సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు మరో ఎనిమిది కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు మంజూరు అయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జోగులాంబ గద్వాల్, నారాయణ్ పేట్, ములుగు, వరంగల్, మెదక్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల్లో కాలేజీలకు అనుమతులు లభించింది.
దేశంలోనే అరుదైన రికార్డుకు తెలంగాణ చేరువైంది. ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండాలనే సీఎం కేసీఆర్ లక్ష్యం నెరవేరబోతోంది. బీఆర్‌ఎస్ పాలనతో.. గత 9 ఏండ్ల కాలంలో 29 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మంజూరు అయ్యాయి. ఇక తాజా పరిణామంతో.. రాష్ట్రంలో పది వేలకు ఎంబీబీఎస్ సీట్లు చేరువ కానున్నాయి.
మెడికల్ కాలేజీల మంజూరుపై వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు.. కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. మారుమూల ప్రాంతాలకు సైతం చేరువైన సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుతాయని, స్థానికంగా ఉంటూనే ఎంబీబీఎస్ చదివేందుకు అవకాశాలు పెరుగుతాయని, కేసీఆర్ నాయకత్వంలో జరిగిన వైద్య విద్య విప్లవమిది అని మంత్రి హరీష్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment