సాక్షి, హైదరాబాద్: సూర్యాపేట మెడికల్ కాలేజీలో జరిగిన ర్యాగింగ్ విషయం తెలిసిందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మెడికల్ కాలేజీలో జరిగిన ర్యాగింగ్ ఘటనపై విచారణ చేయాలని డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్‌ను ఆదేశించామని పేర్కొన్నారు. ఈ ఘటన కారకులను వదిలిపెట్టమని చెప్పారు. రాగ్గింగ్ అనేది నిషేధమని మంత్రి తెలిపారు.
సూర్యాపేట మెడికల్ కాలేజీలో సీనియర్ విద్యార్ధులు ర్యాగింగ్‌కు పాల్పడుతున్నారని ఎంబీబీఎస్ మొదటి సంవత్సర చదువుతున్న ఓ విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చెసిన విషయం తెలిసిందే. ఈ నెల ఒకటో తేదీన బాధిత విద్యార్థి వంటిపై బలవంతంగా దుస్తులు తొలగించి ఫోటోలు తీశారని సీనియర్లపై జూనియర్ విద్యార్థి ఫర్యాదు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment