భోపాల్ : ర్యాంగింగ్ కేసులో నలుగురు యువతులకు అయిదు సంవత్సరాల జైలు శిక్షను విధిస్తూ మధ్యప్రదేశ్‌లోని భోపాల్ జిల్లా కోర్టు శనివారం సంచలన తీర్పును వెల్లడించింది. 8 సంవత్సరాల క్రితం జరిగిన ఈ కేసులో ఓ విద్యార్థినిని సదరు యువతులు ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు రుజువు కావడంతో జిల్లా న్యాయస్థానం ఈ తీర్పిచ్చింది. వివరాల ప్రకారం.. ఓ ప్రైవేటు కళాశాలలో అనిత అనే విద్యార్థి బీఫార్మసీ స్టూడెంగ్‌గా చేరింది. అయితే అదే కళాశాలకు చెందిన నలుగురు సీనియర్లు విద్యార్థినిలు తమ కళాశాలలోకి జూనియర్‌గా వచ్చిన అనితపై ర్యాంగింగ్‌కు పాల్పడ్డారు. ఏడాది వరకు ఇదే తంతు కొనసాగడంతో విసిగిపోయిన విద్యార్థిని ఈ విషయాన్ని కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లగా వారు ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన బాధిత యువతి సుసైడ్ లేఖ రాసి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ లేఖలో నలుగురు యువతుల పేర్లు రాసి, తన చావుకు వాళ్లే కారణమని ఆరోపణలు చేసింది. (రేప్’ సవాల్‌పై క్యాంపస్‌లో కలకలం!)
బాధిత యువతి లేఖలో ఈ విధంగా పేర్కొంది ‘నేను కాలేజీకి వచ్చినప్పటి నుంచి ఈ నలుగురు అమ్మాయిలు నన్ను ర్యాగింగ్ చేస్తూనే ఉన్నారు. ర్యాగింగ్‌ను నేను ఇప్పటి వరకు ఎలా అనుభవించానో నాకు మాత్రమే తెలుసు. కాలేజీలో సీనియర్లకు ఫిర్యాదు చేస్తే, సీనియర్లు కూడా అది సహజం అని నాకు చెప్పారు. కాలేజీ యాజమాన్యం కూడా స్పందించలేదు. చనిపోయాక సోదరుడు, తల్లిదండ్రులు నన్ను మిస్ కావొద్దు.’ అని ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన తర్వాత ఆ నలుగురు యువతులపై ఐపీసీ 306 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా దీనిపై తుది తీర్పును వెలువరించిన న్యాయస్థానం ర్యాగింగ్‌కు పాల్పడిన నలుగురు విద్యార్థినులకు జైలుశిక్షను ఖరారు చేసింది. కోర్టు తీసుకున్న నిర్ణయం కాలేజీలు, ఇతర విద్యాసంస్థల్లో ర్యాగింగ్ ఘటనలు జరగకుండా నిరోధించేందుకు కృషి చేయవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment