కడప అర్బన్: కడప ప్రభుత్వ వైద్య కళాశాల (రిమ్స్)లో ర్యాగింగ్ భూతం మంగళవారం కలకలం రేపింది. మొదటి సంవత్సరం వైద్య విద్యార్థిని వారం రోజులుగా తృతీయ సంవత్సరం విద్యార్థులు ర్యాగింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వేధింపులపై బాధిత విద్యార్థి తల్లిదండ్రులు ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశారు. తనచేత సీనియర్ విద్యార్థులు 600 గుంజీలు తీయించి వేధించారని బాధిత విద్యార్థి ప్రిన్సిపాల్ ఎదుట బోరున విలపించాడు. తాను నడువలేని పరిస్థితిల్లో ఉన్నానని కళ్లనీళ్లు పెట్టుకున్నాడు. తనను వేధించిన ఇద్దరి పేర్లను తెలియజేసినట్లు సమాచారం. ఈ ఘటనపై ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రసాదరావు స్పందిస్తూ వైస్ ప్రిన్సిపాల్‌తో పాటు, నలుగురు అధ్యాపక వైద్యులతో విచారణ కమిటీని వేశామన్నారు. వేధింపులు రుజువైతే పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు రాష్ట్ర వైద్య విద్య డైరెక్టర్ (డీఎంఈ)కి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment