలో మంగళవారం నాడు అలాంటి కలకలమే చెలరేగింది. యూనివర్శిటీ ప్రెషర్స్ బ్యాచ్‌లోని సంపన్న బాబులు తమ బ్యాచ్‌లోని పేద అమ్మాయిని వెతికి పట్టుకొని రేప్ చేయాలంటూ సీనియర్లు సవాల్ విసిరారు. యూనివర్శిటీకి సంబంధించిన ఫేస్బుక్ గ్రూప్‌ల్లో ఈ సవాల్ చెక్కర్లు కొట్టడమే కాకుండా, దానిపై చర్చోప చర్చలు జరిగాయి. ‘డుర్హామ్ బాయ్స్ మేకింగ్ ఆల్ ది నాయిస్’ గ్రూప్లోనైతే 60 మంది యూజర్లు ఈ సవాల్‌పై స్పందించారు. రేప్ చేస్తే ఏమవుతుంది ? గోల చేసి, గగ్గోలు పెడతారా ? కేసులు పెడతారా ? జైల్లో పెట్టిస్తారా? అనే సందేహాలతోపాటు గతంలో ఇదే యూనివర్శిటీలో చదవిన అమ్మాయిల్లో దాదాపు 35 మంది అమ్మాయిలు తాము రేప్‌లకు గురయ్యామని చెప్పారు తప్పా, ఎవరూ పోలీసులకు వెళ్లి ఫిర్యాదు చేయలేదంటూ రేపిస్టుల తరఫున వకాల్తా పుచ్చుకున్న వాళ్లు ఉన్నారు. ‘ఒవర్హియర్డ్ ఎట్ డుర్హామ్ యూనివర్శిటీ’ ఫేస్బుక్ లాంటి గ్రూపులో ఇలాంటి సవాళ్లను విమర్శిస్తూ వ్యాఖ్యలు చేశారు. (‘ఆడాలని, పాడాలని ఇబ్బంది పెడుతున్నారు’) జూనియర్లే వారిలో వారు ఇలాంటి ఆకతాయి సవాళ్లు విసురుకుంటున్నారని కొంత మంది సీనియర్లు ఫిర్యాదు చేయగా, ఇంకా క్యాంపస్‌లోకి కూడా అడుగుపెట్టని జూనియర్లు ఇలాంటి సవాళ్లు ఎలా విసురుతారని ఇతరులు ప్రశ్నిస్తున్నారు. కళాశాలలో క్రమశిక్షణను కోరుకునే విద్యార్థిని విద్యార్థులు మాత్రం నేరుగా యూనివర్శిటీ డీన్, అధ్యాపకుల వద్దకు వెళ్లి ఇలాంటి క్రమశిక్షణారాహిత్యాన్ని క్షమించరాదంటూ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై యూనివర్శిటీ పాలక మండలి స్పందిస్తూ, ‘ఫేస్బుక్ గ్రూపుల్లో చెక్కర్లు కొడుతున్న అసభ్య వ్యాఖ్యలపై యూనివర్శిటీ క్రమశిక్షణా సంఘం వెంటనే రంగంలోకి దిగి దర్యాప్తు జరపుతుంది. నిజంగా విద్యార్థులెవరైనా తప్పు చేసినట్లయితే వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాం. అవసరమైతే సదరు విద్యార్థులను క్యాంపస్ క్రమశిక్షణ, సంస్కతిని పరిరక్షించేందుకు క్యాంపస్ నుంచి వెలి వేస్తాం’ అంటూ బుధవారం హెచ్చరించింది. ఈ నెల 28వ తేదీన యూనివర్శిటీ ప్రెషర్స్ డే. ఈ క్యాంపస్‌లో గతంలో నలుగురు విద్యార్థులు రేప్ కేసులను ఎదుర్కొన్నారు. థాయ్‌లాండ్ తరఫున అంతర్జాతీయ రగ్బీ ఆడిన 20 ఏళ్ల క్రీడాకారుడు క్రిస్టాఫర్ ట్విగ్ ‘రగ్బీ సోషల్ నైట్’ వేడుకల్లో ఓ విద్యార్థిని రేప్ చేసినట్లు కేసు నమోదయింది. ట్విగ్ తాను చేసిన నేరాన్ని ఒప్పుకోకుండానే తాను రేప్ చేసిన అమ్మాయికి క్షమాపణలు చెప్పడంతో ప్రాసిక్యూటర్లు ఆ విద్యార్థిపై కేసును కొట్టివేశారు. 2016, జనవరి నెలలో యూనివర్శిటీ విద్యార్థుల సంఘం కార్యదర్శిగా పనిచేసిన లూయీ రిచర్డ్సన్, మద్యం మత్తులో ఉన్న ఓ విద్యార్థినిని రేప్ చేసినట్లు ఆరోపణలతో కేసు నమోదయింది. 15 నెలల అనంతరం విచారణకు వచ్చిన కేసులో మూడు గంటలపాటు విచారణ జరిపి కేసును కొట్టివేశారు. క్యాంపస్‌కు సంబంధించి మరో రెండు కేసులను కూడా కోర్టులు క్షమాపణలతోనే కొట్టివేశాయి. -
ర్యాగింగ్: 600 గుంజీలు తీయించిన సీనియర్లు..
కడప అర్బన్: కడప ప్రభుత్వ వైద్య కళాశాల (రిమ్స్)లో ర్యాగింగ్ భూతం మంగళవారం కలకలం రేపింది. మొదటి సంవత్సరం వైద్య విద్యార్థిని వారం రోజులుగా తృతీయ సంవత్సరం విద్యార్థులు ర్యాగింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వేధింపులపై బాధిత విద్యార్థి తల్లిదండ్రులు ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశారు. తనచేత సీనియర్ విద్యార్థులు 600 గుంజీలు తీయించి వేధించారని బాధిత విద్యార్థి ప్రిన్సిపాల్ ఎదుట బోరున విలపించాడు. తాను నడువలేని పరిస్థితిల్లో ఉన్నానని కళ్లనీళ్లు పెట్టుకున్నాడు. తనను వేధించిన ఇద్దరి పేర్లను తెలియజేసినట్లు సమాచారం. ఈ ఘటనపై ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రసాదరావు స్పందిస్తూ వైస్ ప్రిన్సిపాల్‌తో పాటు, నలుగురు అధ్యాపక వైద్యులతో విచారణ కమిటీని వేశామన్నారు. వేధింపులు రుజువైతే పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు రాష్ట్ర వైద్య విద్య డైరెక్టర్ (డీఎంఈ)కి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. -
‘ఆడాలని, పాడాలని ఇబ్బంది పెడుతున్నారు’
సాక్షి, కామారెడ్డి : తెలంగాణ యూనివర్సిటీకి చెందిన భిక్కనూర్ సౌత్ క్యాంపస్‌లో జూనియర్లపై సీనియర్లు ర్యాంగింగ్ నిర్వహిస్తున్నారు. ఇంట్రడక్షన్ క్లాసుల పేరుతో ఇబ్బందులకు గురిచేస్తూ... అర్ధరాత్రి ఒంటిగంట వరకు రూమ్‌కు పిలిపించి పరిచయం పేరుతో ఆగడాలకు పాల్పడుతున్నారు. సీనియర్లు వేధింపులు భరించలేని జూనియర్లు ఈ విషయాన్ని కళాశాల ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్లారు. గానా బజానా అంటూ ఆడాలని. పాడాలని, చేతులు కట్టుకోవాలని, తల దించి నిలబడాలని ఇబ్బంది పెడుతున్నారని ప్రిన్సిపల్ ఎదుట విద్యార్థులు వాపోయారు. అనంతరం పోలీసులకు సమాచారం అందివ్వగా పోలీసుల ఎదుట సీనియర్ల ఆగడాల గురించి వివరించారు. ఇక డీఎస్పీ శశాంక్ రెడ్డి ఆదేశాలతో భిక్కనూరు సీఐ యాలాద్రి హాస్టల్‌కు వచ్చి విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. జూనియర్లతో అమర్యాదగా ప్రవర్తించినా.. ర్యాగింగ్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని సీనియర్లను హెచ్చరించారు. -
వసతిగృహంలో ర్యాగింగ్ భూతం
సాక్షి, కొయ్యలగూడెం(పశ్చిమగోదావరి) : ర్యాగింగ్ భూతానికి అభం శుభం తెలియని ఓ విద్యార్థి విలవిల్లాడి మానసిక క్షోభకు గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన వెలుగుచూసింది. ప్రస్తుతం ఆ బాలుడు ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. బాలు డికి వైద్య వివరాలు బయటకు తెలియ నీయకుండా ఆసుపత్రులను మార్చుతూ జరిగిన ఘటనను కప్పిపుచ్చేం దుకు సంక్షేమ శాఖ వసతిగృహం అధికారులు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే.. జంగారెడ్డిగూడెం మండలం చల్లవారిగూడానికి చెందిన పాక గంగరాజు కుమారుడు పాక శాంసన్(15) కొయ్యలగూడెం సమీపంలోని అంకాలగూడెంలో నిర్వహిస్తున్న ప్రభుత్వ కళాశాల సంక్షేమ వసతిగృహంలో విద్యనభ్యసిస్తున్నాడు. శాంసన్ నెలక్రితం వసతిగృహంలో చేరి, కొయ్యలగూడెంలోని ఓ కళాశాలలో ఇంటర్ (ప్రథమ) చదువుతున్నాడు. బయోమెట్రిక్ అమలు కాకపోతుండటంతో 15 రోజుల క్రితం వసతిగృహం అధికారి శాంసన్‌ను స్వగ్రామం పంపినట్లు తెలిసింది. సోదరి ఫంక్షన్ చల్లవారిగూడెంలో ఏర్పాటు చేయడంతో శాంసన్ అక్కడికి వెళ్లాడు. నాలుగు రోజుల క్రితం తిరిగి వసతిగృహానికి వచ్చిన శాంసన్ ఆగస్టు 30వ తేదీ రాత్రి ఆత్మహత్యకు యత్నించాడు. దీనిపై సంక్షేమశాఖాధికారిని వివరణ కోరగా వసతిగృహాన్ని విడిచి ఇంటికి వచ్చినందుకు తండ్రి మందలించడంతో ఆవేదన చెందిన శాంసన్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని పేర్కొన్నారు. శాంసన్‌ను వాహనంలో కొయ్యలగూడెం, అక్కడి నుంచి జంగారెడ్డిగూడెం ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. శాంసన్ తండ్రి గంగరాజు, ఆసుపత్రిలో కోలుకుంటు న్న తన కుమారుడు ఎదుర్కొన్న వేధిం పులను సాక్షికి వివరించారు. శాంసన్‌ను తోటి విద్యార్థులు అనాకారిగా ఉన్నావంటూ గేలి చేస్తున్నారంటూ కొద్ది రోజుల నుంచి ఫోన్లో వాపోతున్నాడని పేర్కొన్నారు. ఒకటి, రెండుసార్లు విద్యార్థులకు స్వయంగా వెళ్లి చెప్పి చూశానని ఆయన తెలిపారు. ఇంటికి వచ్చి వెళ్లిన శాంసన్‌ను విద్యార్థులు మరింత గేలి చేయడంతో ఆత్మహత్యకు ఒడిగట్టాడని గంగరాజు తెలిపారు. ఇదే విషయాన్ని శాంసన్‌ను అడగ్గా సహచర విద్యార్థులు గేలిచేయడం, అవమానకర రీతిలో మాట్లాడి దూరంగా ఉంచుతున్నారని, దీనిపై సంక్షేమశాఖాధికా రికి ఫిర్యాదు చేస్తే విద్యార్థులకు దూరంగా పడుకోబెట్టేవారని తెలిపాడు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన అనంతరం సంక్షేమ శాఖాధికారులు నిజాలు బహిర్గతం చేయవద్దని, చేస్తే వసతిగృహం నుంచి పంపించేస్తామని బెది రించినట్టు శాంసన్ తెలిపారు. దీనిపై వివరణ ఇవ్వడానికి సంబంధిత సంక్షే మ శాఖ అధికారి సుముఖత వ్యక్తం చేయకపోగా, విద్యార్థి వసతిగృహంలో చేరలేదని, అసలు తమకు, ఆ విద్యార్థికి సంబంధం లేదని, తండ్రి మందలిం చడం వల్లే ఆత్మహత్యకు ఒడిగట్టాడని పేర్కొన్నారు. ఆత్మహత్యాయత్నాని పాల్పడిన శాంసన్‌ను ఎవరికీ తెలియకుండా ఆసుపత్రులు మార్చుతూ రహస్యంగా వైద్య చికిత్స అందించడం పలు అనుమానాలకు తావిస్తోంది. వసతిగృహం విద్యార్థులను దీనిపై నోరు మెదపకుండా కఠినంగా అధికారి ఆంక్షలు విధించినట్లు తెలిసింది.కళాశాల వసతిగృహ సంక్షేమ శాఖ అధికారులు తీరును పలువురు విమర్శిస్తున్నారు. శాంసన్ కొయ్యలగూడెం– పోలవరం రోడ్డులో పురుగు మందుల షాపులో గుళికలు కొనుగోలు చేసినట్లు విచారణలో బయటపడింది. -
ర్యాగింగ్ చేసిన యువకుడికి దేహశుద్ధి
శ్రీకాళహస్తి: ర్యాగింగ్ చేసిన ఓ యువకుడికి బాలిక తల్లిదండ్రులు దేహశుద్ధి చేసిన ఘటన శ్రీకాళహస్తి పట్టణంలో చోటుచేసుకుంది. పట్టణంలోని కైలాసరిగి కాలనీ ప్రాంతానికి చెందిన బాలికలు పాఠశాలకు వెళ్లి వస్తుంటే రెండు రోజులుగా కొందరు యువకులు వారిని ర్యాగింగ్ చేస్తూ ఇబ్బంది పెట్టారు. దాంతో బాలికలు వారి తల్లిదండ్రులకు తెలియజేశారు. తల్లిదండ్రులు సోమవారం కాపు కాసి వారిలో ఒకరిని పట్టుకున్నారు. చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నారు. ఆ యువకుడితో పాటు ఉన్న వ్యక్తులు ఎవరు అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. ఆ యువకుడు కేవీబీపురం మండలానికి చెందిన వ్యక్తిగా భావిస్తున్నారు. -
ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు
ఎంజీఎం : ర్యాగింగ్‌కు పాల్పడితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని వరంగల్ పోలీసు కమిషనర్ డాక్టర్ విశ్వనాథ రవీందర్ హెచ్చరించా రు. గురువారం కాకతీయ మెడికల్ కళాశాల మొదటి సంవత్సర విద్యార్థులకు నిర్వహించిన ఓరియంటేషన్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమాజంలో వైద్య వృత్తి గొప్పదని, దేవుడు జన్మనిస్తే వైద్యుడు పునర్జన్మనిస్తాడని పేర్కొన్నారు. అలాంటి వైద్య విద్యనభ్యసించే విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడి వారి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. ప్రధానంగా ఇంజనీరింగ్ 33 శాతం, మెడికల్ కళాశాలల్లో 17 శాతం ర్యాగింగ్ జరుగుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయని పేర్కొన్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ర్యాగింగ్ చట్టంపై పూర్తి స్థాయిలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ర్యాగింగ్‌కు పాల్పడిన వారికి పడే శిక్షకాలాన్ని విద్యార్థులకు తెలిపారు. ఆయా విద్యాసంస్థల విభాగాధిపతులు ర్యాగింగ్ నివారణకు చర్యలు తీసుకోకపోతే వారు సైతం శిక్షార్హులేనన్నారు. ర్యాగింగ్‌కు పాల్పడిన వారిని శిక్షించే క్రమంలో ఆయా విద్యా సంస్థల విభాగాధిపతులు అమలు చేసిన శిక్షను సుప్రీం కోర్టు సైతం మార్చలేదన్నారు. ర్యాగింగ్‌ను నిషేధించేలా కళాశాలలో తీసుకోవాల్సిన అంశాలను వివరించారు. కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్య మాట్లాడుతూ మొదటి సంవత్సరం విద్యార్థులకు మెడికల్ కళాశాలలోని బోధన, ఇతర అంశాలపై అవగాహన కల్పించారు. కేఎంసీలో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించిన వారి గురించి వివరించారు. కార్యక్రమంలో ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రమేశ్, రాంకుమార్‌రెడ్డి, రజామాలీఖాన్, పీడీ ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. -
ర్యాగింగ్‌కు పాల్పడిన ముగ్గురు విద్యార్థుల అరెస్టు
శ్రీకాకుళం: ర్యాగింగ్‌కు పాల్పడ్డారనే ఫిర్యాదు పై శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలోని శ్రీవేంకటేశ్వర ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన ముగ్గురు విద్యార్థులను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. మెకానికల్ విభాగానికి చెందిన పవన్ మణికంఠ, నాగేశ్వరరావు, గణపతిరావు అనే విద్యార్థులు అదే విభాగానికి చెందిన మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినిని కొన్ని రోజులుగా వేధిస్తున్నారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు డీఎస్పీ శ్రీనివాసరావు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
తొమ్మిది మంది విద్యార్థులపై ర్యాగింగ్ కేసు
హైదరాబాద్: తొమ్మిది మంది విద్యార్థులపై పేట్ బషీరాబాద్ పోలీసులు ర్యాగింగ్ కేసు నమోదు చేశారు. వీరిలో ఏడుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించగా మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. పోలీసుల కథనం మేరకు.. కొంపల్లి సినీప్లానెట్ సమీపంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఫస్ట్ ఇయర్ ఇంటర్ చదువుతున్న ఓ విద్యార్థిని చొక్కా గుండి పెట్టుకోలేదని ఈ నెల 26న సీనియర్ విద్యార్థులు తొమ్మిదిమంది ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. అదే రోజు రాత్రి 12 సమయంలో ఎదురు తిరిగిన జూనియర్ విద్యార్థిపై వారు దాడికి పాల్పడ్డారు. ఈ విషయంపై పోలీసులు విచారణ జరిపి తొమ్మిది మంది విద్యార్థులపై ర్యాగింగ్ కేసు నమోదు చేశారు. వీరిలో ఏడుగురిని ఆదివారం అరెస్టు చేసి మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.