భిక్కనూరు : టీఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణ యూనివర్సిటీపై సవతితల్లి ప్రేమ చూపిస్తోందని సౌత్‌క్యాంపస్ విద్యార్థి జేఏసీ కన్వీనర్ సత్యం ఆరోపించారు. శుక్రవారం సౌత్‌క్యాం పస్‌లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ యూనివర్సిటీకి ప్రభుత్వం కేవలం రూ. 24 కోట్లు మాత్రమే మంజూరు చేయడం శోచనీయమన్నారు.
జిల్లాలో తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో, రెండు పార్లమెంట్ స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను ప్రజలు గెలిపించారని, అయితే ఆ విషయాన్ని కేసీఆర్ విస్మరించారని అన్నారు. వెంటనే తెలంగాణ యూనివర్సిటీకి రూ.100 కోట్లు విడుదల చేయని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హె చ్చరించారు. నిరసన కార్యక్రమంలో జేఏసీ అధ్యక్షులు గోవర్ధన్, నాయకులు రఘురాం, రమేశ్, ఫర్మియానాయక్, సంధ్యకుమార్, యోగి, నర్సింలు, శివకుమార్, రఘురామ్‌లు పాల్గొన్నారు.
తెయూపై శీతకన్ను
Published Sat, Nov 8 2014 3:02 AM | Last Updated on Sat, Sep 2 2017 4:02 PM
Advertisement
Advertisement