‘ఆడాలని, పాడాలని ఇబ్బంది పెడుతున్నారు’ | Police Given warning To Seniors For Ragging Juniors In Bikkanuru campus | Sakshi
Sakshi News home page

‘ఆడాలని, పాడాలని ఇబ్బంది పెడుతున్నారు’

Published Mon, Nov 25 2019 2:35 PM | Last Updated on Mon, Nov 25 2019 2:55 PM

Police Given warning To Seniors For Ragging Juniors In Bikkanuru campus - Sakshi

సాక్షి, కామారెడ్డి : తెలంగాణ యూనివర్సిటీకి చెందిన భిక్కనూర్‌ సౌత్‌ క్యాంపస్‌లో జూనియర్లపై సీనియర్లు ర్యాంగింగ్ నిర్వహిస్తున్నారు. ఇంట్రడక్షన్‌ క్లాసుల పేరుతో ఇబ్బందులకు గురిచేస్తూ... అర్ధరాత్రి ఒంటిగంట వరకు రూమ్‌కు పిలిపించి పరిచయం పేరుతో ఆగడాలకు పాల్పడుతున్నారు. సీనియర్లు వేధింపులు భరించలేని జూనియర్లు ఈ విషయాన్ని కళాశాల ప్రిన్సిపల్‌ దృష్టికి తీసుకెళ్లారు. గానా బజానా అంటూ ఆడాలని. పాడాలని, చేతులు కట్టుకోవాలని, తల దించి నిలబడాలని ఇబ్బంది పెడుతున్నారని ప్రిన్సిపల్‌ ఎదుట విద్యార్థులు వాపోయారు. అనంతరం పోలీసులకు సమాచారం అందివ్వగా పోలీసుల ఎదుట సీనియర్ల ఆగడాల గురించి వివరించారు. ఇక డీఎస్పీ శశాంక్ రెడ్డి ఆదేశాలతో భిక్కనూరు సీఐ యాలాద్రి హాస్టల్‌కు వచ్చి విద్యార్థులకు కౌన్సిలింగ్‌ ఇచ్చారు. జూనియర్లతో అమర్యాదగా ప్రవర్తించినా.. ర్యాగింగ్‌ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని సీనియర్లను హెచ్చరించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement